Previous Page Next Page 
లవ్ ఎట్ సెకండ్ సైట్ పేజి 6

 

    జీవితంలో మొదటిసారిగా  లవ్ ఎట్ ధర్డ్ సైట్ కలిగింది! తీరా పడ్డాక తెలిసింది - ఆ అమ్మాయికి తన మీద భయంకరమయిన "హేట్రేడ్ నెస్" పేరుకుపోయి ఉందని -
    ఇప్పుడేమి చేయటం ?
    "హలో! వాట్ హాపెండ్ బ్రదర్! నీ లెవల్ కి ఫుడ్ ఇంకా చాలా లాగించాలి కదా?" అడిగాడు - రాకేష్ అనుమానంగా!
    "పరిస్తితులు సడెన్ గా రివర్స్ కొట్టినాయ్ మిత్రమా! దేరార్ - ప్రాబ్లమ్స్ వితిన్ ప్రాబ్లమ్స్-"
    "షటప్ - ప్రస్తుతం నాకున్న ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఎవడికీ ఉండవ్!" చిరాగ్గా అన్నాడతను -
    "వ్వాట్ ? నీకు ప్రాబ్లమ్సా?"
    "యస్ -"
    "నేనమ్మను! మల్టీ మిలియనీర్' దినేష్ రెడ్డి అనే లాడ్ లా బేటా రాకేష్ కి ప్రాబ్లెమ్స్ అంటే నేనేకాదు. ఎవడూ నమ్మడు-"
    "కానీ డబ్బు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ కంటే సాల్వ్ చేయలేనివే ఎక్కువ బ్రదర్!"
    "ఫరేగ్జంపుల్?"
    రాకేష్ దిగులుగా మోనికా వేపు చూశాడు.
    "ఫరెగ్జాంపుల్ - డబ్బుతో తండ్రిని కొనగలమా?" అడిగాడు రాకేష్-
    "ఇంకా అనుమానమా? ఎంతమంది తండ్రులు కావాలో చెప్పు! హోల్ సేల్ రెట్లో కొనుకొస్తా-"
    "తండ్రంటే - నా ఉద్దేశ్యం - ఫిజికల్ కాదు బే- మనసు - తండ్రి మనసు- కెన్ యూ బై ఫాదర్స్ మైండ్/ పోనీ కొశ్చన్ ఇంకో రకంగా వేస్తాను -- డబ్బుతో తండ్రి విల్లింగ్ నేస్ ని కొనగలమా?"
    "అంటే మీ డాడీ నీకు ప్రాబ్లెమా?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీ-
    "యస్-"
    "యువరోన్ డాడీ?"
    "డాడీ ఒన్ కాకపొతే అద్దె డాడీలుంటారా? నీయవ్వ బ్రెయిన్ లెస్ ఫెలో!"
    'ఈ రోజుల్లో ఉంటారు గానీ -- నీ విషయంలో ఉండరు -- ఇంతకూ మీ డాడీతో ఏమిటి ప్రాబ్లం?"
    "నేను మోనికాను లవ్ చేయటం మా డాడీకి ష్టం లేదు-"
    "ఎందుకిష్టం లేదు"
    "అది ఒక బిగ్ బిగ్ స్టోరీ-"
    "ఫ్లాష్ బాక్ స్టోరీయా--"
    "అవును! కాలేజ్ డేస్ లో మాడాడీ ఒక మోడలింగ్ చేసే అమ్మాయిని లవ్ చేశాడు -"
    "వావ్ - మీ డాడీకూడా ఆ రోజుల్లో చాలా ఫాస్ట్ టైప్ అన్నమాట!"
    "వెరీ ఫాస్ట్-'
    "ఆ మోడల్ కూడా మా డాడీ ని ప్రేమించింది. మా డాడీని వెంటేసుకుని తిరుగుతూ బోలెడు నగలు కొనిపించింది! ఆ తరువాత ఆ నగలన్నీ తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ నెంబర్ సిక్స్ తో పారిపోయింది-"
    "బాయ్ ఫ్రెండ్ నెంబర్ సిక్సా! అంటే అసలెందమంది బాయ్ ఫ్రెండ్సుండేవాళ్ళు?"
    "ఆ మేటర్ ఇప్పుడు మనకవసరం అంటావా?"
    "ఆవిడ లెవల్ తెలుసుకుందామని అడిగాన్లే -"
    "అందుకని ఈ గ్లామర్ ఫీల్డ్ ని సంబంధించిన గాళ్స్ ని లవ్ చేయడానికి వీల్లేదని రూలింగిచ్చారు మా డాడీ!"
    "అయితే అక్కడ లూప్ పడిందన్నమాట!"
    "అవును"
    భవానీశంకర్ చకచక ఆలోచించాడు.
    "అవునూ! నువ్వూ, మోనికా లేచిపోవచ్చు కదా కామ్రేడ్స్ - పైగా మీలాంటి లేచిపోయే లవ్ బర్డ్స్ కి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ పోలీస్ పుల్ ప్రొటెక్షన్ ఇస్తోంది -- మిగతా డ్యూటీలన్నీ గంగలో కలిపేసి -"
    "నోవే యార్! అలాంటి చిల్లర లవ్ కీ, అల్లరి మారేజ్ కీ మోనికా వప్పుకునే టైప్ కాదు - అదీ గాకుండా అసలు లవ్ విషయం పెళ్ళి విషయం ఇవన్నీ నేనింకా మోనికాతో మాట్లాడలేదు -"
    "ఇంత లేటా ? టూమచ్ బ్రదర్! బయట ప్రపంచాన్ని ఒక్కసారి చూడు -- త్రీడేస్ లో లవ్- త్రీనైట్స్ లో చిల్డ్రన్ - స్కీమ్ నడుస్తోంది మిత్రమా!"
    "మాకు అవన్నీ మాట్లాడ్డానికి ఇప్పుడున్న ఇంటిమసీ చాలదు - ఇంకొన్ని రోజులు మోనికా నా గురించి అన్నీ స్టడీ చేశాక అప్పుడు ప్రపోజ్ చేస్తే హాపీ ఎండింగ్ అవుతుందని నా ప్లాన్-"
    సరిగ్గా అప్పుడే మోనికా సెల్ ఫోన్లో అలారం పెద్ద సౌండ్ తో మోగటం మొదలు పెట్టేసరికి - ఏదో బాంబ్ పెలబోతుందని - హోటల్లో చాలా మంది టేబుల్స్ కింద దూరారు.
    భవానీ, రాకేష్ లు కూడా నేలమీద పడుకున్నాక రాకేష్ కి డౌటోచ్చింది.
    "ఏమిటా అలారం?" మోనికా నడిగాడు.
    "అలారం - నా అపాయింట్ మెంట్స్ ని గుర్తు చేయడానికి ఈ సెల్లో కొత్త ప్రొవిజన్ ఇచ్చార్లే -- ఓకె రాకేష్ ! టైం ఈజ్ ఆఫ్- మళ్ళీ కలుసుకుందాం - బై -' అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది.
    "హలో డియర్ -- వన్ సెకండ్ -- ' అంటూ ఆమె వెంట పడ్డాడు రాకేష్ - భవానీశంకర్ వెంటనే స్కూటర్ రాణి మల్లిక దగ్గరకు పరుగెత్తాడు.
    "హాలో మిస్" అన్నాడు అప్పుడే ఆమెను కనుక్కున్న ఎఫెక్ట్ ఇస్తూ -- మల్లిక భవానీ వేపు ప్రశ్నార్ధకంగా చూసింది.
    "మీరు ......."
    "ఇందులో మీ తప్పేంలేదు ఫ్రెండ్! మాణింగ్ మనం చాలా చిన్న మీటింగ్ లో కలుసుకున్నాం- వీధి కుక్కలా పోరాటం మధ్యలో మీరు ఇరుక్కుపోయిన సందర్భంలో నేనే మీకు హెల్ప్ చేశాను -"
    "యా - యా - అయ్ రిమెంబర్ నౌ"
    "వెంటవెంటనే ఇలా కలుసుకోవడం చాలా ప్లెజెంట్ గా ఉంది డియర్ - ఇటీజ్ స్మాల్ అండ్ కంజేస్ట్ డ్ వరల్డ్ - వాడ్డూ యూ సే/ బై దివే - మాణింగ్ మీ పేరడగడం మర్చిపోయాను -"
    "మల్లిక-"
    "ఓ! బ్యూటీపుల్ నేమ్ - చిన్నప్పటి నుంచీ - ఆ పేరంటే నాకు ఆరాధన! కారణం తెలీదు -- బహుశా ! ఓల్డ్ జన్మ - అంటే పునర్జన్మ ఎఫేక్టేమోనని నా అనుమానం! వాడ్డూ యూ సే!"
    "అయ్ డోంట్ నో-"
    "అన్నట్లు మిమ్మల్ని ఇంతకుముందు -- కూడా ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది మల్లికా జీ! మీరే ఏరియాలో ఉంటారు ?"


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS