Previous Page Next Page 
శశిరేఖ పేజి 13

శశిరేఖ ఫిడేలు  తీసికొని వాయించెను. అట్లు కాదని అతడు చేయి  పట్టుకొని వాయింపించాపోయెను.  ఆమె చెయ్యి  వెనుకకు లాగుకోనగా, పడవ వెనుకకు  వంగెను, తత్తరపాటున  ఆమెనాతడు గట్టిగా రెండుచేతుల తోడను లాగుటచఆమె అతనిని త్రోసి  వెనుకకు  వరిగెను. పడవ సగము వరిగి శశిరేఖ నీళ్ళలో పడెను. ఇదివరకే మేల్కాంచిన కృష్ణుడును,సుందరరావును, నీళ్ళలోకి దూకి ఆమెను వడ్డున చేర్చిరి. శశిరేఖ స్మృతి లేదు.          
తెల్ల వారునప్పటికి శశిరేఖకు  ఎక్కువగా జ్వరము తాకెను.కడుపు నందు విశేషమగు నొప్పిచే బాధపడుచుండెను.సుందరరావు  చూచి ఆమె అపాయస్దితిలో నున్నదనియును,యింటివద్ధకన్న నుపచారాము
బాగుగా జరుగుననియు, నామె నాస్పత్రికి  మార్పించెను. కృష్ణుడును  సుందరరావును రేయింబగళ్ళు ఆమెను కాచుకోనియుండిరి. పదిహేను దినముల కామెకు స్వస్ద్హత కలిగెను. కాని మిగుల బలహీనముగ నుండి ఆస్పత్రియాందే యున్నది. ఇంతలో కృష్ణుని తల్లికి విషజ్వరము తగిలినది. ఆ యింటికి శశిరేఖను తినుకుని వెళ్ళుట మంచిదిగాదని సుంధరరావనేను. తల్లిని కనిపెట్టుకోనియుండు  కృష్ణుడును ఎక్కువసార్లు శశిరేఖను చూచుటకు వీలులేదు. శశిరేఖకుకావలసిన యుపచారమును  చేయించుటయు,ఆమె  వంటరిగా యుండకుండ మాట్లాడించుటయు సుందరరావు పైబడినది. ఒక  నాడు మధ్యాహ్నము శశిరేఖ ఆస్పత్రిలో తన గదిలో మంచము పై పరుండగా సుందరరావు కుర్చీ పై కూర్చుని మాట్లాడుచుండెను.
సుంద - ఎట్లా ఉందివేళ, చెయ్యి ఏది, మేత్తనిచేయ్యి, ఎంత మొద్దేక్కినదో పనివల్ల. తామరాకును తాటాకు చేయడం పాపము.
శశి - పనిచెయ్యక తప్పుతుందా ఆడవాళ్ళయిన  తరువాత?
సుంద - కోంధరికన్నా తప్పితిరాలి. కొన్ని పువ్వులను  తల్లోపెట్టుకుంటారు. కొన్నిటిని చెట్లమిదనే  వాడిపోనిస్తారు,అన్నీ ఒకటే?
శశి - మికుమల్లే  ఉద్యోగంలో  వుంటే కృష్ణుడుకూడా నవుకర్లను పెట్టేవాడే.
సుంద - ముందు నా ప్రాణాన్ని పోగొట్టుకుంటాగాని అట్లాంటి చెయ్యని పని చేయ్యనిస్తానా ?  ఆ మృదు దేహం మీద ఈగని వాలనిస్తానా?
అతని కంఠధ్వనియం  దేదో మార్పు వినిపింపగా శశిరేఖ ముఖమెత్తి అతనివైపు చుచూనప్పటికి కండ్లయం దగ్ని మామ్డుచున్నటుల కాన్నించెను. అతడేదో లోపల  నణచుకోనుటకు మహాప్రయత్నములు సలుపుచున్నటుల కానవచ్చ్గు-
చుండెను. శశిరేఖ బలహీన మామె  కొక కొత్త యందము నిచ్చినది. బలముగా  నిటునటుతిరిగి   దొరకకుండ  నుండినది. అసహాయయ్తే యొక గుప్పెటలో చిక్కునటుల అచట  పరుండి యుండుట కలిగినది. ఆ కండ్లుమాత్ర మతిప్రకాసవంతముల్తే ఆకర్షణాశక్తీ నినుమడుంచుకోనేను. కలవ తూండ్లవలె తెల్లని యామె హస్తములు సన్నని దేహము ప్రక్కన పడియుండెను. మొదటి నుండియు శశిరేఖకు సుంధరరావును చూచిన  ప్రీతి. అతని వ్తేధ్యము, మర్యాద, సంపాదన చూచిన  నామె  కాశ్చర్యమును,గౌరవముకలదు. ఎంతో నిపుణతతో తాను కుదిర్చిన రోగములనాతడు చెప్పినపుడు ఆమె యాతని శక్తీకా- శ్చర్యపడుచుండును. కాని యీదిన  మాతని ముఖము కాంచినది  మొదలు ఆమె  హృదయమున కోత్తవికార  మొదటి  కనబడినది. గుండెలు తటతట కొట్టుకోనుచు మనసు గిర్రుని తిరిగిపోవుచుండెను. తెలివిగల యాతని ముఖమును నున్నగ గొరిగిన యా సన్నని పెధవులను, తిక్షనములగు నా కండ్లుచూచిన  నామెకు భయము తోచెను. భయమువలని అయిష్టతయు,నాతని పైగల  గౌరవముచే  నిష్టతయు  కలిసినవి.
శశి- మీకు ఇష్టమయినట్లాంటి వాళ్ళకి పెళ్ళి  చేసుకోరాదూ?
సుంద - శశి!నీకు తెలీదూ? నన్నింకా అర్ధం చేసుకోలేదూ?
అని ఆమె ముఖము దగ్గరగా వంగి అడిగెను.
శశిరేఖ  వదలు  కంపించినది. రెండు  చేతులతో  నతనిని  నేట్టేవేసినది. కాని అతడా చేతులను గట్టిగా పట్టుకొని  వానిని బలవంతముగ ముద్దు పెట్టుకొని వేల్లిపోయినాడు.
శశిరేఖ అట్లే పరుండి ఆలోచించుకోన్నది.  బాలవంతముగాతనకతడు కావించిన   అవమానముక్తే  మిగుల
కోపం  వచ్చినది. నేత్రములు కోపారుణముల్తేనవి. ముఖమేర్రబారినది. కాని అతని మాటలు, అతని స్పర్శతన  కానందమును కలిగించిన సంగతి జ్ఞప్తికి  వచ్చుచుండెను.  అతడేమి చేసినను తనకిష్టము  వచ్చుననియు, అతని ప్రేమను తానును వాంచిచు చున్నటుల ఆమెకు తోచేను.  ఆ తలుపుతో వదలు  వణకేను. భయము వేసెను.కృష్ణునియందు తనకు ప్రేమ పోయినదా?పోనీ, తగ్గినదా? లేదు లేదనేను ఆమె హృదయము. కృష్ణుని, అతని మృదుత్వమును,  అమాయకత్వమును, తన పై నాధారపాడు అసహయత్వమును,  తనను ద్తేవముగాచూచు  ప్రేమను, అతని శక్తిని, బలమును, తనయం దాతడు చూపు గౌరవమును ఆమె  నాకర్షించెను. అందరును ఎవరిని  గౌరవించుచుండిరో అతడే తన సౌందర్యమునకు దాసుదయ్యేనుగదా యని గర్వము కలిగెనుకృష్ణు డామెను  "నీ వందముగా నున్నావ"న్నప్పుడు  ఆమె యందమామెకు  తెలియలేడు. చిన్నపిల్లవలె  నవ్వెను. కాని యిప్పడితని చూపులే తన  యందమును   తనకు వేలిబుచ్చుచుండెను. కృష్ణుని ప్రేమ యేయాటం కము లేక యామె పై ప్రవహించిముంచివ్తేచేను. కాని యీతని ప్రేమ ఆటంక పరుపబడి యాగి యాగిలోనిముడక ప్రవహించుచుండును.అతని ప్రేమను  మల్లించుకోనుటకు, అతని తలపులను మార్చుకోనుటకు, అతడు చేయు మహాప్రయత్నములు అతని ప్రేమకు మరింత బలమునాపాదించుచుండెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS