తిరుపతి
6-6-04
రఘుగారికి నమస్తే,
గురుదత్ సినిమాలు నాకిష్టం. వ్యర్ధలంపటంలో చిక్కుకుని జీవితం చాలించుకున్నాడు.
శ్రీలంక రేడియో మధ్యానం తెలుగు పాటల కార్యక్రమం పరమ ఘోరమ్తెన టెస్ట్.
DD తెలుగు వార్తల తరవాత - రాత్రుళ్ళు 7.15 నుంచి 9 వరకు Voice of America (Malasia) disturbance లోంచి శ్రీ లంక స్పష్టంగా వింటుంటాను. 9 నుంచి 9.30 వరకు టేప్ పెడతాను. ఆ తరవాత వివిధ భారతి (వారానికి నాలుగు రోజులు classical music హ్తేదరాబాద్ డిల్లీలో నుంచి)
డిల్లి నుంచి సంగిత త్రిమూర్తుల గురించిన కార్యక్రమం. ఆ మొన్న దిక్షితర్ కృతులు. యస్ సౌమ్య పాడింది. బాగా పాడింది. (అతి ప్రాచుర్యమున్న విని విని విన్న వాతాపి గణపతిం -లేదు).
కళ్యాణి రాగం, త్యాగరాజ కృతి - యే తావునరా నిలకడ నీకు - ఆలాపన చాలా బావుంటుంది.
సినినేపధ్యాగాయ ని జానకి కర్నాటక సంగీతం కాసేట్ కొన్నాను -వాతాపి గణపతిం, పరిపాలయమాం , యే తావునరా - చూసి, కాని యేమీ బాగా లేదు.
సంగిత కృతులలో కవిత్వత్వం అతి తక్కువ. భక్తి ప్రధానం. లేదూ, జావళిల్లంటీ వాటిల్లో మధుర భక్తి. యే భక్తిలేని నన్నంతగా కర్నాటకం వశపరుచుకుంది! సంగీతం!
కొన్ని రాగాలు చత్తవి. అలాంటివి పాడి వాయించి యిబ్బంది పెడుతుంటారు. carnatic composer పురందరదాస నాసిరకం.
మధ్యనాలు వివిధ భారతి బాగోక తెపూ టివి పెట్టుకుంటున్నాను.
తెలుగువాళ్ళు, పరికిణి చిర మానేశారు. Pant salvar kameez ల్లో చూడటం నాకు అసహ్యం.
యివాళ్ళ డిల్లి నుంచి త్రిమూర్తుల కార్యక్రమంలో త్యాగరాజ కృతులు. సుదారఘునాధన్. నగుమోముతో ప్రారంభించింది. బాగానే పాడింది. కరహరప్రియ, పక్కల నిలబడికి ఆలాపన నేనేప్పడూ వినలేదు. విస్తారంగా ఆలాపన పాడింది.
కోన్ని విషయాలు నాకు అర్ధం కావు. వుదాహరణకి - రెండు దాదాపు వొకే రకంగా రెండు మందులు షాపుల పక్కపక్కనే వుంటాయి. రేండిలోనూ వోకేరేటు. అంతా identical . ఐతే వొక షాపుకి విపరీతమ్తెన రిద్ది. రెండో షాపుకి వకళ్లూ అరా వెడుతుంటారు.
అనిల్ బిస్వాస్ వొక్కడు చాలు; పాత సిని సంగీతం అమూల్యాపూర్వనిధి - అనటానికి. పాకిస్తాన్ సినిమా పాటలూ బాగోలేదు. నూర్ జహ గోంతూ బాగోలేదు.
యీ సుదీర్ఘ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. యేమి చెయ్యటం లేదు. రోజంతా సంగీతం వినటం, వక గంట వార్తలు చూడటం, వక గంట Fashion TV చూడటం, అప్పడప్పడూ మీకో వుత్తరం రాయటం తప్ప, నేనేమి చెయ్యటం లేదు.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
18-6-04
రఘుగారికి నమస్తే,
యేడాది క్రితం వరకూ అన్ని సిజన్లలోనూ అన్ని వేళలా వొంట్లో టెంపరేచర్ నార్మల్ వుండేది. వక యేడాది నుంచి బయటి వుష్ణోగ్రత మిద ఆధారపడుతోంది వొంట్లో టెంపరేచర్. బయట ౩౦డిగ్రీల సెంటిగ్రేడ్ వుంటే వొంట్లో నార్మల్ గా వుంటుంది. ౩౦డిగ్రీల లకి తగ్గితే వొంట్లో సబ్ నార్మల్ వుంటుంది. 32 డిగ్రీల లుంటే 99వుంటుంది వొంట్లో. 36 డిగ్రీల వుంటే 100 వుంటుంది. 40డిగ్రీల వుంటే 101 వుంటుంది. (అదే Air coolar పెట్టుకుంటే. లేకపోతే యింకొంచెం పెరుగుతుంది). దేర్మోమీటర్ లో తెలుస్తూంది. discomfort యేమి వుండదు. డాక్టర్లందరూ యిదే వినటం అంటున్నారు! యింక, అమెరికా మా అమ్మాయికి రాసి చూడాలి. ఆమెది internal medicine.
యే భాష ఐనా, అది ప్రాచీనం ఐనంత మాత్రాన విలువ పెరగదు. పదాలు, పదాల కూర్పు, ధ్వని ముఖ్యం. జయదేవుని గితగోవిందమంత సరళంగా మధురంగా వుండాలి. నేను విన్న అన్ని భాషలలో కంటే అతి తియ్యగా సుస్వరంగా వుండే భాష, తెలుగు. వుదాహణకి - సిని నేపధ్యగాయని చిత్ర గొంతు, ఆమె పాడిన అన్ని భాషలలో కంటే తెలుగులో యెక్కువ లేతగా తియ్యగా వుంటుంది!
(ఖరహప్రియ రాగం నాకంత గా యిష్టంలేదు)
ఖరహరప్రియ ఆలాపన యిదే వినటం అన్నాను ఆ మొన్న. యివ్వాళ విన్నాను MLV. ఆలాపన సుదీర్ఘంగా అధ్బుతంగా వినిపించింది. Dreams Audio వాళ్ళ ML వసంత కుమారి Twin - cassettes, Revathi కొనండి. (యితివలది).
పద్మభూషణ్ వొచ్చింది. కాని రావాల్సినంత పేరు రాలేదనే నేను అనుకుంటాను. సినిమాలకు పాటలు పాడింది. తెలుగు సినిమాలకి కూడా వొకటి అరా పాడింది. వెనక విన్నాను. MLV కి అవసరాల కన్యాకుమారి వయొలిన్ వాయిస్తుంది. బాగా వాయిస్తుంది. ఆమెవి రెండు కాసెట్లు కూడా వచ్చాయి. (HMV cassettes పొట్టివి. అరగంట వుండవు. యిరవ్తే నిమిషాలే)
వీళ్ళూ వాళ్ళూ అని కాదు - వొక్కో కాసేట్ రికార్డింగ్ బాగోదు. స్పష్టంగా వినిపించదు. (అరుదుగా)
కర్నాటక కృతికర్తలలో మొదటి పేరుగా నిలిచే అనితరసాధ్య త్యాగరాజస్వామి వినమ్రంగా యెందరో మహానుభావులు అందరికి వందనముల ....అంటే అందరూ భక్తి ప్రపత్తులతో అదే పాడి వాయించి తమ తమ వందనములు సమర్పించుకోగా విన్నాను. తాదాత్మ్యంగా ,
వోకేవోక్క గితగోవిందం అష్టపదులతో అమరుడయ్యాడు; పద్మావతి చరనచారణ చక్రవర్తి, జయదేవుడు!
మీ వుత్తరం 11 న వొచ్చింది. సంగతులు తెలిశాయి.
వీణ అతి ప్రాచినం. వేదకాలం నుంచి వుంది. మృదంగం కూడా ప్రాచీనం. రెండూ అప్పట్లో దేశవ్యాప్తం.
మా తెలుగు తల్లికి మల్లెపూదండలా; నమస్తే క్తెరళి నటనగానకేళి నమస్తే క్తెరళి - బావుంటుంది.
తా వలచింది రంభ అన్నారు మన పెద్దలు. యిది ప్రపంచం అంతటికి వర్తిస్తుంది. ఐతే వలపు దరికి రాని వాళ్ళకు వర్తించదు.
తెలుగు వ్యాకరణం చూడటం నాకిప్పటికి రాదు. తికమక.
సందేహించకండి - ఫిలాసఫీకి ICPR ముద్రణ విలివ్తేందే. ఐతే distri bution Motilal Banarsidas కి యిచ్చేటట్లయితే.
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
