ఖరీదైన గెస్టులు ఇంటికొచ్చినప్పుడు నలభై ఏళ్ళ స్త్రీలా హుందాగా వ్యవహరిస్తుంది. ఇంటి పనులూ, ఆర్ధిక వ్యవహారాలూ చూసుకుంటున్నప్పుడు ముప్ఫై ఏళ్ళ ఇల్లాలిగా చురుగ్గా వుంటుంది. ఇక పడకటింట్లో ఆమె పదహారేళ్ళ కన్యలా ముద్దు ముద్దుగా ముగ్ధ మనోహరంగా ప్రవర్తిస్తుందట.
ఇప్పుడామె నీలం పూలున్న తెల్లటి నైటీలో వుంది. కాటుక లేక పోయినా ఆమె కళ్ళు సెక్సీగానే వున్నాయి. బొట్టు లేకపోయినా నుదురు సాయంకాలపు ఆకాశంలా ఎర్రెర్రగా మెరుస్తూనే వుంది.
లిప్ స్టిక్ ముద్రలు చెరిగిపోయినా పెదవులు దోర దోరగా దొండపండుల్లా వున్నాయి. ప్యాడెడ్ బ్రా లేకపోయినా ఆమె ఎద ఎత్తుగా, గుండ్రంగా తేనెటీగలతుట్టెలా వుంది. వడ్డాణం ఎప్పుడూ పెట్టకపోయినా ఆమె నడుం పిడికిలిలో యిమిడేంత సన్నగా వుంది. ఎలాంటి అలంకారాలు చేసే వీలులేని బొడ్డుకూడా పిడికిట్లో మూసిన పగడంలా వుంది.
అంతకుమించి కిందకు దిగాలంటే అందరికీ భయమే. ఆమంటే ఆ టౌన్లోని మగవాళ్ళందరికీ చచ్చేంత భయమూ వుంది. బతికేంత ఆకర్షణా వుంది. ఛోటా ఆఫీసర్ దగ్గర్నుంచి బడా రాజకీయ నాయకుడి వరకు శాసించగల ఆమె చిన్న పల్లెటూరు నుంచి వచ్చిందంటే ఆశ్చర్యంగానే వుంటుంది.
ఆమె పుట్టిందీ పెరిగిందీ పాయసంపల్లెలో. ఆమె తండ్రి టైలర్ గా వుండేవాడు. తల్లి అడపాదడపా కూలిపనులకు వెళ్ళేది. ఒక్కతే కూతురు గనుక వున్నంతలో కష్టం తెలియకుండానే పెంచారు. పదవతరగతి వరకు చదువుకుంది. ఇంటర్ చదవడానికి కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ పట్టుకొచ్చింది. కానీ అక్కడ చదివే అమ్మాయిలంతా బాగా డబ్బున్నవాళ్ళనీ, ఎంతో నాజూగ్గా స్టెయిల్ గా వున్నారన్న విషయాన్ని కనిపెట్టింది. తనలాంటి పేద అమ్మాయి సాదాసీదాగా వుండే వీలుందే తప్ప అంతకు మించిన గొప్పలకు పోయే అవకాశం లేదు. రోజూ ఇన్ఫీరియర్ గా ఫీలవడం కన్నా యింటి దగ్గర వుండడమే నయమనుకుంది.
ఇలా, డబ్బుంటే తప్ప చదువూ సంధ్యా ఏదైనా సాధ్యంకాదని తన పదహారవ ఏట నేర్చుకుంది.
డబ్బు సంపాదించడం ఎంత కష్టమో, అదే సమయంలో అంతే సులభమని తన పదిహేడవ ఏట గుర్తించింది. డబ్బు గడించాలంటే పల్లెటూరు కన్నా పట్టణాల్లోనే అవకాశాలు ఎక్కువగా వుంటాయని తన పద్ధెనిమిదవ ఏట తెలుసుకుంది.
పందొమ్మిదో సంవత్సరంలో శ్రీరాములుతో ఆమెకి వివాహం నిశ్చయమైంది.
శ్రీరాములు మామూలు మనిషి కూడా కాడు. వెర్రిబాగులతనమే ఎక్కువ. పరుపులు, దిండ్లు కుట్టేవాడు. సైకిల్ పై దూది వేసుకుని వూరూరా తిరిగేవాడు. పరుపులు, దిండ్లు కుట్టి జీవనం చేసేవాడు. ముందు వెనకా ఏమీ లేనివాడు.
పందొమ్మిదేళ్ళకి సరిత చాలా అందంగా తయారైంది. ఆమెలో వుండే సెక్సీతనం ఆమెని అందరిలోకి ప్రత్యేకంగా నిలబెట్టేది. ఈ సెక్సీతనం ఆమె అవయవాల్లోనే వుందో, లేక ఆమె ప్రత్యేకించి సాధించిందో ఆమె మిత్రురాళ్ళకు అర్థం కాలేదు.
అలాంటి సరిత శ్రీరాముల్ని పెళ్ళి చేసుకోవడానికి ఎలా ఇష్టపడిందో ఎవరికీ అంతుబట్టలేదు. పైపెచ్చు పెళ్ళి కుదరగానే యింకా సరదాగా, జాలీగా వుంది.
ఓరోజు సాయంకాలం మిత్రురాళ్ళు ఆమెను ఈ విషయంపై నిలదీశారు.
"శ్రీరాములులాంటి వాడితో ఏం సుఖపడతావే?"
"వెర్రి మొర్రి వాడితో వేగలేక ఛస్తావ్!"
"అప్పుడే అంత తొందరపడకు, నీలాంటిదాన్ని ఎవరైనా ఎగిరి గంతేసి మరీ పెళ్ళాడతారు. మంచి సంబంధం వచ్చేవరకు ఆగు"
"ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. బాగా ఆలోచించుకో"
అంతా విన్నాక సరితాదేవి "మీరంతా ఎందుకంతగా బాధపడిపోతున్నారో నా కర్థం కాలేదు. మనకంటూ కొన్ని లక్ష్యాలున్నప్పుడు మన సహచరుడు మనకన్నా తెలివితక్కువవాడై వుండాలి. ఆడపిల్లల్లో - మీరనే ఏమిటి చాలామంది తాము తెలివితక్కువవాళ్ళమనే నమ్ముతారు. అందుకే తమకంటే తెలివైనవాళ్ళని జీవిత భాగస్వాములుగా రావాలని కోరుతుంటారు.
కానీ నేనలాంటిదాన్ని కాను. నేను తెలివైనదాన్ని. నేను సాధించాల్సింది చాలా వుంది. అందుకే శ్రీరాములు లాంటివాడే నాకు కావాలి" అంది స్పష్టంగా.
ఆ మిత్రురాళ్ళకు ఆమె మాటలు ఏమీ అర్థం కాలేదు. పాపం అంటూ జాలిగా చూశారు. సరిత మాత్రం పెదవి విడీవిడకుండా గుంభనంగా నవ్వి వచ్చేసింది.
శ్రీరాములతో ఆమె పెళ్ళి జరిగింది. అందరూ కాకి ముక్కుకి దొండపండు దొరికింది అన్నారు.
భర్తకంటే భార్య తెలివైనదిగా వుంటే ఎంత మేలు జరుగుతుందో ఆమె స్నేహితురాళ్ళకు తెలిసింది. సరిత ఎలా అలంకరించుకున్నా శ్రీరాములు పట్టించుకునేవాడు కాదు. ఆమె ఈ పెళ్ళిలో పోగొట్టుకోనిది, అందరూ పోగొట్టుకునేది ఒకటే - అది స్వేచ్ఛ.
తన అంచనా తప్పుకానందుకు ఎంతో సంతోషించింది సరిత. మెల్లగా తన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించుకుంది.
ఓరోజు రాత్రి శ్రీరాములు తనను దగ్గరికి తీసుకున్నప్పుడు, అతని కౌగిలిలో పూలపొట్లంలా ఒదిగిపోతూ చెప్పింది.
"ఈ పల్లెటూర్లో ఎంత పనిచేసినా ఒకటే. రాబడి ఎప్పుడూ అంతే వుంటుంది. వారానికి ఒక పరుపు కుడితే గొప్ప. మన ఆదాయం పెరగదు. అదే టౌన్లో అయితే చేతినిండా పని. అందువల్ల మన ఫ్యామిలీని టౌన్ కి మార్చేద్దాం"
శ్రీరాములు వెంటనే తలూపాడు.
అలా సరిత టౌన్ లో కాపురం పెట్టింది. తను వుంటున్న కాలనీలోనే మరో ఇల్లు అద్దెకు తీసుకుంది. అక్కడ శ్రీరాముల్ని పరుపులూ, దిండ్లూ కుట్టమంది.
సరిత చొరవగా వుండేది. పాత, కొత్త అనే భేదం లేదు. అందరితోనూ చిటికెలో స్నేహం సంపాదించేది. ఈ పరిచయాలన్నీ వ్యాపారానికి తోడ్పడ్డాయి రోజుకి నాలుగైదు పరుపులు అమ్మే స్థాయికి వచ్చింది.
ఉన్నంతలో శుభ్రంగా వుండేదే తప్ప డబ్బు దుబారాగా ఖర్చు పెట్టేది కాదు. డబ్బంతా కూడాక అక్కడే ఓ చిన్న ప్లాటు కొంది. ఇంటికి కావాల్సినవన్నీ నిదానంగా ఒక్కొక్కటీ అమర్చుకుంది.
తప్పు అయినా ఒక స్థాయిలో వున్నప్పుడు చేస్తేనే దానికి విలువ వస్తుందని ఆమెకు తెలుసు. అందుకే అంతవరకు ఆమె నిగ్రహాన్ని పాటించింది.
మరో పాచిక జరపాల్సిన సమయం వచ్చిందని ఆమె గ్రహించింది.
డబ్బు పెట్టుబడి పెట్టకుండా తన తెలివితేటలతో ఆదాయం వచ్చే రంగాలు రెండు. ఒకటి సినిమా రంగం అయితే, రెండోది రాజకీయం. సినిమాల్లో తను ఏం చేయగలదో ఊహించిందిగానీ ఏమీ తట్టలేదు. దీంతో రాజకీయమే మేలనుకుంది.
రాజకీయాల్లో వుండాలని నిర్ణయించుకున్న తరువాత తనకు గాడ్ ఫాదర్ గా వుండే వ్యక్తిగా ఎవరిని ఎన్నుకోవాలో ఆలోచించుకుంది. అధికారంలో వున్నా లేకపోయినా చక్రం తిప్పగలిగే వ్యక్తి ఆమె కంటికి ఒక్కరే కనపడ్డారు. అతను పరమేశదాసు.
