35
ఏడాదితో పూర్తవుతుందనుకొన్న ఇల్లు, ఇంకో ఆరు మాసాలకు గానీ, కలేదు. అయితే ఈ ఆలస్యం కాంట్రాక్టర్ ది కానేకాదు. మొట్టమొదట మంజరి ఒప్పుకొన్న ప్లానుకూ, ఆ దరిమిలా ఆవిడ చేసిన ఎడిషన్లకూ ఎక్కడా సంబంధంలేదు. అంగుళం చువ్వ సరిపోయే చోట రెండంగుళాల చువ్వ వాడమనేది. ఎనిమిది గంపల ఇసుకకు, గంప సిమెంట్ పోస్తే సరిపోయేదానికి, నాలుగింటి కొకటిచొప్పున పోయ్యమనేది. సున్నం జిగురులేదనేది. వాటరింగ్ సరిగ్గా జరగడం లేదనేది. లక్షా తొంభైవేల పేచీలు లేవదీసేది.
''మీరడిగిన ప్రకారం బిల్డింగ్ కడితే నకొంప ఆరిపోతుంది'' అని గోలకేత్తాడు కాంట్రాక్టరు.
''అలాగని ఆ ముదస్తపు కొంప కట్టించుకోనా?.... పోనీ వోపని చెయ్యి. నువ్వు లేబర్ కాంట్రాక్టువరకే. మెటిరియల్ నేను సప్లయి చేస్తాను. అప్పుడు నువ్వు నష్టపోవడమన్న ప్రసక్తే ఉండదు'' అని సలహా ఇచ్చింది మంజరి.
''సరే'' అన్నాడు వాడు.
ఈ దఫా ఎక్కడెక్కడి ఇనుమూ, చాలకుండా పోయింది. వంద బస్తాల సిమెంటు తెచ్సిపడేస్తే ముడోనాటికల్లా ఖాళీగోతాలు చూపించేవాడు. కాంట్రాక్టర్ మనస్సులో ఏమనుకొన్నా పైకి మాత్రం, లొంగేది కాదు మంజరి. సితారా దొడ్లో పదిగాజాల పొడవునా, మూడు గజాల వెడల్పునా, ఈతకొలను ఉంది. దానికి రెట్టింపు సైజులో మంజరి కట్టించింది. అంటే జయపూర్ నుండి, ప్రత్యేకంగా మార్బుల్ స్టోన్ తెప్పింసింది. చుట్టూ పరిపించింది! ఈ పనులన్నీ చలపతీ, లాలారాం చూసుకొంటూన్నప్పటికీ, ఏదో వోసమయంలో ఆవిడ కూడా కలగచేసుకోక్ తప్పేదికాదు.
సరిగ్గా ఆ సమయంలో కిషన్ దాసును పోలీసులు అరెస్ట్ చేశారు. అదృష్టవశాత్తు ఆ పని మంజరి ఇంట జరగలేదు.
లాలారాం, ఆ వార్త చెప్పినప్పుడు మంజరి దాదాపుగా మూర్చపోయింది. ఆవిడ తేరుకోవడానికి అగంటకు పైగా పట్టింది. నోటమాట రావడానికి ఇంకో నాలుగు గంటలపాటు ఆగవలసి వచ్చింది. అయినా, మంజరి ముఖంలో కళాకాంతులు లేవు. ఆవిడ - చీమ కదలినా గుండెలార్సుకు పోయేంతగా వణకసాగింది.
''ఏం జరిగింది మంజూ'' అని చాలా ఆప్యాయంగా అడిగాడు చలపతి.
''ఏం లేదు.... నాకే..... ఆరోగ్యం బాగాలేదు. అంతకు మించి జరగడాని కేమున్నదిట?'' అన్నది మంజరి.
''అక్కడ సినీ పరిశ్రమను గురించి యింకా రాయలేదా?''
''రాశాను!'' అంటూ శర్మ మళ్ళా చదివి వినిపించడం సాగించాడు.
''సినిమా పరిశ్రమ అత్యున్నత స్థానంలో ఉన్నదేశంలో అరికా వోక్కటే ననుకొంటాను. వాణిజ్య రీత్యా చూసినా, కళాదృష్ట్యా, చూసినా, అరికన్ చిత్రాలు లోకోత్తరంగా ఉంటాయి. స్త్రీలు ఖర్చు చేసి కోట్లు పిండుకోవడమంటే ఎంమిటో మనకు తెలీదు. అది అరికనులకు బాగా తెలుసు. ఒక్క పిక్చర్ కోసం వాళ్ళు 5,6 కోట్లు డాలర్లు ఖర్చుచేసి, అంతకు యాభై రేట్లు, నూరు రెట్లుకుడా సంపాదించిన సందర్బాలున్నాయి. పది ప్లోర్స్ ఉంటే మన బ్రతుక్కది గొప్ప స్టూడియో. దాన్ని చూసుకోని -ఓ- మురిసిపోతూ ఉంటాం. నేను అరికాలో 80,90 ప్లోర్సున్న స్టూడియోలను చూశాను. నిజానికవి స్టూడియోలు కావు. మహానగరాలు. అందులో బ్రహ్మాండమైన కారడవులు, మహోన్నత పర్వతాలు, నదులు, సరస్సులు, జలపాతాలు, ఎడారులు, బంధభుములు, చిత్రవిచిత్రమైన పశ్నలు, క్రూరమృగాలు, ఆకాశానంటే సౌధాలు, అత్యాదునిక నగరభాగాలు, నీగ్రోల మురికి పెటలు, రెడ్ ఇండియన్ల గుడిశలు - అన్నీ ఉన్నాయి. సహజత్వంకోసం అరికనులు ఖర్చుపెట్టి ఖర్చుపెట్టి నంతగా, మాకేవ్వరూ ఖర్చుచేయననడం అతిసయోక్తికాదు. ప్రతి చిన్నవిషయాన్నీ వీరెంతో శ్రద్దగా పరిశీలిస్తారు. అన్నీ టైం ప్రకారం చకచకా జరిగిపోతాయి. నేనక్కడ ఉండగానే, ఒక మహానౌక సముద్రంలో మునిగిపోవడం ఘాట్ చేశారు. అదే తెలుగు డైరెక్టరైతే, రెండు డైలాగ్స్ తో అసీను కొట్టిపారేసేవాడు. హిందీ డైరెక్టరైతే, ఓ న్యూస్ పేపరుతో ఓడ మునిగిపోతున్న బోమ్మా, దానికింద న్యూసువేసి, ఎవరో చదువుకున్నట్లు, ఓషాట్ తీసిపారేసేవాడు. కానీ అరికన్ దర్శకుడలాచేయలేదు. ఫసిఫిక్ లో అసీన్ నిజంగా క్రియేట్ చేశారు. ఎందుకైనా మంచిదని వంద కేనేరాలతో ఆసీన్సు ఘాట్ చేశాడు. విమానాల ద్వారా కూడా కొన్ని షాట్స్ తీయించాడు. ఇంతా చుస్తే - సినిమాలో, ఆసీను ఏడెనిమిది నిమిషాలకన్నా ఉండదని తెలిసింది, దాంతో పోలిస్తే, మనమూ, మన పరిశ్రమా ఏదశలో ఉన్నదీ ఊహించడానికే భయమేస్తున్నది! మనం - ఇక్కడ కుచుని, సినిమాలకు, నాటకాలకూ చుక్కెదురును కొంటాం. అరికాలో అదేమి లేదు. నాటక రంగంలో ఎంత గా అభివృద్ధి చెందిందో నేను చెప్పలేను.... నాకున్న బాధ్యత లన్నింటినీ త్వరగా వదిలించుకొని అదే పద్దతి మీద,
నాటకరంగాభివృద్ధి కోసం కృషి చెయ్యాలనుకొంటున్నాను. భాగావత్సంకల్పం ఎలా ఉంటుందో తేలీదు..... అయితే సినిమాలకు పోటచీ లేదనికాదు. ఈనాటి అరికన్ సినీ పరిశ్రమ టేలివిజన్ సవాలు చేస్తున్నది. అతి దారుణమైన ఈ పోటీలో ఏరంగం గెలుస్తుందన్నది ప్రశ్నకాదు. అంత ఆరోగ్యకరం కాదన్నదేనా అభిప్రాయం....
అరికనుల జీవనం అవశ్యం అనుశరణీయం. కోటిశ్వరుని బిడ్డలయినా కష్టించి పనిచేస్తారు. దాదాపు ప్రతి కుటుంభానికి కారున్నది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తారు. పదివస్తువులకోసం, పదిచోట్లకు తిరగనవసరం లేదు. ఒకేచోట మనక్కావలసిన అన్ని వస్తువులూ దొరుకుతాయి.... చాలామంది ఆరికనులకు సెక్స్ కు అధిక ప్రాధాన్యమిస్తారని మనం అనుకొంటాం. అక్కడి ఆచార వ్వవహరాలు మనకు కొత్త గనుక, అలానిపించేమాట నిజమే ! కానీ, అదే పూర్తినిజం కాదనిపించింది నాకు. నేను, మారిలిన్ మన్రోతో కలసి, రెండుమూడు క్లబ్బుల కెళ్ళాను, ఒకచోట బేర్ డాన్స్ స్ జరుగుతున్నాయి. అ నగ్నత్వం మనలో శారీరక వాంచలను రేక్కొలపదు. ఏదో అనిర్వచనీయమైన ఆనందానుభూతిని కలిగిస్తుంది. నాకలాంటి అనుభూతే కలిగింది కూడానూ, బహుశా - నేను కలాధృష్టితో చుడడం వల్లనే అలా అనిపించిందో, లేక అందరూ, ఆ నృత్యాలను చూసి, నాకుమల్లేనే అనుకొంటారో నేను చేప్పలేను. భారతదేశం నుండి, భారతీయులు సహృదయత్వాన్నిస్నేహవాత్సల్యాలసను నేను పదిలంగా పట్టుకెల్లి ఆరికనుల కర్పించాను. వారినుండి సౌజన్యాన్ని సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఈ దేశానికి తీసుకోచ్చాను. నాకు అవకాశమే లభిస్తే, మళ్ళీ మళ్ళీ ఆరికాను చూడాలనిపిస్తున్నది'' అని ముగించాడు శర్మ.
మంజరి సిగరేట్ ముట్టించి, గుప్పుమని పొగవదులుతూ '' బావుంది శర్మాజీ!'' అన్నది.
''మీరు చెప్పిన పాయింట్స్ ను నేను వేనకా ముందూ సెట్ చేస్తున్నాను. ఓ ఆర్డర్ లో పెట్టాక, ఇతర దేశాల పర్యటనను గురించి కూడా రాస్తాను'' అన్నాడు శర్మ.
''త్వరగా కానివ్వండి, జనంతో వేడితగ్గాక మనమేం చేసినా తిరిగి రగులుకోదు......
వీటిని హబిందీలోకి, ఇంగ్లీషులోకి మార్పించండి! అన్ని పత్రికలకూ పంపించండి!'' అన్నది మంజరి.
''అలాగే చేద్దాం!'' అన్నాడు శర్మ.
ఆతను లేచిపోతూ ఉండగా, మంజరి, చిన్న చిటిక వేసి చిరునవ్వు నవ్వుతూ, నాకు మన్రో ఓ అద్బుతమైన ఘట్టం చెప్పింది. అది బావుంటుందని మీరనుకొంటే - నా జపాను పర్యటన సందర్బములో ఎక్కడన్నా ఇరికించండి ! '' అన్నది.
''చెప్పండి!'' అన్నాడు శర్మ.
''మన్రో'' ఆమె రెండవభర్త 'జో' తో కలసి జపాన్ వెళ్ళింది. అమెరికన్ సైన్యాధికారుల కోరికమీద కొరియాలో యుద్ధం చేస్తున్న అమోరికన్ సైనికులకు వినోద ప్రదర్శన లివ్వడానికి అంగీకరించింది. అక్కడి సైనాధికారులు ఆమె గౌరవార్ధం, బ్రహ్మండమైన విందును ఏర్పాటు చేసి, తమ 'మెస్'కు ఆమెను ఆహ్వానించారు. అంత వరకూ బాగానే ఉన్నది. మన్రోను చూడటంకోసం వేలాది మంది అమెరికన్ సైనికులు మెన్ లో పోగుపడ్డారు. ఆ హడావుడిలో వారొక ముఖ్యవిషయాన్ని మరచిపోయారు. అంతకు ముందుగా మెస్ లో, మన్రో నగ్నచిత్రం వొకటి గోడకు వేళ్ళాడుతూఉండేది. కనీసం ఈ సమయంలోనైనా, దాన్ని తొలగించి ఉండవలసింది! కానీ ఎవ్వరూ ఆపని చేయలేదు. ముందుగా అక్కడా చిత్రాన్ని చూసింది మన్రోయే! ఆమెతో బాటు మిగతావారు కూడా చూశారు. చూసి చాలా నొచ్చుకున్నారు. దురదుష్టవశాత్తూ దాన్ని తొలగించడం మరచిపోయామని, మిమ్మల్ని అవమానించాలన్న దురుద్దేశంతో దాన్నక్కడ ఉంచలేదనీ అమెరికన్ అధికారులు పదేపదే మన్రోకు సంజయిషీ చెప్పుకోన్నారట. దానికి మన్రో ఇచ్చిన సమాదానమేమిటంటే -'' ఇందులో, మీరుగానీ, నేనుగానీ, బాధపడవలసిందేమీ లేదు. బ్రతుకులోని సంక్లిష్టతా దశలు మానవతను ఏ స్థాయికి తీసుకుపోతాయో అర్ధం చేసుకొనేందుకు ఈ బొమ్మ సాయపడుతుందనుకొంటాను. ఇంకొద్ది గంటలలో''మారిలిన్'' మట్టిలో కలిసిపోతుందనగా, ఈ నగ్న చిత్రానికి నమూనాగా నిలచింది. ఫలితంగా మట్టిలో కలసిపోవడానికి బదులుగా, ఊపిరి పీల్చుకొని ఇవతలి ప్రపంచంలో కొచ్చి పడింది. ఇలా నిలబడటం తప్పని నేనిప్పటికి అనుకోవడంలేదు. ఈ బొమ్మకోసం మారిలిన్ నిలబడకపోతే, ఈనాడు మీముందీ జగదేక సుందరి నిలబడేదే కాదు'' అన్నదిట మన్రో. దీన్నీ కాస్త అలాఇలా మర్చేసి, నాటూర్ లో ఎక్కడన్నా ఇరికించండి, యాజ్ ఇటిస్ గా కాదు. అవసరమైతే ఓ చిన్న సీన్ క్రియేట్ చేయండి. ఇన్సిడెంట్ బలమైందికదా ?'' అన్నది మంజరి.
''మర్వొలెస్ మేడమ్! ఇలాంటివి లక్షాతొంభయ్ ఇరికించేస్తాను... మీకెందుకూ? మీరలా చూస్తూ ఉండండి. ఈ వ్యాసాలను, లోకోత్తరంగా తయారుచెయ్యకపోతే, నా చెవి కోయించుకొంటాను సరా?'' అన్నాడు శర్మ.
మంజరి, అతని బుగ్గలు వుణికిముద్దాడి వదిలేసింది.
33
రాజన్ ను రామ్మంటూ జాబులు రాసింది. ఫోన్ చేసింది. వైరిచ్చింది. ఆతను రాలేదు గానీ, అతని దగ్గర నుండి ఓ కాగితం పట్టుకొని కనకమందిరం గారొచ్చారు.
''వీరు నాకు చాలా ఆప్తులు నీతో పనుండి వచ్చారు. ఆ పని పూర్తిచేసి పంపించు'' అని రాశాడు రాజన్.
''చెప్పండి నావల్లయ్యేదైతే తప్పకుండా చేస్తాను'' అన్నది మంజరి.
''నే ఉన్న ఆస్తంతా తగలపెట్టుకొన్న మనిషిని ఇరవైయేళ్ళ పాటు నాటకాలడాను. ఆడించాను. నా సొమ్మంతా ఇందులోనే కరిగి పోయింది. ఈ సంగతి మన రాజన్ కు కూడా తెలుసు. పిల్లలు ఎక్కోచ్చే వేళకు నేను బికారి నయ్యాను. నాతోబాటు పనిచేసిన వారూ, నా కంపనీలో చిన్న చిన్న వేషాలేసినవారూ, ఈనాడు లక్షలు సంపాదించారు. వారందరూ తలో చేయూ వేసి, నాకు సాయం చేశారు. కాస్త- కళ్ళూని నిలబడుతున్నాడు. మీరూ నాకు, సహాయపడితే- నాకదే చాలు'' అన్నాడు కనకసుందరం.
ఇంత చేప్పినా, అతనిక్కావలసిందేమిటో మంజరి భోధపరచుకోలేకపోయింది. అదే - రవంత సున్నితంగా అడిగిందికూడాను.
''పొనీ పెట్టుబడికి ఏ పాటికావాలో అడగండి'' అన్నది మంజరి చెక్కుమీద సంతకం చేసి, అంకె వెయ్యకుండా.
కనకసుందరం, రెండు చెంపలూ ఫేడి ఫేడి మని వాయించుకొని లబ లబ లాడిపోయాడు.
''నా ఉద్దేశం అదికాదు తల్లీ! మీ ఆశీర్వాదంవల్ల నా కిప్పుడు ఆర్దిక సహాయమేమీ అవసరం లేకపోయింది. స్నేహితుల ప్రోద్బల్యం వల్ల, నేను సబ్బుల పరిశ్రమ ప్రారంభించాను. సరుకయితే మంచిదే! ప్రొడక్షన్ కూడా బాగానే జరుగుతున్నది. కానీ అమ్మకాలే లేవు. నాకన్నా ముందీ ఇండస్ట్రిలో పాతుకుపోయిన వారు, నాసరుకు మార్కెట్ కేకక్కుండా అడ్డుపడుతున్నారు. పెట్టిన పెట్టుబడంతా లాకప్ అయిపోయింది. ఏమీ తోచక తమదగ్గరి కొచ్చాను'' అన్నాడు. కనక సుందరం. అతనిక్కావలసిందేమిటో మంజరి కర్దమయింది. అయినా ఆవిడ బయటపడదలుచు కోలేదు.అది నిజంకాదని చలపతికి తెలుసు. ఆవిడేదో దాస్తున్నదనీ, తననింకా నమ్మలేదనీ అతననుకొన్నాడు.
''ఇందులో ఎవరితప్పూ లేదు. నేను మాత్రంఅవిన్నుపూర్తిగా నమ్మాను గనుక నా అనుకోవడానికి ?'' అని సరిపుచ్చుకొన్నాడు చలపతి.
శర్మ, వసంతా కూడా కదిపిచూశారు గానీ, మంజరి తొణకలేదు.ఆఖరకు రాజమణి దగ్గర బయటపడింది.
''నేను మొదట్నించీ వాణ్ణి అనుమానిస్తూనే ఉన్నాను. కానీ, రుజువులెందే మనం మాత్రం అనడం దేనికనుకొన్నాను. చివరకు కొంప మునిగినంత పనైంది. అని మామూలు నోట్లు కావు...'' అని గోల్లుమన్నది మంజరి.
''హాసి'' అని నోరు నొక్కుకున్నది రాజమణి.
అవిడ ఆపాదమస్తకం చెమటతో నిండిపోయింది.
''ఈ పీడ ఇంతటితో పోదక్కా పోలీసులు మన ప్రాణాలు తీసిగానీ వదలరు. అసలే కళ్యాణి చావప్పుడు, పోలీసులు, వొచూపు మనమీద వేసి ఉంచారు. అదింకా మటుమాయం కాకముందే ఈ పీడ చుట్టుకొన్నది. ఇదంతా నాఖర్మం!'' అని నెత్తిబాదుకొన్నది మంజరి.
రాజమణి మెత్తని మాటలతో వోదార్చగాలిగిందే గానీ, ఈ పీడ విరగడయ్యెందుకు ఉపాయం చెప్పలేక పోయింది.
ఆ పని చెసినవాడు చలపతి.
''ఆ మధ్య, నీకు ఢిల్లీలో తెలిసిన వాడెవడో ఉన్నాడని చెప్పావు చూడు -వాడి పేరేదో ఉండాలి... సక్సేనా అనుకొంటాను అవునా? అతగాడేమీ నీకీ సందర్బములో సాయం చేయ్యలేడా?'' అన్నాడతను.
''చూద్దాం, అయినా కొంప ముంచుకుపోయిందేమీ లేదు గానీ, అనవసరంగా రద్దీ పడాలసోస్తుందేమోనని నా భయం. ఇదీ అతని ఫోన్ నంబరు. ఢిల్లీకి కాల్ బుక్ చెయ్యి'' అన్నది మంజరి.
-సక్సేనా వచ్చాడు.
'అంతా నేను మధ్యలోనే విన్నాను'' అన్నాడు నవ్వుతూ.
''ఎవరు చెప్పారు?'' అన్నది మంజరి.
''మరీ అంతలోతుల్లోకి వెళ్లకండి. మీకు పని కావడం ముఖ్యమా? వివరాలు ముఖ్యమా?'' అన్నాడు సక్సేనా.
మంజరి ఇంకోమాట మాట్లాడకుండా అతన్ని లోపలకు తీసుకొచ్చి కుచోబెట్టింది.
''ప్రజల గౌరవమర్యాదలమీద, నా వృత్తి ఆధారపడి ఉంది. అంతవరకూ లేదు గానీ, ఇకముందా దాసుగాడు, నన్నుకూడా ఈ రొంపిలోకి లాగుతాడేమో నని భయంగా ఉంది. అలాంటిదే జరిగితే నీ బాంబేలో తలెత్తుకుని తిరగలేను. అసలే ఇక్కడి వాతావరణం నాకు ప్రతికూలంగా ఉన్నది. దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నంలో ఉండగానే, ఈ ఆపవాదులు మీదకు విరచుకు పడుతున్నాయి. ఇక్కడినుండి తిరిగి మద్రాసు పోవడంకన్నా, ఏ రైలుకిందనో తలపెట్టి చావడం మేలు!'' అని వాపోయింది మంజరి.
సక్సేనా అటూ ఇటూ చూశాడు.
''ఎవ్వరూ లేరు!'' అన్నది మంజరి.
''నీకే ఇబ్బంది కలక్కుండా నేను చూస్తాను. నాదీ పూచీ.... మరి నాకేమిస్తావ్?''
అన్నాడు సక్సేనా, అదోలాగా నవ్వుతూ.
''ఏమైనా సరే!'' అన్నది మంజరి తక్షణమే!
సక్సేనా చెయ్యిచాపాడు.
మంజరి అతని చేతిని తనచేతిలోకి తీసుకొని ''మాటతప్పను'' అన్నదజి నవ్వుతూ.
''ఇదుగో అడ్రసు. సాయంత్రం ఇక్కడకురా. వీధి చెడీలమీద తెల్లటోపీ కుర్రవాడు కనిపిస్తాడు. ఎర్రలక్క కావాలి'' అను నిన్ను లోపలికి తీసుకోస్తాడు. నేనక్కడే ఉంటాను'' అన్నాడు సక్సేనా.
''అంత దూరం దేనికి? మనమిక్కడున్నా అభ్యంతరం పెట్టేవాళ్ళేవ్వరూ లేరు.......అయినా, ఇప్పటికా మీరు నా గురించి బయట పడటం! నేనడిగితే బావుండదని ఊరుకున్నాగానీ మిమ్మల్ని మద్రాసులోనే చేరిచేద్దామనుకొన్నాను''.
సక్సేనా నవ్వి వెళ్ళిపోయాడు.
''మనిషి కొకరోగం, ఇంతోసి భాగ్యానికి, అక్కడెక్కడికతో వెళ్ళి 'ఎర్రలక్క కావాలి' అనాలట వాడెవడో తెల్లటోపీ నన్ను లోపలికి తీసుకుపోతాడట, అంత భయపడేవాళ్ళు, పిరికి దద్దమ్మలూ, అడదానికోసం, అంతలా పారుకులాడ్డమెందుకు?'' అనుకొన్నది మంజరి.
ఇష్టంలేకపోయినా మంజరి అలంకరించుకొన్నది.
''ప్రాణం పోతున్నా సరే, మా జన్మలకీ మేకప్ తప్పదు. ఆఖరుకు శవానిక్కూడా మేకప్ చేసిగానీ పారేయరు. అని విసుక్కొన్నది.
అనుకొన్నవేళకు ఆ చిరునామా దగ్గర కోచ్చింది మంజరి. తెల్లటోపీవాడు చీడీల దగ్గర కనిపించాడు.
వచ్చే నవ్వును అపుకొంటూ -
''ఎర్రలక్క కావాలి'' అన్నది మంజరి.
''రండి!'' అన్నాడతను.
మంజరి అతన్నను సరించింది.
గదిలో కొచ్సిన మరుక్షణమే, తలుపులు మూసుకొన్నాయి. చూస్తుండగానే, కటుకపూసినట్లుగా చీకట్లు అలుముకోన్నాయి.
మంజరి గుండెలు అవిసిపోయాయి. అప్పుడేప్పుడో ఆవిడ చదివిన డిటెక్టివ్ నవలల్లోని సంఘటనలన్నీ జ్ఞాపకం వచ్చాయి. ముచ్చెమటలతో ఆపాదమస్తకం తడిసిపోయింది.
''భయపడకండి! నేనున్నాను.''
అది సక్సేనా గొంతు.
తరువాత గరుగ్గా ఉన్నచేయి తన మణికట్టును పట్టుకొని ముందుకు తీసుకుపోవడం మంజరికి తెలుసు.
పది నిమిషాలు నడిచాక వెలుతురు కనిపించింది.
''కూచోండి!'' అన్నాడు సక్సేనా.
మంజరి కూచున్నది.
తనో సిగరెట్ అంటించి మరోటి మంజరికి ఆఫర్ చేశాడతను.
''ధాంక్స్. ఇప్పుదోద్దు''
పది నిమిషాలైన సక్సేనా నుంచి ఎలాంటి రెస్పాన్సు రాకపోవడంతో లోలోపల చిరాకు పడింది.
''ఏమో అనుకొన్నాను గానీ, వీడు పరమ బడ్డు'' అనుకొన్నది మంజరి.
''ఎందుకింత శ్రమ తీసుకోవడం? ఈ కాస్తదానికి మా ఇల్లు పనికిరాక పోయిందా? అప్పటికి నేను చెప్పాను గదా!'' అన్నది మంజరి.
'' మీ మనస్సు బావోలేదు కదూ?'' అన్నాడు సక్సేనా.
అబ్బే! ఉందే !'' అన్నది మంజరి.
''మీరు బుకాయిస్తున్నారు..... ఇలా వచ్చి కూచోండి. పది నిమషాలు చిన్న పిక్చర్ చూద్దాం''.
మంజరి అతని పక్కనేవచ్చి కూచున్నది.
మీరు నాకో ప్రామిస్ చెయ్యాలి. ఇక్కడ చూసిన విషయాలు మీరేపరిస్థితుల్లోనూ, బయట అనకూడదు. అలా అన్నట్నాకు తెలిస్తే, మీరు ప్రమాదాల్లో చిక్కుకోవలసి వస్తుంది. మీరలా చేస్తారని కాదుగానీ, ముందుగా చేప్పడం నావిధి గనక చెబుతున్నాను. మరోలా అనుకోకండి!'' అన్నాడు సక్సేనా.
ఈ దోరణి మంజరికి నచ్చలేదు. చాలాకాల మయింది. అవిడలాంటి బెదిరింపు మాటలువిని, ఇంతకాలంగా, ఎదటివారిని ఆదరించి, బెదరించి, హడలగొట్టిందేగానీ, తనొక్కమాటా పడలేదు. ఇప్పుడీ సకసేనా గాడేదో వాగుతున్నాడు. ఈ క్షణాన తను 'వీలుకాదని' లేచిపోవచ్చు. కానీ పోయి చేసేదేమిటట? వీడు పలుకబడికల వాడే ననడంలో సందేహంలేదు. లోగడ తనతో అన్నవన్నీ చేశాడు. ఇదీ చేస్తాడు. కాకపోయినా తనిప్పుడు బయటికి వెళ్ళనుకూడా వీలులేదు. దోవతెలీదు సరిగదా కనీసం
''మిరోప్పుకొంటే సినిమా మొదలవుతుంది'' అన్నాడు సక్సేనా
''ఊఁ''
''యస్'' అన్నాడతను.
మరుక్షణమే లైట్లన్నీ ఆరిపోయాయి.
చిన్న తెరమీద ఓ క్షయంపాటు తెల్లకాంతి పడ్డాక, బొమ్మలొచ్చాయి.
వాటిని చూసి మంజరి రిచ్చపడింది. లోగడ ఇలాంటి ఫిల్ములను గురించి అవిడ విన్నదేగానీ, చూసిన పాపన పోలేదు. ఇప్పుడా కొరతకూడా తీరిపొయింది.
పది నిమిషాల పిక్చర్ లోనూ కలసి, మూడు సీన్సున్నాయి. ముందుగా పూలతోట. అందులో అమ్మాయి. అబ్బాయి తరువాత ఈత కొలను సీను, ఇద్దరూ కలసి ఈదడం, మూడవది ఈకార్యక్రమాల పర్యవసానమేదో అదీ!
సినిమా సుస్తున్నంత సేపూ, మంజరి కొంత అనీజీ నెస్ ఫీలవుతూనే వుంది.
''సిగ్గూ శరమూ లేకుండా వొళ్ళమ్ముకొని బతికిన దాన్నే. ఈ సినిమా చూసేండుకు అభిమానపడి చస్తున్నానే - ఇహ మామూలు మనుషులు ఎలా చూస్తారో?'' అనుకొన్నది మంజరి.
పదినిమిషాలయ్యాక లైట్లు వెలిగాయి.
''ఎలా ఉంది?'' అన్నాడు సక్సేనా.
''బాగానే ఉందిగానీ - అసలలాంటి వెవరు చూస్తారండీ?'' అన్నది మంజరి.
''న్యాయంగా అయితే ఇవన్నీ నేను చేప్పకూడదు గానీ, మీమీది, గౌరవం వల చెబుతున్నాను. కులీన వంశస్థులు చాలా మంది వీటిని చూస్తారు. కొందరు ఫిలింకాపీలను కొనుక్కుపోతారు. కూడాను...... ఇందులోకి మామూలు స్త్రీలు, పురుషులు పనికిరారు. అందంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నవాళ్ళు కావాలి. మీస్నేహితురాళ్ళల్లో చాలామంది మాఖాతా దారులే ! వారితో తీసిన ఫిల్ములు చూస్తానంటే ప్రాజెక్టు చేయిస్తాను.... '' అన్నాడు సక్సేనా.
''ఎవరెవరు?'' అన్నది మంజరి.
''చూడండి!'' అన్నాడు సక్సేనా
''అవసరం లేదు. మీ మాటమీద నాకేమాత్రం నమ్మకంలేదంటారా?''
''సితారా, అనవర్, కుంతి, బాను, జయంతి, మాల, కుర్షిద్ మాల, మణి, వీళ్ళందరూ, వస్తూనే ఉంటారు'' అన్నాడు సక్సేనా.
''నాకీ ఫిల్ము ఎందుకు చూపినట్లు?'' అన్నది మంజరి చాలా తాపీగా.
''ఎలా వ్వవహరించాలో మీరు తెలుసుకోవడానికి, మీరు మేకప్ లోనే వచ్చారు. గనుక సరిపోయింది. లేకపోయినా ఫర్వాలేదు. లోపల అన్నీరెడీగా ఉన్నాయి. మీకు 'జోడు' కూడా ఏర్పాటు చేశాను. మీరు జాగ్రత్తగా చేస్తే పది నిమిషాల్లో వసంతా ఫినిష్ అవుతుంది. ఏ మాత్రం సిగ్గుపడి పాడుచేసినా, మళ్ళీ మళ్ళీ రీటేక్ చెయ్యాలి సొస్తుంది. ''
'రీటేక్' అని గొణుక్కొని తనలో తనే నవ్వుకొన్నది మంజరి. తల అడ్డంగా తిప్పుతూ.
''మీకిష్టం లేందే రమ్మని చెప్పడం భావ్యంకాదు. మీరేదో ఉపకారం కావాలన్నారు. చేస్తానన్నాను. అందుగ్గాను మీరు నాకీ పని చేసిపెడితే చాలు. కాదూ కూడదు, పోలీసులతో యాతనే పడతానంటారా ? మీఇష్టం ! అయితే ఈ వ్వవహారం ఏ వోడ్డుకు చేరుస్తుందో చెప్పలేను'' అన్నాడు సక్సేనా.
మంజరి ముఖం పాలిపోయింది.
కళ్ళల్లో భయపు ఛాయలు ఆర్రాడాయి.
''మేకప్ చెరిగింది, సరిచేసుకొంటాను'' అన్నది మంజరి, గొంతును స్వాధీనంలోకి తెచ్చుకొంటూ.
36
(మాధవరావు చెప్పిన కధ)
మళ్ళీ నేను రంగం మీది కొస్తాననుకోలేదు. కానీ రాక తప్పిందికాదు. మనుషుల్ని గురించి నాకైతే కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నమాట నిఅజమే ! నా అంచనాలు కూడా సాదారణంగా తప్పిపోవు. కానీ వొక్కో వ్వక్తి, కొమ్ములు తిరిగి వాడి అంచనాలను కూడా దాటిపోవడం కద్దు. దానికేమిటి కారణం ? జాతకం అలాంటిదీ! అని సరిపెట్టుకొంటాం.
అట్టడుగునుండి, ఆకాశంలోకి లేచిన మనుఘులు, సాదారణంగా, తమ పూర్వ పరిస్టితులను, ఆసహ్యించు కోవడమూ, పూర్వపు పరిచయస్థుల నుండి ముఖం తప్పించడమూ చేస్తూ ఉంటారు. గత స్మ్తుతుల తాలుకు బాధామయ వాతావరణాన్ని వారు భరించలేరు నామట్టుకు నేను, నా చిన్నతనంలో పడిన యాతనలన్నీ పైకి చెప్పుకొన్నానా? లేదా!
మంజరి ఇందుకు భిన్నమైన వ్వక్తిత్వం కలిగిన మనిషి, అవి తన శత్రువులను, ప్రతిరక్తకణంతోటి ద్వేషించింది. ఆప్తులను, ప్రాణ ప్రదంగా - అంతకు మించి కూడా ప్రేమించింది. జీవితంలో, అడుగడుగునా, ఆమో తిన్నదెబ్బలు, అనుభవించిన నరకయాతన, ఆ బ్రతుకును తీర్చిదిద్దాయి. అనుభవాలనుండి జీవరసాన్నీపీల్చుకుని వ్వక్తిత్వాన్ని వికసింపచేసుకొన్న మనిషి! ఈ రోజున మంజరి కొచ్చింది గనుక, ఇవన్నీ నేనంటున్నానని, మీరభిప్రాయ పడితే మీకర్మకు నేను చేయగలిగిందేమి లేదని మనవి చేస్తున్నాను.
విదేశాలకు వెళ్ళబోయేముందు, మంజరినోసారి చూడాలనిపించింది. రామచంద్రంతో చెబితే తను రానన్నాడు. నేను బలవంతం చేశాను. వాడు ఎడుస్తూ బయలుదేరాడు. తీరా మేము విమానాశ్రయం చేరుకొనే వేళకు అది బయలుదేరి పోయింది.
నిజానికి విచారించవలసిన వాణ్ణి నేనయినా, రామచంద్రాన్ని వోదార్చవలసి వచ్చింది.
''నాకు తెలుసు, మంగమ్మ మళ అలా మనకు కనిపించదు. అందుకే నేను రానన్నాను. నువ్వు నాప్రాణాలు తీశావు'' అని విరచుకు పడ్డాడు రామచంద్రం.
అంతకు ముందొకసారి, కళ్యాణి హత్య జరిగినప్పుడు, వద్దమనుకొన్నాం కానీ వీలుపడిందికాదు. వాటికి నేడు మళ్లీ బొంబాయికి రావలసివచ్చింది. అసలీ ప్రయాణం కూడా ఉండకపోను. మునుపెన్నజూ రాయనంత బలంగా ఈసారి జాబురాసింది మంజరి.
''ఈ ప్రంచంలో, ప్రాణాలున్నంత కాలమూ, మనుషుల మధ్య సంబంధాలుంటాయన్న నమ్మకం నాకిప్పటికీ ఉన్నది. మిమ్మల్ని చూడాలని నేనెంత గోషిస్తున్నానో నాకూ, ఆ పరమాత్మకూ మాత్రమే తెలుసు. ప్రతి జాబు చివరా, సుఖంగా ఉన్నావు గదా అంటారు. నేనెలా ఉన్నదీ ఒక్కసారి వచ్చి చూడండి. ఆప్తులకోసం నా ఆత్మ దిశదిశలూ అన్వేషిస్తుంది. ఎంతో ఎత్తుకు ఎదిగానని మీరు లోగడ జాబులో రాశారు. బహుశా అందువల్ల నే కావచ్చు. భునిమీద కాళ్ళు నిలపలేక పోతున్నాను. ఒక్కో తరంగం మహాధృతంగా వచ్చి, కళ్ళ కింద మట్టిని త్రవ్వి లాగిపారేస్తుంటే, ఏమిచేయ్య్దడానికి తోచక, ఎడ్చినా వినే దిక్కులేక అల్లాడి పోతున్నాను. నాకెన్నడూ లేని భయమేదో, లోలోపల కదులుతున్నది. అసంత్రుప్తి జ్వాలలు ప్రతిరక్తబిందువునూ, మాడ్చి వేస్తున్నాయి..... ఈ మహాగ్రతాపం నుండి రవంత బయట పడేందుకూ, కాస్త చల్లని వాతావరణంలో ప్రశాంతంగా బ్రతికేందుకూ నాకు అవకాశముంటే చాలు. అది మీరు మాత్రమే కలిగించగలరు. ఈ ఉత్తరం చూడంగానే, మీరూ రామచంద్రంగారూ కలసిరండి! ఈ సారి రాకపోతే, అక్షరాలా నన్ను చంపుకు తిన్నట్లే!''
ఇదీ బాబూ !
ఈ పంక్తులు వెనుక నాకు మంజరి దీనారవం వినిపించింది.
''నువ్వు ముందుపదరా! వారంరోజులు అటూ ఇటూగా నేను వస్తాను'' అన్నాడు రామచంద్రం.
దోవపొడుగునా నాకు మంజరి గురించిన ఆలోచనలతోనే సరిపోయింది. ఇన్ని వందలమైళ్ళు రైలు ప్రయాణంలోనూ, కొన్ని వేల సార్లు ఆవిడ పేరు విన్నాను. ఆవిడ బొమ్మ చూశాను.
''ఇండియా మొత్తంమీద ఏదోఒక బాషలో ఏదోవొక ప్రాంతంలో అవిడున్న సినిమా ప్రతిరోజూ ఆడుతుంది'' అన్న మాట విన్నాక మంజరికి పట్టిన అదృష్టానికి పళ్ళు పులిసిపోయాయి......
స్టేషను దగ్గరకు తనే స్వయంగా కారుతీసుకొచ్చింది. ముందుగా నేనామెను గుర్తుపట్టలేక పోయాను. ఆవిడే నన్ను పలకరించింది.
''బొమ్మలో ఉన్నదానికి, నీకు ఎక్కడా పోలికేలేదు. మంజరీ! అన్నాను నవ్వుతూ''.
''సినిమాలో బాగున్నానంటారా? విడిగా బాగున్నానంటారా ?'' అన్నదావిడ.
''ఎక్కడ బాగున్నా ఏంలాభం? నేనై ముసలి వాణ్ని. మరి నువ్వేమో - రోజు రోజుకూ చిన్నదాని వయిపోతున్నావు గానీ, వయస్సు పెరుగుతున్నట్లు లేదాయే. నాటకాలాడే రోజుల్లో నిన్ను చుస్తే, ఇంకో రెండు మూడేండ్లకన్నా 'సర్వీస్ కు' పనికిరావనుకోనేవాన్ని, కానీ ఇప్పుడలా లేవు. అందరికి వయస్సు పెరుగుతుంటే సినిమా మనుషులకు తరుగుతుంటుందా ఏం?'' అన్నాను సరదాగా.
మంజరి సమాధానం చేప్పకుండా నవ్వి ఓ క్షణం నాకేసి చూసి తలవంచుకోంది.
''మాట్లాడవేం?'' అన్నాను.
''ఏం మాట్లాడినా మీరు ముసలివాళ్ళు మీవల్ల నాకు ఉపయోగం లేదు'' అన్నది మంజరి.
''మరి కారు తిప్పించు, తిరుగుబండికే పోతాను''
''పదండి! ఈ దిక్కుమాలిన గోడవలకన్నా ఏ మారుమూల గ్రామంలోనో, ఊరిబయట పూరిపాకలో గోనెపట్టా పరచుకోని, అదమరిచి నిద్రపోదామనిపిస్తుంది'' అన్నది మంజరి.
''నేనిక్కన్నుంచే వస్తున్నాను. నన్ను చూసి అసూయ పడేందుకేమీ లేదు.....
ఎందుకలా జనం నీ కారు కేసి మిర్రిమిర్రి చూస్తారు?'' అన్నాను.
మంజరి రెండు చేతులతోనూ తల బదుకొన్నది.
కదిలిస్తే కంపు కంపవుతుందని, నేను మాట్లాడలేదు.
మంజరి ఇల్లు - అది ఇల్లా, రాజభవనంగానీ -చుశాక నాకు పిచ్చెక్కుతుందనిపించింది. ప్రత్యేకంగా జయపూర్ నుండి పాలరాళ్ళు తెప్పించానన్నది. కేవలం స్నానాల కొలను కట్టడానికే ఇరవయ్యయిదు వేలదాకా అయినట్లు చెప్పింది. ఆఖరి అంతస్తులో నిలబడి చూస్తుంటే, అటు సముద్రమూ, ఇటు బొంబాయి నగరమూ, నేత్రోత్సవంగా కనిపిస్తాయి.
చలపతి నన్ను చప్పున ఆనమాలు పట్టాడు. శర్మగారు కూడా నన్ను అప్యాయంగానే పలకరించాడు. వసంతను చూసిన జ్ఞాపకం లేదుగానీ, రాజమణి నాకు బాగా తెలుసు. మీరుగాక మిగిలిన నౌకర్లందరూ, నేనంటే అమిత గౌరవాభిమానాలు ప్రకటించారు. వారం రోజులపాటు, చలపతీ శర్మ, నన్ను బోబాయంతా తిప్పారు.
''స్టూడియోలు చూస్తారా?'' అన్నాడు శర్మ.
''వద్దుగానీ, మంజరి షూటింగేదన్నా ఉంటే చూద్దాం'' అన్నాను.
ఆ సమయానికి ఏదో లవ్ సీను షూట్ చేస్తుంన్నారు. మంజరి పల్లెపడుచు వేషంలో ఉన్నది. హీరో పైజామా, లాల్చీ, సన్నటి కళ్ళజోడు, వేసుకొన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకొని, సన్నగా పాట పాడతారు. మొదటి చరణం పిక్చరైజ్ చేసేసరికే మధ్యాహ్నమయింది.
''నాకు తలనోప్పిగా ఉంది. ఇంటికి పోతాను'' అన్నది మంజరి.
'' అయ్యో ఎలా?'' అన్నారెవరో.
ఆమాట వచ్సిన దిక్కుగా కళ్ళురుమి చూసింది మంజరి. ఆ ముఖం చాటుకు తప్పుకొన్నది.
మంజరి మాటకున్న విలువేపాటిదో చూశాక, ఆవిడతో మాట్లాడటానికి నాకు భయమేసింది.
అయినా అంత వ్యవధాన మేదీ!
బారెడు పొద్దెక్కిగానీ లేవదు. మళ్ళీ రాత్రి ఏ పన్నెండింటికో గానీ కొంప చేరదు. ఈ లోగా ఖాళీ దొరికితే బోజనానికొస్తుంది. ఆ సమయంలో ఇంటి దగ్గర కొన్ని వందల మంది గుంపుగుడి ఉంటారు. వారందరితోనూ మాట్లాడటం అసంభవం. ఉన్న రెండు ఫోన్లూ ఆస్తమానూ మోగుతూనే ఉంటాయి. చాలా వాటికి లలారాం, చలపతి శర్మగార్లే సమాధానమిస్తుంటారు. ఇక ఉత్తరాల సంగతి సరేసరి!
మంజరి భాగ్యాన్ని చూసి, నేను అసూయపడ్డమాట నిజమే లక్షలు దాటిపోయింది. ఆ తరువాత అంకె చేరబోతూ ఉంది. సంపాదన ఎంత భారీగా ఉన్నదో, ఖర్సులూ అంతే! దాదాపు, ఓ వంద విద్యార్థులకు అవీడ జీవితాలనిస్తుంది. రెండు అనాధాశరణాలయాలు అవిడ పేరుమీదగా నడుస్తున్నాయి. రకరకాల రాజకీయ పార్టీలకు, ఆవిడ భారీ ఎత్తున విరాళాలిచ్చింది. పత్రికలకు ఏ రూపంలో ముట్టచెప్పకపోతే - బావ్యంగా ఉండదు. ఇవిగాక ఇంకా విడిచందాలూ, పన్నులూ, లంచాలూ, వార్శికాలూ, ఎన్ని అలవడ్డాయో!
''ఒక్కసారి సంపాదించడం మనేద్దామా అనిపిస్తుంది. కానీ అది మన చేతుల్లో వుండదు నాకు డబ్బోద్దోయ్ బాబూ అన్నా వినిపించుకోరు. రాత్రింబవళ్ళు, నిద్రాహారాలు మాని, సంపాదించింది పన్నులకింద ప్రభుత్వానికివ్వాలంటే, కడుపు రగిలి పోతుంది. అందుకే ఖర్సులు విపరీతంగా పెట్టేస్తున్నాను. అప్పటికీ మొత్తం సంపాదన లెక్కలోకి రాదు'' అన్నది మంజరి.
''ఇది మోసం కాదా?'' అన్నాను అవిడతో.
మంజరి నవ్వి
''అసలు బ్రతుకే పెద్దమోసం'' అన్నది నాకేసి చూస్తూ.
''నేను వారంరోజులపాటు నా ప్రొగ్రాములన్నీ కాన్సిల్ చేశాను. చస్తారు వేధవలు. చావవీండి. ఎవరికట జాలి? నేను చచ్సిన రోజుల్లో, వొక్కడు నన్ను కనికరించిన పాపానపోలేదు. వీళ్ళమీద నాకెందుకు జాలి ఉండాలండీ?'' అన్నది మంజరి.
''నువ్వు మంచిదానివి. మెత్తటి దానిని నీది జాలి గుండె, ఎదుటివారి కష్టాలుచూసి నువ్వు భరించలేవు'' అన్నాను.
''కొంత మేరకే నిజం! కొందరు సుఖపడుతున్నా నేను చుడలేను. ముఖ్యంగా నా శత్రువులు, నన్ను బాధించిన వారిమీద కసి తీర్చుకోవడంలో నేను పరమానందాన్నిఅనుభవిస్తాను... ముఖ్యంగా, డ�
