Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 35


                        సంధ్యా సమస్యలు

ఆ సాయంత్రం...
రాక్సీలో నార్మా షేరర్,
బ్రాడ్వేలో కాంచనమాల!
ఎట కేగుటొ సమస్య తగిలిం
దొక విద్యార్థికి!

ఉడిపీ శ్రీకృష్ణ విలాస్ లో -
అటు చూస్తే బాదం హల్వా,
ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ!
ఎంచుకొనే సమస్య కలిగిం
దొక ఉద్యోగికి!

ఆ సాయంత్రం....
ఇటు చూస్తే అప్పులవాళ్లూ
అటు చూస్తే బిడ్డల ఆకలి!
ఉరిపోసుకు చనిపోవడమో,
సముద్రమున పడిపోవడమో -
సమస్యగా ఘనీభవించిం
దొక సంసారికి!

                                                                              - 1939 (?)

                                                      * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS