Previous Page Next Page 
భస్మనేత్రం పేజి 15

    నా గ్రీకు వీరుడ్ని కలుసుకుందామని..."
    "గ్రీకువీరుడా? ఎవరే... అక్కినేని నాగార్జునా?"
    "కాదు.. నేనింకా వడివేలు బ్రదరెమో అనుకున్నా..." శర్మిష్ట అనడంతో మౌన యిలా అయితే లాభం లేదని అక్కడ్నుంచి లేచి, అతన గదిలోకి వెళ్ళింది.
    ముగ్గురూ మౌన వెనగ్గా ఆమె గదిలోకి వెళ్ళారు.
    "అబ్బ చెప్పవే..." మూగ్గురూ బ్రతిమిలాడేసరికి, ఇక తప్పదని చెప్పింది.
    "అదే... మన ఎదురు అపార్ట మెంటులో వుండే... హిరో" అంది.
    "అతనా... ఇదేమ సెలక్షనే.. ఆ జీవుడి మొహంలో నవ్వేప్పుడైనా చూసావా? బహూశా అతనికి 'నవ్వడం' అనే పక్రీయ ఒకటి వున్నట్టు కూడా తెలిసినట్టు లేదు. టార్జాన్ కు జేంస్ వేసినట్టు వుంటాడు..." అంది భామిని.
    "అయితేనేం... అతను మనిషేగా..."
    "మనిషేకానీ... మ్యాన్లీతనం లేదే...."
    "పర్లేదు... నాకుందిగా... యిద్దరం షేర్ చేసుకుంటా."
    "ఏయ్... మౌనా... ఆర్యూ... సీరియస్..." సచిత్రశర్మ అడిగింది ఆశ్చర్యంగా మౌన మొహంలోకి చూస్తూ.
    "నీ కేమ్డుకా డౌట్ వచ్చింది?" మౌన తాపీగా అంది.
    "అదికాదు.అతనెవరో తెలియదు ఎలాంటి మెంటాల్టీనోతెలియదు. కాలేజ్ మేట్ కాదు. కొలిగ్ కాదు. అలా జస్ట్ కనిపించాడు. కాకపోతే ఓచిన్న డ్యాష్ యిచ్చాడు. ఆ మాత్రానికే టెంప్ట్ అయిపోయావా?"
    "ఏమో... కారణం అడిగితె చెప్పలేను. బహూశా నాకు తెలిసి ఏ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు సరైన కారణంతో ప్రేమించరెమో... ఐ లైక్ హిం..."
    "సరే... ఫోనీ అతను కూడా నిన్ను ప్రేమించాలిగా"
    "ప్రేమిచాలని రూలేం లేదే?" అంది మౌన.
    "అంటే... అతను ప్రేమించకపోయినా, నువ్వతాన్ని ప్రేమిస్తావా?"
    "వైనాట్... సర్లేన్లీ.. అతను ప్రేమిస్తేనే, నేను ప్రేమిస్తే అది నిజమైనా ప్రేమేమ్దుకు అవుతూంది? అతను ప్రేమించాడు. నేను ప్రేమిస్తాను. అతను డిన్నర్ యిచ్చాడు. నేనూ డిన్నర్ యిస్తాను లాంటి వాటిమీద నాకు నమ్మకంలేదు. నేను నా సైడ్ మాత్రమె ఆలోచిస్తున్నాను. నా ప్రేమను అతనికి చెబుతాను. అతనికి కూడా అదే అభిప్రాయంముంటే...అతను నన్ను ప్రేమిస్తాడు..."
    "లేదంటే?" సుచిత్ర శర్మ ఆశ్చర్యంగా అడిగింది.
    "నేను మాత్రమె ప్రేమిస్తాను."
    "అంటే వన్ సైడ్ లవ్వా? ప్రేమ వన్వే ట్రాఫిక్ లా వుమ్దకూదడే..." భామిని అంది.
    నవ్వి అంది మౌన.
    "నాకీ కొటేషన్ల మీద, ప్రేమ మీద కొందరు చెప్పే సూక్తుల మీద నమ్మకంలేదు. ప్రేమ పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. ఒక్కొక్కరికి ఒఅక్కావు అభిప్రాయం వుంటుంది.
    నా కోణంలో ప్రేమ వన్ వే ట్రాఫిక్ లానే వుండాలి. ఇద్దరు వ్యాపారస్తులు చేసుకునే అగ్రిమెంట్ లా వుండకూడదు. నేకీలాభం యిస్తాను. నాకీలాభం కావాలి. నీకీ పర్సంటేజ్ యిస్తాను. అందుకు నాకా బెనిఫిట్ యివ్వాలి... ఇవ్వన్నీ యిచ్చిపుచ్చుకోవడాలు.... యిలంతిగివ్ అండ్ టేక పాలసీ నచ్చదు.
    నేను మీకు యిష్టపూర్తిగా యిది ఇస్తున్నాను అని ఇచ్చేయాలి అంతే... కానీ అందుకు ప్రతిగా 'మళ్ళీ నాకేం ఇస్తావు' అనేవిధంగా వుండకూడదు.
    ఆఫ్ కోర్స్... యిడ్డారూ ఒకరికొకరు ప్రేమానురాగాలు యిచ్చిపుచ్చుకుంటే ఓ..కే... అలా అవతలి వ్యక్తినుంచి మనకు రెస్పాన్స్ లేదని, మనం మన ప్రేమను, అభిప్రాయాన్ని మార్చుకోవడమే నాకు నచ్చదు.
    నేను నిజంగా అతడ్ని సిన్సియర్ గా లవ్ చేస్తే, నా ప్రేమను అతనితో చెబుతా... అతన్నుంచి ప్రేమను పొందే ప్రయత్నం చేస్తా... చివరి వరకూ నా ప్రయత్నంలో లోపం వుండకుండా చూసుకుంటాను.
    అయినా, నేను నా ప్రేమలో విఫలమైతే... అతన్ని ప్రేమించడం ఓ జ్ఞాపకంగా నామనసులో మిగుల్చుకుంటాను..."
    మౌన వైపు విప్పారిన నేత్రాలతో చూసారంతా!
    "వాహ్... ఎయిర్ హొస్టస్ మౌనేనా యిలా మాట్లాడేది? మాకు కొత్త మౌనను చూసిన్నట్లు వుంది. నీ ఎనాలసిస్ మాకందరికీ ఆమోదయోగ్యం అయినా, కాకపోయినా, ఒఅభిప్రాయం ఏర్పరుచుకున్నావు. ఆ అభిప్రాయాన్ని ఫాలో అవుతున్నావు. ప్రేమించే చాలా మందికి ఏమిటో తెలియదు.. ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియదు.వయసులో వచ్చే ఒకానొక ఘట్టం... ప్రేమ అనుకుంటారు. నువ్వూ అలాంటి భ్రమలోనే వున్నవనుకున్నాం. ఎనీహొ... కంగ్రాట్స్... అండ్ ఆల్సో అల్ డ బెస్ట్..." ముగ్గురూ మనస్పూర్తిగా అన్నారు.
    "థాంక్యూ ప్రెండ్స్... ఇవాల్టి నుంచి మూడురోజుల్లోగా అతనిలో చిన్న ప్రకంపనం అయినా కేలిగేలా చేస్తాను..." అంది మౌన.
    "వన్స్ ఎగైన్ అల్ డ బెస్ట్..." అన్నారు మనస్పూర్తిగా.
    "థాంక్యూ..." అంది మౌన. 
                                            ***
    నితీష్ రాయ్ 'న్యూఢిల్లీ న్యూస్' అఫేసులోనుంచి వెహికల్ పార్కింగ్ ప్లేస్ కు వచ్చాడు.
    తన బైక్ బయటకు తీసాడు.
    "ఆలస్యం అయిందెంటి బేటా.. అర్దరాత్రి పన్నెండు దాటుతుండడంతో అడిగాడు వాచ్ మెన్. అతనికి నితీష్ రాయ్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బేటా అనిఅప్యయంగా పిలిస్తాడు.
    "మనకు అర్దరాత్రేమిటి బాబా... మనం అర్దరాత్రి మేలుకుని వుంటేనే, తెల్లారి లేవగానే జనం మనం రాసే వార్తలు చదువుతారు" అన్నాడు నీతిష్  రాయ్.
    చలివిపరీటంగా ఉంది. స్వేర్టర్ వేసుకున్నా ఆగడంలేదు. తలకు మస్లర్ చిట్టుకొన్నాడు. జేబులో నుంచి సిగెరెట్ వెలిగించడంతో.
    బైక్ ని స్టార్ట్ చేశాడు.
    చీకటిని చీల్చుకుంటూ బైక్ ముందుకు దూసుకుపోయింది.
     అరోజే అతను కిన్నెరా దోపిడి జరిగినప్పుడుస్ తారసపడ్డ వ్యక్తి  ఎక్కడ వుంటాడో ట్రేస్ చేశాడు. తెల్లారి వెళ్ళి అతడ్ని కలవాలనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS