భగవంతుడు నన్ను అనుగ్రహించాడు...

God in My Dreams...

సి. పాండురంగాచారి

నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ దేవుడు కలలో కనిపిస్తూ ఉంటాడు. సామాన్యంగా నేను ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాను కనుక అలా చేయొద్దని హెచ్చరించేందుకే దేవుడు కలలో కనిపిస్తున్నాడని నాకు తెలుసు. నేనెటూ పొరపాటు చేయకుండా బుద్ధిగా ఉండలేను కనుక ఈ కలలను పట్టించుకుని ప్రయోజనం లేదులెమ్మనుకునేవాణ్ణి.

 

కానీ ఇప్పుడు నాకు నిజంగా ఆధ్యాత్మిక చింతన అలవడింది. దేవుడిపట్ల ధ్యాస పెరిగింది. అలౌకిక ఆనందాన్ని చవిచూశాను. క్రమంగా నాలో పరిపక్వత పెరిగింది కనుక తెలిసి తెలిసి ఏ తప్పూ చేయడంలేదు. తప్పు దారి పట్టించే భయాలూ, భ్రాంతులకు లోను కావడంలేదు. లౌకిక ప్రపంచంలో బ్రతుకుతూనే మోక్ష సాధన దిశగా ప్రయత్నిస్తున్నాను. ఇక నా ఆశ, శ్వాస దైవారాధనే.

 

ఆధ్యాత్మిక గురువుగారి దగ్గరికెళ్ళి నేను దేవునికి అంకితమైపోయేందుకు పాటించాల్సిన సూత్రాలేంటో తెలుసుకున్నాను. అందుకోసం ప్రార్థన చేయమని, మనసారా ఆశీర్వదించమని కోరాను.

 

ఆ రాత్రి నాకు బొత్తిగా నిద్రపట్టలేదు. నా ముఖాన్ని ఏదో అదృశ్య శక్తి గట్టిగా నొక్కుతున్నట్లుంది. ''దేవుడా! నొప్పిగా ఉంది.. కాపాడు.. బాధ విపరీతంగా ఉంది.. రక్షించు..'' అంటూ వేడుకుంటున్నాను. నేను ఊపిరైతే తీసుకోగల్గుతున్నాను కానీ ఇతరత్రా నలిపేస్తున్నట్లుగా, దుర్భరంగా ఉంది. ఆఖరుగా ''అయ్యో.. నరకప్రాయంగా ఉంది.. కాపాడు తండ్రీ'' అన్నాను దీనంగా.

 

అలా నిస్సహాయంగా ప్రార్ధించగానే ఆ అదృశ్య శక్తి నన్ను వదిలేసింది. మరగకాచిన నీళ్ళతో ఆవిరిపడుతున్నప్పుడు ఉక్కిరిబిక్కిరౌతున్నట్లు ఉంటుంది. ఆవిరి పట్టడం పూర్తయిన తర్వాత చివరికి లోపలున్న కఫం, కల్మషం అంతా పోయి హాయిగా, తేటగా ఉంటుంది చూశారా... ప్రస్తుత నా పరిస్థితి అచ్చం అలానే ఉంది.

 

మరుసటి రోజు మా గురువుగారి దగ్గరికెళ్ళి రాత్రి జరిగింది చెప్పాను. ఆయన ప్రశాంతంగా చూశారు. ముగ్ధమోహనంగా నవ్వి ''నాయనా! నీలో ఎక్కడో పాపం చేశాను.. దేవుడు చేరదీస్తాడో లేదోనన్న భయము, వెరపు ఉన్నాయి. వాటిని పోగొట్టేందుకే భగవంతుడు నీకు ఇలాంటి అనుభవాన్ని ప్రసాదించాడు'' అన్నారు.

 

ఆ నిమిషం నాక్కలిగిన పరమానందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. కరుణాకటాక్షాలు ప్రసాదించాడు. అంతకంటే ఇంకేం కావాలి? నిరంతరం భగవంతుని చింతనతో జీవితాన్ని సార్ధకం చేసుకోవడమే నా ఏకైక లక్ష్యం.

 

how dreams come, dreams represents our thoughts, symbolic dreams of mind, spiritual power enlightened me, god in my dreams


More It's My Experience