Previous Page Next Page 
ప్రేమతో ....వడ్డెర చండీదాస్ పేజి 27

                                                                                                 
                                                                                                               తిరుపతి
                                                                                                             22-1-04
    రఘుగారికి నమస్తే,
    కొరియర్ కదా మరసతి రోజుకి చేరాయి కేసేట్స్. రెండూ విన్నాను. రెంటిలో 2+1 మూడు వున్నాయి. ఆ రాగాలలో చాలా వరకు బాలమురళికృష్ణ,  కొన్ని యం.యస్.సుబ్బలక్ష్మి విన్నాను. యం.యల్. వసంతకుమారి పాడిందో లేదో తెలియదు.
    వెనకటి బాలమురళీకృష్ణ  గొంతూ పాడటం అధ్బుతం. అనితర  సాధ్యం. మంగళం విడిగా తెలుగులో పాడతాను. (యం.యస్.సుబ్బలక్ష్మి  హిందిలో మిరాబాయో, తులసిదాసో యెవరిదో పాడుతుంది) వక మంగళం పాతికేళ్ళయినా  యిప్పటికి  చెవుల్లో  వినిపిస్తుంటుంది.
    క్షిరాబి కన్యకకు నీరాజనం, జక్కువ కుచంబులకు నీరాజనం .... అంటూ అధ్బుతంగా అనితరసాధ్యంగా  పాడాడు (అన్నమాచార్యుని కురంజి) సొంత కృతులు బావుండవు, సాధారణంగా.
    ఫోను చేసి; మీరు పాడిన వెనకటి వాటికోసం అసంఖ్యాకంగా నిరీక్షిస్తున్నారు. కేసేట్స్ గా  రిలీజ్ చెయ్యండి ప్లీజ్ - అని చెప్పండి.
    సంగీతం వాళ్ళకు రాస్తున్నాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
    PS: కవరు మిద GLASS WITH CARE అని రాయాలి. యే రాగం దొరికితే  లిస్టులో ఆ రాగం పక్కన వాళ్ళ పేరు B అనో S అనో V అనో రాసుకోండి. -డ్లూప్లికేషన్ లేకండా.

                                                                                                              -వడ్డెర చండీదాస్.
              
    
                                                                                                                        తిరుపతి
                                                                                                                        4-2-04   
    రఘుగారికి నమస్తే,
    రాయటం మర్చిపోయాను. cassette cases  కొంచెం చిట్లాయి. టర్కీటవల్ ముక్కగాని మరేదన్నా గాని కాసెట్స్ కి చుట్టాలి.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
    ps: సంగీతం నుంచి జావాబు వొచ్చింది. We will  consider your request - అని.

                                                                                                       -వడ్డెర చండీదాస్.

                                                                                                           తిరుపతి
                                                                                                        15-2-04
    రఘుగారికి నమస్తే,
    తన ప్రియ అర్ధాంగి  మరణిస్తే స్మృతి చిహ్నంగా చక్రవర్తి  షాజహాన్ తాజ్ మహల్  కట్టించాడు. షాజహాన్ కొడుకు  రాజ్యదికారాన్ని  గుంజుకుని తండ్రిని చెరసాలలో పెట్టించాడు. అతని కరుణకృత్యం; చేరసాలలోంచి తాజీ మహల్  కనిపించేలాగా పెట్టించాడు. షాజహాన్ శేష జీవితం  చేరసాలలోంచి  తాజ్ మహల్ చూస్తూ గడిపాడు.
    పొద్దుట. 8.30 నుంచి చెన్త్నే తిరువనందపురం హ్తేదరాబాద్ లలో  కర్నాటక సంగీతం  వింటుంటాను.
    చెన్త్నే హ్తేదరాబాద్ లలో ఏది కావాలంటే అడిగాని; లేదూ కొంచెం adjust  చేసుకుంటే  యేకకాలంలో  తమాషాగా రెండూ వినొచ్చు! అవి రెండూ పక్కపక్కనే వుంటాయి.
    అది నుంచి యిప్పటి వరకూ వుర్దూతో నిండిపోతే సినిమాలను హిందూస్తాని అనికాక హిందీ అని యెందుకు అంటారో తెలియదు.
    లాహొర్ ప్రాంతం; వెనకటి కాలంలోని చాలా రంగాలలోని గొప్ప ప్రముఖులకు స్వస్థలం.
    (మీ వుత్తరం అందింది. సంగతులు తెలిసాయి).
    ఆ మొన్న 75 యేట  సూరయ్య   కన్ను మూసింది.  అదే రోజు వివిధ భారతి  మంచి శ్రద్దాంజలి కార్యక్రమం నిర్వహించింది.  ఆరోజున ఆ మరసతి రోజున.
    ఆమె బాలకళాకారిణిగా  ప్రారంభం. మధుర విశిష్ట గళం. మంచి నటికూడా. సుదీర్ఘజీవితం, భగ్నప్రేమికురాలిగా గడిపింది.
    సూరయ్య నాకు యిష్టం.  చాలా చాలా యిష్టం. గొంతులో తేనె కళ్ళలో మెరుపు మర్చిపోలేను.
    జాపనియుల్లాకాక; చ్తేనియుల పాత సంప్రదాయాన్ని  (వివాహ వ్యవస్ధ మాత్రం పటిష్టంగానే వుంది) సడలించారు. చేయినా ఆడవాళ్ళ బూరి ఘనం లేంజరి ప్రదర్శనలోచ్చాయి (Lingerie).
    బాలమురళికృష్ణ - నవనవసుందర విలసిత శశిముఖ - తిల్లానకు దీటుగా నాట్యం చెయ్యగలిగితే  గొప్ప ప్రావిణ్యం అనుకొవొచ్చు.
    యం.యస్. సుబ్బలక్ష్మికి భారతరత్న యిచ్చినప్పుడు  బాలమురళికృష్ణ  కూడా  యివోచ్చు.
    నాలాగా కాక, మా అమ్మాయిలాగా మీరు సంగీతం వింటూ చదువుకోగలరు. మీరు మా అమ్మాయి కంటే పెద్దో చిన్నో తెలియదు. ఆమెకి నలభయ్యేళ్ళు. వాళ్ళిప్పడు  న్యూయార్క్ లో లేరు.  కేంటకిలో వుంటున్నారు. తిరుక తక్కువ ఆదాయం యెక్కువ. రెండోకారు Lexus కొన్నారట.  హొమ్ దియేటర్ టైప్ టివి కొన్నారట. అతను నెఫ్రాలజీ. ఆమె యింటర్నల్ మెడిసిన్. మా మనమరాలు పెద్దద్తేంది. యిక్కడ్తెతే పెద్ద క్రతువు వుంటుంది.
    యీ మధ్య అర్డానుస్వారం  వాడటం  తగ్గింది యెందుకో.  వుదాహరణకి - మనవరాలు  అని రాయటానికి బదులు మనమరాలు అని రాశాను.
    మీ నలుగురికి శుభాకాంక్షలు
                                                                                                          -వడ్డెర చండీదాస్.

                                                                                                              తిరుపతి
                                                                                                            20-03-04
    రఘుగారికి నమస్తే,
    ఆ మొన్న హ్తేదరాబాద్ రేడియోలో  బి.వి. మోహనకృష్ణ  గాత్రం విన్నాను. పాడటం యెలావున్నా, గొంతు బాలమురళీకృష్ణ  గొంతును  గుర్తుకి  తెచ్చింది.
    Public Schools అంటే సామాన్య ప్రజల పాఠశాలలు  - అని. వెనక రాజరికాలలో  రాజవంశారికాలలో  రాజవంశాల వారి కోసం కాని పాఠశాలలు అని అర్ధం. Public  అంటే ప్రజాబహుళ్యం.  యిప్పుడు రాజరికాలు లేని రోజుల్లో  Public Schools ఆర్దికంగా వున్నతవర్గాల Privileged వాళ్ళ కోసం యింగ్లిషు మీడియం special schools. అలాంటప్పుడు  వాటివి pudlic schools   అనతమేమిటి!
    అందాలన్నీ స్త్రీలో కుప్పపడ్డాయి. మగకి యేమి  లేవు. ప్రకృతిలో  అందమంతా  మగదే. వుదాహరణకి కోడిపుంజు, మగ నెమిలి, మగ సింహం, మగ కోయిల గొంతు.
    హ్తేదరాబాద్ రేడియో  ప్రతి శుక్రవారం  రాత్రి పదిగంటలకి  అరగంటసెపు- రికార్డులనుకుంటాను మంచి కర్నాటక సంగీతం వొస్తుంటుంది. కేసెట్ల మిద రికార్డు  చేస్తుంటాను.
    65 యేళ్ళకి  కూడా యిప్పటి స్వప్న స్ఖలనాల అనుభవం వుంటానే వుంది!
    ప్రజ్ఞాశాలి  వయొలిన్ స్ట్  యం.యస్. గోపాలకృష్ణన్  కూతురు Dr. యం. నర్మద వయొలిన్  బాగా వాయిస్తుంది.
    దేశ విభజనలో  లాహొర్ ని  వొదులు  కోవటం పరమ అసమర్ధత!
    యీ  యాభయేళ్ళలో  40 కోట్ల నుంచి 100 కోట్లకి జానాభ పెరగటం, ప్రగతి కాదు; అసమర్ధత, అజ్ఞానం.
    శిల్పాలలో  తప్ప, గుత్తి గవ్వ ప్రదర్శన నిషిద్దం.
    యూరాలజిస్ట్  hard prostate అని అనుకున్నాడు PSA test లో మరికొంత అనుమానం.byopsy లో అంతా okay అని నిర్ధారణయ్యింది.
    Mild typoid symptoms యింకా అలాగే!
    మీ నలుగురికి శుభాకాంక్షలు

                                                                                                                      -వడ్డెర చండీదాస్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS