Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 40

 

    రేడియోలో చదువుతున్న వార్తలు వింటున్నా బుర్ర కేక్కడం లేదు సాగర్ కు.
    తను ఏదో ఒకటి తేల్చుకోవాలి! ఇప్పటికే ఆలస్యం చేశాడు. ఈ విషవలయంలో నుంచి ఎలాగయినా బయట పడాలి. అందుకు ఒకటే మార్గం. దానితో అన్ని సమస్యలు తీరిపోతాయి. అందరి రోగాలు కుడురిపోతాయి. నౌ ఆర్ నెవర్! మాధవిని తీసుకొని తను దూరంగా వెళ్లిపోవాలి. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా మాధవిని తీసుకుని పారిపోవాలి. వీళ్ళకు అందనంత దూరం పారిపోవాలి. పెళ్ళి చేసుకున్నాకే తిరిగిరావాలి. పెద్దవాళ్ళ ఇష్టా ఇష్టాలతో పని లేదు. డాక్టర్ జడ్జి యస్పీ అందరు కట్టగట్టుకుని ఏ గంగలో అయినా దూకనీయ్ తన నిర్ణయానికి తిరుగు లేదు. మాధవిని ఈ రాత్రికే గడప దాటించాలి! మాధవిని తీసుకుని దూరంగా పారిపోవాలి. రిజిస్టరు ,మారేజీ అయేంతవరకు ఎక్కడున్నది ఎవళ్ళకు తెలియకూడదు ----అతని ఆలోచన హటాత్తుగా ఆగిపోయింది.
    తను అంత పని చేయగలడా? మాధవి అందుకు ఒప్పుకుంటుందా? పెద్దల చాటున పెరిగిన పిల్ల తనతో లేచి రావటానికి ఒప్పుకుంటుందా? లోకం ఏమనుకుంటుంది? యస్పీ గారి అబ్బాయి, జడ్జి గారి అమ్మాయి లేచి పోయారనుకోరా? జడ్జి రామనాధం గారు కోర్టులో లాయర్ల మొహాలు ఎలా చూస్తారు. యస్పి గారు తన తోటి ఆఫీసర్ లతో ఎలా ఉంటారు. ఒక్కసారిగా సాగర్ ఆలోచనలకూ గండిపడింది.
    ఒకసారి మాధవిని చుస్తే గాని ప్రశాంతంగా ఉండదని లేచి జడ్జి రామనాధం గారి ఇంటి వైపు సాగాడు. రామనాధం గారి గేటు తాళం వేసి కనపడింది. సాగర్ బోత్తరపోయాడు.
    మాధవి వాళ్ళు లేరు ఎక్కడికి వెళ్ళారు. మళ్ళీ మాధవికి ఏమైంది లేకపోతే ఊరు వెళ్ళారా ? అని ఆలోచనలతో గేటు పట్టుకుని ఊపాడు , గేటు ఊపిన శబ్దానికి "ఆ వస్తున్నా ఎవరూ?" కారు షెడ్డులో నుంచి వినిపించింది.
    "నేనే! సాగర్ ను' పెద్దగా సమాధానం చెప్పాడు.
    మరో రెండు నిముషాల్లో నౌకరు రామయ్య గేటు దగ్గరకొచ్చాడు.
    "బాబుగారు - మీరా?" గేటు తాళం తీస్తూ అన్నాడు.
    "అవును! ఈ టైం లో గేటు ఎందుకు వేశావ్?"
    మాధవమ్మ గారు పారిపోకుండా - తన ప్రశ్నకు తనలో నుంచే ఎవరో సమాధానం చెప్పినట్టయింది! వళ్ళు జలదరించింది.
    "అయ్యగారు, అమ్మగారూ అమ్మాయిగారు తీసుకుని ఊరి కెళ్ళారు బాబూ!" నౌకరు చెప్పాడు.
    "ఎప్పుడూ? ఎక్కడికి?"
    "సాయంకాలం నాలుగంటలకు బయలుదేరారు." విశాఖపట్నం." నౌకరు గేటు తెరచి బయటకొచ్చాడు.
    "విశాఖపట్నమా? ఎందు కేందుకూ?" సాగర్ గుండె గొంతులోకి వచ్చి అడ్డం పడినట్టయింది.
    "అమ్మాయి గారి సంగతి తమకు తెలుసుగా బాబూ?" నౌకరు గొంతు జీరపోయింది.
    "మాధవిని పిచ్చాసుపత్రిలో చేర్పించడానికా?"  సాగర్ బుర్ర గిరగిరా తిరిగిపోయింది.
    "అంతేగద బాబయ్య! అయ్యగారికి యీ వయసులో ఈ కష్టా లేమిటి బాబూ? మాములు జబ్బు కాదు. ఎప్పటికీ నాయమవుతుందో ఏమో? నా భార్య చెల్లెలు కూడా మన మాధవమ్మ గారి లాగానే చేసేది. విశాఖపట్నం ఆసుపత్రిలో చేర్పించాము . అధక్కడే పోయింది. వచ్చే దీపావళి కి మూడేళ్ళు...." నౌకరు చెప్పుకుపోతున్నాడు.
    సాగర్ భూమిలోకి కృంగిపోతున్నాడు. నరాలు పట్టు తప్పాయి. మనిషి నిలువెల్లా వణికి పోసాగాడు.
    "నా మట్టుకు నాకు అనిపిస్తుంది బాబూ! మాధవమ్మ గారిని ఇంకా ముందే చేర్పిస్తేనే బాగుండేది పిచ్చి ముదిరినాక తిరగదంటారు. అప్పుడు ---- బాబుగారూ తమకు గుర్తుందా? అప్పుడు వంటింట్లో దొంగలు పడ్డారని అమ్మాయి గారు అల్లరి చేశారు, గుర్తుందా బాబు! నిజం చెప్పాలంటే ---ఇంట్లో ఏ వస్తువులూ పోలేదు. అమ్మాయిగారు బహుమతి తెచ్చుకొన్న కుక్కర్ గిన్నె మాత్రం పోయిందన్నారు? ఏ దొంగయినా ఆ ఒక్క గిన్నె కోసమే వస్తాడా బాబు! నేనప్పుడే అనుకున్నాను అట్లాగే జరిగింది!" పైన తువ్వాలు తీసి ముఖం తుడుచుకొన్నాడు నౌకర్.
    "ఏమిటన్నావ్? ఏం జరిగింది?' ఆలోచనగా అన్నాడు సాగర్. స్మృతి పదంలో గాడిచిన సంఘటలన్నీ అల్లిబిల్లిగా తిరగసాగాయి.
    "ఆ కుక్కర్ గిన్నె కూడా ఎక్కడికి పోలేదు. తర్వాత చూస్తే కారు షెడ్డు వెనుక గొందిలో పాత సామానులో దొరికింది!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS