"నా బోయ్ ఫ్రెండ్"
"ఫ్రెండ్ కాదు. మీరు అతన్ని ప్రేమించారు!"
"అఫ్ కోర్స్.... పెళ్లి చేసుకోవాలనుకున్నాను.!"
"కానీ అతని కప్పటికే పెళ్లయింది పిల్లలున్నారు!"
"తర్వాత తెలిసింది!"
"అప్పుడేం చేశారు!"
"ఛీ కొట్టాను" చెప్పింది.
"కానీ తర్వాత కూడా మీరు అతనితో తిరిగినట్టు ఆధారాలున్నాయి."
"ఫ్రెండ్లీగా వచ్చేవాడు."
"మోసం చేసినవాడు ఫ్రెండెలా అవుతాడు!"
"నిజమే. ఆ సంగతి నేను ఆలోచించలేదు!"
"అతను, మీరు ఇంచుమించు రోజుకలుసుకునేవాళ్ళు. పార్కుకో సినిమాకో వెళ్ళేవారు."
"రోజూ కాదు, ఎప్పుడైనా!"
"కానీ మీ ప్రేమ కథ ఎంత వరకూ వెళ్లిందో నాకు తెలుసు!"
ఆమె భృకుటి ముడిపడింది.
"చెప్పు" ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది.
"అతను మిమ్మల్ని ముట్టుకొనేవాడు."
"బస్సెక్కితే వందమంది, సుల్తాను బజారు వెళితే వెయ్యిమంది ముట్టుకొంటారు. అదీ తప్పేనా?" అడిగింది.
"కానీ కౌగలించుకోవడం, ముద్దులు పెట్టుకోవం చేయరు కదా! మీ అందాన్నంతా తడిమిచూడరు కదా!"
"షటప్!"
"సారీ మేడం... .నాకు తెలిసిన విషయాలు చెప్పమన్నారు. చెప్తున్నాను"
"చాలా కష్టపడ్డావు!" అంది.
"నాకు ఒప్పగించిన పని అది."
"అంతేనా!"
"ఇంకా క్లైమాక్స్ వుంది మేడం!"
"ఓహ్! ఏమిటది?"
"మిమ్మల్ని అతని ఫ్రెండ్ గదికి తీసుకెళ్లి....."
ఆమె కళ్లు ఎర్రబడినయ్.
"వెళ్ళాను"
"కానీ ఆ గదిలో ఏం జరిగిందో నాకు తెలీదు."
"ఎవరూ చెప్పలేదా?"
"కిరణ్ కుమార్ ఫ్రెండ్ ఆదినారాయణ ఆ ఇల్లు. అతనితో కిరణ్ చెప్పాడట పని జరిగిందని."
"నాన్సెన్స్!" అరిచింది నాగమణి.
" హౌ డేర్ యూ ఆర్ టు టౌన్ లైన్ దట్." ఆమె ఉద్రేకంతో ఊగిపోతుంటే.....
"మీరు పట్టుబడితే చెప్పాను మేడం...."
"ఆ కిరణ్ గాడు అంత రోగ్ అన్నమాట!"
నరేంద్ర చేతులు కట్టుకు నించున్నాడు.
"రోగ్ కాకపోతే అన్నెం పున్నెం ఎరుగని మిమ్మల్ని వానలో తడిసిపోతోన్నదన్న నెపంతో గొడుగిచ్చి ట్రాప్ లో పడేశాడు కదా మేడం. తనకి పెళ్లయిందని చెప్పకుండా ప్రేమలోకి దింపడు కదా ! తనో ఆఫీసర్నని మిమ్మల్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు కదా!"
