Previous Page Next Page 
ఉద్యోగం పేజి 18


                                కుర్చీలు
వెంకట్రావ్ నాతోపాటు చదువుకుని కొన్నేళ్ళ క్రితం చదువు మానేసి వ్యవసాయం లోకి దిగిపోయేడు. అతనికిప్పడు పాతికెకరాలభూమి వున్నదని నాకు తెలుసు. మంచి  'కామందని' పల్లెటూళ్లో మంచి పేరూ వున్నది.
ఈ కామందుకి ఓ మేనల్లుడున్నాడు. అతనీమధ్యనే బి.ఏ. పాసైనువైనం నాకు మునుపొకసారి వెంట్రావ్ చెప్పాడు.
ఒకానొక ఆదివారం సాయంత్రం నేనింటిదగ్గిర కాఫీ పుచ్చుకుంటోన్నవేళ నన్ను  చూచేందుకొచ్చినతనిపేరు సంగమేశ్వరరావు.ఒక్కగా , తెల్లగా వున్నాడు. పేరుచెప్పి మీళ్ళునమలడం ప్రారంభించేడతను. అతను దాన్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు, కూర్చుని అన్నాడు:
"మి కథలు చదువుతానుసార్! చాలా బావుంటాయి"
అందమైన మాటనే చెప్పాడతను. ఒక కాఫీ పట్టుకొచ్చి యిచ్చేను. అతనాకాఫీ తాగుతూండగా ' మిరేం చేస్తుంటారని' అడిగాను. నన్నభిమానించే పాఠకుల వివరాలు తెలుసుకోడం నా కనీసధర్మం. మిదుమిక్కిలి సంభాషణాక్రమాన్నది  అందంగానూ మలుస్తుంది.
అతను కుర్చీలో  యిబ్బిందిగా సర్దుక్కూర్చుని అన్నాడు.
"బి. ఏ. పాసై యానుసార్!  ప్రస్తుతం ఖాళీ."
" మికూ కథలురాసే అలవాటేమైనా వుందా?"
" లేద్సార్!"
" చదువుతారంతే.  అవునా? ఆమాత్రం టెస్టుంటే ఏదో ఓనాడు మిరూ రాసేగలరు." అన్నాను చంపేసి అన్నాడు.
" మిరీవూరు బదిలీఅయ్యేరని మావయ్య చెప్పాడు.  కనిపించిపోదామని వచ్చాను."
కొంచెం ఆలోచించి అడిగాను.
" ఏవరండీ మి మావయ్య ?"
"వెంకట్రావ్ గారు."
" చెప్పేరుకాదే!  వెంకట్రావ్ మేనల్లుడా మిరు. వాడు నాకు బెస్టు ఫ్రండు. భేష్ బాగుంది వెరీగుడ్.ఊ  ఏమిటీ విషయాలు? మివాడు  క్షేమమా ?నేనీ వూరొచ్చింతకాలమైనా యిప్పటికొచ్చి వాడు నాకు కనిపించలేదు."
"మిరూ చాలా అదృష్టవంతులుసార్! సొంతవూళ్ళో చక్కటుద్యోగంతో ఎంచక్కా కాలక్షేపం చేస్తున్నారు."
"బలే! ఈ వూరొచ్చేందుకు నేను నాలుగేళ్ళు ప్రయత్నం చేశాను. దానికేమంటారు మరి?"
" ఏమైనా మిరు అదృష్టవంతులనే అంటాను."
" సర్లెండి. అలాగే అనుకుందాం చెప్పండీ. ఏమిటి సంగతులు?"
"ఏముంటాయి సార్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చూచి పోదామని అనుకుంటూనే చాలా ఆలస్యం చేసేను. మొన్నా మధ్య మినర్వాలో మి ఫ్రండ్సుతో  కనుపించేరు. అంత మందిలో  మిమ్మల్ని డిస్టర్బ్ చేయడ మెందుకని వూరు కున్నాను."
" అదేమిటండీ!మంచివారేనే! డిస్టర్బ్ చేయడ మేమి టండీ బొత్తిగా ...నో... అదేం బాగోలేదు."
సంగమేశ్వరరావు సిగ్గునభినయించేడు. కాఫీ కప్పు కింద వుంచుతా నాన్చుతూ అన్నాడు.
"ఈ మధ్య రెండుమూడు ఇంటర్యూలు వొచ్చేయండి. అవుతే అవన్నీ పరాయివూళ్ళలో . అందుచేత నేను వెళ్ళలేదు... ఉద్యోగం చేస్తే మానూళ్ళోనే చేయాలనివుంది."
" అవునవును, ఈ రకమైన ఆలోచనలు మనూరిళ్ళకి చాలామంది కున్నాయి సుమాండి! బాగుంది."
" ఈ విషయం మావయ్యతో చెబితే నాకేం తెలీదు.  నాదారేదో నువ్వే చూచుకోమన్మాడు: అప్పుడిహ మిరు నాక్కనిపించేరు."
ఇదీవరస. ఈ సంగమేశ్వరరావు నాకథల్ని మెచ్చుకోడానిగానీ, లేదూ నేటి తెలుగు కధారీతిగురించిగానీ మాటాడేందుకు రాలేదు.  అది గమనించి నేను బాధపడ్డానుగానీ సంగమేశ్వరరావుకది తెలీనివ్వలేదు. ఇంకా  అతనేమాటాడాడు-
" మి ఎలరికలో ఇక్కడేమైనా ఉద్యోగాలుంటే సాయం చేసి పెట్టండి."
" అదిసరే! బట్.... నేనీ వూరొచ్చి ఆర్నెల్లయినా కాలేదింకా..."
"పర్లేదండి. నాలుగైదు  నెలలాగమన్నా ఆగుతాను. ఉద్యోగరీత్యా మిరీవూరొచ్చి ఆర్నేల్లే అయినా మికీ వుళ్ళో ఎవరెవరితో యెంతెంత చనువుందో నాకు తెలుస్సార్!" అన్నాడతను తెలివిగా,  తెగింపుగా , చొరవగా కించిత్తు లౌక్యంగాను.
ఉద్యోగంకోసం వొచ్చినవాడికి తప్పనిసరిగా వినయ విధేయత లుండితీరాలని, నేను గానీ, బొత్తిగా నెత్తికెక్కి  ' ఏం, వాయ్!  నావిషయం ఏంచేస్తావని డబాయించి అడిగేసే మండదూ? అవుతే నేనేం మండిపోలేదు. పైపెచ్చు నీకీ డబాయింపుధోరణి తప్పదనగూడా చెప్పలేదు.  నేను మొహమాటస్థుడిని. నేనేమంటే ఎదటివాడేమైపోతాడోననన్న దిగులున్నవాడిని. అందుచేత సంగమేశ్వరరావు బతికిపోయేడు. నేనుమాత్రం తిరకాసుగానే మాటాడవలసి  వొచ్చింది.
నాకీవూళ్ళో ఎంత పరపతి వున్నది చెప్పేరు. బాగుంది మికీవూళ్ళో కావలసిన  ఉద్యోగమెలాటిది? దానికోసం యెవర్ని అడిగి చూడమంటారూ? ఈ మొదలైనవిగూడా చెప్పేసి వెళిపోండి"అన్నాను.
అప్పుడతను నిజంగా ఇబ్బందిలో మునిగిపోయినట్టు గమనించేను. మాయింటివేపూ నావేపూ, నేను కూర్చున్న కుర్చీ వేపూ గబగబా చూచిగాని చెప్పలేదు.
" మీకు పశుపతి గారు తెలుసుగా సార్?"
ఈ ఒక్కమాట అనేసి అతనొచ్చినకార్యం సిద్ధించినంతగా సంబరపడిపోయేడతను. అతను వెళ్ళిపోయినా పశుపతి గారి గురించి నా  ఆలోచనలుమాత్రం దూరంకాలేదు.
పశుపతిగారికి మావూళ్లో మంచిపేరుంది .ఒక్కగానొక్కమేడుంది. రెండుకారులు కాబోలు- అవీ వున్నాయి. జ్యేష్టడిపేరేమిటో తెలీదుగానీ అతనస్తమానూ కబ్బుల్లోను సినిమాహాల్లోనూ కనిపిస్తాట్ట. ఒక కూమర్తెగూడా వుంది. మావూరి కాలేజీలో బుద్ధిగా చదువుకుంటుందని   నాకెవరో చెప్పారు. ఇంత బలగం గలిగివున్న పశుపతి గారికి మావుళ్ళో ఒక గొప్ప వ్యాపారము వున్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS