కారులో దిగిన స్మార్ట్ గా వున్న ఆ కుర్రవాడు....
"హౌ డు యు డూ" అన్నాడు.
శ్రీనివాస్ కూడా "హౌ డు యు డూ!" అన్నాడు.
"ఐయామ్ ఫ్రమ్ నిమ్స్! మైనేమీజ్..."
ఆ కుర్రవాడు చెప్పకుండానే శ్రీనివాస్ కల్పించుకుని-
"ఎక్స్క్యూజ్ మీ! యువర్ నేమీజ్ సాజిత్! ఇటీవలే తమరు అక్కడ చేరారు. క్రిటికల్ ఆపరేషన్ సహితం సుళువుగా చేస్తున్నారు. ఇంతకు ముందు తమరు అమెరికాలో వుండేవారు...."
"థాంక్యూ! నా పర్సనల్ మేటర్ మొత్తం గాదర్ చేసినట్టున్నారు."
"అది మా హాబీ! ఆ ఆసుపత్రిలో పనిచేసిన ఏ డాక్టరు వివరాలైనా మా కంప్యూటర్ లో ఫీడ్ అయివుంటాయి. తమరు ఎందుకు వచ్చారో చెప్తే మా సేవల్ని అందిస్తాం."
అందుకు సాజిత్ చిన్నగా నవ్వాడు.
డాక్టర్ సాజిత్ ఓ సంపన్న కుటుంబంలో పుట్టాడు. ఆయన తల్లి ఇంకా అమెరికాలోనే వున్నారు.
సాజిత్ మాత్రం ఇండియా చేరాడు.
ఒక మేధావి- టెక్నిషియన్- ఒక డాక్టరు- ఒక ఇంజనీర్ ఎక్కడ ఎక్కువగా అవసరమో అక్కడే వుండాలనేది అతని పాలసీ....అంతే కాని తమకు ఎక్కడ ఎక్కువ సంపదలు వనగూడుతాయో అక్కడ కాదనేది కూడా సాజిత్ చెప్తుంటాడు.
తల్లిదండ్రులు అమెరికాలోనే స్థిరపడమన్నా సాజిత్ అందుకు అంగీకరించలేదు.
తమకు అమెరికాలో - ఇండియాలో ఒక కుటుంబానికి మించిన సంపదలున్నాయి. తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులున్నాయి. అందుకే అతడో నిర్ణయాన్ని తీసుకున్నాడు.
మాతృదేశంలోని అవసరాలకు సేవలు అందించాలని! అందుకు 'నిమ్స్' ను టార్గెట్ గా ఎన్నుకున్నాడు.
హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని తన స్వంత భవంతిలో వుంటూ, ఆసుపత్రిలో పనిచేస్తూ విడిసమయాల్లో తనకు ఆసక్తిగా వుండే విషయాల్ని సేకరిస్తూ, రికార్డు చేస్తూ వుంటాడు.
ఇటీవల సాజిత్ దృష్టికి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వచ్చాయి. అవన్నీ ఫైల్ చేసి తమ సీనియర్ డాక్టర్స్ ముందు పెట్టాడు.వారు కూడా ఆ విషయాల్ని ఆసక్తిగా విని తమ తమ అభిప్రాయాల్ని చెప్పారు.
అవి కూడా నోట్ చేసుకున్నాడు.
ఆ మొత్తాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఒక బుక్ వెట్ గా తేవాలనేది సంకల్పం.
తన ఇంటిలోనూ కంప్యూటర్స్ వున్నాయి. ఈ మధ్య వంటరిగా మరీ బోర్ ఫీలవుతూ....బయట ఏదయినా ఇన్స్టిట్యూషన్ లోకెళితే....ఒకటి రెండు గంటలు కాలక్షేపం అవుతుందనీ, కొంతమంది కుర్రవాళ్ళు పరిచయం అవుతారనీ ఆశించాడు.
తనచుట్టూ కుర్రవాళ్ళు చేరడం తనకు పెద్ద సమస్య కాదు.
అయితే వారి అభిరుచులకు తగ్గ అభిరుచులు తన దగ్గర లేవు. ఫలితంగా తనకు ఓ 'అరిస్టోక్రాట్'గా భావించి చాలామంది దూరంగా వుంటున్నారు. తను వారిని ఇన్ వైట్ చేయలేడు. చేస్తే వారి టేస్ట్ ను తను వారిని తను మన్నించాలి. కొంత ఖర్చు సమస్య కాదు. పడాలి. ఖర్చు తను రాజీ పడలేని ధోరణి!
పైగా ఆ పెట్టే ఖర్చు ఏ పూర్ బోయ్ చదువుకోపెడితే ఒక ప్రయోజనం వుంటుంది.
తన భవంతిలో 'కుక్స్' పనిమనుషులు 'గార్డెనర్స్' వున్నారు. వారికి తాము బాగానే పే చేస్తున్నారు. అందుకే తామంటే వారికో ఆరాధన. చేయాల్సిన పనులన్నీ తమకోసం చకచకా చేసి ఒక దారిని వినయంగా నిలబడతారు.
వారిమధ్య తను వారినుద్దరిస్తున్న యజమానిగా తిరగాలి. ఈమధ్య అదీ తనకేందుకో అనీజీగా వుంటోంది.
తన పర్సనల్ మెడికల్ చాంబర్ అది. అందులో తను రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ గదిలో మైక్రోస్కోపులూ- కంప్యూటర్స్- మైక్రోటేక్ పరికరాలూ-నానోటేక్ థియరీ అన్నీ వున్నాయి. ఈ వయసుకే తను ఆ చాంబర్ కి పరిమితమైతే....జీవితంలో ఏదో కోల్పోతున్న అనుభూతి వస్తోంది!
ప్రపంచం ఇప్పుడు తన దగ్గరకు రాదు. తను అంతస్తుల ఎత్తులో వైజ్ఞానిక పీఠంమీద అందకుండా వుండిపోయాడు. తనే ఆ పీఠం నుండి క్రిందకుదిగాలి. జనంతో పరిచయాలు పెంచుకోవాలి....
సాజిత్ ఆ నిర్ణయాలతోనే ఆరోజు అక్కడికి చేరాడు.
శ్రీనివాస్ ప్రశ్నకు__
"చూడండి సర్! నేను నా ఫైల్స్ లోని కొంత మేటర్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ కెక్కించాలి. ఒక బుల్ లెట్ తేవాలి.
అయితే ఆ మేటర్ కాన్ఫిడెన్షియల్. నాకు కంప్యూటర్స్ ఆపరేట్ చేయటం వచ్చు.
ఒక పేజీకి మీరు చేస్తే ఎంత తీసుకుంటారో- అంత నేను మీకిస్తాను. నాకు ఆ అవకాశాన్ని క్రియేట్ చేయండి."
"ఎంతమాట సర్! ఇక్కడ మనీకాదు సమస్య. మా ఇన్స్ స్టిట్యూట్ తమకు వుపయోగపడటమే మాకు ఆనందం. ఎలాంటి ఫీజులూ వద్దు. మీరు ఏ సమయంలో వచ్చినా మా మెషీన్స్ తమకోసం సిద్దంగా వుంటాయి."
"అలా అయితే నేనిప్పుడే కారెక్కి వెనుతిరిగిపోతాను."
"మీరు వెనుతిరిగి వెళ్ళినా ఒక కంప్యూటర్ తీసుకొని మీవెంట పడివస్తాం. ఇక దీనికి తిరుగులేదు."
శ్రీనివాస్ మాటలకు సాజిత్ నవ్వాడు.
"రండి సర్!" శ్రీనివాస్ ఆహ్వానించాడు.
"రేటు చెప్పండి."
"మీ యిష్టం."
సాజీత్ శ్రీనివాస్ వెంట లోనికి వెళ్ళాడు.
సాజిత్, శ్రీనివాస్ లు సమ వయస్కులు!
శ్రీనివాస్ కూడా స్మార్ట్ గా హాండ్ సమ్ గా వుంటాడు. కష్టపడి కంప్యూటర్స్ లో ఇంజనీరింగ్ చేసి, స్వంతంగా ఇన్ స్టిట్యూట్ పెట్టుకున్నాడు. సిటీలోని శివాజీ సెంటర్ ఇంటర్ సెక్షన్ లో ఒక భవంతి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని రెంట్ కు తీసుకుని ఇన్ స్టిట్యూట్ ఓపెన్ చేశాడు. ఇన్ స్టిట్యూట్ రద్దీగానే సాగుతుంది.
సాజిత్ ను శ్రీనివాస్ తన పర్సనల్ గదికి ఇన్ వైట్ చేసి 'డ్రింక్' ఆఫర్ చేశాడు.
సాజిత్ కోరుకుంది కూడా అదే!
మాతృదేశం వచ్చాక పబ్లిక్ లో తిరగాలనే కాంక్ష మనసులో బలీయమై శ్రీనివాస్ స్నేహంతో అంకురించింది.
తమ డాక్టర్స్ క్లబ్ వుంది.
కానీ అక్కడ వారి హాబీలు, మూవ్ మెంట్స్-విచిత్రంగా వుంటాయి. సంపాదన, బిల్డింగ్స్-కార్లు-అమెరికన్ డాలర్స్-షేర్లు-సంభాషణ మొత్తం అటే సాగుతుంది. వృత్తిపరమైన విషయాల్ని చర్చల్లోకి రానీయకు. సాయంత్రము లైట్ గా డ్రింక్ చేయాల్సిందే...తనకు అది అసలు పడదు.
పోతే తనకు నచ్చింది సీనియర్ డాక్టర్స్. వారు క్లబ్ లోకంటే ఇంటిదగ్గరే ఎక్కువ కాలక్షేపం చేస్తారు.
సాజిత్ కు శ్రీనివాస్ పరిచయం ఆనందంగానే వుంది.
ఇరువురూ డ్రింక్ చేస్తున్నప్పుడు....
బయటనుండి-
"మే ఐ కమిన్ ప్లీజ్" అనే పిలుపు వినపడింది. ఆ కంఠధ్వని మధురంగా వుంది.
శ్రీనివాస్ "కమీన్" అన్నాడు.
పాతిక సంవత్సరాలకు దగ్గరగా చేరన ఒక అమ్మాయి లోనికి ఎంటరయింది. ఏవో పేపర్స్ శ్రీనివాస్ టేబుల్ మీదుంచి-
"సారీ ఫర్ ది డిస్ట్రబెన్స్" అంటూ వెంటనే బయటికిపోయింది. సాజిత్ ఆ అమ్మాయిని చూడటంతో ఒక్కసారిగా తీయటి షాక్ కు గురయ్యాడు.
ఏదో మెరుపు మెరిసి మాయమయినట్టు ఎందుకో ఆ అమ్మాయిని ఆ క్షణమే మరోసారి చూడాలన్నట్టు అతని అంతరంగంలో ఒక భావన పొటమరిచింది. విషయాన్ని ఏదోరకంగా కదిలించాలని-
"మిస్టర్ రీనివాస్! ఈ అమ్మాయిని నేనెక్కడయినా ఇంతకు ముందు చూసానా?"
"చూసే వుంటారు సార్! పేరు పావని. లెక్చరర్ గారమ్మాయి. ఆమె ఫాదర్ దగ్గర మేమంతా చదువుకున్నాం. పేరు తిరుమలరావు గారు..."
"ఐసీ...! ఆమె ఇప్పుడేం చేస్తుంటుంది?"
"ఒక వారంక్రితమే మా ఇన్ స్టిట్యూషన్ లో చేరింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి, ఇన్ వెస్టిగేటింగ్ జర్నలిజంలో డిప్లమా తీసుకుంది.
ఇప్పుడు సాఫ్ట్ వేర్ టెక్నాలజీలో అనుభవం గడించాలని కోర్కె"
సాజిత్ కు శ్రీనివాస్ అంతవరకే చెప్పి ఆగిపోయాడు.
"పిలిచి పరిచయం చేయమంటారా?" అని మాత్రం అనలేదు. అలా అంటాడని సాజిత్ అభిప్రాయపడ్డాడు.
"మ్యారేజ్ అయిందా?"
"కాలేదు! మాష్టారుకి ఈమె ఒక్కటే డాటర్. ఇండిపెండెంట్ వ్యూస్ వున్న గాళ్."
"నైస్ గాళ్!" సాజిత్ శ్రీనివాస్ ముందు అప్రయత్నంగా అన్నాడు. తరువాత తను త్వరపడి అలా అన్నానేమో అనుకున్నాడు. అందుకు శ్రీనివాస్ ఫన్నీగా నవ్వి....
"నాట్ ఒన్లీ నైస్ సర్! బట్ ఆల్సో ఫర్ ఫెక్ట్."
ఈసారి సాజిత్ మెల్లిగా నవ్వి.....
"వెరీగుడ్" అన్నాడు.
డ్రింక్స్ అయిపోయాక....శ్రీనివాస్ కల్పించుకుని.....
"ఒకసారి ఇన్ స్టిట్యూషన్ చూస్తారా సర్!"
"ఇన్ స్టిట్యూషన్ కాదు, ముందు ఆ అమ్మాయిని మరోసారి చూస్తాను" సాజిత్ అందామనుకున్నాడు. ఉండే వుంటుంది గనుక-చూసే అవకాశం వుండదని-
