Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 10

   
    నిజమే!

    జి.కె. నిజరూపం తెలిసిపోయింది. తను ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా అతని చేతిలో చావు తప్పదు.

    అలా జరగడానికి వీల్లేదు.

    మామూలుగా అయితే తనకన్నా ముందు వాడే చస్తాడు.

    అప్పటివరకూ విముక్తి లేదు.

    కేవలం డబ్బుకోసం అతన్ని పెళ్ళి చేసుకుంది.

    డబ్బులో అన్ని సుఖాలు వుంటాయని ఆశపడింది.

    జి.కె. ఛస్తే తనే సర్వాధికారిణి. కానీ మధ్యలోనే అనిపిస్తుంది తన ఉద్యోగం తను చేసుకుంటూ ఏ సామాన్యుడినో చేసుకుంటే ఈ నరకం వుండేది కాదు.

    కిరణ్ చేసిన మోసంతో ఒళ్ళు తెలీని ఆవేశంలో జి.కె.తో పెళ్ళికి ఒప్పుకుంది. డబ్బు ఇచ్చే సుఖము వేరు.

    కానీ అచ్చట, ముచ్చట తీరేదెలా?

    గుండెలపైన చేతులు వేసుకుంది.

    పెళ్ళయినా తనింకా కన్నెపిల్లే.

    పెళ్లయిన ఆడది తన సౌభాగ్యాన్ని కోరుకుంటుంది.

    కానీ తను...... తాళి కట్టినవాడిని రెండోరోజే చావాలని కోరుకుంటోంది.

    చెంప చుర చుర లాడిపోతోంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కోల్డ్ క్రీమ్ తీసి చెంపకి రాసుకుంది.

    చెంపపైన కాలిన మచ్చ.......

    ఆమె కళ్ళనించి కన్నీటిబిందువులు చెక్కిళ్ళపైనించి జారుతున్నాయి.

        *    *    *    *

    జి.కె. టెక్స్ టైల్స్, పైనాన్షియల్స్, ఆటోమోబైల్స్, జి.కె. చిట్స్...... కాక ఇంకో కొన్ని సంస్థలలో ఆయన మేనేజింగ్ పార్టనర్.

    రూపాయిని వందగా చేయాలంటే అరసెకను కూడా పట్టదు జి.కె.కి

    బిజినెస్ మైండ్ అతనిది.


    ఈ వయస్సులో కూడా బిజినెస్ వ్యవహారాలని మాత్రం చక్కదిద్దుకుంటాడు.

    రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయం అయిదు గంటలకే లేచి కూర్చుంటాడు. ఫైల్స్ చూసి ట్రేలో పడేస్తాడు. సెక్రటరీ నరేంద్ర ఉదయం వచ్చి ఏ ఫైల్ ఎవరికి పంపాలో అక్కడికి పంపించేస్తాడు.

    డబ్బు, పలుకుబడిగల జి.కె. లాంటి వాడికి ఎదురనేది లేదు.

    కానీ ఒక్కటే లోపం.......

    ఆ లోపమే అతన్ని బెడ్ రూంలోకి వచ్చేసరికి మృగంలా మార్చేస్తుంది.

        *    *    *    *

    నాగమణి అందంగా అలంకరించుకుని క్రింది హాల్లోకి వచ్చింది.

    అప్పటికే జి.కె. వెళ్లిపోయాడు.

    జి.కె.కి తనతో అవసరం లేదు. అతనికి కావలసినవన్నీ పనివాళ్ళే అతనికి అందిస్తారు.

    బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళిపోయాడు.

    లంచ్ కి కారియర్ తీసుకెళ్తారు.

    సోఫాలో కూర్చుని పేపర్ని చేతిలోకి తీసుకుంది నాగమణి.

    పేపర్ని యధాలాపంగా తిప్పుతుందే తప్ప వార్తలపైకి దృష్టిపోవడం లేదు.

    "అమ్మా!"

    ఆ పిలుపుకి తలెత్తి చూసింది నాగమణి.

    నౌకరు మల్లన్న.

    "ఏంటి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS