Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 18

 

    "ఇంతకుముందు చెప్పినదంతా మళ్ళీ చెప్పమంటారా" సాగర్ మెల్లగా అన్నాడు.
    "నో! నో! అదంతా అవసరం లేదు. నీ కంక్లుజర్ ఏమిటో చెప్పు చాలు. చాలా క్లుప్తంగా వుండాలి."
    "డాక్టర్ మూర్తిగారిని చూసినప్పుడల్లా మాధవిలో సంచలనం కలుగుతున్నది. కాన్ షస్ లో డాక్టరు మూర్తి పర్సనాలిటీ వంటవాడి రూపంలో మెదలుతూ వున్నది. డాక్టర్ కూ వంటవాడికీ వున్న సంబధమేమిటో నాకు అర్ధం కావడం లేదు. డాక్టర్ రూపం గల వంటవాడిని మాధవి ఈ జన్మలో ఎప్పుడూ చూడలేదు."
    "వైటే మినిట్!" ప్రొఫెసర్ సాగర్ ముందుకు వచ్చాడు.
    "పూర్వ జన్మ స్మ్రుతులుంటాయనే నమ్మకం - నీకు ఉన్నదా?"
    "లేదు, పునర్జన్మ అంటేనే నాకు నమ్మకం లేదు."
    "మరి ఈ జన్మలో అన్నావు?"
    "సారీ ప్రొఫెసర్!" నా ఉద్దేశం లో మాధవి అలాంటి వంటవాడిని చూడలేదని. వాళ్ళింట్లో ఎప్పుడూ వంటవాడు లేడట! జడ్జి గారింటిలో అయన భార్య నాగరత్నమ్మ గారే వంట చేస్తుందట. మధ్య మధ్య ఎప్పుడయినా అవసరమయితే అడ వంట మనిషినే పిలిచేవారట."
    "ఓ.కే సాగర్! ప్రొసీడ్!"
    "మాధవికి అలాంటి వంటవాడిని చూసే అవకాశం కలగలేదు. కాని డాక్టర్ మూర్తిని చూడగానే ఆమె మస్తిష్కంలో వంటవాడు ఎందుకు మేదులుతున్నాడో నాకు అర్ధం కావడం లేదు."
    "డాక్టర్ మూర్తి రామనాధం గారి ఫామిలీ డాక్టరా?" ప్రొఫెసర్ అడిగాడు.
    "అని చెప్పలేను. కాని అయన రామనాధం గారికి సన్నిహితుడు."
    "ఎన్నాళ్ళ నుంచి వాళ్ళిద్దరికీ పరిచయం!"
    "ఆరు నెలల లోపే"
    "డాక్టర్ గారికి, జడ్జి గారికి మొదటి పరిచయం ఈ ఊళ్ళోనేనా?"
    "అవును, ఇక్కడే ఇద్దరికీ ఆఫీసర్స్ క్లబ్బు లో పరిచయం అయివుంటుంది."
    "మాధవి మొదటిసారిగా డాక్టర్ని ఎప్పుడు చూసింది?"
    "కాలేజి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజునే చూసింది"
    'అలా అయితే డాక్టర్ జడ్జి గారింటికి అంతకు ముందు వెళ్ళలేదన్న మాట!"
    "వెళ్ళి ఉండక పోవచ్చు! వెళ్ళినప్పుడు మాధవి అతని చూసే అవకాశం లేకపోవచ్చు!"
    "మరి డాక్టర్ జడ్జి గారికి సన్నిహితుడన్నావ్?"
    వాళ్ళిద్దరి మధ్యా అంతకు ముందున్న పరిచయం మాధవికి ఇది జరిగిం తర్వాత దాదాపు స్నేహంగా మారింది. అప్పట్నించి తరచూ డాక్టర్ జడ్జి గారింటికి వెళ్ళి రావడం జరుగుతున్నది!"
    "ఓ.కే. మిస్టర్ సాగర్! మాధవికి డాక్టర్ మూర్తిని చూసినప్పుడు తను ఎన్నడూ చూడని ఓ వంటవాడు కనిపిస్తుంటాడు అవునా?"
    'అవే నా రీడింగ్!"
    "అసంభవం! అబ్ సర్డ్ !" ప్రొఫెసర్ టేప్ రికార్డర్ ఆపి, బల్ల మీద పెన్సిల్ తో కొట్టాడు.
    "ఒక్క నిముషం ప్రొఫెసర్!" సాగర్ టేప్ రికార్డర్ ముందు నుంచి లేచి నిలబడ్డాడు.
    "వంటవాడు కన్పిస్తున్నాడని మాధవి నాతొ చెప్పలేదు!" ఎక్కడో చూస్తూ అన్నాడు సాగర్.
    "మరి నువ్వెందుకు అలాంటి నిర్ణయాని కొచ్చావ్?"
    "ఈ కేసులో ప్రెషర్ కుక్కర్ చాలా ముఖ్యమైన ప్రాత్ర అన్నది, కూరలు తరగడం - వ్రేలు తెగడం అవన్నీ వంటగాదిలోనే జరిగాయి .....వంటగదిలో వుండేవాడు వంటవాడు కాక మరెవరు?" సాగర్ ప్రొఫెసర్ కేసి తిరిగి అన్నాడు.
    "వంటగత్తే ఎందుకు కాకూడదు?" ప్రొఫెసర్ సాగర్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు.
    "డాక్టర్ మూర్తి మగవాడు , అతడ్ని చూసినప్పుడు వంటగత్తే చిత్రాలు మాధవిలో మెదిలే అవకాశం లేదుగా?" ప్రొఫెసర్ సమాధానం ఇవ్వలేదు. కిటికీ దగ్గరగా వెళ్ళి నిలబడి బయటకి చూడసాగాడు.
    "ప్రొఫెసర్! నా ప్రశ్నకు సమాధానం?" సాగర్ ప్రొఫెసర్ వెనగ్గా వెళ్ళి నిలబడ్డాడు.
    "నీకు పునర్జన్మ అంటే నమ్మకం లేదా?" ప్రొఫెసర్ గిర్రున తిరిగి సాగర్ భుజం మీద -చెయ్యి వేసి అడిగాడు. సాగర్ ముఖం వేల వెల పోయింది.
    "ప్రొఫెసర్! మీకు నమ్మకం ఉన్నదా?"
    "ఇంతవరకూ లేదు! యీ కేసు స్టడీ తరువాత నమ్మకం కలుగుతున్నది?"
    "అయితే నా పరిశోధనా, నిర్వచనాలు అన్నీ తప్పు అనే కదా మీ ఉద్దేశ్యం?" నీరు కారిపోయాడు సాగర్.
    "నిరుత్సాహ పడకు ! ఇది చాలా జటిలమైన కేసు! మనకు తెలిసిన మనస్తత్వశాస్త్రానికీ అందుబాటులో లేదు. నా అనుభవంలోకి ఇలాంటి కేసు ఇంతవరకూ రాలేదు. నా సైక్రియాత్రి విజ్ఞానికి ఇదొక పరీక్ష, నువ్వు నాతొ సహకరిస్తే దీన్నీ పరిష్కరించగలననే నమ్మకం నాకున్నది" ప్రొఫెసర్ కళ్ళజోడు తుచుకొని పెట్టుకొన్నాడు.
    "తప్పకుండా? అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గల ప్రొఫెసర్ చంద్రశేఖర్ చీకటిలో ఉన్న మాధవి జీవితానికీ వెలుగు ప్రసాదించ లేకపోతే అది అనితర సాధ్యం! మాధవి జీవితాంతం చీకటిలో ఉండి పోవలసిందే!" సాగర్ గొంతు జీర బోయింది. కళ్ళు ఆర్ద్రమై పోయాయి.
    ప్రొఫెసర్ సాగర్ భుజం తడుతూ "మిస్టర్ సాగర్! నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా?" అన్నాడు.
    "యస్ , ప్రొఫెసర్! ఐ లవ్ హర్!"
    "మాధవి నిన్ను ప్రేమిస్తుందా?"
    "నో డౌట్ ప్రొఫెసర్! మాధవి నన్ను మనసారా ప్రేమిస్తుంది. మేము ఒకళ్ళ నొకళ్ళను అర్ధం చేసుకోన్నాము. మాధవి సౌమ్యురాలు తెలివితేటలు కల అమ్మాయి కూడా"
    "అవన్నీ చెప్తున్నావు. అందం లేదా?"
    "మీ ఉద్దేశ్యంలో తెలివి తేటలుంటే అందం ఉండదనా?"
    ప్రొఫెసర్ పెద్దగా నవ్వాడు.
    "అలా అని కాదు! ఆ రెండూ సర్వ సాధారణంగా ఒకచోట వుండవు. నువ్వు అదృష్ట వంతుడివి."
    "అది మీ చేతుల్లో ఉన్నది. నా మాధవిని నాకు దక్కించాలి! హటాత్తుగా ఇంత భయంకరమైన సమస్య ఎదురవుతుందని నేనేనాడూ ఊహించలేదు."
    "మిస్టర్ సాగర్! సైకాలజీ స్కాలర్ లా మాట్లాడడం లేదు నువ్వు. స్మ్రుతి పొరల్లో ఎక్కడో మరుగున పడి వున్నవి హటాత్తుగా ,  చిన్న ప్రేరణకే బయట పడతాయి. పరమాణువు చాలా సూక్ష్మమైనది, నిరపాయికరమైనది. కాని అది భేదించబడినప్పుడు అపారమైన విధ్వంసక శక్తి విడుదలవుతుంది. మనసు కూడా అంతే. క్షణంలో కొన్ని వందల కోట్ల మైళ్ళ ప్రయాణం చేయగలదు. ఈ క్షణంలో భూమి మీద మరో క్షణంలో చంద్రమండలం మీద! ఎన్నో వేల ఆకారాలను చూడగలదు. సహజ జీవరాసుల రూపాలను కలగా పులగం చేసి ఎన్నో వికృతి అసహజమైన రూపాలను చూడగలదు. మనస్సును, అదుపులో పెట్టుకో గలిగిన శక్తి మనిషి కున్నది. ఆ శక్తి బలహీనపడితే మనిషి వెర్రిగా ప్రవర్తిస్తాడు. పూర్తిగా అదుపు తప్పితే ఉన్మాదావస్థలలో వుంటాడు. మంచివాడికి, పిచ్చివాడికి ఉన్న సరిహద్దు రేఖ చాలా సూక్ష్మమైనది, సున్నితమైనది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS