Previous Page
పాకుడురాళ్ళు పేజి 54

''కొంత మేరకే నిజం! కొందరు సుఖపడుతున్నా నేను చుడలేను. ముఖ్యంగా నా  శత్రువులు, నన్ను బాధించిన వారిమీద కసి తీర్చుకోవడంలో నేను పరమానందాన్నిఅనుభవిస్తాను... ముఖ్యంగా, డబ్బుతో మనుషుల్ని కళలనూ కొని వ్యాపారంచేసే వారంటేనే, ఎదుటివారిని ఇబ్బందుల్లో ఇరికించి అవసరాలు గడుపుకొనే వారంటేనూ, నా నరనరమూ ద్వేషంతో  ఆక్రోశిస్తుంది. వారిని నేలబెట్టి కాలరాచలేని, నా అసమర్దతను తలచుకొని ఎంత విచారిస్తానో మీ రూహించలేరు. ఒక్కోరాత్రి... నాకసలు కంటిమీదకు కునుకే రాదు'' అన్నది మంజరి.
''ఇప్పుడలాంటి బాధలు పడుతున్నట్లు లేదే!'' అన్నాను. ఆమెను శమింపచేద్దామన్న ఉద్దేశంతో ''మాకీ లోగుట్టులన్నీ తెలీవు. తెలిసిందల్లా, నీవెంట అబ్బాయిలు పడుతుంటారనీ, నువ్వు వాళ్ళను ఏడిపించి, ఏడిపించి, చేతికి చిక్కి, పెళ్ళాడి, విడిపోయి, కష్టాలుపడి, తిరిగి కలుసుకొని, నవ్వూ వాడూ ఓ యుగళగీతం ఆలపిస్తూ సుఖంగా ఉంటారనీ!''
మంజరి బాధగా నవ్వింది.
''ఇందాక డబ్బున్నవాళ్ళంటే ద్వేషమన్నావుగదా! మరి నీసంగతేమిటి?'' అన్నాను.
''నామీద నాకెంత ద్వేషమో, మీకెలా తెలియజేయను. చెప్పండి. నేనెక్కడో చదివాను. ''సౌందర్యం దేవతలిచ్చే గొప్పవరం'' అని ఆ వరాన్నినేను క్షుద్రమైన ప్రయోజనాలకోసం ఉపయోగించవలసి రావడంకన్న దురదుష్టం నేను సహించలేను'' అన్నది మంజరి.
ఆవిడ కళ్ళలో నీటి జారలు చూసి చకితున్నియ్యాను.
''జీవితాన్ని చూసి నీలాంటిదిభయపడటంలో అర్థంలేదు'' అన్నాను. ఆవిడ వీపుతట్టి పద పోదాం... నేను చాలా దూరదేశం నుండి వచ్సినవాణ్ణి, ఉన్న నాలుగు రోజులూ నాతో కులాసాగా ఉండాలిగానీ - అలా బాధగా ఉండకూడదు''.
మంజరి అరగంటసేపు మేకప్ చేసుకొని గానీ బయలుదేరలేదు.
'' మీ ప్రశ్నకిప్పుడు సమాదానం చెబుతున్నాను. నేను నగజేముడు మట్టలాంటి మొండిప్రాణిని. బ్రతుకుమీద నాకున్నపాటి ఆశ చాలామందికి లేదు. నేను ఆశాజీవిని ముందేప్పుడో ఎదో మోహోపకారం  జరుగుతుందనీ, నాక్కావలసింద్దో లభిస్తుందన్న ఆశ  లేకపోతే, నా బ్రతుకు మరింత భారంగా తయారయి ఉండేది. ''అన్నది మంజరి.
కారు ఊరి వెలుపలకు వచ్చింది.
రోడ్డుకు రెండు ప్రక్కలా గుడిశలు కిక్కిరిసి ఉన్నాయి. పిల్లలు రోడ్లమీదే పడుకొని నిద్రపోతున్నారు.
''పందుల దుళ్ళలాంటి ఈ మురికి కూపాల్లో మనుషులుంటున్నారని జ్ఞాపకం వచ్సినప్పుడల్లా, కళ్ళకు చిల్లులు పడి, రక్తం కారి పోయేలాగా ఏడవాలనిపిస్తుంది. అలా ఏడ్చిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఎందుకు చేబుతున్నానంటే - నాకు బ్రతుకులో సుఖం ఎక్కడ తప్పిపోయిందో మీరు కనుక్కొంటారని '' అన్నది మంజరి.
''నాకు తెలుసు '' అన్నాను.
''చెప్పండి!''
''నువ్వు కారుపోనిస్తుండు. అపనవసరంలేదు..... ఏమిటంటే, నీకు సంబంధంలేని, విషయాలను గురించి నువ్వనవసరంగా ఆలోచించి సగం పాడయి పోతున్నావను కొంటాను. నీసంగతేదో నువ్వు చూసుకో, లోకం మరామత్తు చేయడానికి చాలామంది ఉన్నారు.  వారి పనులు వారిని చేయ్యనివ్వు.... వర్షం పడుతున్నట్లుంది. కారు మల్లింతామా?''
తిరిగి గుడిశల దగ్గర కొచ్చేసరికి వర్షం ఎక్కువయింది. పిల్లా - జెల్లా ఆ పందుల గుళ్ళల్లో దూరి బిలబిలలాడుతున్నారు.
మంజరి కారుతలుపులన్నీ మూసింది. లోపల వల్లమాలిన ఉక్క, బయట ఆకాశానికి చిల్లుల పడినట్లుగా వర్షం!
ఉన్నట్లుండి హఠాత్తుగా కారు తలుపు తెరచుకొని, రోడ్డు మీదికి ఉరికింది మంజరి. కారణం తెలియక, నేను దిగాను. మంజరి ప్రక్కనే ఉన్న గుడిశ తలుపు తోసుకోని లోపలికెల్లింది.
ఓ నడికారు స్త్రీ గోడకు చేరగిలబడి నొప్పులు పడుతూ ఉంది. పైనుంచి వర్షపు నీరంతా ధారల కింద, ఆ గుడిశలో పడుతున్నది. ఆ ఇల్లాలి వంటిమీద గుడ్డముక్క కూడా లేదు. గోనేపట్టా చుట్టుకొని, గొడ్డులాగా మూలుగుతున్నది. చూట్టురా అయిదారుగురు స్త్రీలు, ఇద్దరు పిల్లలూ ఉన్నారు. వర్షపు నిటికి, గాలి ఉదుటకు, దీపం చిటపట మంటున్నది.
నేను కారులో కొచ్చేశాను.
పావుగంటకల్లా మంజరి కూడా వచ్చేసింది. ఆవిడ వంటినిండా డాగులున్నాయి.
గుడ్డలన్నీ మరసిఅపోఅయినీరు వొడుస్తున్నాయి.
స్టిరింగు ముందు కూచుని, సన్నగా నిట్టుర్సింసింది మంజరి.
''ఏమయింది?'' అన్నాను.
''నీళ్ళాడింది. మొగబిడ్డడు. తెగబారెడున్నాడు. బొద్దుగా, అంతదాకా అన్ని బాధలుపడి, ప్రాణాలు విలవిలలాడి పోయేట్టు తన్నుకులాడిన ఆ తల్లి కూడా, పసిబిడ్డ ఏడుపు వినగానే, లేని వోపిక అంతా కూడదీసుకొని,  బిడ్డను రొమ్ములకు అదుముకొన్నది.
అప్పటి దాకా, చేసినమేమందరమూ ఏమయ్యామో తెలీదు....  మమ్మల్ని మరచిపోయి నందుక్కాదు - ఆమె లోలోపలి మాతృత్వ కాంక్షను గురించి నేనంటుంట'' అన్నది మంజరి.
''పోనీ, హాస్పిటల్లో చేర్పించే వాళ్ళంకగా, కార్లో తీసుకు రాలేక పోయావా?'' అన్నాను.
మంజరి మాట్లాడలేదు. అద్దంలో చూసుకొని, ఓసారి జుట్టు సరిచేసుకొంది. కింది పెదవి బిగబట్టి, ఉద్వేగాన్ని అదుముకొంటూ కారును స్టార్టుచేసింది.
దోవలోకూడా మేమెక్కువ మాట్లాడలేదు.
బోజనాలయిన వేళకు రాత్రి పదిగంటలయింది. తాయారు నాకేసి, మంజరి కేసి చూసి తలవంచుకొంది.
''ఏమిటి?'' అన్నాను.
''అదా!'' అన్నదేగానీ మంజరి చెప్పలేదు. '' వారికి అలవాటు లేదు తాయారూ! ఉంటే, అప్పుడే చెప్పేడే చెప్పేదాన్ని గదా! నాకా? - లోపలుంచు ఆవసరమయితే పిలుస్తాను''.
తాయారు వెళ్ళిపోయాక -
''మీకు నిద్రగానీ రావడంలేదు గదా?'' అన్నది మంజరి.
''లేదు''
''అలా ముడుచుకొని కూచోవడం దేనికి? సాఫీగా కూచోండి!'' అన్నది మంజరి నేను వొదిగి కూచుని ఉడటం చూసి.
సర్దుకున్నాను.
''జీవితంలో విషాదం డబ్బులేకపోవడం కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళు లేకపోవడం. మనం ప్రేమించడానికి ఎవ్వరూ దొరక్క పోవడం..... మీరు లైట్ గా తీసుకోకండి! నేనిది అక్షరాలా అనుభవించి చెబుతున్నాను....... ఆ తల్లి -ఇందాక ప్రసవించినావిడ - గుడ్డలమిల్లులో పనిచేస్తున్నదిట. ఉదయంకూడా పనిలోకేల్లిందిట. ఈ పూట కాన్పు మొగుడు సాయంత్రం షిఫ్టులోపనికి పోయాడు మిన్ను విరిగి మీదపడినా, పని మానేందుకు లేదు. ఓ పూట మానితే ఆ పూట పస్తు! బహుశా, ఆ పసిబిడ్డకు సరైన ఆలనా, పాలనా ఉండక పోవచ్చు. ఉండదని, ఆ తల్లికీ తెల్సు. తమలాగా తమ బిడ్డ కూడా కులీగా బ్రతకాలనీ తెలుసు. అయినా ఆ బిడ్డను రోమ్ములకదుముకొని, వాడికళ్ళల్లో కళ్ళుంచి చూసేప్పటి తల్లి అనందం, సంత్రుప్తి, ఏ కార్లూ, ఏ రత్నహారాలూ ఇవ్వలేవనుకొంటాను..... మీరేమంటారూ?'' అన్నది మంజరి.

                                                         **** శుభం ****


 Previous Page

WRITERS
PUBLICATIONS