Previous Page Next Page 
ష్....మాట్లాడొద్దు పేజి 10

    "దేవుడా.. నాకేమైనా పర్లేదు... నా భార్యను చల్లగా చూడు..."అని వేడుకున్నాడు భార్గవ.
   కృపాల్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. భార్గవ కేసుకు, పార్ధసారది కేసుకు 'లింకు' వున్నట్టు అనిపిస్తుంది. 'కనబడుటలేదు' అన్న పేపర్ లోని ప్రకటన చూసినట్టు కానిస్టేబుల్ చెబుతున్నాడు. యిందులో ఏదో మిస్టరీ వుంది.
    అందుకే భార్గవను ఓ కంట కనిపెట్టమని శివరావును పురామాయించాడు.
    కృపాల్ గత నాలుగైదు  రోజులుగా వచ్చిన అన్ని దినపత్రికలు తెప్పించాడు. అందులో మిస్సింగ్ యాడ్స్ కట్ చేసి ఫైల్ లా తయారుచేసాడు.
    అన్ని అడ్రసులు చూసుకున్నాడు.
    కనబడుటలేదు అన్న ప్రకటన కింద కొందరు ఫోన్ నెంబర్ లు  మరికొందరు అడ్రస్ లు యిచ్చారు. కొందరు తగిన బహుమతి అని యిస్తే, మరికొందరు పది, పాతికా, లక్షా అని యిచ్చారు.
    ముందుగా ఫోన్ నెంబర్స్ యిచ్చిన, ఫో నెంబర్లు నోట్  చేసుకొని ఫోన్  చేసాడు. అవతలివైపు  ఫోన్ ఎత్తగానే తప్పిపోయినవారి వివరాలు అడిగాడు వాళ్లు చెప్పారు.
    కొన్ని అడ్రస్ లకు (లోకల్) మరో కానిస్టేబుల్ ని పంపించి ఎంక్వయిరీ చేయించాడు.
    అలా అన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ వచ్చిన కృపాల్ ఒక్కసారి ఆగిపోయాడు.
    అతని దృష్టి  ఒకచోట ఆగిపోయింది. గత వారంరోజులో గా వచ్చిన ప్రకటనల్లో, తప్పిపోయిన ఫోటోలలో రెండింటి అడ్రసు ఒకటే... మిధిలానగర్... యింటి నెంబర్ పదహారు. అందులో మతిస్ధిమితం లేని వ్యక్తి అడ్రస్ కూడా అదే.
    కృపాల్ మెదడులో ఎక్కడో ప్లాష్ వచ్చింది.
    ఒకే యింట్లో ఇద్దరు తప్పిపోవడమేమిటి? అడ్రస్ కూడా క్లియర్ లేదు.
    ఆ ప్రకటన పడ్డ పత్రికాఫీసుకు ఫోన్ చేశాడు. అడ్వర్టయిజ్ డిపార్ట్ మెంట్ కు కనెక్షన్  యివ్వమన్నాడు. ఈ ప్రకటన గురించి అడిగాడు.
    ఆ ప్రకటన ఎవరో ఓ వ్యక్తి వచ్చి యిచ్చారు. అమౌంట్ పేచేసి ఫోటో యిచ్చివెళ్లాడని  పూర్తి వివరలు  ఏమీ లేవని చెప్పారు అవతవైపు.
    వెంటనే ఓ కానిస్టేబుల్ ని మిథిలానగర్ కు పంపించాడు.
  ఆ కానిస్టేబుల్ వచ్చేవరకు కృపాల్ ఏమీ ఆలోచించలేకపోయాడు. మధ్యాహ్నం రెండు దాటుతుండగా కానిస్టేబుల్ వచ్చాడు.
    "సార్...అదో పాడుబడిన  యిల్లు... మూడ్నాలుగేల్లు గా ఆ యిల్లు ఎవరూ వాడ్డంలేదట... కరెంటు కనెక్షన్ కూడా లేదు."
    "నువ్వు సరిగ్గా చూసావా?"
    "సరిగ్గానే చూసాన్సార్. ఆ యింట్లో మనుష్యులు వుండే  ప్రసక్తే  లేదు."
    కృపాల్ భృకుటి ముడిపడింది.
    "సమ్ థింగ్  ఈజ్ రాంగ్" ఎక్కడో ఎదో జరిగింది. తనీ మిస్టరీని  ఛేదించాలి.
    తనే రంగంలోకి దిగాలి. ఇలా ఆలోచిస్తుండగా , కానిస్టేబుల్ శివరావు వచ్చాడు.
    కృపాల్ కు సెల్యూట్ చేసి  చెప్పాడు. "సార్...మీరు చెప్పినట్టుగానే భార్గవను ఫాలో అయ్యాను. బ్యాంకు టైమ్ మధ్యలో పన్నెండున్నర ప్రాంతంలో బ్యాంకు ఎదురుగా వున్నా ఇరానీ హొటల్ కు  వెళ్లి టీ తాగాడు. తర్వాత హొటల్  పక్కనే వున్నా తాళాలు బాగుచేసేవాడితో ఏదో మాట్లాడి వాడిని పక్కకు తీసుకెళ్లాడు.
    వాడిని ఫాలో అయ్యాను కానీ క్షణాల్లో మిస్సయ్యాడు. తిరిగి ఒంటి గంటకు బ్యాంకుకు వచ్చాడు" డిటెయిల్ట్ గా చెప్పాడు.
    "ఐసీ... నువ్వు అతడ్ని జాగ్రత్తాగా ఫాలో అవ్వు. ప్రణవికి అతనివల్ల ఏదైనా ప్రమాదం  జరిగినా జరగవచ్చు. ఏమాత్రం అలాంటి సిచ్చుయేషన్ వచ్చినా, అతడ్ని కస్టడీలోకి తీసుకోవడానికి వెనకాడవద్దు" చెప్పాడు కృపాల్.
    "అదేంటిసార్... భర్తవల్ల భార్యకు ప్రమాదమా? తన భార్యను తనే చంపుకుంటాడా?" శివరావు అడిగాడు.
    "భర్తవల్ల భార్యకు ప్రమాదం వుండదు "
    "మరి ఆ భార్గవవల్ల"
    "భార్గవవల్ల  ప్రణవికి ఏ ప్రమాదమూ లేదు"
    "మరి నేను  చెప్పేది భార్గవ రూపంలో  వున్నా వ్యక్తి గురించి"
    శివరావు అదిరిపడ్డాడు.
    "ఏంటిసార్ మీరనేది?"
    "యస్...నా అనుమానం నిజంమైతే , అతను ఒరిజినల్ భార్గవ అయివుండడు. అతని ప్లేస్ లో వచ్చిన డూప్లికేట్ కావచ్చు."
    "ఇది... యిదెలా సాధ్యం సార్" విస్మయంగా అడిగాడు కానిస్టేబుల్ శివరావు.
    "ఇది పెద్ద కష్టమైన విషయం కాదు శివరావ్... టెక్నాలజీ డెవలప్ అయింది. పూర్వంరోజుల్లో అయితే మాస్క్ లు  ఉపయోగించేవారు. కళ్లకు గంతలు కట్టుకునేవాళ్లు. యిప్పుడు తలుచుకుంటే... రూపమే మారిపోతుంది. ప్లాస్టిక్  సర్జరీ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు దాదాపు అసాధ్యమన్నదే లేదు. నేరస్దుల్లో కూడా  తెలివితేటలు పెరిగాయి. దురదృష్టం ఏమిటంటే, ఆ తెలివితేటలను వక్రమార్గనికి, చెడుకు  ఉపయోగిస్తున్నారు" కృపాల్ చెప్పాడు ఆవేదనగా.
    శివరావు అలా వింటూండిపోయాడు. కృపాల్ అంటే అందుకే శివరావుకు  గౌరవం. శివరావుకె కాదు ఆ స్టేషన్ లో అందరికీ. దూరదృష్టి సిన్సియార్టీ... డెడికేషన్ ... సమాజంపట్ల  అవగాహన సామాజిక స్పృహ... యివన్నీ కృపాల్ లో వుండే ప్లస్ పాయింట్స్.
    "పాపం...నా బాధంతా  ఆ అమ్మాయి ప్రణవి గురించే ... తన భర్త నిజం భార్తకాదని చెప్పలేము" అన్నాడు కృపాల్.
    ఇవన్నీ తెలియని ప్రణవి ఆ రాత్రి భర్త కౌగిట్లో కరిగిపోవడానికి ఎదురు చూస్తోంది.
    రాత్రి తొమ్మిదిన్నర  అవుతుండగా భార్గవ వచ్చాడు.
    ప్రణవి భర్త చేతిలో పెద్ద  ప్యాక్ వుండడం చూసి ఆశ్చర్యపోయింది. లోపలికి వస్తూనే తలుపేస్తాడు. తన చేతిలో వున్న ప్యాక్ టీపాయ్ మీద పెట్టి, బాత్రూంలోకి వెళ్లాడు టవల్ తీసుకొని.
    ఆతృతగా  ప్యాక్ విప్పింది. లోపల దాదాపు పదిమూరల మల్లెపూలదండ, ఆశ్చర్యపోయింది. మూరెడు మల్లెల కోసం డబ్బు దండగ అనే తన భర్త యింతలా కొనడమా? ఇదికలా?నిజమా?అనుకుంది.
    బహుశా చాలా రోజుల తర్వాత భార్యతో కలవబోతున్నానే ఆనందం వల్ల కాబోలు అనుకుని సిగ్గుపడింది. ఆమె మొహం ఎర్రబడింది.
    మరో బాక్స్ వుంది.  అది ఓపెన్  చేసిన ప్రణవికి స్పృహతప్పినంత పనయింది. నెక్లెస్... రవ్వల నెక్లెస్ .. చాలా కాస్ట్లీ  నెక్లెస్... ఇది నిజంగా కలే అన్న భ్రమ కలిగింది.
    ఈలోగా బాత్రూంలో నుంచి భార్గవ వచ్చాడు.
    "నీకోసమే... అన్నట్టు రేపు అబిడ్స్ వెళ్లి పట్టుచీరలు తీసుకుందాం" అన్నాడు.
    "ఏమిటండీ... యిది నిజంగా నిజమా? నేను నమ్మాలేకపోతున్నాను" ఆనందంగా అంది.
    "కళ్ల ముందు కనిపిస్తుందిగా... సర్లె వెళ్లు... వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసిరా" అన్నాడు.
    ప్రణవి సిగ్గుపడింది. హుషారుగా బాత్రూంవైపు పరుగు తీసింది.
  "సార్... నేను శివరావును మాట్లాడుతున్నాను.భార్గవ తన భార్యకోసం నెక్లెస్ కొన్నాడు. జ్యూయలరీ షాపులోకి వెళ్లి ఎంక్వయిరీ చేసా... ఇంటి లోపలికి వెళ్లి తలుపేసుకున్నాడు."
    "శివరావు... నువ్వు జాగ్రత్తగా వాచ్ చేస్తుండు. నేను... మరో పదిహేను నిమిషాల్లో అక్కడుంటాను. నువ్వో పనిచేయి. ప్రతీ ఐదు నిమిషాలకోసారి భార్గవ కు ఫోన్ చేయి. ఎదో ఓ నెంబర్ కావాలని అడుగు... క్విక్" అంటూ ఫోన్ పెట్టేసాడు కృపాల్.
    క్షణంలో అతనో నిర్ణయం తీసుకున్నాడు. లేడీ కానిస్టేబుల్ సరితను పిలిచాడు.
    "యస్సార్" అంటూ వచ్చింది.
    "నువ్వో పనిచేయాలి... ముందుగా యింటికి వెళ్లి యూనిఫామ్  విప్పి చీరకట్టుకొనిరా... నిన్నోచోతకు తీసుకెళ్తాను ... నీపేరు సరితే ... కాకపోతే నాకు తెలిసిన ఫ్రెండ్ చెల్లెలివి. ఈవేళే మద్రాస్ నుంచి వచ్చావు. నా ఇంటర్వ్యూ కోసం, నిన్ను ఓ యింట్లో వుంచేస్తాను. అక్కడ నువ్వు చేయాల్సింది ఆ అమ్మాయి రాత్రంతా నీతో స్పెండ్ చేసేలా."
    ఎందుకుసార్... అని  అడగలేదు.
    ఎదో ఓ కారణం లేకుండా తమ ఇన్స్ పెక్టర్  ఏ పనీ చేయడని ఆమె నమ్మకం.
    "యస్సార్.... అలాగే" అని  ఓ క్షణమగి "ఎందుకో తెలుసుకోవచ్చా సార్... ఓ అమ్మాయిగా  క్యూరుయాసిటీతో అడుగుతున్నానంతే" అంది సరిత.
    "తెలుసుకోవచ్చు... కానీ అంత టైం లేదు... కానీ ఒక్క విషయం...ఓ  అమ్మాయి జీవితం కాపాడ్డానికి ... ప్రస్తుతం యింతకన్నా వివరాలు చెప్పు లేను" అన్నాడు కృపాల్.
    సరిత వెళ్లిపోయింది.
    మరోపావుగంటలో  ఆమె కృపాల్  ఫ్రెండ్ చెల్లెలుగా అవతారం ఎత్తబోతోంది.
    బాత్రూంలో దూరి స్నానం చేస్తోంది ప్రణవి. ఒక్కసారిగా  తన శరీరం వంక చూసుకుంది. మంచి ఫిజిక్ ఆమెది.
    తన అందం చూసి తనే జెలసీ ఫీలయింది. భర్త చాలారోజులు గా  దూరంగా వుండడంవల్ల ఆమె మనస్సు , శరీరం,సమాగమాన్ని' కోరుకుంటుంది.
    యింకాసేపట్లో తను తన భర్త కౌగిట్లో.....ఈ శరీరాన్ని తన భర్త శృతిమీటుతాడు. ఆ పారవశ్యంతో తను మైమరిచిపోతుంది. ఇన్నాళ్ల విరహానికి ఈ వేల్టితో పుల్ స్టాప్ పెట్టేయొచ్చు.  యింకెప్పుడూ తను తన భర్తకు దూరం కావద్దు.
    అతనిలో వచ్చిన మార్పు కూడా ఆనందాన్ని కలిగిస్తోందావిడకు ముఖ్యంగా అతను తను పిసినారితనాన్ని వదులుకోవడం....
    దేవుడా... నా భర్తను యిలాగే వుండేలా చూడు... అనుకుంది.... అసలా విషయం తెలియకుండా.                              
    భార్గవ అద్దంముందు నిలబడ్డాడు. అతని మొహంలో వికృతంతో  కూడిన నవ్వు స్పష్టంగా కనిపిస్తోంది.
    అతని గురించి ఇక్కడ కొంచెం తెలుసుకోవాలి. భార్గవ రూపంలో వచ్చిన అతని పేరు మద్యప్రదేశ లో వాంటెడ్ లిస్టులో వుంది. ఎన్నో నేరాలతో, ఘోరాలతో అతనికి సంబంధం వుంది. వచ్చి సెక్స్ మానియాక్ ... ఎందరో అమ్మాయిలను నమ్మించి ,ఘోరంగా రెఫ్ చేసి చంపాడు.
    జైలులో వున్నా అతడ్ని  జేమ్స్  డేవిడ్ తప్పించాడు. భార్గవ పోలికలకు దగ్గరగా వుండి, అదే ఒడ్డు , పొడవూ వుండడం ఎస్సెట్ అయింది.
    జేమ్స్ డేవిడ్  భార్గవ  రూపంలో వున్న అతడ్ని ట్రాప్ చేసాడు. అతడ్ని తప్పించడం అతనికి పెద్ద కష్టం కాలేదు.
    క్షణాల్లో  మేకప్ మార్చుకోవడం, ఎదుటివారిని పల్టీ కొట్టించడం అతడికి కష్టంకాదు. అతడి అసలి పేరు ఎవరికీ తేలియాదు. పోలీసుల  లిస్టులో సెక్స్ మానియాక్ , రేపిస్ట్... అంతే.
    అన్ని భాషలో క్షణాల్లో మార్చి మాట్లాడగలడు. భార్గవ వేషంలో బ్యాంకులో రెండ్రోజులు  పనిచేసి, అక్కాడి స్ట్రాంగ్ రూమ్ విషయాలు తెలుసుకొని... ఆ డబ్బును తీసుకురావడం అతని డ్యూటీ.
    అతని డ్యూటీ అతను పూర్తి చేసాడు. ఈరోజు అర్దరాత్రి ఆ పని పూర్తవుతుంది.
    ప్రణవి అందం అతడ్ని టెంప్ట్ చేసింది. వచ్చిన  పని ముఖ్యంగా  కావడంవల్ల దాన్ని ఎవాయిడ్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు ప్రణవి అనుభవించాలి. సెక్స్ లో తన శాడిజాన్ని రుచి చూపించాలి. ఇలాంటి శాడిస్టిక్ ఆలోచనలతో  అతని మోహం  వెలిగిపోతోంది.
    అతను క్షణకాలం  కూడా ఆగలేకపోయాడు. అతని చూపులు గుమ్మం దగ్గర వున్నాయి.
    అప్పుడు గుమ్మంలో ప్రత్యక్షమైంది. పింక్ కలర్ నైటీలో.
       పాలరాతి శిల్పంలా వుంది. ట్రాన్స్ పరెన్సీలో ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    ఇక ఆగలేనట్టు ఆమె దగ్గరగా వెళ్లాడు. సరిగ్గా అప్పడే డోర్ బెల్ మోగింది.
    భార్గవ మొహం ఎర్రబడింది.
    ప్రణవి కూడా డిసప్పాయింట్ గా  చూసింది.  ఈవేళ తమ యింటికి వచ్చే దెవరు?
    "ఒక్క నిమిషం ... ఎవరో వెళ్లి  చూసొస్తా "అంది ప్రణవి.
    "ఎవరో... మనింటి తలుపు అయివుండదు" అంటూ ప్రణవిని దగ్గరకు తీసుకోబోయాడు.
    ఆగకుండా డోర్  బెల్ మోగుతుంది.
    చికాగ్గా మొహం పెట్టాడు భార్గవ.
    "ప్లీజ్... వెంటనే వచ్చేస్తా" అంటూ భార్గవిని విడిపించుకుని వెళ్లి తలుపు తీసింది.
    ఎదురుగా కృపాల్ యూనిఫామ్ లో లేడు. ఆశ్చర్యంగా చూసింది.
    "సారీ...సారీఫర్ ద డిస్ట్ర బెన్స్" అన్నాడు కృపాల్.
    "ఛ...ఛ... అదేం లేదు... రండి" అంది లోపలికి ఆహ్వానిస్తూ.
    అప్పడు గమనించింది. అతడి వెనకే వున్నా అమ్మాయిని.
          "ఈ అమ్మాయి మా ఫ్రెండ్ చెల్లెలు... రేపు ఎదో  యింటర్ వ్యూ  వుందట... వాళ్ల  బంధువుల ఇంటికి వెళ్తే వాళ్లు వూరెళ్లరట... మా యింట్లో ... నేనా బ్రహ్మచారిని....ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు అందుకని... యిఫ్ యూ డోంట్ మైండ్ ...ఈ రాత్రి మీ యింట్లో షెల్టర్  యిస్తే..."
    "అయ్యయ్యో... ఎంత మాట... తప్పకుండా... నాకోసం మీరెంత సాయం చేసారు" అంటూ ఆవిడ్ని తన పక్కనే కూచోబెట్టుకుంది.
    "భోంచేస్తారా ?" అడిగింది ప్రణవి.
    "మీకా శ్రమ అక్కర్లేదు... యిప్పడే హొటల్ లో భోంచేసి వచ్చాం జస్ట్ ... ఈ రాత్రి షెల్టర్ యిస్తేచాలు... అదీ మీకు యిబ్బంది అనుకోకపోతే" కృపాల్ రిక్వెస్టంగ్ గా అన్నాడు
    "అలాంటిదేమీ లేదు... తను ఇక్కడే మరో రెండ్రోజులు వుండి మా  అతిథ్యం స్వీకరించి   మరీవెళ్తుంది"   అంది చిర్నవ్వుతో  సిన్సియర్ గా  ప్రణవి. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS