జరిగిపోయిన తప్పులో నీతో పాటు నాకూ భాగం వుంది. ఎందుకో నిద్రపట్టక మీ గది వైపు వచ్చేసరికి బోల్ట్ వేయడం మరచి పోయినట్టున్నారు.... మీ గది తలుపు తెరిచి వుంది..... ఏదో కలవరించడం వినిపించింది. ఏమిటో తెలుసుకుందామని వచ్చి పక్కనే కూర్చున్న నన్ను అమాంతం కౌగలించుకున్నారు. అంతవరకూ తప్పు మీదే....
ఆ తరువాత తప్పంతా నాది..... అసలే మనసులో సంఘర్షణ కు తట్టుకోలేక మీ వద్దకు వస్తే మీ చర్య నన్ను ఉన్మాదురాలిని చేసింది. ఎన్నాళ్ళ నుంచో భర్త స్పర్శ కోసం ..... భర్త సుఖం కోసం తపించి పోతున్నాను. నా వయస్సు అంతా అడవి కాచిన వెన్నెల అయిపోవలసిందేనా ..... అలా అని నా భర్తకు ద్రోహం చేయలేదు తప్పు చేయలేను.....
అలా సరిపెట్టుకుని, కోరికలను చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు. డబ్బూ అంతస్థు వుండి మాత్రం ఏం ప్రయోజనం ...... మీరు చెప్పండి -....అందుకే నా మనస్సులో వున్న అభిప్రాయాన్ని మీతో చెప్పు కోవాలని వచ్చాను. కానీ, నేను ఏ ధర్మ సందేహాన్ని మీ దగ్గిర తీర్చుకోవాలని వచ్చావో అది మీ నోటి ద్వారా కాకుండా చేతల ద్వారా తెలుసుకోగలిగాను.
నేను ఆశించిన సుఖం లభించింది. అందుకు మీకు మన స్పూర్తిగా రుణపడి ఉంటాను. మీరు నా ముఖం చూడడానికి బిడియ పడతారని మీరు లేచే అమయానికి నేను వెళ్ళి పోతున్నాను. నేను ఇలా చేయడం నా భర్తకు ద్రోహం చేసినట్టు కాదా అని ప్రశ్నించవచ్చు మీరు. కానీ అక్కడ నా భర్త చేస్తున్న పని ఇదే ---ఎవరో ఒకరిని ఉంచుకోకుండా అయన అక్కడ వుండలేరు. అని నాకు తెలుసు.
అయన లాంటి మగవాళ్ళు అంతా తను పవిత్రంగా లేక పోయినా ఫరవాలేదు గానీ తన భార్య పవిత్రంగా వుండాలి అని కోరుకుంటారు..... అలా అని నేను విచ్చలవిడిగా తిరగడం లేదు కదా. మనస్సుకు నచ్చిన రీతిలో మీతో ఒక్కరాత్రి సుఖాన్ని పంచుకున్నాను. ఈ జన్మకు ఇది చాలు. నన్ను అసహ్యించుకోకుండా అర్ధం చేసుకుంటారను కుంటాను.
మీ బెడ్ మీద వున్న దిండు క్రింద పదివేలు వుంచాను అవి తీసుకోండి ........మీరు నాకు ఇచ్చిన సుఖానికి రేటు కడుతున్నానని అనుకోవద్దు. మీ పరిస్థితి అర్ధం చేసుకున్నాను కాబట్టి ఈ సమయంలో ఆ డబ్బు మిమ్మల్ని ఎంతయినా ఆదుకుంటుంది. ఆభిమానంతో మీరు ఆ డబ్బు అక్కడ వదిలి వెళ్ళారంటే ఆ డబ్బు పనిమనిషి తీసుకుంటాడే తప్ప నేను వచ్చేవరకూ అక్కడ వుండదు.
అంటే, అర్ధం అయి వుంటుందను కుంటాను. నేను ఊరికి వెళుతున్నాను. తిరిగి ఎప్పుడు వస్తానో తెలియదు. ఎప్పుడు అయినా నన్ను చూడాలని వున్నా! పలకరించి పోదాం అనిపించినా మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి.....డబ్బు తీసుకోవడం మరచిపోవద్దు.
గుడ్ బై---
మీకు ఏమీ కాని "సుజాత"
ఉత్తరం చదివిన సునీల్ గాడంగా నిట్టూర్చాడు.
అయిష్టంగానే ఆ డబ్బు తీసుకుని బయటకు నడిచాడు సునీల్.
* * *
సునీల్ ఆ భవంతి లోపలకు అడుగు పెట్టబోతూ ఒక నిమిషం సందేహంతో ఆగిపోయాడు.
తన రాకను ఆమె తప్పుగా భావించదు కదా.
అయినా అలా అనుకునే మనస్తత్వం వుండి వున్నట్లయితే ఇంతకు ముందు తను ఫోన్ చేసినప్పుడు అంత సంతోషంగా మాట్టాడి వుండేది కాదు.
ఎందుకయినా మంచిది అనే సునిల్ బయలుదేరేముందు సుజాతకు ఫోన్ చేశాడు.
ఆమె ఏ వుద్దేశ్యంతో డబ్బు ఇచ్చినప్పటికీ అప్పడు తన చేతికి అందిన డబ్బు తనకు అవసరానికి ఎంతో ఆడుకున్నాయి.
అందుకే కృతజ్ఞతలు అయినా చెప్పి వెళదాం అని ఆమె ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేశాడు అతను.
"కృతజ్ఞతలు అనేవి ఎవరూ ఫోన్ లో చెప్పరు.....ఎదుటకు వచ్చి చెబితేనే ముఖంలో వున్న సంతోషం తెలిసేది....." అన్నదామె చిలిపిగా.
ఆమె కనిపించకపోయినా ఆ భాషాలోని మాధుర్యాన్ని ఆమె ముఖంలోని ఫీలింగ్స్ ని మనోనేత్రంతో క్షణంలో చూడగలిగాడు.
ఇప్పుడు అతని మనస్సు విహంగంలా ఎగురుతుంది.
"సరే.....ఇప్పుడే వస్తున్నాను...." అంటూ బయలుదేరాడు సునీల్.
సరాసరి లోనికి నడిచాడు.
కాలింగ్ బెల్ నొక్కాడు.
తలుపు తెరచుకుంది.
ఎదురుగా వున్నది సుజాత కాదు ....మరెవరో.
"సుజాత గారు కావాలి....."అర్ధోక్తిలో సంశాయంగా ఆగిపోయాడు సునీల్.
"మీరు సుజాత అక్క కోసం వచ్చారా......అయితే మీ పేరు సునీల్ అయి వుండాలే" అన్నదామె.
ఆమెకు తనపేరు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంలోనే అవునన్నట్టు తల ఊపాడు సునీల్.
"నా పేరు శాంతి..... మీరు వస్తారనీ, వస్తే కూర్చో బెట్టమని చెప్పింది అక్క.....రండి' అంటూ లోపలకు దారి తీసిందామే.
తనను కూర్చోమని చెప్పింది సరే .....తను వస్తున్నట్టు ఫోన్ చేసినా వుండకుండా బయటకు ఎందుకు వెళ్ళిందో ననుకుంటూ అన్యమనస్కంగానే లోపలకు వెళ్ళాడు.
ఆ పరిసరాలు ఒక్కసారిగా అతనికి గత సంఘటనను గుర్తుకు తెచ్చాయి.
"ఏదో సర్పైజ్ చేయడానికి షాపింగ్ కు వెళ్ళింది అక్క.....తను వచ్చేవరకు వుండమని చెప్పింది ఎదురుగా రాక్ లో హాట్ డ్రింక్స్ వున్నాయి.....మీకు కావలసిందేదో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.....నేను పైకి రాను....." అని చెప్పి వెళ్ళిపోయింది శాంతి.
సుజాత వచ్చేవరకూ మౌనంగా కూర్చోవడం కుదరక విస్కీ బాటిల్ తెచ్చుకుని గ్లాసులో వంపుకుని నీళ్ళు కలుపుకున్నాడు.
పెగ్గూ మీద పెగ్గు .....అప్పటికే ఎంత నెమ్మదిగా సిప్ చేస్తున్నప్పటికీ నాలుగు పెగ్గులు ఖాళీ చేశాడు.
అయినా సుజాత రాలేదు.....వస్తున్నా జాడ లేదు.
టైం పది దాటింది.
అతనిలో మందు నిషా పనిచేయడం ప్రారంభించింది.
డ్రింక్ బాటిల్సు ఎదురుగా చూసేసరికి నోరు ఊరి లాగించాడు కానీ నిజానికి అప్పుడు మందు తీసుకోవాలనే ఉద్దేశం అతనికి ఎంత మాత్రం లేదు.
కళ్ళు తెలిపోతున్నాయి.
ఒళ్ళు తూలి పోతున్నది.
అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుంది.
అడుగుల చప్పుడుకు కళ్ళు విప్పుకుని చూశాడు.
సుజాత వచ్చిందనుకున్నాడు.
కానీ, ఆమె శాంతి.
తలుపు బోల్టు వేసి అతనిని సమీపించిందామె.
సునీల్ మనస్సులో ఏదో అనుమానం.
అది తీర్చుకోవడానికి అన్నట్టు శాంతి వైపు చూశాడు.
ఆమె అప్పటికే అర్ధ నగ్నంగా వుంది.
సునీల్ ఆశ్చర్యం నుండి కోలుకోకముందే వచ్చి అతనిని అల్లుకు పోయిందామే.
ఆమెను విదిలించబోయాడు కానీ సునీలుకు సాధ్యం కాలేదు.
అతనిని బెడ్ పైకి లాగి కౌగలించుకున్నది శాంతి .
క్షణాల మీద అతని బట్టలు మంచం పక్కనే గుట్టగా పడిపోయాయి. తీగ అల్లుకు పోయినట్టు శాంతి నగ్న దేహం అతనిని పెనవేసుకు పోయింది.
ఎంతయినా మగవాడు కదా.....బుర్రను తొలిచివేస్తున్న మందు మత్తుతో పాటు మెత్తని అవయవ సంపద అతనిని మరింత రెచ్చ గొడుతుంటే ప్రతిఘటించడం మానేసి ఆమెకు సహకరిస్తున్నాడు సునీల్.
తన మనస్సాక్షికి విరుద్దంగా జరుగుతున్నది ఏమిటో తెలిసినా....అతని శరీరం మాత్రం అతని మనస్సు మాట వినను అని మొండి కేసింది.
ఫలితం.....శాంతి కోరుకున్న సుఖం లభించింది.
