Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 30

 

    విక్టర్ గభాలున వంగి కర్ర ఎత్తి పట్టుకున్నాడు. అధికారానికి హోదాకు చిహ్నమైన చేతికర్ర మొదటిసారిగా సాంబశివరావు చేతుల్లో నుంచి క్రింద పడింది. ఉక్కులాంటి మనిషి దూది పింజలా అయిపోయాడు. ఆ స్థితిలో వున్న తండ్రిని మ=చూస్తుంటే సాగర్ గుండెలు జరిపోయినాయ్. తన తండ్రిని ఎప్పుడూ అలా చూడలేదు. కవ్విస్తే త్రాచుపాములా బుసలు కొట్టే మనిషి వానపాములా అయిపోయాడు. అతనికి లోపల ఏదో అయిపోతుంది. తండ్రిని గురించి ఆలోచిస్తున్న సాగర్ ముఖం వేల వెల పోసాగింది. తను పొరపాటు చేశాడేమో? డాక్టర్ ను గురించి అలా మాట్లాడ వలసినది కాదేమో? సాగర్ తండ్రి కేసి చూడలేక ఎక్కడో చూడసాగాడు. అతని ముఖం పాలిపోయింది.
    ఆ స్టితిలో కొడుకుని చూస్తున్న తండ్రికి తను ఊహిస్తున్నది నిజమే నని తెలిసింది. వీడి చూపులు వీడు? నిజంగా ఉన్మాద స్థితిలోనే వున్నట్టు  వున్నాడు. ఇంత కాలంగా వాడి సంగతి పట్టించుకోడం తనదే తప్పు. ఆ మాధవి చుట్టూ తిరుగుతున్నప్పుడు తను చూసీ చూడనట్టు ఊరుకున్నాడు. మతి భ్రమించిన పిల్లను ఏదో ఆదుకుంటున్నాడని వూరుకున్నాడు. సైకాలజీ చదువుతున్నాడు, ఆ పిల్లకేదో తన తెలివితేటలూ ఉపయోగించి దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నడనుకొన్నాడు. కాని వాడే దారి తప్పినట్టు ఇంతకాలం గుర్తించలేకపోయాడు. ఏ దురభ్యాసాలు లేకుండా పెరిగినవాడు, తొందరపాటు ఎరుగని వాడు, ఆచితూచి అలోచించి మాట్లాడే మస్తత్వం ఉన్నవాడు, మంచి మర్యాద చిన్నా పెద్దా తారతమ్యం ఎలిసినవాడు. ఈరోజు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటి? ఆ పిల్ల ఉన్మాదాన్ని తొలగించడానికి ప్రయత్నించి వీడు మతి చెడగోట్టుకొన్నాడు. తప్పంతా తనదే! డాక్టర్ మూర్తి ఏనాడో తనను హెచ్చరించాడు. సాగర్ ను మాధవికి దూరంగా ఉంచమని! కాని తను అంతగా పట్టించుకోలేదు. సరిగ్గా డాక్టర్ మూర్తి చెప్పినదే నిజమవుతున్నది. పైగా వీడు ఆ డాక్టర్ను ఫ్రాడ్. మోసం అంటున్నాడు. ఓ మైగాడ్! వాట్ మై టూ డూ? - సాంబశివరావు తల పగిలిపోతున్నట్టుగా ఉన్నది. రెండు చేతులతో తల పట్టుకొని వెనక్కు తిరిగి హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడ్డాడు. సాగర్ ఖంగారుగా తండ్రి వెనకే వచ్చి పక్కన కూర్చున్నాడు. తండ్రి నొసటి మీద చేయి ఉంచి "నాన్నా! ఏమైంది!" ఆదుర్దాగా అడిగాడు.
    "సార్ ! డాక్టర్ గారికి ఫోన్ చేయమంటారా?" విక్టర్ మోకాళ్ళ మీద వంగి సాంబశివరావు కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు.
    "వద్దు" అన్నట్టు సాంబశివరావు విక్టర్ సంజ్ఞా చేశాడు.
    "నాన్నా ! ఎలా వుంది?" సాగర్ కంఠం వణికింది. సాంబశివరావు కొడుకుని ఆప్యాయంగా చూసుకున్నాడు. కొడుకు తల నిమురుతూ "నాకేమీ కాలేదు రా! ఐ యామ్ అల్ రైట్!' అన్నాడు తండ్రి ప్రవర్తనలో వచ్చిన మార్పు సాగర్ కు ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు వూహ తెల్సిన తర్వాత తండ్రి తననేప్పుడూ దగ్గరకు తీసి మమతా మమకారాలను ప్రదర్శించలేదు. గోముగా తల నిమురడమూ, ముద్దులు పెట్టడమూ అయన ఎరుగడు. అలాంటిది ఇప్పుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. నిజంగా తండ్రికి ఏదో అయిపోతున్నది? మనిషికి బ్రతుకు తమన్న నమ్మకం సడలిపోయిన తర్వాత తనమీద తనకు విశ్వాసం పోయిన తర్వాత అన్నీ వదులు కోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ప్రవర్తన సరిగ్గా అలానే వున్నది. హార్ట్ పెయిన్ ఏమన్నా వచ్చిందా అది దిగమింగి ఇలా కుమిలి పోతున్నాడా? మరి డాక్టర్ వద్దు అంటున్నాడెం ?
    "నాన్నా! డాక్టర్ గార్ని పిలుస్తాను"
    "ఏ డాక్టర్ను?"
    "డాక్టర్ మూర్తిని!"
    "అతడు ఫ్రాడ్! మోసం అన్నావుగా?"
    పోలీసు లాఠీ కణతకు తగిలినట్టయింది. సాగర్ నివ్వెరపోయి చూశాడు.
    సాగర్ తండ్రిని అనుమానంగా చూశాడు. ఇవన్నీ పోలీసు వాడి ఎట్టుగడలా? ఇంతవరకూ ఈయన అడినదంతా నాటకమేనా? సాగర్ తండ్రిని చూస్తుంటే కడుపులో దేవినట్టయి పోయింది. ఇంత చవకబారు ట్రిక్స్ తనమీద ప్రయోగిస్తున్న వాడిని తను తండ్రిగా గౌరవించలేడు. ఇదంతా ఆ డాక్టర్ మూర్తే ఆడిస్తున్న నాటకం! కూతురు సుజాతను తనకు అంటగట్టాలన్నా కోరికే డాక్టర్ ను ఇంతటి హీనమైన ప్రవర్తనకు దిగజార్చింది. అంతా పధకం ప్రకారం చేస్తున్నాడు. వై=తన ఎత్తుగడల్లో తండ్రిని ఒక పావులా వుపయోగించుకొంటున్నాడు. అందుకే అంటారు పోలీసు వాడికి కండబలం తప్ప బుద్ది బలం వుండదని! తను ఇంతవరకూ అనుమానించింది నిజమే అయింది. ముందుగా మాధవిని పిచ్చిదాన్ని గా నిరూపించడం - రెండు తన తల్లిని కేన్సర్ అని చెప్పి పెళ్ళికి తొందర పెట్టించడం - మూడు తన తండ్రి సాంబశివరావును నమ్మించి తన మీద ప్రయోగించడం - ఇవన్నీ డాక్టర్ ఒక పధకం ప్రకారం నడిపిస్తున్నాడు. అంతకుముందు తండ్రి మాధవి ఇష్టపడే వాడు. తల్లి కూడా ఇష్టపడేది. కాని సుజాతను తల్లి మీద ప్రయోగించాడు. ఆమె అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకొని సుజాత బులిబులి ఏడ్పులు ఏడుస్తూ తల్లి చుట్టూ తిరుగుతుంటే తండ్రి కూడా సుజాత మీద అభిమానాన్ని పెంచుకొన్నాడు.
    "సాగర్ బాబూ! డాక్టర్ మూర్తి గారికి ఫోన్ చెయ్యండి!' అర్దర్లీ విక్టర్ సాంబశివరావు బూట్ లెస్ వదులు చేస్తూ సాగర్ తో అన్నాడు.
    "ఆ డాక్టర్ వట్టి మోసగాడంటున్నాడు వాడు అతడెందుకూ ?" సాంబశివరావు విక్టర్ ని వారించాడు.
    'అవును! ఆ డాక్టర్ మూర్తి ఒట్టి హంబక్! మోసగాడు! దగా కోరు!' సాగర్ కు వళ్ళు మండిపోయింది. బిగ్గరగా అరిచాడు.
    "అదే నేనూ అంటున్నది సాగర్!' కొడుకును అనునయిస్తున్నట్టుగా అన్నాడు సాంబశివరావు. ఆ పరిస్థితిలో సాగర్ కు ఎదురు మాట్లాడటం గానీ, అతని నమ్మకాలను ఖండించడం గానీ చేస్తే సాగర్ మరీ ఉన్మాదస్థితిలో పడిపోతాడేమోనన్న భయంతో అన్నాడు సాంబశివరావు. తండ్రి వాలకం సాగర్ కు ఇంకా కలవరం  కలిగించింది . తననేదో అర్భాకుడిని చేసి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నీచమైన పోలీసు వాడి ఎత్తుగడలు! ఆలోచించిన కొద్ది తండ్రి మీద కసీ న్యూనతా భావమూ సాగర్ లో పెరగసాగాయి. తనను వెర్రి వాడ్ని చేసి తండ్రి అడిస్తున్నాడు. తండ్రీ- కొడుకుల మధ్య సంబంధాలను కూడా తెంచుకొని నీచాతి నీచమైన పద్ధతులకు పాల్పడుతున్నాడు. ఇహ సహించటం తన వల్ల కాదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS