మోహిని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది.
"రాబర్టు ఒక్కమాట చెప్పనా?"
"చెప్పు"
"భర్త ఎంత చెడ్డవాడ్తేనా ఎన్ని కష్టాలు పెట్టినా ఆడది అతని చేతుల్లోకి అనురాగంగా ప్రేమగా తీసుకొనే ఆ కొన్ని క్షణాల్లో అన్ని బాధల్నీ మరచిపోతుంది. ఆడది మగవాడినించి ఆశించేది ఐశ్వర్యం ఒక్కటే కాదు ఆదరణ ఆ ఆదరణలో ఆ కలయికలో పొందిన సుఖానికి ప్రతిగాపొందే మాతృత్వం కోసం ఆడది కలలు కంటుంది. ఆ ఆశ నాకులేదు. సముద్రం మీద ప్రయాణం చేసేవాడికి చుట్టూ నిరేపట కానీ దాహం వేస్తే ఒక్క చుక్క పనికిరాదు. తాగడానికి మనసు చేసే అల్లరిని భరిస్తూ కోరికల్ని చంపుకుంటూ నా బతుకుని ఈ బంగళలో సమాధి చేసుకొన్నాను" అంది మోహిని.
రాబర్టుకి ఆమె మాటలు చాలా జాలిని కలిగించాయి.
"రాబర్టు ఎప్పటికప్పుడు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎన్నో ప్రయత్నాలు కూడా చేశాను. కావాలంటే ఆ దిండుకింద చూడు అంది.
రాబర్టు దిండు కింద చూశాడు.
పిస్తోలు వుంది దిండుకింద
"చచ్చి నువ్వేం సాధిస్తావ్?" అన్నాడు.
"బతికి చేసేదేముంది?"
"అతను నీ జీవితానికి అడ్డురానప్పడు నీకింకా అశాంతి దేనికి?"
"నిజమే కానీ నాపట్ల విసుగూ అసహనం లేకుండా ఆత్మీయతతో దగ్గరకి తీసే చేతులు నాకు కావాలి. క్షణం క్షణం చచ్చిపోతున్న నాకు ఏ ఆత్మీయత అందక మనసు కొట్టుకొంటోంది రాబర్టు నువ్వు ఎవరో నాకు తెలీదు నిన్ను చూడగానే నా గుండె రెపరెపలాడింది. అందుకే నిన్ను తీసుకొచ్చాను. నా కోర్కె నీ ద్వారా తీరాలి" అంది.
"ఏమిటి?"
మోహిని అతని కళ్ళలోకి చూసింది.
"నీ ద్వారా నేను తల్లిని కావాలి"
రాబర్టు నవ్వేడు ఆమె మాటలకి.
"నిజం రాబర్టు నాగుండె ఎప్పుడో పాషాణంగా మారిపోయింది. నా జీవితం తిరిగిన ఒకే మలుపులో నేను చచ్చిపోయాను కానీ ఈ రోజు నిన్ను చూశాక తిరిగి నాకు ఊపిరి పోసినట్టయింది" అంది మోహిని.
మాలి గదిలోకి వచ్చాడు.
అతని చేతిలోవున్న షి వాస్ రీగల్ విస్కీ బాటిల్ని ఐస్ ప్లాస్క్ షోడాలు తెచ్చి టీపాయ్ పైన పెట్టాడు.
"నువ్వెళ్ళు" అంది మాలితో.
మాలి వెళ్ళిపోయాడు.
"నువ్వు...." అడిగింది. మోహిని
అందంగా వున్నా ఆ సీసాని చేతిలోకి తీసుకుని ముచ్చటగా చూశాడు రాబర్టు.
రెండు గ్లాసులోకి సహంపైగా విస్కీ పోసి కలిపాడు ఐస్ ముక్కల్ని వేసి ఓ గ్లాసుని మోహినికి అందించాడు రాబర్టు.
గ్లాసుని అందుకుంటూ
"ధ్యాంక్యూ" అంది మోహిని
ఆమె గ్లాసుని పెదవులప్తెకి తీసుకుంటూ వుండగా మోహిని పవిటజారి వడిలోపడింది.
ఎర్రని లోనెక్ స్లీవ్ లెస్ జాకెట్ లోంచి కొద్దిగా జారిన ఆమె వక్షోజాలు రెండు గాచీలిన సన్నవి మార్గం అతని కళ్ళకి కనబడింది.
"ఎడారిలో చిక్కుకొని దాహంతో చచ్చిపోతున్న మనిషికి నాకు ఒయాసిన్ కనబడితే ఎలా వుంటుందో నిన్ను చూస్తుంటే నాకు అలా వుంది" అంది.
"ఈ చిన్న విషయానికి నువ్వింత వర్రీ అవడం నాకు నచ్చ లేదు."
మోహిని హత్తుగా నవ్వింది.
నిజమే రాబర్టు ఆర్తితో చేతులుచాచి నా వునికిని గుర్తించి నాలాలనలో మన శ్శాంతిని కోరే ఎవరికైనా నా దగ్గర కాగ ద్తేర్యం నాలో వుంది నేనెంతనమ్మి దగ్గరకోస్తానో ఎదుటి వ్యక్తి నుంచీ అదే దగ్గర తనం అభిమానం నాకు లభించాలి. ఇలా నేను కోరుకోవడం తప్పా?"
నువ్వు ఆశించినదానిలో నాకైతే ఏ తప్పు కనబడలేదు. నిన్ను నేను అర్ధ, చేసుకున్నాను" అన్నాడు రాబర్టు.
అతని మాటలకి మోహిని మతిపోయేలా నవ్వింది.
"ఎన్నో సంవత్సరాల పరిచయం వుంటేనే కానీ మనిషికి మనిషి అర్ధంకాడు అలాంటి దిప్పడే నన్ను అర్ధం చేసుకున్నానని నువ్వంటే నేను ఒప్పుకోను కారణం కరుకుగా రాయిలా కనిపించే మనిషిలో మంచితనం వుండచ్చు అమాయకత్వం కన్పించేచోట చాటుగా కాటువేసే కుత్సితం __మోసం వుండొచ్చు" అంది మోహిని గంభీరంగా
"అంటే నీకు ఆత్మయత వ్యక్తంచేసే వాళ్ళన్నా నమ్మకం లేదన్న మాట" అడిగాడు రాబర్టు.
"నో రాబర్టు నేను మనుషులప్తెన నమ్మకాన్ని పోగొట్టు కున్నాను. నేను నిన్ను నమ్మటం లేదు నేనే నిన్ను పట్టుకొని వెళ్ళా డాలని నేనను కోవడంలేదు. నాకు నీవల్ల కావాల్సిందేమిటో చెప్పాను. అంతే! తమారాకు మీద నీటిబొట్టులా బతకడం నాకు చేతకావడం లేదు. అందుకే నా మససిలా జ్వాలమయ మవుతోంది ఆల్ రైట్ పదియింది డిన్నర్ చేద్దాం !?" అంది మోహిని.
రాబర్టు చేతి గడియారం కేసి చూసాడు పది దాటింది.
ఆ రాత్రి ఇక మోహిని తో జాగరణ తప్పదు కనుక బయటకి పోయే అవకాశం లేదు.
డైనింగ్ టేబిల్ ప్తెన అన్ని అమర్చి వున్నాయి.
మోహిని అతను వద్ద అంటున్నా సర్వ్ చేసింది.
"నీకిలా సర్వ్ చేస్తుంటే నాకెంత ఆనందంగా వుందో తెలుసా?" అంది
