Previous Page
పరిహారం పేజి 53


    "అత్తకి నేనిచ్చిన మాట!"
    "అత్తకి నువ్విచ్చిన మాట తిరిగి నీ కిచ్చివేసేలా చేస్తాను సరేనా!"
    మనోహర్ కౌగలింతలో గువ్వపిట్టలా ఒదిగిపోయిన పారిజాత క్రిందినుండి లలిత పెట్టిన కేకకు ఉలికిపడింది.
    "రా పారూ! ఇంకా ఎంతసేపు"
    లలిత భర్త ఆటో తీసుకు వచ్చిన సంగతి చెప్పింది పారిజాత.
    "పద మీ లలితకు నేను చెబుతాను!" పారిజాత భుజాలచుట్టూ చేతులు చుట్టి మెట్లపైకి తీసుకువచ్చాడు మనోహర్.
    "పారు ఎక్కడికీ రాదు, ఇక్కడే ఉంటుంది......." మనోహర్ అన్నాడు.
    జంటగా నిలబడిన ఆ ఇద్దరినీ ఆశ్చర్యంగా చూసింది లలిత. తరువాత టాటా చెబుతున్నట్టుగా చెయ్యూపి ముసిముసిగా నవ్వుకొంటూ వెనక్కి తిరిగింది.
    పారిజాత చేయి వదలకుండా తల్లి గదివేపు నడిచాడు మనోహర్.
                           *** శుభం ** 
                                పరిహారం Ending Cover Page
    కొందరి జీవితాలు ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో, దిక్సూచిలేని నావలా, కళ్ళెంలేని గుర్రంలా, గమ్యం లేని జీవితాలు, ఆ గమ్యం కోసరం పడే తపన, ఆరాటం, నిరాశ , వారిజీవితాలను ఎలా కలిచివేస్తాయో నిరూపించే ఉత్తమ కథా చిత్రమే యీ పరిహారం నవల.
    పారిజాత వయస్సు బుస బుస లాడే గంధకం కొండలాగ కొరికలు నిలవనివ్వకుండా , కోరికలు గుర్రాలై పరుగులు తీస్తున్న వేళ, లేమి వాటికి కళ్ళాలు వేయబోతుంటే, ఆ జీవితంలో ఆమె నిలదొక్కుకుని తన బావి జీవితానికో ప్రయోజనం సిద్దింప చేసుకునేందుకు ఆమె పడిన ఇక్కట్లు, కష్టాలు చివరకు నిండు అమావాస్య తరువాతనే పౌర్ణమిలా ఆమె జీవితం వడ్డీతో సహా అందుకుని అనుభవించింది.
    ఉరకలు పెట్టే వయస్సు ఒంటరి తనపు అనుభవం ఆమెను సంపూర్ణ వ్యక్తిని చేసినవి. పరిస్థితులకు బానిసగాక, పరిస్థితులనే తనకు బానిస చేసుకున్న విదుషీమణి పారిజాత ----
    స్త్రీ జీవితంలోని కష్టనిష్టూరాలను కండ్ల ముందుంచారు రచయిత్రి. ఆద్యంతం పాఠకులకు ఊపిరి సలుపని సస్పెన్స్ తో ముంచెత్తారు పరిహారం నవలలో. ----
                                                         - పోల్కంపల్లి శాంతాదేవి.


 Previous Page

WRITERS
PUBLICATIONS