Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 18

 

    వకుళ ఆలోచనలో పడింది.....
    తమ ప్రియుడ్ని పడకగదికి రప్పించుకుంటున్న విషయం అతనికి ఎలా తెలుసు?
    ఎలా తెలిసినప్పటికీ అతని ద్వారా తన భర్తకు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయి. విలసవంతమయిన ఈ జీవితం చేజారిపోయింది.
    ఆ బ్లాక్ మెయిలర్ చెప్పినట్టు వినాలని నిర్ణయించుకున్నది వకుళ.....
    ఏది అయితే అది అవుతుంది ముందు కాష్ వాడి ముఖాన కొట్టి వాడి పీడ వదిలించుకోవాలి.
    కాష్ బాగ్ లో నోట్ల కట్టలను సర్దుకుని కారులో వైజాగ్ రైల్వే స్టేషన్ పరిసరాలలో వున్న పెట్రోల్ బంక్ ను వెదుక్కుంటూ బయలుదేరిందామె.
    అంతవరకూ ఆ ఇంటి పరిసరాలతోనే ఆగివున్న మారుతీ కారు కూడా నెమ్మదిగా కదిలి వకుళ కారుని ఫాలో చేయసాగింది.
    కాలయాపన చేయకుండా వెంటనే బయలుదేరడం వలన....ఆమె ఎలాంటి ట్రిక్సు ప్లే చేయడం లేదని .....ఎవరికీ చెప్పడం కానీ.... ఎలాంటి అడ్వాన్స్ స్టెప్ తీసుకోలేదని మారుతీ కారులోని వ్యక్తికీ అర్ధమయింది.
    సహజంగా అలాంటి సందర్భంలో తన తప్పుడు పనిని ఇంకొకరికి తెలియజేయడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకనే వకుళ కూడా మూడవ కంటికి తెలియకుండా బయలుదేరిందనే నమ్మకం కలిగింది అతనికి.
    వకుళ కారు పెట్రోల్ బంకు దగ్గర ఆగడం దూరం నుండి చూసి , తన కారును ఒక పబ్లిక్ టెలిఫోను ముందు కారు ఆపాడు అతను.
    "మేడమ్ , మీరు వకుళే కదూ"
    పెట్రోల్ బంకులోని కుర్రవాడు ఒకడు అమెకారుని సమీపించి అడిగాడు.
    అతనికి తనపేరు ఎలా తెలిసిందో అర్ధం కాక, అయోమయంగానే అవునన్నట్టు తల వూపింది.
    "మీకు ఫోన్ వచ్చింది మేడమ్...."
    తనకు ఇక్కడకు ఫోన్ రావడం ఏమిటి?
    తను ఈ సమయంలో ఇక్కడ వుండే విషయం ఎవరికీ తెలియదే. ఆ బ్లాకు మెయిలరు కు తప్ప.
    ఎస్ అతనే అయివుండాలి.
    యాంత్రికంగా వెళ్ళి ఫోన్ అందుకున్నది.
    "హల్లో."
    వెరీగుడ్ మైడియర్ వకుళా డార్లింగ్ ! చెప్పినట్లే  చేస్తున్నావు నీ కారులో కుర్చుని ఎదురుగా వున్నా రోడ్ వెంట బయలుదేరా వంటే నిన్ను సిటీ బయటకు తీసుకువస్తుంది. అక్కడ రెండు రోడ్లు చీలతాయి. ఎడమ వైపు వున్న రోడ్ లోకి తిరిగి మూడు కిలోమీటర్లు వచ్చానంటే ఒక పెద్ద తోట మధ్యలో బిల్డింగ్ కనబడుతుంది. సరాసరి ఆ బిల్డింగ్ లోకి వచ్చేయి నీ కోసం నేను అక్కడే ఎదురు చూస్తుంటాను' అని ఫోను పెట్టేశాడు అతను.
    అతని వునికి తనకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడని అదీ గాకుండా దూరం నుండి తనని గమనిస్తూనే వున్నాడని అర్ధం గావడంతో ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అతను చెప్పినట్టుగా కారులో బయలు దేరింది వకుళ.
    ఆమె కారు కదలడం గమనించి తను కూడా మరొక రూట్ లో ఆమె కన్నా ముందుగానే తను చెప్పిన బిల్డింగ్ దగ్గరకు చేరుకొని ఆమె కోసం ఎదురు చూడసాగాడు అతను.
    మరికొద్ది సేపటికి వకుళ కారు ఆ భవంతి ముందు ఆగింది.
    అది ఎవరూ ఉపయోగించకుండా వుండడం వలన పాడుపదిపోయింది శిధిలావస్థకు చేరుకుంది.
    బ్లాక్ మెయిలర్ కావాలనే ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడని అర్ధం చేసుకున్నది.
    "రా డార్లింగ్.....లోపలకు రా"
    వకుళ చివ్వున తల ఎత్తింది.
    ఎదురుగా బ్లాక్ మెయిలర్ .....అతని ముఖం గుర్తుపట్టడానికి వీలు లేకుండా పలుచని మాస్క్ తొడుక్కుని వున్నాడు. కళ్ళు ముక్కు, పెదవులు వరకు మాత్రం రంద్రాలు వుండడం వలన ఆ మాస్క్ అతని ముఖానికి అతుక్కుపోయినట్టుగా వుంది.
    అతనిని ఏ విధంగానూ తను గుర్తించలేదు.....
    "నువ్వు ఎవరో తెలుసుకోవచ్చా?"
    "నువ్వే అన్నావుగా నేను బ్లాక్ మెయిలర్ నని బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు ఎవరూ తమ వివరాలు చెప్పుకోరు. బైదిబై డబ్బు తెచ్చావా?" లోపలకు నడుస్తూ అడిగాడు అతను.
    వకుళ మాట్టాడకుండా కాష్ బాగ్ అందించింది.
    దానితో పాటే ఆమె చేతిని కూడా అందుకున్నాడతను.
    "ఏమిటిది?"
    "ఏమిటా? ఆ మాత్రం అర్ధం కాలేదా? నువ్వు పిచ్చిగా వెంపర్లాడేది ఇందుకోసమేగా? రా...కమాన్ ....ఇక్కడ ఎసి లేకపోవచ్చు ఫరవాలేదుఈ చాపమీద శృంగారం ఎలా వుంటుందో కొత్త అనుభవాన్ని రుచి చూద్దువు గాని...." ఆమె చీర కుచ్చిళ్ళను పట్టి వూడదీసే ప్రయత్నం చేస్తూ అన్నాడు అతను.
    "షటప్ .....ఎవడితో పడితే వాడితో పడుకోవడానికి నేను వేశ్యను కాను" విదిలించుకుంటూ అన్నది వకుళ.
    "నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియనిది ఏముంది....నీ ఇష్టం ఇందులో బలవంతం ఏమీ లేదు.... ఇష్టం లేకపోతే వెళ్ళి పోవచ్చు కాకపోతే తరువాత ఏం జరిగినా నన్ను నిందించి ప్రయోజనం లేదు" విలాసంగా అన్నాడు అతను.
    "ఏమిటి......నువ్వు అనేది.... అడిగిన డబ్బు తెచ్చానుగా?"
    'ఆ డబ్బుతో పాటు నువ్వు కావాలంటున్నాను...."
    "ఇది అన్యాయం"
    "నువ్వు చేసే తప్పుడు పనికన్నా ఇదేమీ ఘోరం కాదులే"
    చటుక్కున ఆమెను కౌగలించుకున్నాడు.
    ఈసారి ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు.
    చేసినా ప్రయోజనం వుండదని తెలుసు కాబట్టే యాంత్రికంగా అతనికి శరీరాన్ని అప్పగించింది.
    పది నిమిషాల తరవాత....
    "థాంక్యూ డార్లింగ్.....అడిగిందే తడవుగా డబ్బుతో పాటు నీ శరీరాన్ని కూడా అప్పగించి విందు చేశావు. వీడు ఇలానే పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటాడేమో అని మనస్సులో తెగ మధనపడి పోతున్నట్లు వున్నావు. నీకు ఆ భయం అక్కరలేదు! ఒక నేను నీ జోలికి రాను ...నువ్వు నీ ప్రియునితో యధేచ్చగా విహరించినా నేను పట్టించుకోను అన్నాడు బ్లాక్ మెయిలర్.
    వకుళ మౌనంగా వచ్చి తన కారులో కూర్చున్నది.
    ఆమె కారులో వెళ్ళిపోయాక అతను లోపల గదిలోకి వెళ్ళాడు.
    అంతవరకూ ఆ ఇద్దరి తతంగాన్ని గమనిస్తున్న ఆ గదిలోని మరొక వ్యక్తీ ముఖంలో చిరునవ్వు చిందులు వేసింది .....
    ఇద్దరు ఆనందంగా నవ్వుకున్నారు....
    ఆప్యాయంగా నోట్ల కట్టలను తడిమి చూసుకోవడంలో మునిగి పోయారు ఆ ఇద్దరు....


                                                         *    *    *

    అతని అరుపులతో పోలీస్ స్టేషన్ దద్దరిల్లిపోయింది.
    లాకప్ తలుపులు దగ్గరకు వేసి వున్నాయి.
    లోపల వున్న నేరస్తుడ్ని ఇసుక మూటతో ఆడుకుంటున్నట్లు అతని శరీరాన్ని హూనం చేస్తున్నారు పోలీసులు.
    ఇన్ స్పెక్టర్ ధీరజ స్టేషన్ లోకి అడుగు పెడుతూనే ఆ దృశ్యం చూసింది.
    ఆమెను చూడడంతో ఇంటారగేషన్ ను తాత్కాలికంగా ఆపారు.
    "ఎవరతను? ఏం నేరం చేశాడని అలా చావ బాదుతున్నారు?"
    ధీరజ ముఖం సీరియస్ గా వుంది.
    "రాత్రి బాగా తాగి ప్లాట్ ఫారం పై ఆడవాళ్ళను అల్లరి పెడుతుంటే తీసుకొచ్చి లాకప్ లో పడివేశాం మేడమ్ తెచ్చిన దగ్గర నుంచీ పోలీసులందరినీ వరుస పెట్టి అమ్మలక్కల బూతులతో తిట్టి పోస్తున్నాడు. ఎంత ఓర్పుగా చెప్పినా, నోరుమూసుకోకపోగా ఒళ్ళు పొగరెక్కి నోటి కిష్టం వచ్చినట్టు మట్టాడుతున్నాడు" చెప్పాడు హెడ్ కానిస్టేబుల్.
    "ఆ మాట చెప్పడానికి మీకు బుద్ది లేదూ.....తిట్టినంత మాత్రాన అలా కొడతారా?"
    కోపంతో ఆమె ముఖం జేవురించింది.
    'అది కాదు మేడమ్.... ఉచ్చ నీచాలు మరచి కనిపించిన ఆడవాళ్ళ నందరినీ అసభ్య మాటలతో వికార చేష్టలతో న్యూస్ న్స్ క్రియేట్ చేస్తుంటే తీసుకువచ్చాం. నాలుగు అంటిస్తే తప్ప వాడి కసలు ఎక్కిన నిషా పోదు...." అంటూ ఇంకేదో చెప్పబోయాడు.
    "స్టాప్ దట్ నాన్సెన్స్ .....కానీ మీరు పెట్టె టార్చర్ కు తట్టుకోలేక చచ్చాడనుకో ఏమవుతుంది? లాకప్ డెత్ ....అతను చేసిన నేరం ఏమిటి అని అప్పుడు అరా తీస్తే కేవలం న్యూసెన్స్ కేసు అని తేలుతుంది. ఒట్టి న్యూసెన్స్ కేసు కోసం సెన్స్ లేకుండా అంత సీన్ క్రియేట్ చేసినందుకు ఫలితం తెలుసా? సస్పెండ్ చేస్తారు."
    స్టాఫ్ మౌనంగా తలవంచుకున్నారు.
    అతను తాగివున్నాడు. కాదనడం లేదు. ఆడవాళ్ళను అల్లరి పెట్టడమూ అసభ్యంగా తిట్టడమూ తప్పే! కానీ అవన్నీ నిషాలో వున్నప్పుడూ చేశాడే తప్ప మాములుగా వుండి కాదు. అంటే అతనిలోని మైకం అతనిచేత అలాంటి తప్పులు చర్యలను ప్రేరేపించింది. అప్పుడు మనం ఏం చేయాలి? అతని మత్తుదించే ప్రయత్నం చేయాలి ముందు. అంతేగాని గొడ్డుని చితక్కోట్టినట్టు చవబాదడం కాదు. ముందు మజ్జిగ తీసుకువచ్చి అతని చేత తాగించండి" నింపాదిగా చెప్పింది ధీరజ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS