ఆవిడ ఫరవాలేదు. నాకేమీ ఇబ్బంది లేదు. విద్య ని తీసుకెళ్లండి. పోలీస్ స్టేషన్ ఫార్మాలిటీస్ కూడా ఉన్నాయి కదా. తనతో డిస్కస్ చెయ్యొచ్చు అంది.
విద్యావతి కి ఇంక తప్ప లేదు. సరే అని చిన్న బ్యాగ్లో తన బట్టలు, ప్రొద్దుటి కి కావాల్సిన అవసరాలు పెట్టుకుని అక్కకు చెప్పి బయలుదేరింది.
మోహిత్ కారు నడుపుతున్నాడు.
దారిలో కృష్ణ కుమార్ విద్యావతి కి అన్ని విషయాలు చెప్పాడు. మీరు ఎలా చెప్తే అతన్ని ఆలా మేనేజ్ చేద్దాం అన్నాడు. అతనిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించ వద్దని, జస్ట్ లాక్ అప్ లో ఉంచమని చెప్పాను. మీరు కంప్లైంట్ ఎలా రాసివ్వాలని అనుకుంటున్నారో చెప్తే ఇంటికి వెళ్లిన తరువాత టైపు చేసి పట్టుకెళ్లి ఇస్తాను. అప్పుడు ఎఫ్ ఐ ఆర్ లాడ్జి చేస్తారు అన్నాడు. మీ ఉద్దేశ్యం చెప్పండి.
నాది, పిల్లలది ఒకటే అభిప్రాయం సర్. పెళ్లయినప్పటినుంచి అతని అరాచకాలు ఎన్నో భరిస్తున్నాను. అవి రోజు రోజు కు ఎక్కువ అవుతున్నాయి తప్ప మార్పు లేదు. ఇక అతనిలో మార్పు వస్తుందని కూడా నాకు నమ్మకంలేదు. ఇలానే ఉంటె నేను మానసిక స్తైర్యం కోల్పోతాను. దీనికి తుది పరిష్కారం నేను ఎప్పటినుంచి అనుకుంటున్న విడాకులు ఒక్కటే. నాకు విడాకులు ఇప్పంచగలిగితే మీకు చాలా రుణపడిఉంటాను అంది.
అయితే ఒకటి చేద్దాం మేడం. మీకు ఇప్పటివరకు జరిగిన ఇబ్బందులు రాసి కంప్లైంట్ ఇద్దాం. ఆ విధంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు అవుతుంది. అతనికి చెప్తాను విడాకులుకు ఒప్పుకుంటే అతనికి ఏ సమస్యా ఉండదని. లేకుంటే అతన్ని అరెస్ట్ చేయించి అట్టెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిస్తానని పోలీస్ వారిచేత చెప్పిస్తాను. నిజానికి అతను మీ మీద చేసిన అఘాయిత్యాలు అన్నీ చెప్తే అతని కి చాలా శిక్షలు పడతాయి. విడాకులు కూడా పరస్పర అంగీకారం తోనే ఒప్పిస్తాను. అవి మీకు సంవత్సరంలోపు మంజూరవుతాయి. నేను ఆ విషయంలో పూర్తి హెల్ప్ చేయగలను. కోర్ట్ పరంగా కూడా మా ఫ్రెండ్ లాయర్లు కి చెప్పి ఏ ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చేట్లు చూడగలను అన్నాడు.
మీకు చాలా కృతఙ్ఞతలు సర్. మీరు కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయండి. నేను సైన్ చేస్తాను. మీరు చెప్పినట్లుగానే ముందుకు వెళదాం అంది.
కారు పార్క్ చేసి లిఫ్ట్ లో పైకి వెళ్లారు.
రేణుక వీళ్ళ కోసం వెయిట్ చేస్తోంది.
విద్యావతి ని రేణుక కి పరిచయం చేసాడు కృష్ణకుమార్.
రేణుక విద్యావతి ని లోపలికి తీసుకెళ్లింది.
మీకు చాలా శ్రమ ఇచ్చాను అంటోంది విద్యావతి.
అలాంటి దేమీ లేదు. మీరు రిలాక్స్ అవ్వండి. చాలా డస్సిపోయున్నారు మీరు అంటూ గెస్ట్ బెడ్ రూమ్ కి తీసుకెళ్లి మొహం అది కడుక్కుని రిలాక్స్ అవ్వండి. అందరం భోజనం చేద్దాం అంది రేణుక.
ఈలోగా కృష్ణకుమార్ కంప్యూటర్ ఆన్ చేసి కంప్లైంట్ టైపు చేసి ప్రింట్ చేసాడు.
విద్యావతి హాల్ లోకి రాగానే ప్రింట్ చేసిన కంప్లైంట్ పేపర్ చూపించాడు.
సరిపోతుంది సర్. అతను విడాకులకు ఒప్పుకుంటే నాకు అతనిపై ఎటువంటి సమస్యా ఉండదు అంది.
అందరూ ఇక భోజనాలకు రండి, బాగా లేట్ అయ్యింది అంది రేణుక.
ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ఒక అరగంటలో వస్తానని చెప్పాడు కృష్ణకుమార్. మూర్తి గారికి తినడానికి ఏమి కావాలో అడిగి తెప్పించండి సర్. డబ్బులు నేను వచ్చి ఇస్తాను అని చెప్పాడు.
కృష్ణకుమార్ మాటలు విన్న విద్యావతి అతని మంచితనానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. అతనిలో ఉన్న ఔన్నత్యానికి ఆమె అబ్బురపడింది.
అందరూ భోజనాలకు కూర్చున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర.
రేణుక వడ్డిస్తుంటే విద్యావతి వారించింది. మీరు కూడా కూర్చోండి ప్లీజ్ అంది.
ప్లేట్ లో అన్నం కెలుకుతూ ఉంటె రేణుక చెప్పింది విద్యావతి కి. మీకు ఏ టెన్షన్ వద్దు. అన్నీ ఆయన చూసుకుంటారు. మీరు భోజనం చెయ్యండి అని ఐటమ్స్ ఒక్కొక్కటి చెప్పింది రేణుక.
మీకు చాలా చాలా థాంక్స్ . ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు ఎన్నోనా జీవితంలో జరిగాయి. ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాలేదు సహాయానికి. అందరిని అతను బెదిరించేవాడు. అతను ఏదన్నా చేస్తాడేమోనని ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఈ రోజు మీరు ధైర్యంగా ముందుకు వచ్చి నా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తున్నారు అంది విద్యావతి కృష్ణకుమార్ తో.
మీకు సాయంత్రమే చెప్పానుగా మేడం. లోకల్ గా కమిషనర్ అఫ్ పోలీస్ నా చిన్నప్పటి క్లాసుమేట్. చాలా మంచి వ్యక్తి. మీ సమస్య చెప్పగానే వెంటనే స్పందించాడు. నేను నా ఫ్రెండ్ లీగల్ ఎక్స్పర్ట్ తో కూడా మాట్లాడాను. వాడి సలహా ప్రకారమే కంప్లైంట్ కూడా టైపు చేసాను. వాడు కూడా పోలీస్ స్టేషన్ కు డైరెక్ట్ గా వస్తానన్నాడు ఇప్పుడు. మీ హస్బెండ్ కు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అతని నుంచి మీకు విడాకులు కావాలని చెప్పి ఒప్పిస్తాము. మా లాయర్ ఫ్రెండ్ కూడా పక్కనే ఉంటాడు కాబట్టి వాడే అన్ని లీగల్ విషయాలు చూసుకుంటాడు. మీరు కోరుకున్నట్లు ఎలాగైనా మీకు విడాకులు తెప్పించే పూచీ నాది. ఇకనుంచి మూర్తి గారు మీ పై ఎలాంటి అఘాయిత్యము చెయ్యకుండా ఇబ్బంది పెట్టకుండా పోలీస్ పరంగా, న్యాయ పరంగా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పాడు కృష్ణకుమార్.
రెండు చేతులు జోడించింది విద్యావతి.
రేణుక తో చెప్పి ఆవిడని జాగ్రత్తగా చూసుకోమని తను పోలీస్ స్టేషన్ కు వెళుతున్నట్లు చెప్పాడు. బాగా లేట్ అవ్వచ్చేమో రేణు. మీరు లోపల లాక్ చేసుకుని పడుకోండి అన్నాడు.
నేను తన రూంలోనే పడుకుంటాను ఇవాళ అంది రేణు. కొంత కబుర్లు చెప్తే ఆవిడకి కాస్త హాయిగా ఉంటుంది.
ఓహ్ మంచిది. అలాగే చెయ్యి అన్నాడు.
మోహిత్ అడిగాడు డాడీ నన్ను కూడా మీతో రమ్మంటారా అని .
వద్దురా. నేను వెల్తానులే. ఇబ్బందేమీ లేదు. నువ్వు చదువుకుని పడుకో అని చెప్పి బయలుదేరాడు కృష్ణకుమార్.
****
పోలీస్ స్టేషన్ కి వెళ్లేసరికి ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. అప్పటికే పదకొండు అయ్యింది. మూర్తి ని లోపల బెంచ్ పై కూర్చో బెట్టున్నారు. మందు కిక్ ఇంకా తగ్గినట్టులేదు అతనిలో . మత్తుగా కళ్ళుమూసుకుని కూర్చోనున్నాడు.
సారీ సర్. లేట్ అయ్యింది అని చెప్పాడు కృష్ణకుమార్ ఇన్స్పెక్టర్ తో . అప్పటికే అతని లాయర్ ఫ్రెండ్ కిరణ్ కూడా వచ్చున్నాడు స్టేషన్ కి . హాయ్ రా కిరణ్ అంటూ అతన్ని పలకరించాడు.
ఇన్స్పెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాడు. మీరు చెప్పినట్లే అతనినేమీ చెయ్యలేదు. అరిచాము, తిట్టాము. దాంతో భయపడ్డాడు. మాట వినకపోతే అరెస్ట్ చేసి బొక్కలో తోస్తామని చెప్పాము. చపాతీ కావాలన్నాడు. తెప్పించాము. ఇప్పుడు ఓకే గానే ఉన్నాడు.
లాయర్ కిరణ్, కృష్ణకుమార్ తెచ్చిన కంప్లైంట్ తీసుకుని చదివాడు.
నువ్వు చెప్పినట్లే రాసానురా అన్నాడు కృష్ణకుమార్.
ఎస్. సరిపోయింది. మనం ఒకమారు మూర్తి తో మాట్లాడదాం రా అన్నాడు కిరణ్.
మూర్తి తో మాట్లాడి అన్నీ చెప్పారు అతనికి.
విడాకులకు ఒప్పుకుంటే ఏ సమస్యా ఉండదు.
కాదు కూడదు అని గొడవ చేస్తే అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్ట్ లో శిక్ష పడేట్లు చేస్తాము అని చెప్పారు గట్టిగా.
అలా చేస్తే ఉద్యోగం కూడా ఊడుతుంది. దాంతో మూర్తి మత్తు వదిలింది. భయం తొంగిచూసింది మోహంలో.
మీరు ఎలా చెప్తే అలా చేస్తాను సర్ అని చేతులు జోడించాడు మూర్తి .
అతనికి సీన్ పూర్తిగా అర్ధమైంది. అతని మోహంలో ఆందోళన కనిపించింది. ఇంతకుముందు ఆడిన నాటకాలలా కాదు ఇకముందు అని డిసైడ్ ఐనట్టున్నాడు. అందుకే పూర్తిగా సరెండర్ అయ్యాడు. అతని లో కనిపించే కనిపించే ఆ భయం విద్యావతి కి విడాకులు వచ్చేంతవరకు ఉండాలి. అందుకే కంప్లైంట్ అనేది ఒకటి ఉండాలి అని కిరణ్ ఆల్రెడీ కృష్ణకుమార్ కి డిస్కషన్ లో చెప్పాడు.
అందుకే మూర్తి మీద తను తెచ్చిన కంప్లైంట్ ఇవ్వడం దాని మీద ఇన్స్పెక్టర్ ఎఫ్ ఐ ఆర్ రాయడం జరిగాయి. దాన్ని కోర్ట్ లో ప్రొడ్యూస్ చెయ్యొద్దు అని చెప్పాడు కృష్ణకుమార్. విడాకులయ్యేంతవరకు అతని మీద కొంత కంట్రోల్ పెట్టాలి అనుకున్నాడు . అందుకు ఇవన్నీ తప్పనిసరి. లేకుంటే ఎప్పుడైనా జారిపోయి మళ్ళీ మొదటి కొస్తాడు.
అన్ని డిస్కషన్స్, ఫార్మాలిటీస్ పూర్తయ్యేసరికి ఒంటిగంటయ్యింది. మూర్తి ని రిలీజ్ చెయ్యమని చెప్పారు. ఎఫ్ ఐ ఆర్ కాపీ చూపించాడు ఇన్స్పెక్టర్. కిరణ్ అంతా చదివి చూసి ఓకే అన్నాడు . ఒక కాపీ కృష్ణకుమార్ కూడా తీసుకున్నాడు.
మూర్తి ఇన్స్పెక్టర్ కాళ్ళు పట్టుకున్నంత పని చేసాడు. లెంపలేసుకుని వదిలిపెట్టమన్నాడు. రకరకాలుగా ప్రాధేయపడ్డాడు.
ఇకముందు ఎప్పుడైనా ఇలాంటి వెధవ వేషాలేస్తే కోర్ట్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసి శిక్ష పడేట్లు చేస్తానని ఇన్స్పెక్టర్ బెదిరించాడు.
ఇన్స్పెక్టర్ కి మరోమారు థాంక్స్ చెప్పి కృష్ణకుమార్, కిరణ్ బయటికొచ్చారు.
కిరణ్ ని అడిగాడు ఏరా ఇంక ప్రాబ్లెమ్ ఏమీ ఉండదు కదా అని.
ఇక ప్రాబ్లెమ్ ఏమీ ఉండదురా. డివోర్స్ కు సంబింధించిన పరస్పర అంగీకార పిటిషన్ పేపర్స్ తయారు చేస్తాను. రేపు మూర్తి ని నా ఆఫీస్ కి రమ్మన్నాను కొన్ని డాకుమెంట్స్ కూడా కావాలని చెప్పాను. తెస్తానన్నాడు. అలాగే మీ బ్రాంచ్ కి కూడా రేపు వస్తాను. మేడం దగ్గర కూడా కొన్ని డాకుమెంట్స్ , సంతకాలు తీసుకుంటాను. ఇవన్నీ పూర్తయితే రెండు రోజుల్లో కోర్ట్ లో డివోర్స్ పిటిషన్ వేయిస్తాను. వాళ్లిద్దరూ పిటిషన్ ఫైల్ చేసే రోజు ఒక సారి, ఆరునెలల తరువాత ఇంకోసారి కోర్ట్ కి వస్తే సరిపోతుంది. దానికి తగినట్లుగా ఇద్దరికీ ఏ ఇబ్బందీ లేకుండా పిటిషన్ డ్రాఫ్ట్ చేస్తాను. సంవత్సరంలోపు విడాకులు మంజూరు అవుతాయి అన్నాడు.
కిరణ్ కి కూడా థాంక్స్ చెప్పి ఇల్లు చేరాడు కృష్ణకుమార్. టైం రెండైంది. డూప్లికేట్ కీ తో డోర్ లాక్ తీసి ఫ్లాట్ లోకెళ్ళాడు ఎవ్వరినీ డిస్టర్బ్ చేయకూడదన్న ఉద్దేశంతో.
ఆశ్చర్యంగా ఎవరూ నిద్రపోవట్లేదు. అంతా మేలుకోనున్నారు. మోహిత్ వాడి రూమ్ లో చదువుకుంటున్నాడు . వాడికి లేట్ నైట్ చదివి పొద్దున కాలేజీ టైం కి గంట ముందు లేస్తాడు.
రేణు, విద్యావతి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
