తిరుపతి
5-04-04
రఘుగారికి నమస్తే,
మీ వుత్తరం అందింది.
యూరాలజిస్ట్ బయప్సి hard prostate కి సంబంధించి అంతా బావుంది. SIMS కి పంపించి చేయించారు. నాయమయినట్లుగానే వుంది.
నిరుటి వేసవిలోని mild typhoid symptoms, నోరుచేదు 100 డిగ్రిలలోపు జ్వరం యింకా అలాగే వున్నాయి- అప్పడే negative report వచ్చినా. హొమియోపతిలోని మందులన్నీ ఐపోయాయి! యింక ఆయుర్వేదం చూడాలను కుంటున్నాను. యెందుక్తెనా మంచిదని రీసెంట్ గా మళ్ళి టెస్ట్ చెయించాను. negative report వొచ్చింది.
కొత్తగా B.P. మొదల్తెంది.
కోయిల గొంతు జోలపాటంత మధురం. సడిచేయ్యకో గాలి, జోలాలి జో అచ్యుతానంద లాంటి వకటి అరా తప్ప తెలుగు సినిమాల్లో మంచి జోలపాటలు లేనట్లే. హిందిలో చాలా మంచివి చాలా జోలపాటలున్నాయి.
వుగాదినాడు Festival of Hyderabad సప్తగిరి TV లో వొచ్చింది. భిమ్ సెమ్ జోషి కంటే బాలమురళికృష్ణ చాలా బాగా పాడాడు. అధ్బుతం. గొంతు కూడా బావుంది.
భారతదేశంలో లేచిపోయిన తోలికన్య రుక్మిణి అనుకుంటాను.
పిల్లిగడ్డం పెట్టుకున్న ముసలి కమల్ హసన్ చూడటానికి అసహ్యం. ప్రతివాళ్ళూ వేళమించిపోయాక యింకా హీరోలుగా పెనుగులాడుతుంటారు! హీరోలుగా తమ టైం ఐపోయిందని గ్రహించరెందుకనో! అవిజ్ఞాత.
హరికథల వాచాలతలా డిల్లి రేడియోలో రోజూ స్పాట్ ల్తేట్ లో వూకదంపుడు, వూదర. కొన్నాళ్ళూ విని, మానేశాను.
యం యస్ సుబ్బలక్ష్మి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, బాలమురళీకృష్ణ తత్వాలు; బావుంటాయి.
సంస్కృత తెలుగు కావ్యాలలోని విప్రలంబ శృంగారానికి యేమి తీసిపోదు, మధుర భక్తిలోని శృంగారం.
సరస్వతిదేవి; దేశంలో (సినిమా తొలిరోజుల్లోనే) తొలి మహిళా సంగీత దర్శకి .
మీ నలుగురికి శుభాకాంక్షలు
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
24-4-04
రఘుగారికి నమస్తే,
మీ వుత్తరం అందింది. మేలో వొస్తున్నందుకు, కేసెట్లు తెస్తున్నందుకూ సంతోషం.
వార్తల విషయంలో యెక్కువ క్లుప్తత,స్పష్టత వున్నది DD Hyderabad channel (సప్తగిరి). మంచి సాహిత్యం స్తలకాలన్నాదిగమిస్తుంది. రాసియన్ విషయం దాటిపోయినా నిలిచి వుండాలి. వుదాహరణకి- కన్యాశుల్కం. కన్యాశుల్కం లేకపోయినా పుస్తాకం నిలిచింది. అసలుకి, ఆ కాలంలోనే వుత్తరంధ్రలో తప్ప మరెక్కడా లేదు, తెలుగుదేశంలో.
100 లోపు జ్వరం నోరు చెదులకు ఆయుర్వేదం ప్రారంభించి చూడాలను కుంటున్నాను. ఆయుర్వేద డాక్టర్ mild typhoid కాదు, అప్పటిది para typhoid. యిప్పుడు typhoid కి వీటికి సంబంధం లేదు - అన్నాడు.
కల్పనాలాజ్ మీ సినిమాలు బావుంటాయి.
గోరింకలకి చిలకలకి సంబంధం లేదట! చికల్లో ఆడచిలకలు మగచిలకలు వుంటాయట. యెక్కడో యెప్పడో చదివాను. ప్రపంచ వెండితెరకి అత్యంత సౌందర్యం; మధుబాల.
పాకిస్తాన్ మిద క్రికెట్ లో భారత్ గెలవటం సంతోషంగా అనిపించింది. పాకిస్తాన్ మిద భరత్ యెందులో యెప్పుడు గెలిచినా నాకు సంతోషంగా అనిపిస్తుంది.
Fashion TVModels ఆకృతిలా; యీ పూట నా మనసెందుకో అధ్బుతం. యేని రాయలనిపించటం లేదు. ముగిస్తాను.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్.
తిరుపతి
5-5-04
రఘుగారికి నమస్తే,
సామరాగంలా; మనసిపూట ప్రశాంతంగా మందగమనంగా వుంది.
వెన్నెల కొలనులో విరిసిన కలువ అన్నాడు కృష్టశాస్త్రి. చకోరంలా ప్రకృతిలోనే వున్నాయేనో ప్రకృతి శోభననుభావించెవి.
మనకి తెలియక ఆడవి కాచిన వెన్నెల - అంటాం. ప్రకృతి అన్ని రకాలగానూ స్వయం సిద్ద. ప్రకృతి కె అనుభవ్తెకవేద్యం. మనం వుంటే యెంత వుండక పోతే యెంత! మనషుల్లో ప్రకృతి ని తాదాత్మ్యంగా అనుభవించే వాళ్ళుంటారనుకోండి! కృష్ణశాస్త్రి ఆకులో ఆకున్తె కంటే మనిషికి ప్రకృతి తాదాత్మ్యపు రూపం మరింకే ముంటుంది! సముద్రానికి చంద్రుడితో వున్నా అనుభూతి జగద్వితమే కదండి!
మూడు పట్టిలది మన జాతియజేండా కనక గౌరవిస్తాను గాని పాకిస్తాన్ జెండా యీస్ధటిక్ గా వుంటుంది.
హిందినటి శిల్పాశేట్టిది most appealing ఆకృతి (హీరోయిన్లు సినిమాల్లో చేరిన మొదట్లో యెక్కువ బావుంటారు).
కన్నడ ఆడవాళ్ళలో కూడా బావున్నవాళ్ళుంటారు! వుదాహరణకి -సౌందర్య.
చ్తెనా ఆడవాళ్ళకి స్తనసంపద అత్యధికం.
కొత్తగా వొక అరడజను వీణ కాసెట్లు కొన్నాను. యీమని శంకర శాస్త్రివి గాయత్రిగారివి. రెండు కాసెట్లు నాకు నచ్చాలేదు. వకటి, westernpopular pop tunes ని అనుసరించి. రెండోది గజల్స్ ని అనుసరించి. గులాం అలీ గజల్స్. నాకు గజల్స్ నచ్చ్కావు కదా! ఆ సాహిత్యం తెలిసిన వాళ్ళకి, ఆ పదాలూ బాణీ వీణ మిద పలికించటం బాగా నచ్చావోచ్చు . మాటల్ని పలికించటం ఆమె అసాధారణ ప్రతిభ కదా! రెంటిలోనూ వీణ సవ్వడే మారిపోయింది. గాయత్రి గారేనా! గాయత్రిగారి విణేనా - అని యిష్ట ఆశ్చత్యం కలిగింది.
పడమటి దేశాల్లో యిటివాలి కాలంలో , సిగరెట్లు కాల్చేవాళ్ళు , మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ యెక్కువ -యెందుకో.
యింగ్లిషు భాష గోప్పదేగాని కొన్ని అర్ధంపర్ధం లేకండా వుంటాయి. స్పెల్లింగ్ కి వుచ్చారణకి సంబంధం వుండకపోవొచ్చు. రెండు విభిన్న స్పెల్లింగులకు వొకే వుచ్చారణ వుండొచ్చు. కొన్ని అక్షరాలూ అమాంతం మూగనోము పట్టేస్తాయి. నియమనిబంధనలు వుండవు. వుదాహరణకి యివి కొన్ని మాత్రమే.
మీ నలుగురికి శుభాకాంక్షలు.
-వడ్డెర చండీదాస్
