Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 51

 

    మహా మేదావులయిన ఐన్ స్టీన్ లాంటి వాళ్ళ మెదళ్లలో కూడా పది, పదిహేను శాతం కంటే గ్రేసల్సు జాగ్రదావస్తలో వుండవు. మిగతా వన్నీ బతికే వున్నా , ఆ పని చేసే స్థితిలో వుండవు.
    మనిషి మెదడు గురించి మనకు తెలిసింది అవగింజలో అర్ధభాగం ఉండదా -- ఇంకా మాట్లాడితే సముద్రంలో ఒక్క నీటి చుక్కకి సమానమవుతుందేమో !
    మెదడులో వున్న సేల్సు అన్నీ మేలుకుంటే అది చేయగల అద్భుతాలని అంచనా వేయడం కష్టం. అందుకే కదా అన్నాడు ఐన్ స్టీన్ - 21 వ శతాబ్దంలో జరగబోయే రిసెర్చి అంతా ఈ ఎస్ .పీ అంటే ఎక్స్ ట్రా సేన్సరీ పర్ సెప్షన్ గురించే వుంటుందని.
    బాడీని పెర్ ఫక్టు గా చేయగలిగిన తను మెదడుని పూర్తిగా మేల్కొల్పలేడా?
    మనిషి మనుగడకి మూలకారణం మెదడు.
    మానవజాతి నిర్మూలనమై పోయే పరిస్టితి వచ్చినప్పుడు అదే మెదడు మేల్కొని మార్గాంతరం చూపలేదా?
    తపస్సు అంటే ఏమిటి ?
    ధ్యానం అంటే ఏమిటి?
    మెదడుని మేల్కొలపగలగడమే తపస్సా?
    ప్రాచీన ఋషులు సాధించింది అదేనా?
    కొత్త సైన్సు చెబుతోంది అదేనా?
    దేవుడంటే మన మెదడే కావచ్చునని అంటోంది సైన్సు.
    మెదడులో ఒక భాగం పూజల వలన ఉత్తేజితమైతే, ఒక భాగం ప్రార్ధనల వలన స్పూర్తి పొందితే, మరో భాగం పూజా ద్రవ్యాల పరిమళానికి స్పందిస్తే, ఇంకొక భాగం హారతి వేలుగుకో, మంత్రాల శబ్ద తరంగాలకో ప్రభావితమైతే , మరొక భాగం విగ్రహాల రూపు రేఖలకి దాసోహం అంటే .......
    అట్లా మెదడులోనే మనిషి భావిస్తున్న దైవం ఉన్నాడని కొత్త సైన్సు చెబుతోంది గదా!
    అట్లాంటి మెదడులో అన్ని భాగాల, అన్ని కణాలూ మేలుకుంటే దైవసాక్షాత్కారం అవుతుందా ? అయినట్లేనా?
    దేవతలమని పేరు పెట్టుకుని దివి నుండి దిగి వచ్చిన ఈ హైటెక్ జీవుల బారి నుండి మనిషిని రక్షిస్తాడా దేవుడు ?
    రక్షిస్తాడు.
    రక్షించాలి !
    ఒక స్థిరనిశ్చయానికి వచ్చినట్లుగా అక్కడే పద్మాసనం వేసుకు కూర్చుని, తక్షణం తీక్షణమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు రాజు.
    మెదడు మేల్కోవాలి.
    మానవజాతి రక్షించబడాలి.
    మహా సంకల్పం అది!
    దేవుడా! నేను పరీక్షపాసయ్టట్లు చెయ్యి! దేవుడా! నాకు ఉద్యోగం దొరికేలా చూడు!
    దేవుడా! నాకు ప్రమోషన్ వచ్చేటట్లు చెయ్యి! దేవుడా ! నాకు ట్రాన్స్ ఫర్ ఆపెయ్యి ! దేవుడా! నాకు కార్లు, బంగళాలు , కుక్కపిల్లలు , ఫారిన్ టూర్లు ఉండేలా చెయ్యి! దేవుడా! నా శత్రువులు నాశనం అయ్యేటట్లు చెయ్యి!" లాంటి ప్రార్ధన కాదు అది!
    ముందెన్నడూ జరగని మారణహోమాన్ని అపాలన్న మహాయజ్ఞం తాలుకూ మహా సంకల్పం ! మహా మంత్రం!
    ఎక్కడ ఉన్నావో తెలియని - లేదా - అంతటా ఉండే ఓ మహాశక్తి! పరబ్రహ్మ! ఈ నరమేధాన్ని అపు! వేల సంవత్సరాలు ఒంటికాలి మీద తపస్సు చేస్తే కలిగే ఏకాగ్రత ఒక్కసారిగా వచ్చినట్లయింది రాజుకి.
    తనే పురుషుడు అయినట్లు, తనే ప్రకృతి అయినట్లు, తనే పరమాత్మ అయినట్లు - అంతా తనే అయినట్లూ , తనే అంతా అయినట్లు భావన!
    వేలకోట్ల అగ్నిపర్వతాలు విస్పులింగాలు చెరుగుతూ ఫేటేలు మని పేలినట్లు , సాగరాలు అంబరాన్ని చుంబిస్తున్నట్లు, కారు మేఘా;లు కమ్ముకుంటున్నట్లు ప్రకృతి ప్రళయ తాండవం చేస్తున్నట్లు , నేలా నింగీ ఏకమవుతున్నట్లు , గ్రహాలు గతులు తప్పుతున్నట్లు .
    ఇదంతా తన మెదడులో జరుగుతున్న రియాక్షనా?
    నిజంగా జరుగుతుందా?
    వడివడిగా పరిగెడుతున్నాడు ఎర్రోడు.
    గుబురు చెట్ల దగ్గర మలుపు తిరిగాడు.
    ఎదురుగా వస్తున్నా మృగం లాంటి మనిషిని డాష్ కొట్టి , ధభేలు మని కిందపడ్డాడు ఎర్రోడు.
    వెంటనే --
    అతని ఎదుర్రొమ్ము మీద దూలం లాంటి తన కాలు పెట్టాడు ఆ మనిషి.
    ఊపిరాగిపోయినంత పని అయింది. చూశాడు.
    దొర!
    కరుడు కట్టిన కాఠిన్యం కనబడుతోంది అతని కళ్ళలో.  
    కాలితో ఎర్రోడి గుండెలని తొక్కుతూ "కాల్మొక్త బాంచన్ అంటూ కాలికింద పడి వుండవలసిన నాకొడుకువి కాళ్ళున్నాయి గదా అని పారిపోతావురా నా కొడకా! ,మల్ల మల్లా పారిపోకుండా కాళ్ళు ఇరగ్గోడతా! ముందుగా ఏ కాలు ఇరగ్గొట్టమన్నవూ?" అన్నాడు దొర!
    లేడిపిల్ల మీద సింహం జులుం చేస్తున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. ఎర్రోడికి మూడు రెట్లు బరువు వుంటాడు దొర.
    కానీ --
    అంత శక్తి యెట్లా వచ్చిందో తెలీదు. ఎర్రోడు బలంగా దొరకాలు పట్టుకుని గుంజాడు.
    విరుచుకుపడిపోయాడు దొర.
    బిందె సైజులో ఉన్న అతని తల నేలకు తగిలింది. కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్లయింది.
    ఎర్రోడు తన కాలు దొర ఎదుర్రొమ్ము మీద పెట్టి అన్నాడు.
    దొరా! చెబుతున్నాను విను!
    ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు! ఇక నుంచి దొరలేడు -- ఎర్రోడు లేడు - మనుషులందరూ ఒక్కటే! పై నుంచి దేవతలనే దెయ్యాలు దిగి వచ్చారు. మనుషులందరినీ  సఫా చేసేస్తారు - ఏం చెయ్యాలో ఆలోచించు!" అన్నాడు త్వరత్వరగా.
    "ఏమిటీ?" అన్నాడు దొర.
    అట్లా అంటుండగానే , వెల్లకిలా పడుకున్న దొరకి ఆకాశంలో ఒక వైపున రంగులు మారడం కనబడింది.
    ఆకాశంలో అట్లాంటి రంగుల కలయికని అతనెప్పుడూ చూడలేదు.
    "ఎర్రోడా.....ఏమిట్రా అది?" అన్నాడు దొర- ఇప్పుడతని గొంతులో దొరల దర్పం లేదు. మనుషులకి మాములుగా ఉండే భయం ధ్వనిస్తోంది.    
     


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS