Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 28

 

    అతనితో సెక్స్ లో పాల్గొనేటంత చనువు వున్నదీ అంటే అతను ఆమె ప్రియుడు అయి వుండాలి.
    మంగళ భర్త ప్రముఖ వ్యాపారవేత్త కావడం వలన అతను చెప్పేది కూడా పరిగణలోకి తీసుకొనవలసి వుంటుంది.
    భార్య సింహాచలం చూసి వస్తానని వెళ్ళిందనీ...... ఏ మగవాడితో తన భార్యకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు అయన.
    మరి నగ్నంగా ఆమె హోటల్లో గదిలోకి ఎలా వచ్చిందో కిరణ్ కు అంతుబట్టలేదు.
    అసలు ఆమె హోటల్ కి వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ఎవరు లేరు.
    ఎవరి కంటా పడకుండా ఆ గదిలోకి ఎలా వెళ్ళిందనేది వొక సందేహం.
    ఆమె అందం అపురూపమయినది కావడం వలన రిసెప్షన్ లోని వాళ్ళ దృష్టి పధంలో నుండి తప్పించుకోవడానికి వీలులేదు.....ఆఖరికి లిప్ట్ బోయ్ రూమ్ సర్వీస్ బోయ్ లు కూడా ఎవరూ ఆమెను చూడలేదు అంటున్నారు.
    అక్కడే ఏదో మెలిక వుందనిపించింది.
    కిరణ్ ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధనలోకి తీసుకున్నాడు.
    కారుని పార్కింగ్ చేసినప్పుడు వాచ్ మెన్ తప్పనిసరిగా చూసి వుండాలి.
    అతనిని నిలదీస్తే బురఖా ధరించిన అమ్మాయి వచ్చిందని చెప్పాడు.
    తనను ఎవరూ గుర్తించకుండా ఉండడానికి ఆమె బురఖాలో వచ్చింది అందుకే హోటల్ సిబ్బంది ఎవరూ ఆమెను చూడలేదు అని చెబుతున్నారు.
    తన ఇడెంటిటీ బయట పడకూడదని ఆమె ముందు జాగ్రత్తలు తీసుకున్నది.
    ఆగదిలోని వ్యక్తీ ఎవరో ఆమెకు బాగా కావలసిన వాడే అయి ఉండాలి.
    ఆ పరిచయం ఏదో ఆ క్షణంలో అయివుంటే ఆమె సరాసరి అతని కోసం హోటల్ కు రాకపోవచ్చు.....వాళ్ళిద్దరికీ ఎన్నాళ్ళు నుండో పరిచయం వుండి వుండాలి. ఇద్దరూ శృంగారాన్ని అనుభవిస్తూ వుండి ఉండాలి.
    తన భార్య ఉత్తమురాలు అని గోవిందరావు అనుకోవడంలో తప్పులేదు.
    కానీ తన కళ్ళు కప్పి మంగళ ఎవరితోనో సెక్స్ లో పాల్గొంటుందనే నిజాన్ని అతను జీర్ణించుకోలేక పోవచ్చు....ఆరోజు తన భార్య సింహాచలం వెళతానంటే వెళ్ళమని చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాను అని చెబుతున్న అతని మాటలను అనుమానించడానికి ఆస్కారం లేకపోయింది.
    నిజంగానే మంగళ ఎవరితోనో సీక్రెట్ ఎఫయిర్ పెట్టుకుని వుంటే మాత్రం కట్టుకున్న భర్తకు తెలియకపోయినా పనివాళ్ళకు ఎంతో కొంత తెలియడానికి చాన్స్ వుంది.
    అంత పెద్ద ఇంట్లో పనివాళ్ళు లేకుండా వుండరు.....
    అందుకే ఇంట్లో నమ్మకంగా పనిచేసే వాళ్ళ కోసం ఎంక్వయిరీ చేశాడు ఇన్ స్పెక్టర్ కిరణ్.
    మంగళ ఇంటి పని అమ్మాయి రంగమ్మను నిలదీయడంతో ఆ కేసు మిస్టరీ బయటపడింది.
    ఆమె చెప్పిన మంగళ ప్రియుడు ఎవరో కాదు......
    "సునీల్......"
    అతనితోనే హోటల్ గదిలో గడపడానికి వెళ్ళింది అని చెప్పిందామె.
    ఆ మాట వినడంతోనే ఇన్ స్పెక్టర్ కిరణ్ పోలీసు రికార్డులలో ఉన్న సునీల్ ఫోటో తీసి హోటల్ రిసెప్షన్ లో చూపించాడు.
    అతనే ఈశ్వరరావు అని గుర్తుపట్టారు.....
    అంటే లలిత భర్త హత్య కేసులో తను అనుమానిస్తున్న సునీల్ ...... ఈ హత్య చేసిన సునీల్ వొక్కడే అయి ఉంటాడని నిర్ధారణకు వచ్చాడు ఇన్ స్పెక్టర్ కిరణ్.
    

                                                     *    *    *


    "యూ బ్లడీ క్రిమినల్.....ఇంకా ఎన్ని మర్డర్లు చేశావు....." నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు రైల్వే డి.యస్.పి. చంచలరావు.
    అప్పటికే ఇంటారాగేషన్ లో సునీల్ శరీరం అంతా బొబ్బలు యేక్కాయి.
    చర్మం చిట్లి రక్తం కారుతుంది.
    అతను నోరు విప్పి మాట్లాడే ఓపిక కూడా లేకుండా పోలీసులు అతనిని కుళ్ళ పొడిచారు.
    ఆ టార్చారుకు ప్రత్యక్ష సాక్షి యస్. ఐ. ప్రసాద్.
    అదంతా సాక్షాత్తూ డి.ఎస్.పి అధ్వర్యంలో జరిగింది.
    యముడిలా యెదుట నిలబడి అతనిని ఇంటారాగేట్ చేస్తూ ...వొళ్ళు హూనం చేసే బాధ్యతను మాత్రం యెస్. ఐ. ప్రసాద్ కు మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ కు అప్పజెప్పాడు.
    ఆఫీసర్ మాట వినక తప్పదు.
    కాదు కూడదు అని యెదురు చెబితే వాడంటే నీకు యెందుకు సానుభూతి ........లేకపోతే యెంత డబ్బు ముట్ట జేబుతా నన్నాడేమిటి? అంటాడు.
    అదీ కాదంటే నీచనికృష్ట మయిన పధజాలం.
    అందుకే తన మనసాక్షికి విరుద్దమే అయినా సునీల్ ను క్రూరంగానే ఇంటారాగేట్ చేశాడు యస్. ఐ . ప్రసాద్.
    సీతాపతి అనే వ్యక్తిని చంపింది సునీల్ అనిం ఆతని భార్య లలితతో వున్న అక్రమ సంబంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి సునీల్ ఆ హత్య చేశాడని డి.ఎస్.పి నమ్మకం.
    అదీగాక అతనిపై గతంలో ఒకసారి లా అండ్ ఆర్డర్ వైజాగ్ పోలీసులు బ్లూ ఫిలిం కేసు ఒకటి అతనిపై ఫైలు చేసి వున్నారు. ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే వుంది. దానిని కూడా పరిగణన లోకి తీసుకుని సునీల్ ఆ హత్య చేసి వుంటాడనే నిర్ధారణకు వచ్చాడు.
    అయితే అతను ఆ టార్చర్ ను మౌనంగా భారిస్తున్నాడు తప్ప పెదవి విప్పి చేశానని కానీ చేయలేదు అని కానీ చెప్పడం లేదు.
    దాంతో డి.ఎస్.పి మరింత రెచ్చిపోయాడు.
    అతనిపై కసి రేగింది.
    ఆయనకు తనపై తనకు ఎంతో నమ్మకం ....తన డెసిషన్ ఎప్పుడూ తప్పదని తనకు నేరస్థునిలా కనిపించిన వ్యక్తీ తప్పనిసరిగా నేరం చేసి ఉంటాడనే నమ్ముతాడు అయన.
    అందుకే ఎలాగయినా అతనే దోషి అని నిరూపించాలని అయన తాపత్రయం.
    సునీల్ మొండిపట్టు చూశాక అతనిలోని మూర్ఖత్వం పెరిగింది.
    అందుకే చితకబాది అయినా సరే అతనిచేత నేరం వప్పించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఆ బాధ్యతను ఎస్.ఐ. ప్రసాద్ కు అప్పగించాడు.
    అసలు కేసు దర్యాప్తు చేయవలసింది ధీరజ. కానీ నాలుగు రోజులు శెలవులో వెళ్ళింది.
    ఆమె మీద విసుగు, కోపం కూడా సునీల్ పైనే చూపిస్తున్నాడు డి.ఎస్.పి.
    ధీరజ ఉన్నట్టుండి సుడిగాలిలా వచ్చింది.
    వచ్చీ రావడంతోనే .....
    ఎదురుగా వున్న దృశ్యం చూసిన ఆమె ముఖంలో రంగులు మారాయి. ముక్కుపుటాలు అదిరాయి. ఆవేశానికి లోనయింది.
    తనను తానూ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించింది.
    "ప్లీజ్ స్టాప్ ఇట్...."
    అయినా పై ఆఫీసర్ ఉన్నాడని ఆమె మాటలు వినిపించుకొనట్టు ఎస్.పి. ప్రసాద్ అతనిని లాఠీతో చావబాదుతూనే ఉన్నాడు.
    "ఇసే స్టాపిట్."
    మరింత ఆవేశంగా గొంతు చించుకుని అరిచింది ధీరజ.
    ప్రసాద్ తన ఇంటరాగేషన్ ఆపాడు.
    "మిస్టర్ ప్రసాద్......కారీ అన్....."
    డి.ఎస్.పి. హుకుం జారీ చేస్తున్నట్టు అన్నాడు.
    అప్పటికే అయన కళ్ళల్లో ఎర్రజీర ఏర్పడింది.
    "మిస్ ధీరజా! వాట్ బిజినెస్ హూ హావ్ హియర్ నువ్వు శెలవులో వున్నావు, వెళ్ళి నీ సొంత పనులు చూసుకో.....అనవసరంగా ఈ కేసులో తల దూర్చకు....."
    "ఐయాం ది ఇన్ స్పెక్టర్ ! ఈ కేసును ఇప్పటి వరకు నేనే దర్యాప్తు చేశాను. మిగిలిన దర్యాప్తు కూడా నేనే చేస్తాను.....ఇప్పుడే నేనే నా శెలవు కాన్సిల్ చేసుకుంటున్నాను."
    'బట్ ......ఐ హావ్ గివెన్ యూ సో మచ్ టైం . ఈ కేసులో మిస్టరీ చేధించడం నీ వల్ల కాదు, నేను ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తాను. నా టైం వెస్ట్ చేయకు, యూ కెన్ గో - విసురుగా అన్నాడు డి.ఎస్.పి. చంచలరావు.
    "సర్.....! సునీల్ నిర్దోషి."
    అప్పటికే తన కళ్ళలో చిప్పిల్లుకున్న కన్నీటిని పంటి బిగవున అదిమిపెట్టి అన్నది.
    "నో...హి ఈజ్ ది క్రిమినల్....."
    "నో సర్.....! అతను ఈ హత్య చేయలేదు."
    'అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? లుక్ బేబీ .......నా సర్వీసులో ఇలాంటి క్రిమినల్స్ ను చాలా మందిని చూసాను. బహుశా నీకు కొత్త కావచ్చు. నన్ను విసిగించక వెళ్ళి నీ పని చూసుకో."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS