Previous Page Next Page 
భవ బంధాలు పేజి 13


    "ఏం చేద్దాం?"అంది విశాలాక్షి తెల్లబడ్డ మొహంతో.
    "ఆలోచిద్దాం!" దీర్ఘంగా నిట్టుర్పు విడిచి అన్నారు తండ్రి. ఆలోచించారు రాత్రంతా.

                                  *    *    *
    వారం పది రోజుల్లో ఎప్పటి నించొ వెళ్ళాలనుకున్న యూరోప్ యాత్రకి టికెట్స్ బుక్ చేసుకొని తల్లీ తండ్రి వెళ్ళిపోయారు.
    తెల్లబోయింది కూతురు. "ఎందుకింత హడావుడి ప్రయాణం కొంప మునిగినట్టు!' కోపంగా అంది.
    "ఎప్పటి నించో కొనుక్కున్నాం టికెట్స్."
    "మరి ఇల్లు, నేను...ఎవరు ఉంటారు?" అయోమయంగా చూసింది కూతురు.
    "నీవు ఉండు చిన్న పిల్లవా...పనిమనిషి వస్తుంది పని చేస్తుంది. వండుకోవాలంటే వండుకో....లేదంటే తెప్పించుకో" ముభావంగా అని ఇంటి తాళాలు ఒక సెట్ ఇచ్చారు.
    
                                   *    *    *
    "ఏమిటండీ, ఇదంతా?" ప్లేన్ ఎక్కాక సావకాశంగా అడిగింది విశాలాక్షి . భర్త ఏదో ఆలోచించే ఇదంతా ప్లాన్ చేసాడని తెలిసినా మంచికే అని తెలిసేటప్పటికీ మాట్లాడలేదు.
    "డానికి మనం ఎంత చెప్పినా అర్ధం చేసుకోదు. ధియరీ లాభంలేదు. ప్రాక్టికల్స్ కావాలని డానికి ఇల్లు, బాధ్యతలు , కష్ట సుఖాలు , డబ్బు విలువ భర్తంటే ఏమిటో తెలిసి రావాలి" పేపర్ తెరిచేరు. ఇంకా ఏదో అడగాలని, భర్త గంబీర ముఖం చూసి, పక్కన మనిషి వచ్చి కూర్చోవడం చూసి ఊరుకుంది.
    ఇరవై ఐదు రోజులు గడిచాయి. సరదాగా చూడాల్సినవి అన్నీ చూసారు. ఒక్కసారి కూడా కూతురికి ఫోన్ చేయలేదు. "డానికి ఒక్కసారి ఫోన్ చేస్తానండీ! ఎలా ఉందొ, ఏం చేస్తుందో? తల్లి మనసు గొణిగింది.
    "వద్దు. అది చేసిందా మనకు? ఈ మమకారాలు, సెంటిమెంట్స్ అన్నీ తగ్గించుకోవాలి మనం. అందుకే లోకువ చేసి ఆడిస్తోంది. తనకి కావాల్సింది మన చాకిరీ. డబ్బు తనకే ఉంది. చిరకాలం ఎవరూ కూర్చో బెట్టి చేయరు అని తెలియాలి ముందు డబ్బు ఉంటె చాలు అన్నీ గుమ్మం లోకి వస్తాయి అనుకుంటోంది డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయని తెలియాలి' సీరియస్ గా అన్నారాయన.
    ఈసారి భర్త కూతురిని క్షమించలేదని అర్ధమై ఊరుకుంది ఆవిడ.
    ఇంకో రెండు రోజుల్లో బయలుదేరుతారనగా ఫోన్ వచ్చింది. ఎవరిదో కొత్త నంబర్. మాట్లాడింది ఎవరో పోలీస్ ఆఫీసర్. ఆందోళనగా "ఎస్" అన్నారు మూర్తి. ఆయన చెప్పింది విన్నాక ముఖం పాలిపోయింది. మీ కారుకి యాక్సిడెంట్ అయిందని, అందులో ఉన్న స్త్రీ కి బాగా దెబ్బలు తగిలాయని, స్పృహ తప్పిన ఆమె హాస్పిటల్లో జాయిన్ చేసి , కారు లైసెన్స్ నెంబర్ ద్వారా అడ్రస్ , ఫోన్ నెంబర్ పట్టుకుని ఫోన్ చేస్తున్నానని ఆ పోలీసాఫీసర్ చెప్పాడు.
    మూర్తి గారు కళ తప్పిన ముఖంతో వివరాలు అడిగి, తాను విదేశాల్లో ఉన్నానని, ఆసుపత్రి వివరాలు, ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబర్ మెసేజ్ చేసి హెల్ప్ చేయమని కోరారు. మరో అరగంట ఫోన్ మీద గడిపి కూతురికి ప్రాణాపాయం లేదని, ట్రీట్ మెంట్ ఇస్తున్నారని , కుడికాలు , ఎడమ చేయి ఫ్రాక్చర్ అయ్యాయని , ముఖం మీద , శరీరంలో చాలా చోట్ల చిన్న దెబ్బలు అని చెప్పారు డాక్టర్.
    తాము వచ్చేవరకూ కొన్నాళ్ళు అక్కడే ఉంచి ట్రీట్ చేయమని, ఓ ప్రత్యెక నర్సు ని కుదర్చమని డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తానని అన్ని ఏర్పాట్లు చేసి , "ఒక రిక్వెస్ట్ " అంటూ తమతో మాట్లాడిన వైనం, తాను అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూతురికి తెలియనీయద్దని, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని రిక్వెస్ట్ చేసారు.
    వింటున్న విశాలాక్షి ఆశ్చర్యంగా , అర్ధం కానట్టు చూసింది. "టికెట్ మార్చడానికి దొరికితే ప్రయత్నించండి" అంటూ కళ్ళు తుడుచుకుంది. తల్లి ప్రాణం కూతురు అలా దిక్కు మొక్కూ లేనిదానిలా పడుండడం తట్టుకోలేక.
    'దానికేం ప్రమాదం లేదు. భయమేమీ లేదు. వెనక నించి ఎవరో గుద్దారు. చిన్నదేబ్బలె" అన్నారు ఓదార్పుగా భార్య వంక చూసి.
    "అయినా సాలోచనగా "చూడు విశాలా! డానికి మనుషుల విలువ , తోడన్నవారు లేకుండా, ఆదుకోడానికి ణా అన్నవారు లేకపోతె ఎలా ఉంటుందో తెలియ చెప్పడానికే ఈ యాక్సిడెంట్ జరిగిందేమో! మనం ఇంకో మూడు రోజులకు గాని వెళ్ళం. అప్పటి వరకు రంగాని కూడా డానికి కనపడకుండా అన్నీ చూడమని చెప్పా. అల్లుడిని కూడా మనం వెళ్ళేక చెప్పి రమ్మంటా.... నర్సు ని డబ్బిచ్చి చూడమని చెప్పా. దానికిం ఎవరూ తోడు నీడా లేకుండా రోజులన్నీ ఒక్కలాగే గడిచిపోయాన్న భావం తొలగాలి. నా అన్నవాళ్లు ప్రతి స్టేజిలో ఉండాలి. దాన్ని కాచుకు చూసేందుకు ఎల్లకాలం ఉండడం అన్నది అర్ధం కావాలి. మనుషుల మధ్య సత్సంబంధాలు ఎంత అవసరమో ఈ సంఘటన ద్వారా అర్ధం అయితే నైనా దానిలో మార్పు వస్తుందేమో! మనం చేద్దవాళ్ళం అయినా అది బాగుపడితే చాలు! లోకం, అది కలిసి మనసు మనసు బండరాళ్ళు అనుకున్నా ఫరవాలేదు. మనం బండరాళ్ళ మై ఉలి దెబ్బలు తిన్నా, డానికి కొత్త రూపం వస్తుందేమో ప్రయత్నిద్దాం. కొలిమిలో సమ్మెట దెబ్బలు తిని కొత్తరూపు సృష్టిద్దాం! ఓ వారం నీ బాధ , ఆవేదన దాచుకో.
    ఇది దాన్ని సంస్కరించడానికి దేముడిచ్చిన అవకాశం అనుకో. పక్షులు జంతువులూ ఎగరడం, వేటాడ్డం నేర్వగానే పిల్లల్ని పట్టించుకోడం మానేసినట్టు ఉండడం నేర్చుకోవాలేమో మనిషి కూడా. అప్పటికి కానీ తెలిసి రాదేమో ఈ తరానికి. మనిషి ఒంటరి అవడం శాపం అనుకోవాలి. నీవు ఊరికే బాధపడకు . అర్ధంచేసుకో నన్ను" భార్య భుజం మీద చెయ్యి వేసి లాలనగా అన్నారు మూర్తి .
    ఐదారు రోజులకి ఇంటికి తిరిగొచ్చేసరికి అప్పటికే కాస్త తేరుకున్న కూతురు భర్తకి ఫోన్ చేసి రప్పించు కుందన్న విషయం రంగాద్వారా విన్న మూర్తి గారు సంతోషించి ఆస్పత్రికి బయలుదేరారు.
    వెళ్ళేసరికి అల్లుడి చేయి పట్టుకు తలగడకు అనుకుని కూర్చున్న కూతురు తల్లి తండ్రుల్ని చూసి మొహం చిట్లించి భర్త చేయి మరింత గట్టిగా బంధించింది వదలకుండా.
    అయన భార్య వంక అర్ధవంతంగా చూసారు.

                                     *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS