"పోన్లే నాకు అన్నం పెడతాంగానీ ఓమాట చెప్పు" అన్నాడు ఫో ర్ ట్వంటీవన్.
"ఏమిటి?"
" అమ్మాయిని ఏం చేశావు?"
"ఏం చేయలేదు" వస్తున్న కోపాన్ని ఆణుచుకుంటూ చెప్పాడు. పరుశురాం.
సింహాచలం అతని డొక్కలో పొడిచాడు.
"పని జరిగిపోయిందని కేసు పెడితే దానిబతుకు కొల్లేరౌతుందని పని జరగబోయానని కేసుపెట్టుంటుందీ! చెప్పు బాబూ! పీసు మిఠాయిలా వుందా? రసుగుల్లాలావుందా?" ఫోర్ ట్వాంటీవన్ పక్కకి ఒరిగి అన్నాడు.
"సిగ్గు పడకు. మేం కూడా చాలా రేపుల్లో పార్టిసిపేట్ చేశాం. చెసిందానికంటే చేసినోడు చెపితే వినడం సరదా కదా!"
"నాకు తెలీదు బేవర్స్ నా కొడుకుల్లారా" అరిచాడు పరుశురాం.
"కూతలు కూస్తే జాయింట్లు ఊడిపోతాయి. అన్నం కావాలా వద్దా?"
"కావాలి" అన్నాడు పరుశురాం.
"అయితే దాన్ని ఎలా చేస్తావో చెప్పు?"
"ఇంకా నాకు అలాంటి అనుభంలేదు. ఆడదాని గురించి ఇంకా తెలీదు?"
"సరిగ్గా చేసుండవు. అందుకే దానికి కోపమొచ్చి బొక్కలో తోయించింది" సింహాచలం వెటకారం చేశాడు.
"మీరంతా నన్నెందుకు పిచ్చివాడ్ని చేస్తున్నారు" ఆవేదనగా అడిగాడు పరుశురాం.
"నీ బుర్ర పనిచేయకుండా చేసి నిన్న వెర్రివెధవనిచేస్తే కేసు మేం గెలుస్తాం. నిన్ను కృష్ణజన్మస్థానానికి పంపించేయవచ్చు."
"మీ రేమన్నా చేసుకోండి. దాహంగా వుంది. ముందు కాసిని మంచి నీళ్ళు ఇవ్వండి. లేకపోతే ఒక్క దెబ్బ కొట్టినా నా ప్రాణం పోతుందీ" ధీనంగా అడిగాడు పరుశురాం.
పోలీసువిద్దరూ పగలబడినవ్వారు.
"బెదరిస్తున్నావా చస్తానని. లాకప్ డెత్తులకి మా స్టేషన్ నెంబర్ వన్. ఒక వేళ నువ్వు చస్తే చీకటిపడ్డాక ఊరి పొలిమేరల్లో పారేసి ఎవరో నిన్ను కొట్టి చంపిపడేసారని మర్డర్ కేసు రిజిస్టర్ చేసుకుంటాం. ఓయమ్మో! మా తెలివి ముందు నీ తెలివేం పనికొస్తుందమ్మా" సింహాచలం ఎద్దేవా చేశాడు.
"నేనిప్పుడు దేనికయినా సిద్ధంగా వున్నాను. నాకు తాగడానికి నీళ్ళు, తింటానికి ఏదన్నా పెడితే తప్పా మళ్ళీ మీ దెబ్బలకి ఈ శరీరం తట్టుకోదు" పరుశురాం ప్రాధేయపడుతూ అన్నాడు.
"సింహాచలం ఫోర్ ట్వంటీవన్ కి సైగ చేశాడు. అతను వెళ్ళి ఓ ప్లేటుపైన చిన్న నా ప్ కిన్ కప్పి తీసుకొచ్చాడు.
"తిను" అని సెల్లోకి తోశాడు.
పరుశురాం ఆత్రంగా నాప్ కిన్. తీశాడు. అంతే! నార్ఘాంతపోయాడు.
ప్లేటులో బ్రాసరీ వుంది.
"ఇదేమిటి" అన్నాడు ఉద్రేకాన్ని అణచుకుంటూ.
"ఆకలిన్నావని తీసుకొచ్చాడు మా ఫోర్ ట్వంటీవన్ .నీకిష్టమైంది. చికన్ ప్ర్రైలా వుంటుంది తిను."
" స్కౌండ్రల్స్" అరిచాడు పరుశురాం.
సింహాచలం గుర్రుగా చూశాడు.
"చింత చచ్చినా పులుపు చావలేదట. ఈ నాకొడుకు మూసలెక్కి స్తే గానీతిక్క కుదరదు. పదరా ఫర్ ట్వంటీవన్" అని తాళం తీసి తలుపు తెరుస్తున్నాడు సింహాచలం.
పరుశురాంకి అర్థం అయింది తిరిగి దెబ్బలు తప్పవని.
అయితే ఆ పరిస్థితిలో ఆతను
"చింతచచ్చినా పులుపు చావలేదట. ఈ నాకొడుకుని మూసలెక్కిస్తే గానీ తిక్క కుదరదు. పదరా ఫోర్ ట్వంటీవన్" అని తాళం తీసి తలుపు తెరుస్తున్నాడు సింహాచలం.
పరుశురాంకి అర్థం అయింది తిరిగి దెబ్బలు తప్పవని.
అయితే ఆపరిస్థితులో అతను వాళ్ళని ప్రతిఘటించడానికి నిశ్చయించకున్నాడు.
చట్టాన్ని, నిరపరాధుల్ని రక్షించవలసిన పోలీసులే భక్షకులై తన ప్రాణం తీస్తున్నారు. ఇంత జరిగాక ఉపేక్షించి లాభంలేదు. దేనికయినా సిద్దపడాలి.
స్టేషన్లో ఆఫీసర్లు లేరు. ఆవేశంతో, ఉద్రేకంతో శరీరంలోకి శక్తిని కూడదీసుకుంటున్నాడు పరుశురాం. తను కరాటే ఫైటర్ నని, బ్లా క్ బెల్ట్ అని ఆ పోలీసులకి తెలీదని పరుశురాంకి తెలుసు.
ప్రతిరోజూ వ్యాయామం చేసిన శరీరం కనుకనే పోలీసులు దెబ్బలని పట్టుకోగలిగింది.
అప్పటివరకూ తనని ఆవహించిన నీరసాన్ని, దప్పికని, ఆకలిని మరిచిపోయాడు. ఒకసారి శరీరాన్ని కదిలించి చూశాడు. తన శరీరం తిరుగుబాటు చేయడానికి సహకరిస్తోందని నమ్మకం కలగగానే మెరుపులా పైకి ఎగిరాడు పరుశురాం.
ఒక కాలుతో ఫోర్ ట్వంటీవన్ నడుంపైన, రెండో కాలుతో సింహాచలం కాళ్ళపైనా కొట్టాడు పరుశురాం.
"అమ్మో" అని అరుస్తూ కిందపడిపోయారు ఇద్దరు పోలీసులు.
"అమ్మో నాడుం విరిగిపోయింది."
"నా కాలు బాబోయ్....."
పరుశురాం కోపోద్రికుడై చూశాడు వాళ్ళకేసి
"ఒరే నాకొడకల్లారా! నేనిప్పుడు పారిపోతే మీరేం పీకలేరు నన్ను. అయినా నేను జారిపోను. ఈ చేతుల్తో నొక్కితే మీ బుర్రలు కొబ్బరి కాయల్లా పగిలిపోతాయి." అని స్టేషన్లో కూజాని తీసుకుని గడగడా నీళ్ళు తాగాడు పరుశురాం.
సెల్ లోకి నడిచి.....
"పిచ్చి వేషాలైస్తే అడుగు బయట పెట్టాక మీ అంతు చూస్తాను. తాళం వేసుకోండి. ఇన్ స్పెక్టర్ తో ఈ గోడవ గురించి చెబితే మీ పీకలు నొక్కేస్తాను. నాకు వెంటనే భోజనం ఏర్పాటు చేయండి" కటువుగా అన్నాడు పరుశురాం.
తమచేత అన్ని దెబ్బలు తిన్న మనిషి రెండు మూడు నెలలవరకూ తిరిగి మనిషి కాలేడని వాళ్ళకి తెలుసు.
కానీ అలాంటివాడు ఒకే దెబ్బతో ఇద్దర్ని నేల కరిపించాడు.
నిజంగా వాడు అడుగు బయట పెడితే కొబ్బరి చిప్పల్లా తమ బుర్ర పగులగొట్టిస్తాడని వణికిపోయారు. సింహాచలం, పోర్ ట్వంటీ వన్.
