Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 6

          
           నా కవిత్వ

నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల దగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు

                                                                       *      *      *   
                                                                                          ---1941
                                        దృశ్య భావాలు

ఘోష
హేష
మురళి
రవళి
కదలి కదలి
ఘణం ఘణల నిక్వణ క్వణల ఝణం ఝణల
బండిమువ్వ
కాలి గజ్జె
కలిసిపోయె
పక్షి రెక్క
పొన్న మొక్క
జొన్నకంకె
తగిలి పగిలి
వానచినుకు చిటపటలో కలసి
కొబ్బరిమొవ్వ పిచ్చుక గొంతులో మెరసి
మూలుగు యీలుగు కేక
చప్పటులు చకచకలు నవ్వు
పొదివికొనీ అదిమికొనీ
కదలి కదలి
ఘోష
హేష
మురళి
రవళి
నా మనస్సులో నిశ్శబ్దపు స్తంభంలా
నిలుచున్నవి
చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తురి చుక్క
కడలి వచ్చి ప్రిదిలినవ్వి
నవ్వి నవ్వి నీరెండల పరుగులెత్తి
మావి తోపు నీడనాడి
కుంద జాజి సేవంతుల ల
వంగ మల్లీ మందారాలు బంతులాడి
కొలనిగట్ల పడుచుపిల్ల
కుచ్చెళ్ళతో పంతమాడి
కలల మెట్ల వంగినడచి
అలల కడలి అంచులొరసి
నా తలపులో కలసిపోయి
నా పలుకులలో పరిమళించు
చదలచుక్క
నెమలిరెక్క
అరటిమొక్క
ఆమె నొసటి కస్తురి చుక్క

                                              *     *     *                                    ---1941


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS