Previous Page Next Page 
చాటు పద్యమణి మంజరి పేజి 26

 

    'రంగనాథుఁడు అందోళిక పై నెక్కి చనుదెంచునప్పుడు త్రిపురాం'తక దేవుని గోపురంబు జూచి 'అదియేమి' యని యడిగిన నా వివరాలు త్రిపురాంతక గోపురంబని పలుకుటయు నాశివభవనంబు జూడ నొల్లక మైనపు జడ్లు కప్పించు కొనియె. అప్పుడు రంగనాథుని నేత్రంబులు గానరాక జత్యంధుని వలెనె మగిడి శ్రీరంగానకు పోయి యద్దేవుని బ్రసన్నుని జేసికొని నేత్రంబులు పోయే నని మొఱయాడుటయు, నద్దేవుండు కరుణించి త్రిపురాంతక దేవుణ్ణి వేడుకొమ్మనుటయు రంగనాథుండు మళ్ళీ త్రిపురాంతకమున కేతెంచి యద్దేపునకు నమస్కరించి తన యెత్తుకృతులు సమర్పింతునని వ్రతంబు చేసి భక్తి మయం బగు రగడ చెప్పిన నద్దెవుండు ప్రసన్నుండై రంగనాధునకు నిరుకన్నుల నోసగుటయు తంగనాధుఁడు పాలకూర్తికింజని సోమనాధునిచే శివదీక్ష గైకొనియె. అయాయ్య వద్ద శైవరహస్యంబులు తెలిసికొనుచుండె .అంత నిక్కడ ప్రతాప  రుద్రుండు రంగనాధుని ప్రభావంబువిని యాశ్చర్యంబు నొందేను '. రంగనాధుని గూర్చిన పై కధ నిన్ననో నేఁడో యెవరో సృష్టించిరని యుజ్జగింప వీలులేనిది.


                                        vii


    శ్రీనాధుని సమకాలపు వాఁడగు కొలని గణపతి దేవుఁడు తన "శివయోగి సారము' న చక్రపాణి రంగనకవి నిట్లు స్తుతించినాఁడు.
    
    'అసమశివభక్తీ రసమా
    నసునిం బాల్కురికి సోమనాధుని, గవిరా
    జ సమున్నతయశు సద్య!
    ప్రసాది యగు చక్రపాణి రంగనఁ గొలుతు'
    

                                      viii


    గురురాజకవి పద్యమున రంగనాధుఁడు నూఱు తోటక వృత్తములను గూడ రచించినట్లు కలదు. ఛందో గ్రంధములలో రంగనాధుని తోటకము లివి రెండు కానవచ్చినవి.

    బాలబోధచ్చందస్సులో -
 
   తోటకము.    ఉపవాసము లెల్లను నుండుట నీ
    కృప వచ్చుటకా యది రిత్త సుమీ
    యవవిత్రునిఁ బుల్లని యంబలికై
    సుపవిత్రునిఁ జేయుట సుద్ది గదే.            229

      హనుమచ్చందస్సులో ---

  తోటకము.    చెలువార గజాజినచేలముతో
    గళనీలిమతో సహికంకణుఁడై
    తలఁ జంద్రకళం గల దైవము మా
    కులదైవము దైవతకోటులలో                230

    వీనిని బట్టి సిద్దనంజేశ కవి చెప్పిన తోటకవృత్తములను రంగనాధుఁడు రచించుట సమర్దిత మగుచున్నది.
    రంగనాధుని యనుకరణము కావచ్చును, కాశీఖండమున శ్రీనాధుఁడు కూడా తోటక వృత్తరచనము చేసినాఁడు."
    
                                        ix

    బాలబోధచ్చందమున రంగనాధునిదిగా నీ క్రింది కందపద్యము కలదు.
    క||  ఫాలతల భస్మరేఖలు.                  231

    ఇది సమగ్రముగా లేదు. ఇది సిద్దనంజేశకవి పేర్కొన్న నూఱు కందములలో ఁ జేరినదేమో!

    -----------------

    *ఈ పట్టున శ్రీ ప్రభాకరుల నోట్సులో క్రింది యంశము కలదు.
    "ఎర్రా ప్రెగడ - వన క్రీడ పట్టు.

    తోదకం .    "తాలిమి దూలిన తాపసపత్నుల్
    వ్రీళ మనంబున వీడ్కొని చేరన్
    లోలమదాలసలోచన పంక్తిన్
    జాలఁగ నొప్పెను శంకరలీలన్                 232

    
                                           x

    ప్రయోగరత్నాకరములో రంగనాధుని మిత్రవిందాపరిణయములోనిదిగా నీ క్రింది పద్యభాగ మున్నది.

    "వనమాలీ గొలుచు నందుననే యెల్లప్పుడు"

                                          xi

    పలువురు శివకవులు కవి స్తుతిలో రంగనాధుని శివకవినిగా స్తుతించినారు మచ్చుకు ఒకటి.

    భద్రకవి లింగకవి రంగానాధ ప్రశంస
    
    'దండితోఁ బండి తత్రయముఁ గీర్తించి
    సకలవేదపురాణశాష్త్రేతిహాస
    నికరార్ధములు ప్రమాణించి సద్భక్తి
    శ్రీమతి నుదరించిన పాలకుఱికి
    సోమనాధేశ్వరు సొంపుతో ఁ గొలిచి
    రంగద్విశాలాంతరంగంబునందు
    రంగనాధునిఁ గవిరాజన్యుఁ దలఁచి
    యసమానచరితుఁ బ్రత్యగ్రకల్యాణ
    బసవేశుఁ బిడుపర్తి బసవేశుఁ గొలిచి'     (సానందోపాఖ్యానము)    234

                                        xii

    వైష్ణవుఁడైన చక్రపాణి రంగనాధుఁడు శైవుఁడై రంగనకవి యయి నాఁడు . ఇట్లే శైవుఁడైన తెనాలి రామలింగకవి వైష్ణవుఁడై రామకృష్ణుఁ డయినాఁడు.

                                       xiii

    రంగనాధుని పద్యములుగా ప్రబంధరత్నావళిలో నీ పద్యము లున్నవి. ఇవి కూడా (శ్రీశైల మల్లికార్జున ) శివ స్తవవరములే కాన, పయి రంగనాధుని రచనములే యగుట సుస్పష్ట మయినది.

    అదలని తేరు తేరికిని నదరువై తగు విల్లు వింటికిం
    గుదురగు నారి నారిపయిఁ గూస్కు శరంబు శరంబు బొడ్డునం
    బొదలిన యంత యంతముఖముల్ నిజవాసములైన గుఱ్ఱముల్
    చెదరక నీకు నెట్టి వని సేయు నయా! గిరిజాధినాయకా!        235

    ఓజు చేముట్టక యొగ్గానఁ బట్టక
              చక్కఁగా దివిఁ బాఱు చక్రములును
    లాయానఁ గట్టక లలి మేఁత వేట్టక
               వర్ణహీనంబైన వారువములు
    తపన వేట్టక జీవితము కాసు ముట్టక
               సత్త్వసంపదఁ జూపు సారధియును
    కడచీలఁ దట్టక ఘనముగా మెట్టక
               గంభీరసంపద గలుగునిరుసుఁ

    గలిగి తనరారునరదంబుఁ గడఁక నెక్కి
    త్రిపుర విజయంబుఁ జేకొన్న దేవదేవుఁ
    డిందు శేఖరుఁ డానందమందిరుండు
    మనలఁ గరుణావిధేయుఁడై మనుచుఁగాత!                        236

    గోశ తపంచవార్ధులును గోయుగవార్దులు గోత్రివార్దులు
    గోశరవార్ధులు విదితగోశర (వార్దులు) పంచవార్ధు లా
    కేశవతల్ప పద్మభవ కేకివహన దానవేశ దే
    వేశుల కిచ్చునట్టి పరమేశ్వరుఁ డీవుత మా కబీష్టముల్.        237
    
                                           xiv

    పొత్తపి వవెంకటరమణకవి రచించిన లక్షణశిరోమణి యను లక్షణ గ్రంధములో 'అచ్చవెల్లి రంగన్న గారు' అను పేర రంగనాధ రామాయణ ద్విపద లుదాహరింపఁబడినవి. 'అచ్చవెల్లి' యను గ్రామము నేఁడు కడప జిల్లా పులివెందల తాలూకాలో నున్నది.

                                           xv
    
    ఒకానొక లక్షణ గ్రంధమున నిట్లున్నది.

    రంగనాధయ పద్యము   :--

    ఉ. మంచేన చూచితే శివసమాహితచిత్తులు పద్మవాసనా
        కుంచనచంచదున్మిషిత కోమల మూల సరోజకరికా
        భ్యంచిత బిందునాదరసభవ్య నిరంతరశబ్దవల్లి శీ
        లించు తేఱంగు శ్రీగిరిఁ జలింపనిమర్త్యనిలింపు లింపున .    238


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS