It's my experience

గురువుగారి విభూతి మహిమ

Powerful Vibhooti

చిన్నా

 

హైదరాబాద్ షిర్డీ సాయిబాబా భక్తుల్లో చాలామంది సాంబమూర్తిగారి గురించి విని ఉంటారు. కొందరు ప్రత్యక్షంగా చూసి ఉంటారు. అలాంటి అదృష్టం నాకు దొరికింది. ఎలాంటి కష్టం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళి విభూతి పొట్లం తీసుకుంటే చాలు ఆ సమస్య ఇట్టే తీరిపోయేది.

 

చిక్కడపల్లి వేంకటేశ్వరస్వామి గుడికి దగ్గర్లో ఉండేవారు సాంబమూర్తిగారు. ఇప్పుడైతే మారుమూల కుగ్రామాల్లో కూడా సాయిబాబా మందిరాలు వెలుస్తున్నాయి కానీ అప్పట్లో షిర్డీ సాయిబాబా గురించి ఎక్కువమందికి తెలీదు. కానీ సాంబమూర్తిగారి గురించి విని ఆయన దగ్గరకు వెళ్ళడంతో బాబా పట్ల భక్తి కలిగింది. వీలైనప్పుడల్లా సత్సంగాలు, భజనలు ఏర్పాటు చేసేవారు. నిరంతరం బాబాను స్మరించుకోమని చెప్పేవారు. ఆ మహానుభావుని మాటలు వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపించేది.

 

ఎవరైనా ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, మరేదైనా సమస్య గురించి చెప్పినా సాంబమూర్తిగారు ఒక చిన్న విభూతి పొట్లం ఇచ్చేవారు. దాన్ని నీళ్ళలో కలుపుకుని తాగితే వెంటనే అనారోగ్యం మాయమయ్యేది. మా చిన్నమ్మాయికి తరచుగా కడుపులో నొప్పి వచ్చేది. ఎందరు డాక్టర్లకు చూపించినా ఆ మందులతో వెంటనే ఉపశమనం కలిగేది కానీ, పూర్తిగా తగ్గక మళ్ళీమళ్ళీ వస్తూనే ఉండేది. ఒకసారి సాంబమూర్తిగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాటే చెప్పాను. ఆయన విభూతి పొట్లం ఇచ్చి ఒక కప్పుడు నీళ్ళలో కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి - చొప్పున మూడుసార్లు తాగించమన్నారు. అలాగే చేశాం.

 

ఎంత చిత్రం అంటే.. సద్గురువు సాంబమూర్తిగారు విభూతి ఇచ్చిన తర్వాత మరెప్పుడూ అమ్మాయికి కడుపునొప్పి రాలేదు. వారిచ్చిన విభూతి పొట్లాలు దివ్య ఔషధాలు.

 

సాంబమూర్తిగారి గురించి తెలిసిన ఎందరికో ఆయన చేతులమీదుగా అందుకున్న దివ్య విభూతి ఎంత మహత్తరమైందో తెలుసు. గురువుగారు ఇక లేరు, సమాధి స్థితిలోకి వెళ్ళారు అని తెలిసిన క్షణాలు ఎంత దుఃఖాన్ని కలిగించాయో, విషాదాన్ని మిగిల్చాయో మాటల్లో చెప్పలేను.

 

మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని ఎగతాళి చేసేవారికి సమాధానం చెప్పలేం. కానీ, మన మధ్యలో కొందరు పుణ్యాత్ములు ఉన్నారు. వారిలో దివ్య శక్తులు ఉంటాయి. అది బహుశా కఠోర దీక్ష, మనో సంకల్పంవల్ల సాధ్యమౌతుంది. అలాంటి మహనీయుల మహిమను చూసి అనుభూతి చెందాల్సిందే కానీ వితండవాదం చేసేవారిని సమాధానపరచి నెగ్గాలనుకోవడం అనవసరం.

 

shirdi sai baba devotee sambamurthy garu, sambamurthi garu and shirdi sai baba, sai devotee hyderabad sambamurthy garu, sadguru sambamurthy garu and sai satsang


More It's My Experience