Previous Page Next Page 
రెడీమేడ్ మొగుడు పేజి 16

    అతను నోరు చప్పరిస్తూ నిల్చున్నాడు.

    "స ర్ ర్ ర్ ....స ర్ ర్ ర్ ..." మొత్తం కాఫీ జుర్రేసీ టీపాయ్ మీద పెడుతూ "కాఫీ చప్పగా చల్లారి చచ్చింది మీ మొహం మండా" అంది దుర్గా.

    "నీకు బాగా ముగించే యిచ్చాను మరి. ఇంతలోనే ఎలా చల్లారిందో ఎంటో" నసిగాడు అతను.

    "ఊ... సరే లోపలకి తగలడి వంట మొదలుపెట్టండి."

    "అలాగే... ఏం చెయ్యమంటావు?"

    "బంగాళాదుంపల వేపుడూ,సాంబారు,కొబ్బరి పచ్చడి చెయ్యండి."

    "దుర్గా! పోనీ కాఫీ లేకపోతే పోయిందిగానీ నా కోసం కూడా కాస్త అన్నంవండుకుంటానే."

    "వీల్లేదు గాక వీల్లేదు."

    "నేనంత పాపం ఏం చేశానే బాబూ?"

    "మీరన్నీ అబాద్దాలే చెప్తున్నారు. నిన్న ఆఫీసు నుండి ఆలస్యంగా ఎందుకొచ్చారూ అంటే తిన్నగా సమాధానం చెప్తున్నారా?"

    "అయ్యో రామా! నేను చెప్తున్నది నిజమనే బాబూ! మా ఆఫీసులో ఎవడో గన్నయ్  గాడికి నా ఖర్మ కాలి ట్రాన్స్ ఫరైంది. అందుకుని ఫేర్ వేల్ పార్టీ యిచ్చారు. నిన్ను నేనెలా నమ్మించాలి?" నొసలు మీద కొట్టుకుంటూ అన్నాడు అతను.

    "నన్ను నమ్మించాలని ప్రయత్నించోద్దు. నిజం చెప్పండి చాలు. అసలు ఆ దేవతతో గానీ దొరికితే చీపుర్తో సన్మానం చేస్తా" అంది ఆమె బ్రహ్మాజీ వంక క్రూరంగా చూస్తూ.

    ఇంతలో డోర్ బెల్ మోగింది.

    "ఎవరో చూడండి" అంది దుర్గా.

    అతను బయటికివెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ముఖం వేళ్ళాడేసుకొని రాంపండు!

    ఇంట్లో పరిస్థితి యిలా వున్నప్పుడోచ్చాడెంటబ్బా? అనుకున్నాడు అతను.
 
    "నువ్వా?! కంగారుగా అరిచాడు.

    రాంపండు వులిక్కిపడ్డాడు.

    "ఎందుకలా అరిచావు?" రాకూడని టైంలో  వచ్చానా?" అడిగాడు.

    "అబ్బే... అదేం కాదే...మరేమో నువ్వా చానళ్ళకి మా  ఇంటికి వచ్చావు కదా... అందుకని ఆనందంతో అరిచానన్నమాట.హిహిహి ....

    "ఏవండోయ్.... ఎవడోచ్చాడూ? బిచ్చాగాడా? ఈ మధ్య వెధవలు డోర్ బెల్ నొక్కి మరీ ఆడుక్కుంటున్నారు. ఏంలేదని చెప్పి తలుపేసి రండి" లోపల్నుండి అరిచింది దుర్గ.

    రాంపండు ముఖం వేలవేలబోయింది.

    "హవ్వ హవ్వ హవ్వ..." నోటిమీద అరచేత్తో కొట్టుకున్నాడు బ్రహ్మాజీ. " బిచ్చగాడు కాదు... ఆఫీసులో నాతో బాటు పని చేసే రాంపండు వచ్చాడు"లోపలకి చూస్తూ అన్నాడు అతను.

    అతను గుమ్మానికి అడ్డు అడుగుపెట్టాడు.

    ఇద్దరూ హల్లో కూర్చున్నారు.

    "ఏంటి సర్ ప్రయిజ్ విజిట్?" అడిగాడు అతను.
 
    "ఏం లేదు! నా మూడ్ బాగోక వచ్చా" అన్నాడు రాంపండు

    "ఉండు... కాఫీ తెస్తా" లేచి లోపలకి వెళ్ళాడు అతను.

    "దుర్గా... దుర్గ... ప్లీజ్ మా వాడోచ్చాడు కాస్త కాఫీ పెట్టివ్వవా?"

    "మీరే పెట్టివండి" పెడసరంగా అంది ఆమె.

    "అది కాదె బాబూ! నేను పెట్టిస్తే వాడి ముందు నా పరువేంకాను?"

    "మీరే పెట్టారని అతనికేలా తెలుస్తుంది? అతనే మైనా వంటగదిలోకి వస్తాడా? సరేగానీ నిన్న మీ ఆఫీసులో పార్టీ జరిగిందన్నారుగా.... వుండండి మీరు నిజం చెప్తున్నారో లేదో అతన్ని కనుక్కుంటూ" గుమ్మం వైపు అడుగులు వేసింది.

    అతను కెవ్వుమని అరిచి దుర్గ చెయ్యి పట్టి ఆపాడు.

    బాబోయ్.... నువ్వలా అడిగావంటే నా పరువు పోతుందే బాబూ!"

    "చూశారా చూశారా... అడగనివ్వకుండా అపుతున్నారంటే మీరు నాతో అబద్దం చెప్తున్నారన్నమాట?" కొరకొరా చూస్తూ అంది దుర్గ.

    "నిన్ను నేనెలా నమ్మిమ్చనే తల్లీ! బ్రహ్మాజీ తలకాయ పట్టుకున్నాడు. వేమత్నే అతనికో ఆలోచన వచ్చింది. "పోనీ నేను అతనితో నిన్న జుఅరిగిన పార్టే గురించి మాట్లాడ్తా... నువ్వు తలుపు వెనకాలనుండి విను... ఏం?" అన్నాడు.

    "సరే అలాగే ఏడవండి" అంది ఆమె.

    అతను వంటగదివైపు అడుగులు వేశాడు.

    "కాఫీ అతనోక్కడికే యివ్వండి. మీరు తాగారో చీరేస్తా."

    అతను కాఫీ పెట్టుకుని బయటకెళ్ళాడు.

    "ఇదిగోనొయ్ కాఫీ! మా ఆవిడే పెట్టింది. తీస్కో " కాఫీ కప్పు రాంపండుకి అందించాడు అతను.

    "మరి నీకో?" అడిగాడు రాంపండు.

    "నాకా? నాకెందుకూ? నేనిందాకే చెంబుడు కాఫీ తాగా...హిహి"

    "నాకు కంపెనీ యివ్వడం కోసమైనా కొంచెం తాగవోయ్."

    "అబ్బే... నేను తాగితే మా ఆవిడ ఊర్కోడు. అంటే ఎక్కువ సార్లు కాఫీ తాగితే ఆరోగ్యం పాడవుతుందనిఆవిడ భయం. నేనంటే మా ఆవిడకెంత ప్రేమో! హిహి.... నువ్వు తాగు...తాగు."

    రాంపండు కాఫీ సిఫ్ చెయ్యడం మొదలుపేట్టాడు.

    లోపల్నుండి ఆమె దగ్గింది. బ్రహ్మజీకి గుర్తుకొచ్చింది. అప్పుడు తాను క్రితం రోజు పార్టీ కెళ్ళి వచ్చినట్టు ప్రూఫ్ చేసుకోవాలని.

    "మరేమో పండూ... నిన్న పార్టీ భలే జరిగిదెం.... ఆ  కేడీరావ్ గాడు అస్సలు పనే చెయ్యడు గానీ వాడు ట్రాన్స్ ఫరై వెళ్ళిపోతున్నాడంటే ఎలా పొగిడారో చూడు."

    "అవును.... అలాంటి పార్టీల్లో చెప్పే మాటలన్నీ అబద్దాలే అన్నాడు రాంపండు.

    "అబ్బా.... వెధవ పార్టీ గానీ భలే లేటయిపోయింది కదూ?"

    "ఊ..." కప్పు టేపాయ్ మీద పెట్టాడు రాంపండు.

    "విన్నావా?" అరిచాడు బ్రహ్మాజీ దుర్గాని వుద్దేశించి.

    "విన్నాను... బాగా లేటయిందనే కదా అన్నావు. అదే నా కొంపముంచింది" అన్నాడు రాంపండు.

    "ఉండుండు... అప్పుడే చెప్పకు."

    అతనికి కంగారు పుట్టింది. రాంపండు మొహం చూస్తూనే తెలుస్తుంది. వాళ్ళావిడతో గొడవ పడ్డారని. ఇప్పుడు అతనేదైనా వాళ్ళావిడ గురించి చెప్తే లోపల్నుండి దుర్గ విందంటే ఇంకా పీడిస్తుంది. చూశారా వాళ్ళావిడ ఎలా చేసిందో... నేనేదో మంచిదాన్ని కాబట్టీ.... అంటూ.

    రాంపండు అతనింక ప్రశ్నార్ధకంగా చూశాడు.

    "ఇప్పుడే వస్తా..."

    బ్రహ్మాజీ లోపలకి వెళ్ళాడు, దుర్గ టవలూ, బట్టాలూ తీసుకుని బాత్రూంలోకి వెళుతుంది స్నానం చెయ్యాడానికి.

    "విన్నావా?" అడిగాడు బ్రహ్మాజీ

    "ఆ! అఘోరించార్లే...." అంది దుర్గ.

    అలాగైతే నేను కూడా కాఫీ తాగితాను మరి?"

    "ఊ!"

    "నా కోసం కూడా కాసిన్ని బియ్యం ఉడకేస్స్కోంటూ  మరి" చేతులు నలుపుకొంటూ అన్నాడు బ్రహ్మాజీ

    "సరే ఏడవండి! నేను స్నానానికికేలుతున్నా" అంటూ బాత్రూంలోకి వెళ్ళింది.

    బ్రహ్మాజీ తన కోసం కాఫీ పెట్టుకుని కాఫీ కప్పుతో బయటకెళ్ళి రాంపండు ఎదురుగా కూర్చున్నాడు.

    "అదేంటి ఇప్పుడేగా కాఫీ త్రాగమని అన్నావ్ గా... మళ్ళీ ఇదేంటి?" అడిగాడు రాంపండు.

    "అంటే ఓసారి త్రాగమని చెప్పాగా.... మళ్ళీ ఇప్పుడు లోపలికెళితే ఏవండీ! మీరు ఆయనతోపాటు కాఫీ తాగాలేడుగా అని అడిగింది. చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారి కాదే. పదిసార్లు  తాగుతా! నాకిప్పుడు అర్జంటుగా కాఫీ పెట్టివ్వు అన్నా.... చచ్చినట్టు కాఫీ పెట్టికొచ్చింది. అంతేనొయ్! వీళ్ళతో యిలా బిహేవ్ చేస్తే తప్ప కంట్రోల్లో వుండరు. సరేగానీ నీబాదెంటీ?" కాఫీ సిఫ్ చేస్తూ, కాలుమీద కాలేసి వూపుతూ విలాసంగా అడిగాడు బ్రహ్మాజీ. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS