డబ్బులు, ధాన్యాలూ, పటాలు, వీకులు , శాస్త్రాలు .....పంచలు- గొడ్లు, తాయెత్తులు.
మాకు పనీ వొద్దు. పదార్ధాలు వొద్దు.
నీకూ వొద్దు, నిన్ను చెయ్యమన్నామా, రా.
రైళ్ళ దగ్గిర, సినీమాల దగ్గిర, హోటళ్ళ దగ్గిర. బస్సుల దగ్గిర ......ఎక్కడా వీళ్ళే, రైళ్ళు బస్సులు ఎక్కే వాడా, సినిమా చూసే వాడా, ఫలహారాలు మింగేవాడా, కిళ్ళీలు నమిలే వాడా, ఏం లేనివాళ్ళు 'ఇస్తావా' అని చెయ్యి జాచే యీ స్వతంత్రులు -- నిర్భయులు. ఎంత ఇబ్బంది వాళ్ళని చూడడం -- ఎంత బాధ నీ జేబులో సొమ్ము, నీ కండువా జరీ, నీ చేతి వాచీ వెండి - ఎంత బాధ!
మంచి సంతుష్టితో తిననీరా వీళ్ళు నిన్ను!
"నాకేం హక్కు వుంది?" అనే సత్యాన్ని ఎక్కడి నుంచో కేలుకుతారా నీలో,
కాళ్ళు పట్టి, అబద్దాలడి, దొంగతనంగా తెచ్చి, బలుపుగా మోసిన కానీని నీ సొంత కానీని అడుగుతున్నారా?
మా ఇంటి ఎదురు 'లాయరు ' - తన నేల సారం పీల్చి ఎదిగిన వేపచెట్టు పుడకని -- అడిగితే,
"నీ తాతసొమ్మా!" అంటున్నాడు.
తన నేలలో వూరిన బావినీటిని , తన మనమడి కోసం నిలువ వుంచుతున్నాడు.
ఎంత బాధ నీకు? ఈ బిచ్చగాళ్ళు - హాయిగా ఎండలో మాడి, చలిలో వోణికి.
కాని మహారాజులమల్లె, గర్వంగా, నీ లెక్క లేకుండా తను నీకు అప్పిచ్చినట్టు, కానీ 'ఇయ్యి' అంటున్నాదా పని - మనిషి - రక్తం -- నరాలు - స్వేచ్చ - ఎవరు విలువ కడతారు?
పుట్టింది మొదలు ఒకటే ఏకరువు పెట్టె నిద్రల లెక్చరరికి గంటకి అయిదు రూపాయలు -
వోటు పెట్టెలు మార్చి తక్తు నెక్కిన నక్కకి నెలకి మూడు వేలు -
నిజంగా నరాలు పిండి, రక్తం వుడుకేత్తి , వ్రాసి సొమ్మసిలిన వ్యాసాలకి, కధలకి, కవిత్వానికి పోస్టేజీ ఖర్చు.
పెళ్లిళ్లు ..........పెళ్లిలో అడ్డాలు యీ బిచ్చగాళ్ళు, బైరాగులు రౌడీలు .......
తిండిట .........నాకూతురు పెళ్లికి, నీళ్ళకి తిండిట! తంతే , తరిమితే , కైదులో వేస్తె .......
శోభనం గదిముందు - పెళ్ళాలు లేని బీదవాళ్ళు - పులి స్తరాకులు కోసం ----
లోపల పరిమళాలు -- పలహారాలు --
ప్రతికుక్కా, దోమా, చేసే పనికి అంత ఖర్చు ! అందరూ కలిసి శోభనం కూతుర్నేత్తుకు పొతే! సిగ్గులేదు.
"మా అమ్మాయికి గర్భాదానమండి ........'మీరు భోజనానికి' సిగ్గులేదూ?
"గర్భాదానానికి అల్లుడికి ఏమిచ్చారు? అయిదు వొందలు, ఎంత కష్టం? అయిదు వందలకే వొప్పుకున్నాడా? నేనైతేనా? సరేలెండి. నాకెందుకు? భోజనం పెట్టండి అదేచాలు" ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పెళ్ళిళ్ళన్నా, గర్భాదానాలన్నా సంతోషం విడవదు. భోజనాలు ----మేళాలు----- బోగం మేళాలు-
బోగం మేళాలు , out of fashion. వీరేశలింగం గారి ఆత్మ యింకా ముక్కాలు పీటల్నీ కదిలిస్తోంది.
నాటకం మేళాలు - కొత్త fashion.- సంసార నాటకాలు. వూరేగింపుల వెంబడి నాటకాలు - ఇంకో రెండు వందలు ఎక్కువ ఇస్తే సరి. మాది బోగం మేళం కాదు -- సంసారిక ఉద్యోగస్తుల నాటకం మేళం.
ఏదో వొకవిధం - ఆడది దగ్గిరికి రావాలి -- రంగు పూసుకునే ఆడది మరీ రంగుగా వుంటుంది.
పెళ్ళి అయితేనేం, చావు అయితేనేం?
చావు యేడుపుల ఉద్రేకంలో ఇదే సమయమని ఒకరి మీద పడి పమిట తొలిగించి వొత్తుకోడం .......
పెళ్ళిళ్ళలో- నృత్యాలు- నృత్యం చేసే భాగాల కోసం ---
హృదయేశ్వరీ విరహం భరించలేక, సమ్మె స్త్రీల తొడలు తడిసెట్టు కన్నీళ్లు.
పోనీ ఓ బౌద్దభిక్షు కాశ్రమం పెట్టి, భిక్షుకులని ఆహ్వానిద్దాం.
అసలే ముసలిపులి, పళ్ళూడాయి- లేచే శక్తి లేదు. కవిత్వపు బంగారు కడియాలు చూసి పిలిస్తే ......ఎన్ని అగచాట్లు ..........అబద్దాలు. స్త్రీలని పట్టా లా చడువున్న స్త్రీలని, రిబ్బన్ల పిల్లల్ని , లెక్చర్ల లేడీలని , ఎట్లానన్నా........
సినిమా కధలో కావిలించుకోగాలేనిది, నేనేం తీసిపోయినాను? నా బొర్రా, జరంతో చిన్నదయింది యీ మధ్య ......నీ భర్త పోయినాడా! నేనున్నానుగా! అమ్మాయీ! పిచ్చిదానా! నా చేతివంక చూడకు.
దిగులా!
ఏం లేదులే -- ఏం చెయ్యటం లేదు,
ఏదో పోయినవాళ్ళు పోయినారు- వున్న వాళ్ళ వంక చూడు.
ఎంత స్నో పూసుకున్నానో మ ఇట్లా వాసనా చూడు. దెబ్బలు కూడా తిన్నాను. అబ్బే నేనేం చెయ్యలేదు. అంత చిన్నపిల్ల నాకెందుకు?
పెళ్ళిళ్ళల్లో మేళాలు మరీ వీలు.
నాటకాలు సాగని రోజుల్లో -- యీ మేళాలకన్నా పొతే -- జమిందారులు, వర్తకులు,
ఏం చేస్తారా
నవీన స్త్రీకి emancipated women కి కావాలి వొంటి నిండా, వొంటి యిరుకుల్లో -- పరిమాళాలు- పొగడ్తలు, lime- lights, హృదయ భంగాలు ,
తాము తామని , తిరగడాలు - 'ఎంత చిన్న వారండీ - మీ మనమరాలు కన్న మీరే చిన్న, మీరే చౌక."
చలం - ఎంత గొప్ప స్త్రీలని తయారు చేశావు? వాళ్ళని వెంబడించే ఎంతటి దొంగల్ని !
* సమాప్తం *
