Previous Page Next Page 
రామాయణము పేజి 26

    హనుమంతుడు నాలుగు వేదములను అధ్యయనము చేసినవాడు. వ్యాకరణ దోషములు లేకుండా వచించగల పండితుడు. మనోరంజకముగ మాటలాడగల నేర్పరి; గాన  విద్యావిశారదుడు. సకల కళాప్రపూర్ణుడు. అతనిచే ఆకర్షితుడైన శ్రీరాముడు "లక్ష్మణా రుద్రుని  వలె  ప్రకాశించుచున్న ఈ వానరొత్తమునకు  ఈతడు తెలిసికోనగోరిన మన వృత్తంతామును వివరించుము" అని  ఆదేశించినాడు. లక్ష్మణుడంతయు వివరించి పిమ్మట "ఆంజనేయ 'దనువు' అను గంధర్వుడు మాతో  ఈ బుశ్య మూక  పర్వతముపై 'సుగ్రీవుడు' అను వానరాధిపుడు ఉన్నాడనియూ, అతడు స్నేహపాత్రుడనియూ, అపహరించబడిన సీతాదేవి ఎక్కడనున్నదీ  వెదకి తెలిసికొనుటకు అతని సహకారము  అవసరమనియూ చెప్పుటచే  మేమిక్కడకు వచ్చినాము. పర్వతము పైకి పోవుదారికై పరికించుచున్నాము" అన్నాడు.
    హనుమంతుడు: ఆ సుగ్రీవుడు మా ప్రభువే. ఆయనకు నేను ప్రధాన  సచివుడను. సుగ్రీవుడు మిమ్ము పర్వతాగ్రము నుండి గమనించినాడు. మీరెవ్వరో తెలిసికొని రమ్మని  ఆయనయే నన్నిచటకు పంపినాడు. సీతదేవి జాడను తెలిసికొనుటలో మా రాజు మీకు తప్పక  తోడ్పడును... శ్రీ రామచంద్రా ప్రస్తుతము సుగ్రీవుడు కూడా నీవలెనే  భార్య  వియోగము  వలన దుఃఖములో నున్నాడు. అగ్రజుడునూ బలపరాక్రమశాలియు ఐన 'వాలి' వలననే తమ్మునకు అన్యాయము జరిగినది. ధర్మపరాయణుడవూ పరాక్రమవంతుడవూ ఐన నీ సాహాయ్యమిప్పుడు సుగ్రీవునకు అవసరము.
    లక్ష్మణుడు: ఈ రామచంద్రుడు దుష్ర్కుతులను శిక్షించి పీడితుల రక్షించుటకు కంకణము కట్టుకొన్నాడు. మేము వల్కలమును ధరించినను ఆయుధములను విసర్జించకుండటకు కారణమిదియె.
    రాముడు: ఆంజనేయా  వాలి సుగ్రీవుల వృత్తాంతమును తెలిసికొనగోరుచున్నాను.
    హనుమంతుడు: అలకించుడు... 'బుక్షరాజుడు' అనెడి వానర సార్వభౌముడు ఇక్కడకు సమీపముననె కల కిష్కింధా నగరమును రాజధానిగ జేసికొని జంబూ ద్వీపమందలి కపిసమూహములన్నింటికిని అధిపతిగా నుండెడివాడు. అతని కుమారులే  వాలి సుగ్రీవులు. వాలి ఇంద్రుని అంశమునను జన్మించినారు. బుక్షరాజుని అనంతరము వాలి వానర సామ్రాజ్యమునకు  పట్టభికుక్తుడైనాడు. వినయ సంపన్నుడగు సుగ్రీవుడు అగ్రజుని భయభక్తులతో సేవించుచు తన పరాక్రమముతో తోడ్పడుచుండెడివాడు.
    ఒడిదుడుకులు లేకుండ కాలము గడిచిపోవుచుండగా  ఒక రాత్రి  అడవి దున్నపోతు  ఆర్పు ఒకటి అత్యంత భయంకరముగ  వినపడింది. ఆ భయంకర రావమునకు వాలి పట్టామహిషి తారాదేవి హడలిపోయినది. వాలి రుద్రుడై అంతఃపురము నుండి కోట బురుజుపైకి ఎగిరి వచ్చినాడు. అంత కర్ణకఠొంముగా అరచి అపచారము చేసిన పొగరుబోతు  ఎవడని పరికించి చూచినాడు. కోట ముంగిట కొండంత పరిమాణము గల శరీరముతో మహిషాకారమున  నున్న రాక్షసుడొకడు కనపడినాడు. వాని ముక్కు పుటముల నుండి వెలువడుచున్న ఊపిరి మండు వేసవి వడగాడ్పు వలె దుస్సహముగా నున్నది. భూమి దద్దరిల్లుననట్లు ఎగిరిపడుచూ తన వాడి కొమ్మలతో కోట గోడను డీకొనుచున్నాడు. వాలి "ఎవడవురా నీవు? ఈనిశీధిని నిశ్శబ్దమున కేల భంగము కలిగించుచున్నావు?"' అని గద్దించి అడిగినాడు.
    ఆ రక్కసుడు "నేను దుందుభి' అను వీరాగ్రేసరుడను. ఈ విశాల విశ్వమున నన్నెదిరించి పోరగల వీరుడెవ్వడును లేడని బుజువు చేయుటకు  బయలుదేరినాను, మొదట హిమవంతుని వద్దకు  పోయి 'పర్వతరాజునని విఱ్ఱవీగకుము. దైర్యమున్నచో నాతో పోరాడుము' అని సవాలు చేసినాను. వాడు 'మునులెందరో నాయందు వసించుచు నిష్ఠతో  తపమొనరించు కొనుచున్నరు. నేను లేచి వచ్చి నీతో  తలపడినచో ఆ మునిసందోహమునకు ఇబ్బంది కలుగును. అంతియకాక  నేను అకారణ యుద్దమునకు సిద్దమై కాలమును వృద్దా చేసికొను అవివేకిని కాను'  అని ఏవేవియో కుంటిసాకులు చెప్పి తప్పించుకొన్నాడు. నేనా పిరుకిపందను వదలివచ్చుచూ నాతో పోరాగల ధీరుడెవాడైన నున్నచో తెలుపుము' అని అడిగినాను.... హిమవంతుడు  'దక్షిణా పథమున కిష్కింధ రాజధానిగా గల వానర సామ్రాజ్యమునకు 'వాలి' యను వనచరశ్రేష్టుడు సౌర్వభౌముడు. వాలి బలపక్రమశాలి అని విన్నాను అని చెప్పినాడు. వాలీ "ఆలస్యము చేయక బురుజు నుండి దిగివచ్చి నాతో తలపడుము" అని సవాలు చేసినాడు.... వాలి హుంకరించుచు బురుజుపై  నుండి దుందుభి ముందనకు ఉరికినాడు. రాక్షసుడు తన వాడి  కొమ్ములతో వాలి వాని  శృంగములను నేర్పుగా దొరక పుచ్చుకొని అరటి దూటను విరిచినంత సులువగా ముక్కలు చేసినాడు; తన వాలముతో మహిష రూపుడగు దానవుని నాలుగు  కాళ్ళనూ కలిపి బంధించి  పర్వతమంత పరిమాణము కల వానిని పడగొట్టి తన  పిడికిలి దెబ్బలతో  వాని  దేహమును  హునాము చేసినాడు. వాని కాయము  గాయముల మాయమై రుధిరామును  చిమ్మినది; ముక్కుపుటముల నుండి  శోణితము ఏరులై పాఱినది; వాడు  రక్తమును కక్కుచూ  ప్రాణములు విడిచినాడు.
    లక్ష్మణుడు: అసురుడు అహంకారమునకు వశ్యుడై అసువులను కోల్పోయినాడు!... ఆంజనేయా తరువాత ఏమి జరిగినదో తెలుపుము.
    హనుమంతుడు: పర్వతమంత పరిమాణము కల దుందుభి కళేబరమును విజయోత్సాహముతో తిలకించుచున్న వాలికి ఒక వింత కోరిక జనించినది. 'ఈ మహాకాయమును నేనెంత దూరము తన్నగలనో చూచి ణా కాలి  సత్తువను పరీక్షించుకొందును' అనుకోనుచూ ఆ బలశాలి దానిని బంతి వలె తన్నినాడు. అది అత్యంత రయమున పోయి యోజనము దూరమున గల మతంగ మహాముని వర్ణశాల ప్రాంగణమున పడినది.  కళేబరము  నుండి వలువడిన రక్తబిందువులు కుటీర మందలి  హొమగుండము నందు పడినవి. మతంగ  మహాముని  క్రుద్ధడై "ణా ఆశ్రమము నిట్లపవిత్రము చేసిన  తుంటరి ఎవడైనను వర్ణశాల చుట్టును యోజనము పరిధిలో  ఎక్కడ  అడుగిడినను మరణించును గాక!" అని శపించినాడు. వాలి- మతంగ మహామునికి తన వలన జరిగిన అపచారము తెలిసివచ్చి - 'క్షమించుడ' ని కోరుచు వర్తమానమును పంపినాడు కాని ఆ మహా తపస్సంపన్నుని శాపము అమోఘమగుటచె అది అట్లే నిలిచిపోయినది. అనతి కాలముననె మతంగ మహామునిస్వర్గమునకు పోయినాడు. ఆయన ఆదేశానుసారము శబరియూ మీరు వచ్చు వరకునూ ఆశ్రమమును మీకై వేచియుండి పిమ్మట నాకమునకు పోయినది...మన ఎదుట గల  ఈ బుశ్యమూక మహీధరము మతంగ మహాయుని శాపములోని యోజనము పరిధిలోనికి తనపై పగపూనిన అగ్రజుడు ఈ భూధరమునకు రాజాలడనియే సుగ్రీవుడు ఈ పర్వతముపై  వసించుచున్నాడు.
    లక్ష్మణుడు: ఆంజనేయా వాలికి సుగ్రీవుని పై గల పగకు కారణమేమి?
    హనుమంతుడు: విన్నవించెదను అలకించుడు. దుందుభికి 'మాయావి' అను పేరుగల కుమారు డున్నాడు. వాడి కిష్కింధకు పోయి కోట ప్రాంగణమున నిలిచి "నా తండ్రిని చంపినా నిన్ను వధించి పగ తీర్చుకొనుటకు వచ్చినాను. యుద్ధమునకు రమ్ము" అని సవాలు చేసినాడు. "వీని తండ్రి గతినే వీనికినీ పట్టించెదను!" అని వాలి పోవుచుండగా సుగ్రీవుడు "అన్నా వీడు బలపరాక్రమములలో తండ్రిని మించినవాడు; మాయలలో ఆరితేరినవాడు. నన్ను కూడ నీతో రానిమ్ము" అన్నాడు. వాలి "ఈ దనుజుని మాయలు గీయలు నన్నేమియు చేయజాలవు. వీనిని వధించుటకు నాకు నీ సాయమక్కరలేదు. నీవు నా రణవిద్యాకౌశలమును తిలకించగోరినచో రావచ్చును" అన్నాడు. వాలితో సుగ్రీవుడునూ వెళ్లినాడు. మాయావి కయ్యమునకు కాలుదువ్వి వచ్చినాడే కాని ఆజానుబాహువులునూ అవక్ర వరాక్రములునూ అగు వాలి సుగ్రీవులు కంటబడుటతోనే హడలిపోయి వెనుకకు తిరిగి పలాయనము చిత్తగించినాడు! సుగ్రీవుడు వాలితో "అన్నా ఈ దనుజుడు భయముతో పారిపోవుచున్నాడు. మరలిపోవుదము రమ్ము" అన్నాడు. వాలి, "శత్రుశేషమును ఉండనీయరాదు" అని మాయావిని తరుముచూ పోయినాడు. సుగ్రీవుడునూ వెళ్లినాడు. మాయావి ఎదురైనా ఒక కొండలో దూరి మాయమైనాడు. వాలి సుగ్రీవునితో "వీడు ఎలుక వలె ఈ బిలమును దూరినాడు. నేను సర్పము వలె వెంటాడి వీనిని వధించి వచ్చెదను. నీవు గుహ ద్వారము వద్దనె వేచి యుండుము" అని ఆదేశించి గుహను ప్రవేశించినాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS