Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 28


                                                        చేదుపాట

ఔను నిజం, ఔను నిజం,
ఔను నిజం, నీ వన్నది!
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం!

లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో!
బ్రతుకు వృథా, చదువు వృథా,
కవిత వృథా! వృథా, వృథా!

మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగులం!
వెనుక దగా, ముందు దగా,
కుడియెడమల దగా, దగా!

మనదీ ఒక బ్రదుకేనా?
కుక్కలవలె, నక్కలవలె!
మనదీ ఒక బ్రదుకేనా?
సందులలో పందులవలె!

నిజం సుమీ, నిజం సుమీ,
నీ వన్నది నిజం సుమీ!
బ్రతుకు ఛాయ, చదువు మాయ,
కవిత కరక్కాయ సుమీ!

లేదు సుఖం, లేదు రసం,
చేదు విషం జీవఫలం!
జీవఫలం చేదువిషం,
చేదు విషం, చేదు విషం!

ఔను నిజం, ఔను సుమా,
ఔను నిజం నీవన్నది!
నీ వన్నది, నీ వన్నది,
నీ వన్నది నిజం, నిజం!
                                                                               14-5-1937

                                                        * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS