అది నిజంగా మిరాకిలే...

A Real Miracle

విజయలక్ష్మీ యదాతి

అరుణ్ Indo-American. అతనితో నా ప్రేమ, పెళ్ళి చాలా తమాషాగా జరిగిపోయాయి. తన పేరెంట్స్ అప్పటికే చనిపోయారు. మా వాళ్ళకు caste feelingలేకపోయినా, mother American కనుక culture differ అవుతుందేమోనని భయపడ్డారు. కానీ అరుణ్ణి చూసి, కొన్నిసార్లు మాట్లాడాక నాకంటే ఎక్కువ impress అయ్యారు. కొడుకులా ఫీలయ్యారు. దాంతో ఏ అబ్జక్షన్లూ, అడ్డంకులూ లేకుండా పెళ్ళి జరిగింది. మామూలు పెళ్ళిళ్ళలో కనిపించే కట్నాలు, కానుకలు, పెట్టుపోతలు లాంటి అసహనం కలిగించే ఏ ఆచారాలూ, ఆర్భాటాలూ లేకుండా ఒక birthday party అంత simpleగా sweetగా జరిగింది పెళ్ళి. అరుణ్ advt agency బాగానే నడుస్తోంది కనుక నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేకపోయింది.

 

సంతోషంగా సాగిపోతున్న మా జీవితంలో పిడుగుపాటు లాంటి సంఘటన... ఒక యాడ్ గురించి అరుణ్ బోంబే వెళ్ళి తిరిగొస్తుండగా భయంకరమైన accident. రైల్లో డోర్ ను పట్టుకు నిలబడ్డాడట.. అప్పుడే ట్రెయిన్ మలుపు తీసుకోవడంతో బాలెన్స్ తప్పి పడిపోయాడు. అర్ధరాత్రి కావడంతో కంపార్ట్ మెంట్లో అందరూ నిద్రలో ఉన్నారు. పడటం పడటం ఒక పెద్ద గోతిలో పడ్డాడు. తెల్లారేవరకూ ఎవరూ చూడలేదు. పగలైనా అయితే ఫోన్లో కాంటాక్ట్ లేక డౌట్ వచ్చేది. కాస్త వెలుగురేఖలు వచ్చాక అటుగా వెళ్ళిన పెద్దమనిషి చూసి... hospitalలో చేర్చి మాకు ఫోన్ చేసి చెప్పారు.

 

అరుణ్ణి ఆ స్థితిలో చూస్తే ఏడ్పు ముంచుకొచ్చింది. కన్నీళ్లు వరదలై పారాయి. కాలు ఫ్రాక్చరయింది.. ఒక చెయ్యి లేనే లేదు.. ఒళ్ళంతా గాయాలు.. వెంటవెంటనే ఆపరేషన్లు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే తీసుకొచ్చి ఉంటే చేతిని ఎటాచ్ చేసే పని అన్నారు డాక్టర్లు. అరుణ్ చెయ్యి విరిగి అల్లంతదూరంలో పడిందని, దాన్ని వెతకడానికే చాలాసేపు పట్టిందని అక్కడివాళ్ళు చెప్తోంటే కడుపు తరుక్కుపోయింది. ఇంతకంటే విషాదకరమైన సంఘటన ఇంకేం ఉంటుంది?

 

మొత్తానికి ఆ విషాదం నుంచి తెరుకున్నాం. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. అంత వేగంగా వెళ్తోన్న రైల్లోంచి.. అందునా ఓ పెద్ద గోతిలో.. అదీ అర్ధరాత్రి దిక్కూమోక్కూ లేనిచోట పడి కూడా survive అయ్యాడంటే మిరాకిలే. దేవుడే వచ్చి చేతులు అడ్డు పెట్టి అరుణ్ణి ఆదుకుని ఉంటాడు అనిపించింది. మామూలుగా కాలు స్లిప్పయి పడిపోతేనే ఘోరమైన దెబ్బలు తగుల్తాయి. అలాంటిది అంత బీభత్సమైన యాక్సిడెంట్... నాకు మొదట్నించీ దేవుడంటే చాలా నమ్మకం. ఇక అరుణ్ యాక్సిడెంట్ తర్వాత ఆ నమ్మకం మరీ మరీ పెరిగింది.

 

అరుణ్ survival ఒక miracle అనుకుంటే ఒక చేయి విరిగిందని, నడకలో తేడా వచ్చిందని పిచ్చి పిచ్చి complexలకి పోకుండా ఎంతో ధీమాగా నిలబడ్డం ఇంకా గొప్ప సంగతి. తన artificial hand మీద తనే జోకులు వేస్తాడు. ఒక్క చేత్తోనే వెయ్యి పనులూ చక్కబెడతాడు. Car driving దగ్గర్నించీ వంటల్లో ప్రయోగాల వరకూ అరుణ్ చెయ్యనిదీ, చేయలేనిదీ లేదంటే లేదు. అరుణ్ణి ఆదుకున్న దేవుడికి నేనెప్పటికీ రుణపడి ఉంటాను.

 

god's grace, survival by god's grace, spiritual power saved, lord saved us, unbelievable wonder, me and god, experience with god


More It's My Experience