సాంబశివరావు చెప్పాడు. డాక్టర్ మూర్తి ఓ క్షణం అలోచించి అన్నాడు.
"మనం వెంటనే రామనాధం గారిని చూడటం మంచిది."
'ఇప్పుడా? ముందు సాగర్ ఎమైనాడో చూడాలిగా"
"డోంట్ వర్రీ, నా ఉద్దేశ్యం మీ కర్ధమయిందనుకుంటాను. సాగర్ రామనాధం గారింటికే బయలుదేరి ఉంటాడు. సాగర్ జడ్జి గారింటికి వెళ్లేముందే మనం వెళ్ళడం మంచిది. రామనాధం గారిల్లిక్కడకు బాగా దగ్గర కదా! మీ బంగాళా నుంచి సాగర్ సైకిల్ మీద వెళ్ళే లోపున మనం కారులో వెళ్ళొచ్చు, కమాన్ హరియప్!' అంటూ డాక్టర్ మార్తి సాంబశివరావును వెంట బెట్టుకొని డ్రాయింగ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. తమ వెనుకే వస్తున్నా కూతురిని చూసి "నువ్వెక్కడికమ్మా? నువ్వు ఇంట్లోనే ఉండు" అన్నాడు డాక్టర్ మూర్తి.
"సాగర్ కు ఏమైంది నాన్నా?" సుజాత అయోమయంలో పడిపోయింది.
"సాగర్ బాగానే ఉన్నడమ్మా! నువ్వేమీ ఆదుర్దా పడొద్దు! మేము ఇప్పుడే వస్తాం. నువ్వు ఇంటి దగ్గరే ఉండు." అంటూ మూర్తి పోర్టికోలో ఉన్న కారు దగ్గరకు నడిచాడు. జీప్ కేసి వెళ్తున్న సాంబశివరావును ఆపి తన కార్లో కుర్చుమన్నాడు మూర్తి. సాంబశివరావు జీప్ ను బంగాళాకు తీసుకెళ్ళమని డ్రైవర్ కు చెప్పి డాక్టర్ మూర్తి పక్కన కారులో కూర్చున్నాడు.
16
డాక్టర్ మూర్తి , సాంబశివరావు జడ్జి రామనాధం గారింట్లో నుంచి బయటికి వచ్చేసరికి కనుచీకటి పడుతూ ఉన్నది. సాంబశివరావుకు నెత్తిమీద నుంచి పెద్ద బరువు దించుకున్నట్టుగా ఉంది. డాక్టర్ మూర్తి వదనంలో ఏదో సాధించానన్న సంతృప్తి వ్యక్తమవుతుంది.
డాక్టర్ మూర్తి కారు నడుపుతున్నాడు. సాంబశివరావు పక్కన కుర్చుని హాయిగా చల్లటి గాలి పీల్చుకుంటున్నాడు,
"మన సమస్య పరిష్కారం అయింది. థాంక్యూ డాక్టర్! కాని రామనాధం గారిని చూస్తుంటే జాలి వేస్తున్నది. ఒక్కతే కూతురు అలా అయిపొయింది పాపం"
"ముందే నా సలహా విని ఉంటె పరిస్థితి ఇలా దిగాజరేది కాదు! ఇప్పుడు చూడండి.' సాలోచనగా అన్నాడు మూర్తి.
'అవును పాపం!' పెదవి విరిచాడు సాంబశివరావు .
"కానీ......."
"ఏమిటి మీ అనుమానం?" మూర్తి సాంబశివరావు కేసి తిరిగి అన్నాడు.
'అసలు సాగర్ మాధవి పరిస్థితిని అర్ధం చేసుకొనే స్థితిలో వున్నాడా అని?"
"ఐ థింక్ సో" అన్నాడు మూర్తి.
"ఏమో డాక్టర్!" నీళ్ళు నమిలినట్లు అన్నాడు సాంబశివరావు.
"సాగర్ విషయంలో తండ్రిగా మీరు ఆదుర్దా పడటం సహజం. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకున్నారు డాక్టరుగా నా అభిప్రాయం ఇది. సాగర్ మానసికంగా బాగానే ఉన్నాడు. మాధవి గురించి అతడు వర్రీ అవుతున్న మాట వాస్తవం. ఆమె మానసిక రుగ్మత నయం కానిది అని సాగర్ అర్ధం చేసుకొన్నా మరుక్షణం నుంచి సాగర్ మారిపోతాడు. నాకు అందులో సందేహమేమీ లేదు" డాక్టర్ మూర్తి ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చాడు.
"అది రివర్సు లోనూ జరగవచ్చుగా?" ఎక్కడో ఏదో ఆలోచిస్తూ అన్నాడు సాంబశివరావు.
"అలా జరగదనే నా విశ్వాసం!" డాక్టర్ మూర్తి అన్నాడు.
"మీరు ఊహించినట్టు సాగర్ రామనాధం గారింటికి రాలేదు. మరి ఎక్కడికి వెళ్లుంటాడు?"
"అదే నాకు అర్ధం కావడం లేదు. మీ అర్దర్లీ సాగర్ ను ఫాలో అవుతున్నాడు కదా?"
"మనం జడ్జి గారింటికి దగ్గరున్నట్టు విక్టర్ కు చెప్పలేదు. ఇంటికే ఫోన్ చేసి ఉంటాడు!" సాలోచనగా అన్నాడు సాంబశివరావు .
డాక్టర్ మూర్తి , సాంబశివరావు మరో ఐదు నిమిషాల్లో యస్పీ బంగళా దగ్గర కొచ్చారు. కారు గేటు ముందు కొచ్చేసరికి విక్టర్ ఎదురుగా పరుగెత్తు కొచ్చాడు. డాక్టర్ మూర్తి పోర్టికోలో అంతకు ముందే ఆగి వున్న కారు వెనకే తన కారు ఆపాడు.
"సాంబశివరావ్! ఆ కారు మీది కాదు గదూ?" పోర్టికోలో ఉన్న గ్రే కలర్ ఎంబాసిడర్ను చూపిస్తూ అడిగాడు డాక్టర్ మూర్తి.
"మాది కదూ! అదే చూస్తున్న ఎవరోచ్చారా అని?" సాంబశివరావు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
ఇద్దరూ కారు దిగారు. విక్టర్ పరుగు పరుగున గెట్ దగ్గర్నుంచి వచ్చి సాంబశివరావు ముందు నిలిచి సెల్యూట్ చేశాడు.
"ఎవరిదీ కారు? ఎవరోచ్చారు?" సాంబశివరావు అడిగాడు.
'డాక్టర్ ఆనందరావు గారొచ్చారు సార్!" విక్టర్ చెప్పాడు.
"డాక్టర్ అనందరావా? అమ్మగారికి ఎలా ఉన్నదో స,సాంబశివరావు ఆదుర్దాగా ఇంట్లోకి నడిచాడు. డాక్టర్ మూర్తి, విక్టర్ సాంబశివరావుని అనుసరిచారు.
"డాక్టర్ ఆనందరావు గార్ని సాగర్ బాబు తీసుకొచ్చారు. సాగర్ బాబు సైకిల్ మీద వెళ్ళింది డాక్టర్ గారి నర్శింగ్ హోం కే సార్?" విక్టర్ చెప్పాడు.
"ఓ . ఐ.సి.!" అన్నాడు డాక్టర్ మూర్తి.
సుభద్రమ్మ గారి గది దగ్గరకు వెళ్ళేసరికి సాగరూ, డాక్టర్ ఆనందరావు బయటికి వస్తున్నారు.
"గుడ్ ఈవినింగ్ డాక్టర్" అంటూ డాక్టర్ మూర్తి డాక్టర్ అనందరావుతో కరచాలనం చేశాడు. సాంబశివరావు కూడా ఆనందరావుకు విష్ చేశాడు.
"ఐ సపోజ్ యూ ఆర్ ట్రీట్మెంట్ హర్!" డాక్టర్ మూర్తిని చూసి అడిగాడు ఆనందరావు. డాక్టర్ మూర్తి అవునన్నట్టు తల ఉపాడు.
'పేషెంట్ ఎలా ఉన్నది? ఎనీ ఎమర్జన్సీ?" డాక్టర్ మూర్తి అనందరావుని అడిగాడు.
"ఎమర్జన్సీ ఏమీ లేదు. మిస్టర్ సాగర్ నన్ను రిక్వస్ట్ చేశాడు హి వాంట్స్ సెకెండ్ ఒపీనియన్!" డాక్టర్ ఆనందరావు సున్నితమైన పరిస్థితిలో పడి అన్నాడు. అది అర్ధం చేసుకున్న డాక్టర్ మూర్తి అన్నాడు. "ఇన్ ఫాక్ట్ ఐ మైసేల్స్ వాంటెడ్ టు హావిట్! మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామను కుంటున్నాను. ఐ యాం హాపీ దట్ యూ హావ్ యగ్జామిన్ హర్!"
హాల్లోకి వచ్చిన డాక్టర్ అనందరావును మర్యాద సూచికంగా సాంబశివరావు సోఫా చూపించాడు. డాక్టర్ ఆనందరావు పక్కన డాక్టర్ మూర్తి కూర్చున్నాడు. సాంబశివరావు ఎదురుగా కూర్చున్నాడు.
