Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 28

    జులపాల జుట్టుతో శాలువా కప్పుకుని ఉన్నాయన తల బయటికిపెట్టి.

    "ఎవరు కావాలి   

    కావాలి ఎవరు

    ఎవరో ఒకరంటావా

    ఆ ఎవరు ఎవరో చెప్పాలి"అన్నాడు.

    నేను ఠారెత్తిపోయాను. గబగబ పరుగెత్తి ప్రక్కకి వెళ్ళి ఇంటి నెంబరు చూశాను. చంచల్రావు ఇచ్చిన నెంబరు అదే.

    "ఏమిటో కంగారు

    చెప్పవా నా బంగారు"

    గబగబ నా వెనకాలే అతను కూడా వచ్చి అన్నాడు.

    "పిచ్చుమణిగారి ఇల్లు ఇదేనండీ?" కాస్త వణుకుతూ అడిగాను.

    "నా కవిత్వం మణీ

    కవుల్లో నేను మణి

    ఇంతకీ ఏమిటి నీ పని

    నా పేరే పిచ్చుమణి"

    అన్నాడు పిచ్చుమణి వచనకవిత్వం చదివే స్టయిల్లో.

    "మీతో పని వుండి...నసిగాను.

    "లోపలికి రండి... రండి రండి లోపలికి"

                                            

    ఇద్దరం వరండాలో కుర్చీల్లో కూర్చున్నాం.

    "ఏం పని... నాపేరే పిచ్చుమణి. ఏం పని నాపేరే పిచ్చుమణి" అన్నాడు పిచ్చుమణి శాలువ సవరించుకుంటూ.

    నేను చంచల్రావు ఆయనకు రాసిన ఉత్తరం ఇచ్చాను.

    పిచ్చుమణి ఉత్తరం అంతా చదివాడు.

    "ఉత్తరం చూశారు కదండీ... మరీ మీ సహాయం..." ముందుకు వంగుతూ కుతూహలంగా అడిగాను.

    "ఉండుండు... చదవనీ మరోసారి ఉత్తరం. ఉండుండు చదవనీ మరోసారి ఉత్తరం."

    "ఎందుకండీ మీరు ఒక్కో వాక్యాన్నీ రెండ్రెండుసార్లు అంటారు?"

    "వచన కవులు అంతే నాయనా. ఒక్కో వాక్యాన్నీ రెండు రెండుసార్లు అంటారు. కవి సమ్మేళనాల్లో పాల్గొనీ పాల్గొనీ అలా అలవాటై పోతుంది నాయన."

    అలా అని నోటిమీద చెయ్యిపెట్టి కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసి గబుక్కున క్రిందికి వంగి ఏదో తీసి ప్రక్కకి తిరిగి నోట్లో పెట్టుకుని "హిహిహి"అన్నాడు.

    బావుండదని మర్యాదకి నేనూ హిహిహి అన్నాను.

    చంచల్రావు రాసిన ఉత్తరం మళ్ళీ చదివి హఠాత్తుగా క్రిందపడిపోయాడు పిచ్చుమణి.

    నాకు కంగారుపుట్టి క్రిందికి వంగి చూసి తేలికగా ఊపిరి పీల్చుకున్నాను.

    పిచ్చుమణి గుక్కపట్టి నవ్వుకున్నాడు. అలా ఒక రెండు నిముషాలపాటు నవ్వి గుండెలమీద చెయ్యివేసుకుని "హబ్బ...హమ్మ... భలే జోకేశావయ్యా. కవిత్వం రాయడం ఒకరు చెప్పాలయ్యా? తోచింది రాసెయ్యడమే"

    "ఏదో మీకు అనుభవం ఉంది కదా? కాస్త మెలుకువలు నేర్పుతారనీ"

    "అలాగే చెప్తా... అలాగే చెప్తా... హహహ..." అని గబుక్కున క్రిందికి వంగి ఏదో తీసి నోట్లో పెట్టుకున్నాడు.

    "ఊ...ఇప్పుడు చెప్పు కవిత్వం రాయడం నేర్పాలంటావ్?"

    "అవునండీ... అవునవునండీ"

    "చూశావా చూశావా? నా ఎదురుగా కూర్చుంటే నీకూ కవిత్వం ధోరణి వచ్చేస్తుంది... హాహాహా..."

    "హిహిహి..." నాకూ కవిత్వం వస్తుందన్న సంతోషంతో నవ్వాను.
                                      
   

    "దీని సిగ తరగ..." క్రిందికి వంగి కుర్చీ క్రిందనుండి ఏదో తీసి నోట్లో పెట్టుకున్నాడు పిచ్చుమణి.

    ఏమిటబ్బా ఇతను ఇందకట్నుండీ క్రింద నుండి ఏవో ఏరుకుని నోట్లో పెట్టుకుంటున్నాడు. బఠానీలా, శనగలా?

    "ఏమిటండీ ఇందకట్నుండీ క్రిందనుండి ఏదో తీసి నోట్లో పెట్టుకుంటున్నారు? బఠాణిలా?" కుతూహలం పట్టలేక అడిగాను. బఠాణిలు క్రింద పడిపోతుంటే దీన్నే క్రిందనుండి తీసి పెట్టుకుంటున్నా" అని ఆ కట్టుడు పన్నుని యథాస్థానంలో పెట్టేశాడు.

    "ఇంతకీ వచన కవిత్వం ఎలా రాయాలో చెప్పాలంటావ్?" ముందు నీ మనసుకు తట్టిన భావం వచనంలో కాగితంమీద రాసేస్కో. ఆ వచనంలోని ఒక్కో వాక్యాన్నీ ముక్కల క్రింద విరిచేసి ఒకదాని క్రింద ఒకటి పరిస్తే అదే వచన కవిత్వం"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS