Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 31

       
                                                                                                        తిరుపతి
                                                                                        2-7-04
    రఘుగారికి నమస్తే,
    మనసు, యీ పూట, స్వరకల్పనలా  చిందులేస్తోంది.
    చెవికి అందని అవ్యక్తగానం; కంటికి అందని అరూప్య చిత్రలేఖనం; అర్దమవని చిరపరిచితుని  అలేఖ్య కావ్యం; భావానికి అందని అప్లావిత మానసం; దాహ నివృత్తి భ్రమనిచ్చే  మరీచిక; కంటికి అంది అందని క్షితిజ రేఖ - యిదో  వ్యర్ధార్ధ రచన.
    మన పరిచయం పాతిక ముప్పయ్యేళ్ళ నాటిది. అప్పట్లో మీరు కాస్పూర్ లో  రిసెర్చి  చేస్తూండేవారు. యిక్కడికి  దగ్గిరలోని  కడపజిల్లా కోడూరు దగ్గిరి మీ వూరికి వొచ్చినప్పుడు కలుస్తుండేవారు. ఆ తరువాత గోవా. ఆ తరవాత సిమ్లా అక్కడి నుంచి హ్తేదరాబాద్ కి.
    పూనా,  బెంగుళూరు వెళ్ళోచ్చాను అని రాశారు. నేనెంతగా ప్రయనించనో  మికంతగా ప్రయాణాలు (యూనివర్సిలకు).
    ఆ మొన్న పప్పు సోమేశ్వరరావు వీణ రికార్డు చేశాను. అతని కూడా అతని పండితపుత్రుడి వీణాపకారం.
    నా దగ్గిర వీణ కాసెట్లు ముప్పయ్ కి ప్తెగా వున్నాయి. అందులో గాయత్రిగారివి  పదిహేనుకి ప్తెగా.
    మా అమ్మాయికి చాలా మంచి సంగీతాభిరుచి (ఆమె భర్తకి కూడా). న్యూయార్క్ లో CD లు కాసెట్లు కొంటుంది. న్యూయార్క్ లో అక్కడి వక రేడియో స్టేషన్లో శని ఆదివారాలు, హిందూస్తాని కర్నాటక వొస్తుండేవి. నేనక్కడవున్నప్పుడు యింటర్నెట్ లో మంచి  తెలుగు పాటలు వినెవాణ్ని.
    ముసురుపట్టి వాన జల్లులు.  చలివేడి చమటా లేకండా ఆహ్లాదంగా  వుంటుంది. వర్షంలో తడవటం కూడా యిష్టం. జోరున వర్షం కురుస్తుంటే చూస్తుండటం యిష్టం, మేఘాలు యిష్టం. ఉరుములు యిష్టం. మెరుపులు యిష్టం.
    వర్షం యిళ్ళ మధ్య కాక, బయట బావుంటుంది.
    యిలాంటి వాతావరణంలో సంగీతం మరింత అద్బుతంగా వుంటుంది- వింటూంటే. నిన్నంతా అమీర్ ఖాం, కిశోరి  అమోన్ కర్ లను  విన్నాను.
    యివ్వాళ గాయత్రిగారి T.series  cassette  మళ్ళి మళ్ళి విన్నాను.
    కరంటుపోతే; నీటి నుంచి బయటపడిన  చేపపిల్లలా  వుంటుంది, నాస్దితి. అమెరికాలో  కరంటుపోదు. అక్కడి comforts కి అలవాటు పడినవాళ్ళు  తిరిగి రావటానికి  యిష్టపడరు.
    వి. శాంతారా  సినిమాలు యిష్టం. ఆ సినిమాలలో ని సంగీతం యిష్టం.
    చాలా యిష్టం. చాలా చాలా యిష్టం.
    హ్తేదరాబాద్ పెడతాను, తెలుగు పాటలకి.  యీ శతాబ్దం పాటలోస్తుంటే ఆఫ్  చేస్తాను.
    తెలుగువాళ్ళలా  మలయాళీలు, 'నమస్కారం' అంటారు.  వాళ్ళ లుంగి బావుండదు.
    గితాంజాలి వారి కన్నకుడి  వ్తెద్యనాధన్ వయొలిన్ కాసేట్ కొనండి. తన ముఖమల్ గొంతుతో  తలత్ మహ్ మూద్  అన్ని తేనెలూరే పాటలు పాడాడు, సినిమాలకు.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                    -వడ్డెర చండీదాస్.

                                                                                                           తిరుపతి                                                                                                                                                           3-7-04
    రఘుగారికి  నమస్తే,
    యీ మధ్య కొత్తగా పది (కర్నాటక వోకల్) కాసెట్లు కొన్నాను. అందులో HMV  వారి యం.యస్.సుబ్బలక్ష్మి  3 కాసెట్లు సెట్టు  Naada sudha Rasa  కూడా వుంది. అన్ని బావున్నాయి. దాన్లో  జనని నిన్ను వినా, నగుమోము వున్నాయి.  నా కోసం కోంటారేమోనని  రాస్తున్నాను.
    యింట్లో వుంటే- శినివారాలు 4-5 వివిధ భారతి తప్పక వినండి. ఆదివారం జయ్  మాలాగోల్డ్  వోకో రోజు చచ్చు వెధవో జిడ్డు వెధవో వొస్తాడు.
    జ్ఞాపకాల మిణుగురులు- కొన్ని తియ్యగా, కొన్ని చేదుగా, సరస్సులో  కార్తికదిపాలలా,  అమావాస్య వినిలాశంలో నక్షత్రాలు-
    లాల్ గుడి జయరామన్ వయొలిన్ విన్నాను. బాగానే వాయించాడు. నేనిదివరకు కొన్న రాగం తానం పల్లవి తగలేశాడు.
    మొన్నో సాయంత్రం DD chennai లో యెవరో వోకామె కూచిపూడి బాగా చేసింది. చాలా రోజుల తరవాత బావున్న కూచిపూడి చూశాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                             -వడ్డెర చండీదాస్.

                                                                                                                   తిరుపతి
                                                                                                                10-7-04
    రఘుగారికి నమస్తే,
    యీ పూట నిద్ర లేవగానే కిశోరి  అమోన్ కర్ శుద్ద్ కళ్యాణ్ గుర్తొచ్చింది. యీ  వేకువని  వుజ్వలించిన  అద్బుతస్మృతి.  ఆమె ఆలాపన; అనితర సాద్యం. ఆకాసేట్  వెయ్యి రూపాయల్తెనా  యిచ్చి కొందును. తన 75 యేట లండన్ లో పాడింది.
    యెందరో అద్బుత సంగితకులు. అందుకే త్యాగారాజస్వామి అన్నాడు. యెందరో అద్బుతంగా వినిపించే వాళ్ళు. వినిపిస్తూ తాదాత్మ్యించె  వాళ్ళు. కేవలం వింటూ తాదాత్మ్యించే వాళ్ళు.
    కె.విశ్వనాథ్ సినిమాలు బాగానే వుంటాయి.పాటలు బావుంటాయి.
    సంగీతానికి,  ముఖ్యంగా  శాస్త్రీయ సంగీతానికి మూడ్ అవసరం. వినిపించటానికే కాదు; వినటానికి కూడా. వాళ్ళకి తోచినప్పుడు కాసెట్ల కెక్కిస్తే మనకి అనిపించినప్పుడు వింటూంటాం. నిన్న బిస్ మిల్లా ఖాంవి కొన్ని క్యాసెట్లు వరసగా విన్నాను. షహ్ నాయ్ కి అతనొక్కడే.
    శాస్త్రీయ సంగీతానికి; T. series వాళ్ళవి తక్కువేగాని చాలా బావుంటాయి.

                                                                                                                   12-7-04
    యివ్వాళ మనసు ఆధ్వనంగా వుంది; నిలయ విద్వాంసుల గోష్టిలా. ఠుమ్రిల్లా  బోర్ గా  కూడా వుంది.
    మనసుకి యేది అతకటం లేదు. సంగీతం వినాలనిపించటం లేదు. టివి
    చూడాలనిపించటంలేదు. Lingerie నచ్చటం లేదు. (సాధారణంగా లింజరి నచ్చటం నచ్చకపోవటం వుండదు.) అంతా చెరుకు పిప్పిలా వుంది, నిరీహ సాధారణంగా  నాకు అలవాటు లేని స్ధితి; అననుభావం.

                                                                                                               16 -7-04
    లేచేసరికి శాయికృష్ణ  అష్టపదుల రేఖా చిత్రాలు గుర్తొచ్చాయి.  మనసు; మెఘ్ , మార్వా రాగాలలా వుజ్వలంగా వుంది. కాసేపాగి మల్లీశ్వరి కాసేట్ పెట్టుకొని వింటాను -అదుండే  గంటసేపు.  డిప్పక్రాపులతో జీన్స్ ల్లోని  స్త్రీ జన  సమూహం పక్కన, జార్జియాన్ చిత్రించిన,  పర్వత లోయలో అనాచ్చాదిత స్లీపింగ్ వినన్  వుంటే, సౌకుమార్య  సౌందర్య అపశృతిలా  అనిపించినట్లుగా; కిక్కిరిసిన ఆకాశ హర్మ్యాల  న్యూయార్క్ నగరం మధ్యలోంచి,  విశాలంగా ప్రశాంతంగా  ప్రవహించే   పెద్ద హడ్సన్  నది,  అనిపిస్తుంది. అత్యంత అందంగా వుంటుంది న్యూయార్క్  నగరంలో. (statue of Liberty  నగరంలోలేదు; బయట సముద్రంలో వుంది.)
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                         -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS