బాజారావు మాత్రం గోమతి కీర్తి ఓకే చోట నిద్రించటం మసలటం చూడలేక పోతున్నాడు. ఒకరి గుడిసెలోకి ఇంకొకరు పోవటం నిషేధం కాబట్టి కీర్తి గుడిసెలో వున్న సూట్ కేసులు బ్యాగ్ లు బాజారావుకి తెలియదు. కీర్తి తన బ్యాగ్ లో వున్న పాంటు షర్టు ఇచ్చింది రాజారావుకి. బాజారావు మంచివారుగాని చెడ్డవాడుగాని అది మెల్లగా తెలిసేవిషయం. మనం స్నేహితుల్లాగా వుందాముగాని మరే విషయం చెప్పొద్దుఅని కీర్తి గోమతికి చెప్పింది.
ఓ రోజు...
"మిస్టర్ కమల్! గోమతి మీకు కొత్త ఫ్రెండా! పాత ఫ్రెండా! లేక....అంటూ బాజారావు ఆగిపోయాడు.
గోమతితో కల్సిముందే ఆలోచించి ఆట్టే పెట్టిందికీర్తి.
"మా ఇరువురిది బాంబే మొదట్లో గోమాతికి నేను బాయ్ ఫ్రెండ్ ని మా పరిచయం కాస్త ముదిరి ఇంకాస్త దగ్గరయ్యాము. తన అంకుల్ దగ్గరకు బైలుదేరింది గోమతి. చిత్రకళా ప్రదర్శనంలో బహుమతి పొంది ప్రభుత్వం అనుమతితో ఇతర దేశాలలో నా కళ ప్రదర్శించటానికి నేను బయలుదేరాను. బస్ మే మెక్కింది ఓకే విమానమయినా దానికి ప్రమాదం జరిగినా ఓకే చోటకి విసిరేయబడ్డాము" గోమతి వైపు చూసి కన్నుగీటుతూ అంది కీర్తి.
బాజారావు ముఖం మాడ్చుకున్నాడు." మీదితమాషా కేసు. ఇంత ప్రమాదం జరిగి అందరు మరణించి తెల్సిన మీ ఇరువురు ఒకేచోట సురక్షితంగా ఉండటం చాలా గొప్ప విశేషం అన్నాడు.
"అందరూ మరణించారని ఎలా అనుకుంటున్నారు? మనం ముగ్గురం ఇక్కడ కనబడుతున్నాము. ఇంకెవరైనా బ్రతికుండవచ్చు గదా?" అంది గోమతి.
గోమాత్య్ని బజారావుని మార్చి మార్చి చూసింది కీర్తి.
"బతికుంటే వుండొచ్చు" అన్నాడు బాజారావు.
కీర్తి కనుబొమలు సాలోచనగా ముడిపడ్డాయి.
కీర్తి కేదయినా అయిడియా వచ్చినప్పుడు అనుమానం వచ్చినప్పుడు కనుబొమలు ముడిపడతాయి. కీర్తికిప్పుడు ఆలోచనేతట్టిందో అనుమానం ఆవరించిందో తెలియదు.
బాజారావు కీర్తి భుజం మీద చెయ్యి వేశాడు.
మంచి శిక్షణ పొందిన కీర్తి ఆడపిల్లలా సిగ్గుపడలేదు. ష్టడీగ నుంచుని చిరునవ్వుతో "ఏమిటి?" అన్నట్లు బాజారావు వైపు చూసింది.
"అదృష్టవంతులు అడవిలో వున్న అందాల బృందావనంలో వున్న ఒకటే అన్నాడు బాజారావు.
"ఎస్" ముక్తసరిగా అంది కీర్తి.
"కమల్?"
"ఏమిటి?"
"ఇక్కడ ఆడవాళ్ళు పొట్టిగా వున్నా బాగున్నారు?"
"ఆడాళ్ళ పెదవులు లావుగా వుంటే చాలా మంది అసహ్యించుకుంటారు కమల్! నామటుకు నేను అసహ్యించుకోను."
"నేను అసహ్యించుకోను బాజీ!"
"అయితే వీళ్ళని నీవు ఇష్టపడుతున్నట్లేగా కమల్"
"ఆ,"
"నీకు అవసరం లేదుకదా?" గోమతి వైపు ఓ చూపుపారేసి అన్నాడు బాజారావు.
గోమతి ముఖం పక్కకుతిప్పుకుంది.
"ఇక్కడ అవసర అనవసరాల ప్రసక్తిలేదు. మిస్టర్ బాజీ గుణం అదిముఖ్యం. వీళ్ళు అనాగరీకులు అడవిజాతివాళ్ళు కావచ్చు. కాని మనుషులు, నీతి మంచితనం వీరిలో వుంది కాబట్టే మనం బ్రతికి తిరగగల్గుతున్నాము ఆచారాలం టాప్ మనదేశంలో ఎన్నిలేవు ఎందరు మూడులు లేరు, మనకి ఆహారం వసతి ఇచ్చి మనజోలికి రాని వీరు మనకన్నా మంచివాళ్ళు కాదంటావా? నా సిద్దాంతం ముద్దుకు ముద్దు గుద్దుకు గుద్దు. నేను వీరిపట్ల విశ్వాసంగానే వుంటాను."
కీర్తివైపు మెచ్చుకోలుగా చూసింది గోమతి.
"నీ సిద్దాంతం నా సిద్దాంతం ఇంచు మించు ఒకటే మిస్టర్ కమల్ నన్ను ఎవరైనా ఒక్కటేస్తే నేను నాలుగేస్తాను. ముద్దు కావాలంటూ ఏముద్దు అయినా దరి చేరితేకాదనను." అన్నాడు బాజారావు.
గోమతి విసుగ్గా అవతలి కెళ్ళిపోయింది.
కీర్తిని మగవాడిగా తలచిన బాజారావు ఆడవాళ్ళు వాళ్ళ అందాలు తీరు తెన్నులు తన అనుభవాలు కీర్తితో వుషారుగా చెప్పుకు పోతున్నాడు.
కీర్తి "ఊ" కొడుతూ వుండిపోయింది.
11
చెరువులో స్నానం చేసి వస్తున్న గోమతి పెద్దగా కేకలు వేయటంతో కీర్తి పరుగెత్తుకుంటూ వెళ్ళింది.
బాజారావు గోమాతిని బలవంతాన కౌగిలిలోకి లాక్కుంటున్నాడు.
గోమతి పెనుగులాడుతూ అరుస్తున్నది.
కీర్తి వెనుకపాటుగా వెళ్ళి బాజారావు భుజంమీద బరువుగా చెయ్యివేసి బాజారావు ని వెనక్కులాగింది.
బాజారావు గిర్రున వెనక్కు తిరిగాడు.
గోమతి ఒక్కంగలో కీర్తి వెనక్కి వచ్చింది.
"ఏమిటిది?" అంది కీర్తి కోపంతో వూగిపోతూ.
"అర్ధం కాలేదా కమల్" రవ్వంత వ్యంగ్యంగా అన్నాడు బాజారావు.
