Previous Page Next Page 
మహావృక్షం పేజి 20

లేదు వీణా! ఇదే బాగుంది అంటూ నువ్వు మోకాళ్ళతో నడుస్తున్నావ్."
"ఏటికి ఎదురీదడంఅని దీన్నే అంటారేమో!"
"ఎదురీది బతికి విజయం సాదించడంలో  థ్రీల్ వుంది. ఎచీమేంట్ వుంది. అది సరే! నాసంగతి వదిలేయ్. నువ్వెందుకు పెళ్ళిచేసుకోలేదో చెప్పు ముందు."
అనూష  కొంచంసేపు మౌనంగా వుండి  అంది. "ప్రత్యేకమైనా కారణం అంటూ ఏంలేదు. అమ్మా, నాన్న పోయాక నా విషయం ఆలోచించి, నాకు పెళ్ళిచేయాలని ఎవరు ప్రయత్నిస్తారు?"
"నీకు ఒకళ్ళు చేయడం ఏవిటి? అనూ!అందం,చదువు, హొదా, ఆస్తి ఇన్ని వున్న ఇంకా కన్నేపిల్లగా వుండానిచ్చారంటే ఈ దేశంలో నీకు భర్త కాగల ఆర్హత వున్న మగాడు పుట్టలేద్దన్నమాట.
అనూష నవ్వింది. "పద ఆకలేస్తోంది భోంచేద్దాం."

                    *    *    *    *    *
భరణి అవకాశం దొరికినప్పుడల్లా అనూష దగ్గరకి వస్తూనేవున్నాడు. తన గురించి,  తన పత్రిక గురించి, రాజకీయాలు, సినిమాలు, టీ.వీ సీరియల్స్, అతనకి తెలియని సబ్జెక్ట్ లేదేమో అనిపిస్తుంది. అతని స్నేహశీలత అనూషకి నచ్చింది. ఉదయంగాని, సాయంత్రాలుగానీ ఆమె ఇంట్లో వున్న, సమయం చూసుకుని వస్తుంటాడు. తను ఎక్కువగా మాట్లాడకపోయినా, అతని మాటలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఒక రోజు అతను ఇంట్లో వున్న సమయంలో వీణ వచ్చింది. పరస్పరం పరిచయాలయ్యాక  అతను వీణని కూడా ఇంటర్వ్యూ చేసి, పత్రికలో వేస్తానన్నాడు.
వీణ చిరునవ్వుతో అంది. "మా అనూషని చేసినప్పుడే నా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది."
భరణి ఆశ్చర్యంగా చూశాడు. "ఎలా?"
"నా స్నేహితురాలు, లాయరు వీణ అని నాపేరు తను చాలా సార్లు రిఫర్ చేసిందిగా!"
"ఓ!"నవ్వాడు.
"మీరు చాలా సరదాగా మాట్లాడారు."
"థాంక్స్"ముగ్గురూ కాఫీ తాగారు.
"ఓ.కే మేడమ్!మరి నేవస్తాను. డాక్టరుగారూ! శలవా?" అడిగాడు.
"ఓ.కే. గుడ్ నైట్"జర్నల్ పక్కన పెట్టేసింది అనూష. అతను లేచి వెళ్ళిపోయాడు.

                                                           *    *    *    *
మరునాడు ఆశ్రమానికి వెళ్ళారు అనూషా, వీణ....అనూష కారు గేట్లోకి రాగానే బాబునేత్తుకుని సుశీల, పెరట్లొంచి శారదా,శ్యామలా పరిగెత్తుకువచ్హారు.
"ఎలా ఉన్నారర్రా?" అడిగింది అనూష.
"మేమందరం బాగున్నాం మేడమ్! మీరెలా వున్నారు? వీణగారు కులాసాన?" అడిగింది శారద.
శ్యామల మొహం వాడిపోయి వుండడం చూసింది అనూష.ఎందుకో ముభావంగా, ఏదో ఆలోచిస్తూ వున్నాట్టుగా వుంది.
"ఏం శ్యామా! ఏంటి భోజనాలు అయిపోయాయా? మీ ఇద్దరూ అప్పుడే పెరట్లో షికార్లు చేస్తున్నారు?"నవ్వుతూ అడిగింది వీణ.
"అబ్బే షికారేం లేదు, మొక్కలకి పురుగుపడితే మందులు చల్లించి వస్తున్నాను"బలవంతంగా నవ్వింది శ్యామల.
"నీరజ ఎలా వుంది?" సుశీల చేతుల్లోంచి బాబుని అందుకుంటూ అడిగింది.
"నీరజా!" శ్యామల పిలిచింది. బాబుకి స్వెటర్ అల్లుతొన్న నీరజ గదిలోంచి వచ్చింది. అనూషని చూసి గబగబా వచ్చి కాళ్ళకు దణ్ణం పెట్టింది.
"ఎందుకిలా? తప్పుకదూ! దేవుడికి పెట్టు, నాక్కాదు" నీరజని లేవనెత్తి అంది అనూష.
శారద అంది."మేడమ్! నీరజ ప్రేవేటుగా కట్టి బి.ఏ పూర్తి చేయాలనుకుంటోంది."
"అలాగా! దానికేం, తప్పకుండా చేయచ్చు. కానీ తన పాత సర్టిఫికెట్లు కావాలి కదా! అవి వున్నాయా నీరజా?" అడిగింది.
నీరజ తలవంచుకుని అడ్డంగా తలూపుతూ "లేవు" అంది.
"మరెలా? కనీసం టెన్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కావాలి. మీనాన్నగారికి లెటర్ రాయి తెచ్చిస్తారు."
నీరజ ఏడ్చింది. మాట్లాడలేదు.
"సరేలే, చూద్దాం. నువ్వు వెళ్ళద్దు, అడ్రసు ఇవ్వు. నేనే ఎవరి నన్నా పంపిస్తాను,సరేనా?" నీరజ కృతజ్ఞతగా చూసింది.
తరువాత ఇద్దరూ కలిసి కుట్టుమిషను, ప్రింటింగ్ యూనిట్ వున్న పెద్ద హాలు వైపు వెళ్ళారు మెయిన్ బిల్డింగ్ కి ఆనుకుని వున్నాయి. రెండు పెద్ద హాల్స్, నాలుగు గదులు. ఆ హాల్స్ లో ఒక దాంట్లో కుట్టుమిషను, ఒక దాంట్లో చీరల మీద ప్రింట్ వేసే ఎకవిప్ మెంట్ వుంది. అదికాక చీరలు రోలింగ్ చేయడానికి కావలసిన రోలింగు కర్రలు కూడా వున్నాయి. అక్కడ చాలా మంది పనులు చేస్తూ వుంటారు. పగలంతా కొందరు బట్టలు కుడుతుంటే, కొందరు రోలింగ్ చేయడం, చీరలమీద అద్దకాలు వేయడం లాంటివి చేస్తుంటారు.
ఇద్దరూ కలిసి ఆశ్రమం మొత్తం తిరిగి ఎలా వుందో పర్యవేక్షించారు.
కుట్టుమిషన్ల దగ్గర కూర్చున్నవాళ్ళు అన్నారు. "మిషన్లు కొన్ని పాడైనాయమ్మా, బాగుచేయించాలి. అదీ కాక...."ఆగిపోయింది.
"చెప్పండి. అదీకాక?"అడిగింది అనూష.
"ఇప్పుడు కొత్తరకం మిషన్ లు వచ్చాయట మార్కెట్ లోకి. దాని మీద ఎంబ్రాయిడరీలు, పీకోలు, అన్నీ కుట్టుకోవచ్చట. అలాంటి మిషన్లు కొంటే, బైటనుంచి పని తెచ్చుకుని, నాలుగురాళ్ళు సంపాదించే మార్గం చూసుకుంటాం....కనీసం మా మందులకైనా వస్తాయి కదా?"
అనూష తల పంకించింది.
"అలాగే ప్రయత్నిస్తాం. అక్కసారి కలెక్టరుగారిని,మినిష్టరు గారిని కలుసుకుంటాం ప్రండ్స్. ఏవన్నా వస్తే తప్పకుండా కొంటాం"వీణ మాటిచ్చింది. తిరిగి హాల్లోకి వెళ్ళేటప్పటికి శ్యామల వేడి వేడిగా ఉల్లిపాయ పకోడి చేస్తోంది. శారద ప్లేట్లలో సర్దుతోంది "మృదుల కనిపించలేదేంటి?" అడిగింది అనూష శారద యిచ్చిన పకోడీప్లేటు అందుకుంటూ.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS