Previous Page Next Page 
కౌసల్య పేజి 2

 

    వెంకట్రామయ్య దీర్ఘంగా శ్వాస వదిలి నిట్టూర్చాడు.
    విశాలక్షమ్మ తల చెడి ఇలా అయినందుకు , సరోజమ్మ పోయి ముకుందం అలా తిరుగుతున్నందుకూ అయన లోపల్లోపలే ఎంత కుమిలి పోయేవారో! ఏమైతే నెం! తన పిల్లల భారం అంతా మీ మీద పెట్టి వెళ్ళిపోయారు."
    గాంభీర్యాన్ని ముఖం లోకి బలవంతాన తెచ్చుకొని "వస్తానండి" అంటూ వడివడిగా ఇంటి వేపు నడిచాడు వెంకట్రామయ్య.
    ఇప్పుడతని వయస్సు నలభై మూడు . 1961 ;లో లక్నో లో అంబికాచరణ ముజుందార్ అధ్యక్షతన కాంగ్రెసు సమావేశాలు జరిగిన ఏడు పుట్టాడు. పుట్టిన ఏడాది కే తల్లీని, అయిదేళ్ళ కే తండ్రినీ పోగొట్టుకుని తనకంటే పది పదిహేనేళ్ళు పెద్ద ఆయినా అన్న అచ్యుతరామయ్య దగ్గరా, వదిన సీతమ్మ దగ్గరా పెరిగాడు వెంకట్రామయ్య. అచ్యుతరామయ్యా, సీతమ్మా వెంకట్రామయ్య ను కన్న కొడుకులా పెంచారు. అతను కూడా వాళ్ళను అలాగే గౌరవించేవాడు. సీతమ్మ కు విశాలాక్షి పుట్టేటప్పటికి , వెంకట్రామయ్య కు పదకొండేళ్లు. విశాలక్ష్మి తరువాత రెండేళ్ళ కు , అంటే సైమన్ కమిషన్ ఇండియా వచ్చిన ఏడు, ముకుందం పుట్టాడు. విశాలాక్షి, ముకుందాల తర్వాత ఏడెనిమిదేళ్ళ దాకా సీతమ్మ కు మళ్ళీ సంతానం కలగలేదు.
    అన్నగారి పిల్లలనూ, విశాలాక్షి ని , ముకుందాన్నీ ఆడిస్తూ, వ్యవసాయపు పనుల్లో అన్నగారికి సాయం చేస్తూ తీరిక వేళల్లో  దిన పత్రికల ద్వారా తెలిసే రాజకీయ పరిస్థితులను పరిశీలీస్తూ ఒకరకమైన బాధ్యతా రాహితమైన జీవితాన్ని గడిపాడు వెంకట్రామయ్య , తనకు ఇరవై ఏళ్లు వచ్చేదాకా.
    ఆ తరువాత, తొమ్మిదేళ్ళు పూర్తిగా నిండని విశాలాక్షి ని కాకినాడ లో డిప్యూటీ తహసీల్దారి చేస్తున్న పాతికేళ్ళ యువకుడు సూర్యనారాయణ కిచ్చి పెళ్ళి చెయ్యడం, పండగ కానీ కాకినాడ నుంచి వచ్చి సూర్యనారాయణ మేట్రీక్యూలేషన్ కు కట్టమని వెంకట్రామయ్య ను ప్రోత్సహించడం , ఆ ప్రకారం ఆ ఏడే వెంకట్రామయ్య కట్టి పాస్ కావడం జరిగింది. అప్పటికి పుల్లేటి కుర్రు లో మెట్రిక్యులేషన్ పాస్ అయిన వాళ్ళు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ లేరు. వాళ్ళయినా ఉద్యోగాల కోసం పోరుగూళ్ళు పోవడం మూలాన కోనసీమ లో ఆ గ్రామం చుట్టూ పట్ల వెంకట్రామయ్య ఒక్కడే కొంచెం చదువు కున్నవాడుగా చలామణి అవుతూ ఉండేవాడు. ఆరోజుల్లో అమలాపురం, రాజోలు, కొత్త పేట, లాంటి పెద్ద ఊళ్ళ లో తప్ప, తాక్కిన పుల్లేటి కుర్రు లాంటి చిన్న చిన్న కోనసీమ గ్రామాల్లో హైస్కూలె ఉండేది కాదు. రాను రాను వెంకట్రామయ్య కు రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ కాసాగింది.
    1938 లో హరిపురం లో సుభాస్ చంద్రబోస్ అధ్యక్షతన కాంగ్రేసు సమావేశాలు జరుగుతూ ఉంటె, చూడటాని కనీ వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండిపోయాడు వెంకట్రామయ్య. దానితో ఇంటి దగ్గర అచ్యుతరామయ్యా, సూర్యనారయాణా కలిసి వెంకట్రామయ్యను ఎలాగేనా రాకజీయాల ప్రభావం నుంచి తప్పించాలనే ఉద్దేశంతో వివాహం చెయ్యడానికి నిశ్చయించారు. కాకినాడ లో సూర్యనారాయణ దగ్గర ఇంటర్మీడియట్ లో చేర్పించడానికి కూడా నిర్ణయించారు. కాని ఈలోగానే అంటే వెంకట్రామయ్య హరిపురం లో ఉండగానే, సీతమ్మ  ఆనందాన్ని కని పురిటి లోనే గతించింది.
    అందువల్ల వెంకట్రామయ్య చదువూ, వివాహం ఆ పై ఏటికి కాని కుదరలేదు. రామచంద్ర పురం లో పెద్ద లాయరూ, తాలూకా బోర్డు చైర్మన్ , జస్టిస్ సభ్యుడూ అయిన రావు సాహెబ్ పెరుమాళ్ళయ్య గారి అమ్మాయి కౌసల్య తో వెంకట్రామయ్య వివాహం నిశ్చయం అయింది. కౌసల్య అందమైంది. వీణ వాయిస్తుంది. ఫోర్టు ఫారం దాకా చదువు కుంది. కాకినాడ పి.ఆర్. కాలేజీ లో ఇంటర్మీడియట్ లో చేరిన ఆరునెలల కే వెంకట్రామయ్య కు కౌసల్య తో వివాహం అయింది. కాకినాడ లో ఉన్న రెండేళ్ళ లోనూ శ్రీ బులుసు సాంబమూర్తి గారి రాజకీయ ప్రభావం, వెంకట్రామయ్య మీద ఎక్కువగా పడింది.
    అందుకే 1941 లో తన పునప్పంధానం రెండో రోజున పెరుమాళ్ల య్య గారి విసుగునూ, అన్నయ్య సలహా నూ, తుదకు కౌసల్య కన్నీళ్ల నూ కూడా లెక్క చెయ్యకుండా వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొనడానికి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. ఆరు నెలలలోజైలు నుంచి విడుదలయి వచ్చి, పుల్లేటి కుర్రు లో కౌసల్యతో కలిసి ఏడెనిమిది నెలలు కాపురం చేసినా, తిరిగి 1942 ఆగస్టు క్విట్ ఇండియా హడావిడి లో జైలుకు వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య.
    అతను ఈ మాటు జైలు నుంచి మూడేళ్ళ కు కాని తిరిగి రాలేదు. ఈలోగా భర్త మీదా, సంసారం మీదా విరక్తి కలిగి గర్భవతి గా ఉన్న కౌసల్య తన పుట్టింటికి రామచంద్ర పురం వెళ్ళిపోయింది. కౌసల్య కబురు ఎన్నాళ్ళ కూ తెలియక పోవడంతో అచ్యుత రామయ్యే ఆ ఊరు వెళ్ళారు. కానీ అవమానంతో తిరిగి వచ్చాడు. ఏమంటే పెరుమాళ్లయ్య నానా దుర్భాషలూ ఆడాడు. మరదలు కౌసల్య పలకరించక పోవడం సరిగదా, చంటి కుర్రాడి నయినా చూడనివ్వ లేదు. తరువాత ఎనార్ధానికి పెరుమాళ్లయ్య పోయారని తెలిసి అచ్యుతరామయ్య రామచంద్ర పురం వెళితే, "మీకు మాకూ సంబంధం తెగిపోయింది. మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని బాధపెట్టకండి." అని నిష్కర్షగా చెప్పేసింది కౌసల్య.
    జైలు నుంచి వచ్చి సంగతులన్నీ విన్న వెంకట్రామయ్య , అన్నగారికి జరిగిన అవమానానికి చాలా నొచ్చుకున్నాడు. వెంకట్రామయ్య వద్దని చెబుతున్నా వినకుండా అచ్యుతరామయ్య వీరిగాడి ద్వారా కబురు పంపించాడు రామచంద్రాపురం తమ్ముడు విడుదల అయి వచ్చాడని . కౌసల్య అప్పుడూ రాలేదు. దానితో వెంకట్రామయ్యకూ కౌసల్య అంటే విరక్తి ఏర్పడింది.
    ఇది ఇలా ఉండగా విశాలాక్షి కి జానకి పుట్టింది. ఆ తర్వాత ఏడు సూర్యనారాయణ పెత్తల్లి కూతురు సరోజను చూసి, 'ఏమైనాసరే ఆ అమ్మాయినే చేసుకుంటా' నని పట్టుబట్టి పెళ్లి చేసుకున్నాడు ముకుందం. సరోజా ముకుందాలు రెండు మూడేళ్ళు కాపురం చేశారు హాయిగా.
    1953  శ్రావణ మాసం లో , గర్భిణి గా ఉన్న సరోజ కు సూడిద ఇచ్చి తీసుకు వెళ్ళాడు సూర్యనారాయణ. 'వరద చాలా ఉదృతంగా ఉంది. గోదావరి దాటద్దు ' అని ఎంత మంది చెబుతున్నా వినిపించుకోకుండా 'మంత్రుల కాంపు ఏమైనా సరే వెళ్లి తీరాలని భయంకరంగా ఉన్న గోదావరిని దాటాలనుకున్నాడు సూర్యనారాయణ సరోజ తో సహా. కాని వాళ్లు అవతల గట్టుకు చేరకుండానే లాంచీ వరద లో కొట్టుకు పోయింది.
    అల్లుడూ, కోడలూ ఒకేసారి దుర్మరణం పొందడం చూసి భరించలేక మంచం పట్టి ఏడాది తిరక్కుండా చనిపోయాడు అచ్యుత రామయ్య. అప్పటి నుంచీ వెంకట్రామయ్య అన్న పిల్లాలనే తన పిల్లలు గా చూసుకుంటూ , మధ్య మధ్య తన భార్యా, కొడుకు జ్ఞప్తి కి వస్తున్నా, ఆ బాధను పైకి కనిపించనియ్య కుండా గంబీరంగా అణుచుకుంటూ , పుల్లేటి కుర్రు లో చాలా పెద్ద వ్యక్తీ గా గౌరవం పొందుతూ, జీవితాన్ని గడుపుతున్నాడు.
    సరోజ పోయాక ముకుందం జీవితమే అదోలా మారిపోయింది. ఇక- విశాలాక్షి భర్త పోయిన దుఃఖాన్ని తనలో తనే మింగుకుని , ఒక్కగానొక్క కూతురు జానకి మీదే ఆశలు అన్నీ పెట్టుకుని బ్రతుకుతుంది. జానకి పెద్ద దయి స్కూలు ఫైనల్ లోకి వచ్చింది. అచ్యుత రామయ్య రెండవ కొడుకు ఆనందం కూడా బి.ఎ పాస్ అయ్యాడు. 'వచ్చే ఏడు వాడిని వాల్తేరు లో ఫోర్టు ఆనర్సు లో చేర్పించాలి.' అనుకుంటూ వెంకట్రామయ్య గుమ్మం దాటి హల్లో ప్రవేశించాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS