అబ్బ! ఏం అదృష్టవంతుడివిరా నాయనా! అని మనసులో అనుకుని ఉఉరు ప్రయాణం కాన్సిల్ కావడం, రాజీకి కోపం వచ్చి మాట్లాడకపోవడం, మర్నాడే అఫీసులో జాయిన్ అవడం, ఆ రోజే ఆఫీసులో పార్టీ జరిగి ఆలశ్యంగా యింటికెళ్ళడంతో పరిస్థితి యింకా విషమించటం, అన్నీ వూసగుచ్చినట్టు చెప్పాడు రాంపండు.
"ఇంట్లో మనశాంతి లేక యిలా వచ్చాను. నా చేతిలో లేనిదానికినా బాధ్యత ఏముందో నువ్వే చెప్పు? మా చిన్నాన్నని వూర్నుమ్ది నేను రామ్మాన్నవా? నిన్న ఆఫీసులలో పార్టీ నేను ఆరెంజ్ చేశానా?" తల పట్టుకుని అన్నాడు రాంపండు.
"ఇదిగో... నీలాగా బేలగా వుంటే యిలానే నెట్టికెక్కి కూర్చుంటారు. నేను చూడు తాను ఎడ్డెం అంటే నేను తేడ్డం అంటాను. తానుఎదయినా ప్రశ్నిస్తే 'నా యిష్టమే! నీ బాబుతో చెప్పుకో' అంటాను. అలా అంటే వీళ్ళు చెప్పు చేతల్లో వుంటారు" కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతూ అన్నాడు బ్రహ్మాజీ.
"ఏమో! నీలా అందరూ అదృష్టవంతులు కారుగా! నేను ఒకటి అంటే మా ఆవిడా నాలుగంటుంది. సరే_ ఆఫీసుకు టైమవుతుంది. అనవసరంగా నీ టైం వేస్ట్ చెయ్యడం ఎందుకూ.... నేను వస్తా" రాంపండు లేచాడు.
"అలాగే! ధైర్యంగా వుండు. మరీ అలా బేలగా అయిపోకు" అని తర్వాత లోపలకి చూస్తూ "ఇదిగో నిన్నే! వంటెం చేస్తున్నావ్? ఓ పని చెయ్యి. బంగాళాదుంపలు వేయించి, కొబ్బరి పచ్చడీ, సాంబార్ చెయ్యి. త్వరగా చసి తగలదు. అఫేసుకు టైమవుతుంది" అని మళ్ళీ రాంపండు వంక గర్వంగా చూసి కళ్ళేగరేస్తూ "మగాడిలా బ్రతకాలోయ్" అన్నాడు బ్రహ్మాజీ.
రాంపండు రక్తం వేడెక్కింది.
నిజమే. బ్రహ్మజీలా చెయ్యాలి అంతే" అని అనుకుని "నేనింక వస్తా" అని చెప్పి వెళ్ళిపోయాడు రాంపండు.
హాల్లోంచి గదిలోకి వచ్చిన అతను బిక్కచచ్చిపోయాడు.
ఎదురుగ దుర్గ క్రూరంగా చూస్తూ నిలబడి వుంది.
"నునును నువ్వు స్నానం చేసి ఎప్పుడు బయటికోచ్చావ్?" తడబడుతూ అడిగాడు.
"ఇఇఇ ఇందాకే వచ్చా! మీరు రాంపండుతో వాగిన వగుడంతా విన్నా" అతని చెవి పట్టుకుంది దుర్గ.
* * * *
ఆఫీసులో....
లంచ్ టైంలో.... లంచ్ బాక్స్ ఓపెన్ చేశాడు బ్రహ్మాజీ.
"ఇదిగో చూశావా! సాంబార్ అన్నం, బంగాళాదుంపల వేపుడు,ఇది కొబ్బరి పచ్చడి చూశావా. అన్నీ నీ ఎదురుగానే ఆర్డర్ యిచ్చా. చచ్చినట్టు అదే చేసింది. ఏ మాత్రం తేడా వచ్చినా చొక్కా చీరేస్తానని దానికి తెలుసు. అన్నట్టు నీ బాక్స్ ఏది? అన్నాడు అతను.
"ఈ వేళ వంటెం నా బాక్స్ ఏది?" అన్నాడు అతను.
"ఈ వేళ వంటెం లేదు. బాక్స్ ఎక్కడి నుండి తెస్టా" అన్నాడు రాంపండు.
"ఏం పర్లేదు. నా బాక్స్ షెర్ చేసుకుందాంలే. మా ఆవిడా ఎంత రుచిగా చేస్తుందో చూద్దువుగానీ" బాక్స్ మూటలో రాంపండు కోసం వెయ్య సాగాడు అతను.
"అవునుగానీ! నీ తలమీద ఆ బోడి సెంటీ?" అడిగాడు రాంపండు."అదా? హహహ ... అదీ... మరేమో నేను స్నానానికని బాత్రూంలోకి వెళ్ళాను కదా_ అక్కడ కలుజారి పడ్డానన్నమాట! హహహ "
కాలుజారి పడితే అంతగా నవ్వుతూ చెప్పాల్సిన అవసరం ఎంటో రాంపండుకి అర్ధం కాలేదు.
"కాలు జారి పడితే నెత్తిన ఎలా బొప్పి కట్టిందీ?" ఆశ్చర్యపోతూ అడిగాడు.
"అంటే రెండు కాళ్ళూ మరీ ఘోరంగా జారి, కళ్ళు రెండూ గాల్లోకి లేచిపోయి తల క్రిందులుగా పడ్డాడన్నమాట! హహహ..."
"అమ్మో! అల పడ్డవంటేబుర్ర బద్దలవ్వల్సిందే.... నికీ చిన్నా బోడిపెతో ప్రమాదం తప్పిపోయిందంటేఅదృష్టవంతుడవే."
"అవును కదా మరి... హహహ... తిను!" టీఫీన్ బాక్స్ మూతని రాంపండు ముందుకు జరుపుతూ అన్నడు అతను.
* * * *
అమ్మాయో! అలాగా?" అంది సత్యవతి రాజీ వంక జాలిగా చూస్తూ.
రాజీ తలూపుతూ ముక్కు చీర కొంగుతో చీదుకుంది.
"ఊర్కో! ఊర్కో! ఈ మగాళ్ళంతా యింతే. ఎక్కడో నూటికో అంత నిర్లక్షం పనికి రాదు సుమా." "పెళ్ళయిన కొత్తలో బాగానే వుండేవారు. ఇంకా పిల్లా లేదూ, పీచూ లేదూ. అప్పుడే మోజు తీరిపోవలా ?" మేక్కోతూ అంది రాజీ.
"కొంపదీసి వేరే ఆడదాని మోజులోగానీ పడలేదు కదా?" అడిగింది సత్యవతి.
"ఛీఛీ ! ఆయనలాంటివారు కాదు. నేనంటే నిర్లక్ష్యం చోపిస్తూన్నారు అంతే! ఆడిన ఎందుకో తెలీదు."
"ఎందుకేమీటీ! నువ్వు మెత్తగా వుమ్త్వుగా. అందుకుని లోకువ_ఇలా మాట్లాడకుండా, తిండీ తిప్పాలూ లేకుండా వుంటే ఒరిగేదేమీ వుండదు. ఎదిరించు. ఏం కావాలన్నా నిలదీసి అడుగు_ అప్పుడుగానీ దార్లోకి రారు ఈ మగవాళ్ళు. నేను ఏదైనా సినిమాకి వెళదాం అన్నాననుకో అయన ఇప్పుడు వీలు కుదరని ని అన్నారో.... చచ్చారన్నమాటే. ముందు బాగా దులిపి పారేస్తా. తర్వాత ఎలా కుదరదో చూస్తా అని అయన చొక్కా కలర్ పుచ్చుకుని సినిమా ఎలాసుకరదనిఅని అన్నారో ..... ఛచచ్చి న్నమాటే.ముందు బాగా దులిపి పార్స్త. తర్వాత ఎలా కుదరదో చూస్తా అని యన చొక్కా కలర్ పుచ్చుకుని సినిమా హాలుకి లక్కేళ్తా" అంది సత్యవతి. తర్వాత "బాబోయ్! టైమైంది. ఇప్పుడు ఆయనోస్తారు. నేను తర్వగా తయారవ్వాలి. ఇద్దరం అలా త్య్మ్క్ బండ్ మీదికి షికారేళ్ళి, అక్కడ్నుంచి హొటల్ కెళ్ళి భోజనం, సెకండ్ షో సినిమా కేల్దామా అనుకుంటున్నాం.... వస్తానేం" లేచి హడావడిగాబయటకు పరుగు తీసింది.
"ప్చ్! సత్యవతి ఎంత అదృష్టవంతురాలు?! దాని మొగుడు అన్ని కోరికలు తీరుస్తాడు! మొగుడ్ని గుప్పిట్లో పెట్టుకుంది ఎంచక్కా" అనుకుని లేచి నిలబడింది రాజీ.
ఓసారి బద్దకంగా ఒళ్ళు విరుచుకుని వీధి తలుపు గడియవేసి వెనక్కి తిరిగి రెండడుగులు వేసింది.
"డింగ్ డాంగ్..."
డోర్ బెల్ మోగింది.
సత్య ఏమైనా మర్చిపోయి వెనక్కి వచ్చిందా?
వెనక్కి తిరిగి డోర్ దగ్గరికెళ్ళి తలుపు గడియ తీసింది.
ఎదురుగా రాంపండు.
రాజీ వంక నిర్లిప్తంగా చూశాడు.
ఒకరికొకరు పరిచయం లేని వ్యక్తులు కూడా అంత నిర్లిప్తంగా ఒకరికొకరు చూసుకోరు.
ఇద్దరూ ఎవరి మనస్సుల్లో వారు ఒక ఖచ్చితమయిన నిర్ణయానికి వచ్చారు.
"ఏంటి అలా గుమ్మానికడ్డుగా నిలబడి దేభ్యం మొహం వేసుకుని చూస్తున్నావు.... పక్కకి తొలుగు" అన్నాడు రాంపండు కరువుగా లేని కురుకుదనం తెప్పించుకుని పైకి అన్నాడేగాని మనసులో బెదురుగా వుంది ఏం గొడవ అవుతుందోనని.
రాజీ అతని గొంతులోని మార్పుకీ మొహంలో ఎప్పుడూ చూడని ఎక్స్ ప్రెషన్ కీ వులిక్కిపడింది. అసలు రాంపండు ఇంటికి రాగానే తనే అలా కఠవుగా మాట్లాడలని అనుకుంది. కానీ తనకంటే ముందుగా అతను మాట్లడేసరికి క్షణంపాటు ఆమె మెదడు మోద్దుబారిపోయింది.
