Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 21


    కొంతమంది తనలోని ప్రతిభని వెగులోకి తెచ్చుకొని ప్రసిద్దులవుతారు.

     మరికొందరు ఉబుసుపోక అన్నట్టు చెప్పుకొంటానికే తప్ప వెలుగు లోకి రాలేరు.

    అక్కడే 'కృషి" అనే మాట విలువని సంతరించుకొనేది!

    రామ్! నీచేతిలో జూద రేఖ కుబుసం విడిచిన పాములా కనిపిస్తుంది.

     కోట్లు సంపాదించగల రేఖది.   

      ఈప్రపంచాన్నే శాసించగల నెంబర్ వన్ గాంబ్లర్  వి కాగలవు నువ్వు.

     నీలోని ఆ కళని వెలికితీసి  నగిషీలు  చెక్కా లన్నదే నా తపన.

     రామ్!

     ఈ ప్రపంచంలో డబ్బుకున్న విలువ మరి దేనికీ లేదు.

     డబ్బున్న ఓ హంతకుడికి వుండే పరపతి, గౌరవం ఈ సమాజంలో డబ్బులేని జంటిల్మన్ కి వుండదు.

     డబ్బే ఈ ప్రపంచం.

     ఈ ప్రపంచమే డబ్బు!

     ఎవరు ఎవరి వెంటపడినా ,అనుసరించినా దానికోసమే!"

    నాయకులు ప్రజాసేవకోసం జీవితాలని రాజకీయాలకు    అంకితం చేసినా-

    "కళకోసం కళామతల్లికి తారలు సేవ చేసినా-

    సామాజిక స్పృహకోసం రచయితలు రచనలు చేసినా-

    ఉద్యోగులు మంచి పదువుల్లోకి ఎగబడినా-

     తేలిక మార్గంలో డబ్బు సంపాదించడానికి

     దొంగలు దొంగతనం చేసినా!

     ఆడది వ్యభిచరించినా- డబ్బు కోసమే రామ్!"

    "అవినీతి ఒక్క టేనా డబ్బు సంపాదించడానికి మార్గం!"

    " ఇదంతా అవినీతి అని నేను ఆనంటంలేదు. కానీ నీతినే సూత్రప్రాయంగా పెట్టుకునేవాడు పైకి ఎదగలేడన్నది నిర్వివాదాంశం రామ్."

    "నీతో నేను ఏకీభవించలేను."

    " ఛాలెంజ్ రామ్!  జీవితం అంటె ఓ అవగాహనలేని పసివాడివి నువ్వు."

     నీచేతిలో వున్న విద్యతో నువ్వు గొప్పవాడివి కావాలని ఆశిస్తున్నానే. తప్ప అవినీతిలో కూరుకుపొమ్మని నేను చెప్పడం లేదు.

     నువ్వు నన్ను అర్దం చేసుకోడానికి ప్రయత్నించు. నీకే అర్ధం అవుతుంది.

     పరుశురాం తన పొట్టచుట్టూ వున్న ఆమె చేతిని విడిపించుకుంటూ-

    "దొంగతనం కూడా కళేగా!" అన్నాడు.     

    "జూదగాడికి, దొంగకి తేడా వుంది రాం.

     ధర్మరాజంతటి మహారాజు జూదం ఆడాడు. దర్మం తప్పని ఆ మహారాజే జూదం తప్పుకాదని అడినప్పుడు నువ్వునేనూ దాని గురించి ఆలోచించవలసి  పనిలేదు.   

     అది కూడా అన్ని  ఆటల్లానే ఓ క్రీడ!"

    పరుశురాం భుజాలని పట్టుకొని మీదకి లాక్కుంది నందిని.

     మెత్తని  ఆమె  గుండెలు అతని  ఛాతికి వత్తుకుంటున్నాయి. అతని తలలోకి చేతివేళ్ళని పోనిచ్చి నిమురుతూ.

     "నా మాట వింటే నిన్నో మనిషిని చేస్తాను రాం.

     మంచిబట్టలు... ఉండటానికి ఇల్లు, కారు, టెలిఫోన్ అన్నీ...  ఇంకా ఏం కావాలన్నా నేనివ్వగలిగింది ఏదైనా సరే ఇస్తాను.

     జూలీ  క్లబ్బులో నువ్వు రోజూ పేకాట ఆడాలి."

    " నన్నంత  గొప్పవాడ్ని చేయాలని నాకెందుకు అంత ఆరాటం! దానివల్ల నీకు కలిగే లాభం!"

     నందిని ఎలాంటి  మగాడినైనా  సరే తనకి పాదాక్రాంతుడై పోయేలా  నవ్వింది. అతని  చేతనని  తన తొడపైన హత్తుకుంటూ  అంది.

     "పెట్టుబడి నాది. గెలిచిన దానిలో నీకు పర్సంటేజి ఇస్తాను.అది కాక మిగిలిన మీ అవసరాలన్నీ నేనే చూస్తాను.

     ఆ జూలీ క్లబ్ ఎప్పటికయినా నాకు కైవశం కావాలి."
   
    ఆమె  మటలకి పరుశురాంకి నవ్వొచ్చింది. తెలీకుండానే ఆమె తొడపైన... కొంచెం పైన గిల్లాడు.

     "ఏయ్. ఏంటది?" చిరుకోపంతో అంది.

     "గుడినే మింగాలనుకుంటున్న నీ ఆశకి ఏమనాలో తోచక గిల్లాను- నొప్పి పెట్టిందా?"

'    అయ్యోపాపం అన్నట్లుగా అతనడిగేసరికి ఆమె అంది.

     "ఏం నాయనా అంత జాలిపడుతున్నావా?

    నేను  గిల్లితే అసలే ఊడిపోతుంది. జాగ్రత్త" అంది.

     "లేకపోతే ... ఆక్లబ్లునీ కెందుకు?" అన్నాడు.   
   
    నందిని అతని చెవిని కొరికింది.

     "నీకు తెలీదు రాం!"

    నా కోరికలో స్వార్థం లేదు. ఆవేదన వుంది. బతికివున్న మనిషి గుండెను బయటికి లాగి పిండేస్తున్న బాధవుంది రాం!

    ఆమె కళ్ళల్లో నీరు తళుక్కున మెరిసింది.

     ఆ కన్నీటిని అతను తుడుస్తాడని ఆమె ఆశతో ఎదురు చూసింది.

    "నీకేదో ఫ్లాష్ వుందనుకొంటాను" ఆమె తెల్లని పాదాన్ని అరచేత్తో సవరదీస్తూ అన్నాడు.

     ఆమె మొహం  కందగడ్డలా ఎర్రగా అయింది.

     " అంత ఊపిరిపోసిన  ఆ వ్యక్తి  ఎవరు?"

    "ఓ దేవుడు!"

    "మన దేవుళ్ళకి చాలా పేర్లుంటాయి. ఏ దేవుడో చెప్పు."

    ఆమె తల అడ్డంగా ఊపింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS