Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 8

 

    "కమింగ్ డాడీ!"
    రాస్కెల్ ! అసలు సంగతి ఇదన్నమాట!
    పరమ ఉచితంగా తనతో పిల్లలకు ట్యూషన్ చెప్పించేయాలని పధకం వేశాడు.
    హాట్సాఫ్ రా స్టీమ్ ఇంజన్!
    ప్రభుత్వాన్నే కాకుండా ప్రజలను కూడా అమ్ముకు తిను.
    గుర్రపుతోక జుట్టుతో వచ్చింది పింకీ.
    పింక్ గా లేని పెంకిగా ఉన్నట్లు కనిపిస్తోంది మొఖం . అంతకుముందు ఒకటి రెండు సార్లే చూశాడు మెట్లు ఎక్కుతూ.
    "పింకీ! ఇడుగో -- మీ ట్యూషన్ టీచర్."
    "నమస్తే ' అన్నాడు సురేష్.
    "హయ్!"
    ఓహో! క్లాసిఫికేషన్ లో తేడా వచ్చినట్లుంది.
    "హాయ్!"
    పెదాల మీద నవ్వు --- కొంచెం ముదురుగా నవ్వు తోన్నట్లుందేమిటి?
    "ఏం చదువుతున్నావ్ బేబీ?"
    "నైన్త్!"
    కావాలాని వయసుని పెంచుకోడానికి విపరీతమయిన కృషి చేస్తున్నట్లుంది.
    మొఖంలో పన్నెండేల్లుంటే శరీరాన్ని పద్దెనిమిదికి లాగుతోంది. వృధా ప్రయాస అని తెలుస్తూనే ఉంది.
    "నువ్వెండులో "వీక్' పింకీ?"
    "నువ్వెందులో స్ట్రాంగ్?"
    మైండ్ తో పాటు కొంచెం బాడీ కూడా షేక్ అయింది ఆ ప్రశ్నకి.
    ఆ సిద్దార్ధాగాడికి తీసిపోయిందేమి కాదు.
    శ్రీవారి నవ్వుతున్నాడు.
    "నేన్చేప్పలేదూ? మోస్ట్ ఇంటెలిజెంట్ అనీ."
    "ఆఫ్ కోర్స్ - ఆఫ్ కోర్స్"
    "రేపట్నుంచీ రోజూ ఈవినింగ్స్ కాసేపు పింకీకి కోచింగ్ ఇవ్వావోయ్! సిద్దార్దకి అవసరం లేదు. వాడికి అన్ని సబ్జెక్టులోనూ సెంట్ పర్సెంట్ మార్కులోస్తుంటాయ్!"
    "రాకపోతే ఎలాగండీ! బుద్దులెక్కడికి పోతాయ్."
    శ్రీహరి కొంచెం అనుమానంగా చూశాడు గానీ ఎడ్జస్ట్ చేసుకుని నవ్వేశాడు.
    "ఇంక వస్తానండీ!"
    "ఓకే!"
    మెట్లేక్కుతూంటే పింకీ పరుగుతో వచ్చింది వెనుక.
    "ఏయ్ ! ట్యూషన్ సార్ అంటే నువ్ కొశ్చేన్లెస్తే నేను అన్సర్ ఇవ్వాలనుకుంటున్నానెమో! అదేం కాదు. రోజూ నా డౌట్స్ అడుగుతాను. నువ్ ఆరోజంతా దాన్ని గురించి స్టడీ చేసి మర్నాడు వచ్చినప్పుడు చెప్పాలి! తెలిసిందా?"
    "ఇప్పుడిప్పుడే తెలుస్తోంది."
    "అయితే ఓ కొశ్చేన్ ఇస్తాను! రేపటికి ప్రిపేర్ అయిరా!"
    "ఏమిటది?"
    "ఒకమ్మాయీ , ఒకబ్బాయి ఫోన్ లో ముద్దు పెట్టుకోవటం ఎలా?" అదిరిపడ్డాడు.
    "ఆ ప్రశ్న వేయాల్సిన ఏజ్ గ్రూప్ లోకి నువ్వింకా రాలేరు" అని చూసేసరికి పింకీ కనిపించలేదు. కానీ ఆ స్థానంలో కుమిదిని నిలబడి ఉంది. చేతిలో కూరగాయల సంచితో.
    "నా ఏజ్ గ్రూప్ కి తగ్గ ప్రశ్నలంటే ఎలా వుండాలి!" టీజింగ్ గా ఆడుగుతోంది. పనిమనుషుల్లో కూడా యింత ఎడ్యూకేషనుంటుంది కాబోలు .
    "ఆ పోట్లాకాయలెవరి కోసం/ మేరీ పండరీకాక్షయ్య గారికి?"
    "ముందు నేనడిగినదానికి సమాధానం చెప్పు."
    "నీ వయసెంతో చెప్పాలి ముందు?"
    'ఆడాళ్ళ కొలతలు ఊహించుకోగా లేంది --- వయసు ఊహించలేవేమిటి?"
    కొంపముంచింది. శ్రీదేవి మేడమ్ తో పకోడీలు తింటూ మాట్లాడిన మాటలు బయట నిలబడి విని వుంటుంది.
    కొంచెం ఘాటుగా కెమిస్ట్రీ రిలీజ్ అయేలా కొట్టాలి దెబ్బ--
    "అమ్మాయి లైఫ్ లో బెస్ట్ పిరీడ్ ని లెక్క కట్టగలను కానీ -- ఏజ్ ని లెక్కకట్టడంలో అంత అనుభవం లేదు -"
    'అలాగా! అయితే అదే చెప్పు పోనీ ! అమ్మాయి లైఫ్ లో అద్భుతమయిన సమయాన్ని ఎలా కొలుస్తారు !'
    "మగాడి గంటల్లో! అంటే దాన్నే ' మేన్ అవర్స్' అంటారు. మేన్ అవర్స్ ని లెక్క కట్టడానికి రెండు పద్దతులున్నాయ్. మొదటిది మగాడికి చెమటలు పట్టిన దగ్గర్నుంచీ -'
    చాలు! తనక్కావలసిన ఎఫెక్ట్ వచ్చేసింది.
    ఆమె ముఖంలో కెమిస్ట్రీ రిలీజయింది. రక్తం శరవేగంతో పరుగెడుతున్న గుర్తులు మొఖమంతా కనబడుతోంది.
    చటుక్కున మెట్లు దిగి అప్పుడే తెరచుకున్న లిప్టులోకి పరుగెత్తింది.
    వాటర్ టాంక్ కిందకు చేరుకొని కిరోసిన్ బుడ్డి వెలిగించి ఆ కనబడీ కనబడని కాంతిలో ఇన్ లాండ్ లెటర్ మీద ఉత్తరం రాయటం మొదలు పెట్టాడు.
    అమ్మా!
    నీ ముద్దుల కొడుకు, గారాలపట్టి బంగారుకొండ వగైరా వగైరా నామంతరములు గల నేను నమస్కరించి వ్రాయులేఖా రాజము --"
    ఈ ఉత్తరములో నీకు తప్పకుండా ఓ శుభవార్త చెప్తానని అదివరకు రాశాను కదమ్మా! నాకు మంచి ఉద్యోగం వచ్చిందమ్మా! నువ్వుకున్న కలలు నిజమయ్యయమ్మా! పాండురంగస్వామి గుళ్ళో వేనుకవేపున్న శని విగ్రహం చుట్టూ ప్రదక్షణాలు చేశావ్ కాదమ్మా! ఆ దేవుళ్ళందరి దయవల్లా నేను ఇప్పుడు ఉద్యోగం సంపాదించానమ్మా! జీతం మాత్రం ఇప్పుడే ఇవ్వరు. ఆరునెలల తర్వాత నుంచీ వస్తుంది. అప్పుడు ఒక ఇల్లు తీసుకుని నిన్నిక్కడికి తీసుకొస్తాను. ప్రస్తుతం పదిరూపాయలు ఈ కవర్లో పెట్టి పంపుతున్నానమ్మా! ఇంకెంతో కాలం నువ్ కష్టపడక్కరాలేదు - ఆరు నెలలు - అంతే! ఆ తరువాత నిన్ను బంగారు తల్లిగా చూసుకుంటాను ---"
    ఎవరి సంగతెలా ఉన్నా తల్లికి అబద్దం రాయాలంటే ఏదో గిల్టీగా అనిపించింది.
    అయినా తప్పదు----
    తనకు ఇంకా ఉద్యోగం దొరకలేదని తెలుస్తే ఆమె దిగులు పెట్టుకుని చచ్చిపోతుంది. అంతవరకూ గడిపిన జీవితం నామీదరికి పీడ కల్నే ఆ పీడకలను మరిపింపజేయాలంటే ఈ అందమయిన అబద్దపు కల చాలా అవసరం--
    కిర్సనాయిలు అయిపోవడంతో దీపం బుడ్డి ఆరిపోయింది.
    పక్క మీద వాలిపోయాడు --
    దూరంగా ఎక్కడి నుంచో తుత్తుతూ తుత్తుత్తూరా పాట వినబడుతోంది. ఆ పాట ముగిసే సరికి కళ్ళు మూతలు పడిపోయినాయ్ --
    
        
                                              *    *    *

    అదేమాట తను ఓ అమ్మాయితో కలిసి డాన్స్ చేస్తూ పాడుతుండగా నిజంగానే ఎవరివో చేతులు తన ఛాతి మీద చరచినట్లనిపించి వాటిల్లో చేతిని అందుకుని వెంబడే నిమురుతూ పైకి వెళ్తోంటే చేయి విదిలించుకుని జిక్క కసురు కసరటం వినిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS