"ప్రపంచంలో ఫిబ్రవరి పధ్నాలుగుని వాలంటీన్స్ డే లేదా ప్రేమికుల దినం అంటారు.
ఆ పేరెలా వచ్చింది?"
అదోలాంటి అసహనంతో "క్రీ.శ. మూడవ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యాన్ని రెండవ క్లాడియస్ అనే రాజు పాలించేవాడు.
చాలా క్రూర స్వబావంగల క్లాడియస్ తన సైనికులు ప్రేమించడాలు, పెళ్లి చేసుకోడాలు వంటి బంధాలకి దూరంగా వుండకపోతే దేశ రక్షణ కష్టమని శాసనం విధించాడు.
ఇది దారుణం అంటూ వాలెంటీన్స్ అనే తత్వవేత్త ప్రభుత్వానికి ఎదురు తిరిగి ప్రేమతత్వాన్ని బోధించడం ప్రారంభించగానే వాలెంటీన్స్ ని ఉరితీశాడు.
అతని పేరుమీద మొదలైందే వాలెంటీన్స్ డే."
"ఒక మగాడు ఆరునెలల కాలంలో ప్రపంచ జనాభాని సృష్టించగలడు.
తండ్రిగా అటంటుంది మీ మోడరన్ సైన్స్ వివరంగా చెప్పగలరా?"
రుత్వి అవాక్కయి చూస్తున్నాడు. క్షతగాత్రుడైన సైనికుడిలా.
సరిగ్గా అప్పుడే బజర్ మోగింది టైం అయిపోయినట్లుగా
ముందు రియాక్టయింది విజూష.
మరో రెండు ప్రశ్నలకి జవాబు చెప్పి వుంటే...
లేదు....
ఆ మాత్రం వ్వవధి వుంటే ఖచ్చితంగా రుత్వి గెలిచేవాడే.
కానీ.....
క్విజ్ మాస్టర్ రుత్విని రేపిడ్ ఫైర్ రౌండ్ లో అడిగింది క్లుప్తంగా జవాబిచ్చే అవకాశంలేని ప్రశ్నలు.
ఎందుకలా జరిగినాగానీ రుత్వి ఓటమికోసం చాలా పకడ్బందీగా చేసిన ప్రణాళికలా అనిపించింది.
క్విజ్ మాస్టర్ ఆదేశంపై ఫైనల్ స్కోర్ తెలియజేయడానికి సునంద సంసిద్దురాలవుతుండగా రుత్వి తన సీటుపైనుంచి లేచాడు నిర్లిప్తంగా.
ఇంచుమించు డయాస్ దిగి ఇక వెళ్లిపోయేవాడే.
"మిస్టర్ రుత్వి!" క్విజ్ మాస్టర్ అన్నాడు "ఫలితాన్ని ఇంకా అనౌన్స్ చేయలేదు."
"అయినాగానీ మధ్యలో అలా వెళ్ళడం సభ్యతనిపించుకోదు" క్విజ్ మాస్టర్ కోపంగా అన్నాడు.
"పోటీ అన్నాక కొన్ని నియమ నిబంధనలుంటాయి."
"ఖచ్చితంగా నేనూ అదే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను తిరుగుబాటు చేస్తున్నట్టుగాకాక చాలా సాత్వికంగా చెప్పాడు రుత్వి.
"రేపిడ్ ఫైర్ రౌండ్ లో ప్రత్యేకించి నా మీదనే అలాంటి ప్రశ్నలని ఎందుకు సంధించారూ అని నేను అడగడంలేదు.
కానీ కొన్ని ప్రశ్నలకి మీకే సరైన జవాబులు తేలీదని తెలిసినందుకు బాధపడుతున్నాను."
"వాట్ డూ యూ మీన్?" రాష్ట్రస్థాయిలో చాలా క్విజ్ మాస్టర్ గా వ్యవహరించిన క్విజ్ మాస్టర్ సుందరం ఆవేశంగా ఏదో అనబోతుండగా హఠాత్తుగా టెలి ప్రసారం ఆగింది.
ఇంతసేపూ చూసింది "లైవ్ టెలికాస్ట్" ఆయన క్విజ్ కాంపిటీషన్ గా అప్పటికి తెలుసుకున్న విజూష ఆశ్చర్యపోతుంటే స్క్రీన్ పైకి ఓ లేడి అనౌన్సర్ వచ్చింది.
"అనివార్య కారణాల మూలంగా ప్రసారం నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాం. క్విజ్ కాంపిటీషన్ వివరాలను సాధ్యమయినంత త్వరలో తెలియజేస్తాం."
ఆ తర్వాత అనౌన్సర్ అదృశ్యమయ్యి సినిమా పాటలు మొదలయ్యాయి.
రాష్ట్ర హ్యూమన్ రిసోర్సస్ మేనేజ్ మెంట్ విభాగం ఓ ప్రైవేట్ టెలిఛానల్ ద్వారా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ఫైనల్స్ అలా ముగిసిపోవడంతో విజూష అదో గుర్తొచ్చినట్టు పక్కకి చూసింది.
సశ్య లేదక్కడ.
రుత్వి ఓడినట్టు తెలుసుకున్న సశ్య అతడ్ని తను శాశ్వతంగా గెలుచుకున్నట్టు చెప్పడానికి ఉత్సాహంగా బయలుదేరింది.
ఇలాంటి ఆలోచన రావడం విజూషకి నచ్చలేదు.
కానీ.......
అలా అనుకోకుండా వుండలేకపోయింది.
ఎందుకలా జరుగుతున్నది ఆమెకి తెలీదు.
ఆలోచన అలలపై అసంకల్పితంగా ఏ అక్షరాలలో అచ్చవుతున్నట్టు రుత్వి గురించి అయిష్టంగాగానీ ఇష్టంగాగానీ అదోలాంటి మధనానికి గురవుతూందామె.
మొన్నెప్పుడో కలలో కనిపించిన వ్యక్తి వాస్తవంలో తారసిల్లి దూరాన్ని దృశ్యంగా మలిచి అంబరానికి వున్న బంధాన్ని అందంగా వ్యక్తం చేసి ఆమెకంటే ఇంటి చూరుల్లో చిక్కుకున్న స్వప్నాల రేఖల్ని కనుపాపల కాపలాతో మనసుదాకా మోసుకువెలుతుంటే వున్నట్టుండి పైకి లేచింది విజూష.
"రవీంధ్రభారతికి వెళదామా?"అంది స్పూర్తి ఠక్కున.
తనకే అందని ఆలోచనలకి ఆకృతిని గీస్తున్నట్టు స్పూర్తి మృదు మందహాసంతో మాటాడుతుంటే బిడియంగా వుంది విజూషకి.
అదొక్కటే కాదు....
అహం కూడా బుసకొట్టింది.
అంతే -
"అక్కడికి దేనికి?" అనేసింది.
విజూష మనోభావాల్ని చదివినాగానీ "నీకు వెళ్లాలని వుంది కాబట్టి" అనలేదు స్పూర్తి.
"ఇప్పుడు జరిగింది స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్ విజ్జూ!
దీని తర్వాత సౌత్ జోన్ పోటీలు.
ఆ తర్వాత జాతీయస్థాయి పోటీలు నిర్వహించబడాలి అంటే పోటూ ఫలితాలు అనౌన్స్ చేయాలి.
పైగా స్టేట్ హ్యూమన్ రిసోర్సస్ వాళ్లు పత్రికా విలేఖరులని పోటీ ఆహ్వానించి వుంటారుగా.
రుత్వి అంత ఘాటయిన అభియోగం మోపేక వూరుకోరుగా అయినా రుత్వి అలా అనాల్సింది కాదు."
స్పూర్తి వాక్యాలు ఇంకా పూర్తికానేలేదు.
