ఆ స్పర్శ ఎప్పటికీ మర్చిపోలేను...

Memorable Touch

కాటమనేని మహాలక్ష్మి

 

మా అమ్మాయి అపర్ణ, అల్లుడు రఘుబాబు యు.కె.లో ఉంటారు. వాళ్ళకోసం కాంధారీ దగ్గర త్రిబుల్ బెడ్ రూం డీలక్స్ ఫ్లాట్ చూశాం. ఇద్దరూ పనిచేస్తున్న కంపెనీల వివరాలు, శాలరీ సర్టిఫికెట్లు అన్నీ చూపిస్తే బ్యాంకువాళ్ళు 50 లక్షల లోను వస్తుందని చెప్పారు. అదేదో advertisementలో మూడు నిమిషాల్లో లోను శాంక్షను అవుతుందని చెప్పినట్లు, మనదేశంలో కూడా పనులు వెంటవెంటనే, సాఫీగా జరిగిపోతున్నాయే అనుకుని చాలా సంతోషించాం.

 

రోజురోజుకీ రేట్లు పెరుగుతుండటంతో ముందుగా 20 లక్షలు కట్టేసి అగ్రిమెంట్ రాయించుకున్నాం. తక్కిన డబ్బు బ్యాంకు ప్రాసెసింగ్ పూర్తయ్యాక చెక్ ఇస్తామని చెప్తే..తనకు 70 పర్సెంట్ బ్లాక్ లో, మిగిలిన 30 పర్సెంట్ వైట్లో ఇవ్వాలి అన్నారు ఓనర్.

 

బ్యాంకువాళ్ళతో మాట్లాడితే ''అలా కుదరదు'' అన్నారు.

 

Construction, వాస్తు, చుట్టుపక్కల లొకాలిటీ అంతా బాగుంది.. ధర కూడా రీజనబుల్ గా ఉంది. అన్ని హంగులూ ఉన్న ఈ తరహా ఫ్లాట్ సాదారణంగా కోటి రూపాయలు పలుకుతోంది. అలాంటి ఫ్లాట్ చేజారిపోతోందే అని దిగులేసింది. ముఖ్యంగా ఇంటి అగ్రిమెంట్ రూపంలో కట్టిన సొమ్ము వెనక్కి రావడం అంత తేలిక్కాదు. ఓనరు సహృదయంతో ఇస్తే తిరిగివ్వాలి, లేదంటే లేదు. ఏ కోర్టుకెళ్ళినా ప్రయోజనం లేదు. ''మీకోసం రిజర్వుచేసి ఉంచారు.. లేదంటే ఇంకొకరికి అమ్మేవాళ్ళుకదా'' అంటారు. ఇప్పుడెలా, ఏం చేయాలి.. అని ఒకటే దిగులు.

 

పిల్లలు యు.కె. నుంచే ఎవరెవరితోనో మాట్లాడారు. మేమూ సాయశక్తులా ప్రయత్నించాం. ఒక దశలో ఇక అయ్యేపని కాదు అనిపించింది.

 

ఆరోజు ఉదయం సాయిబాబా గుడికి వెళ్ళాను. బాబా కాళ్ళకు తల ఆనించాను. అదేం చిత్రమో తెలీదు.. కేవలం విగ్రహంలా అనిపించలేదు. సాయిబాబా అక్కడ సజీవంగా ఉన్న భావన. అంతే.. బాబా కాళ్ళను గట్టిగా పట్టుకున్నాను. కన్నీళ్లు కారిపోతున్నాయి.

 

''బాబా! మాకు ఏది మంచో, మాకంటే ఎక్కువ నీకే తెలుసు.. ఈ ఫ్లాట్ మా అందరికీ బాగా నచ్చింది. నీకూ మంచిదనిపిస్తే అడ్డంకులు తొలగించు నాయనా'' అని ప్రార్ధించాను. అవి నిజంగా అపురూప క్షణాలు. బాబా దివ్యస్వరూపాన్ని సజీవంగా తాకిన అనుభూతి..ఆ స్పర్శ నాకు ఇప్పటికీ మరపుకు రావడంలేదు. బాబా పాదాన్ని గట్టిగా పట్టుకున్నాను.. ఆయన కాలు నొప్పి పుడుతుందేమో అనిపించింది. పాదంపై నుండి చేతులు తీసి, మరోసారి దణ్ణం పెట్టుకుని బయటకు వచ్చాను.

 

చెప్పులు వేసుకుని కారు ఎక్కానో లేదో ఆయన సెల్ ఫోన్ మోగింది. ''బ్యాంకువాళ్ళు ఫోన్" అని నాకు చెప్పి ఫోన్ ఎత్తారు.

 

''ఒకసారి బ్యాంకుకు రండి.. సరే, మీరడిగినట్లే చేద్దాం.. ''రిపేర్లు చేయించాలి'' అని రాయండి.. అవసరమైన డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేయండి..'' ఇదీ సారాంశం.

 

ఇద్దరిమీ ఆశ్చర్యానందాలకు గురయ్యాం. ఇది నిజంగా మిరాకిలే. తర్వాత వ్యవహారం అంతా చకచకా సాగిపోయింది.

 

సాయిబాబా నమ్మినవారిని ఎప్పుడూ కాపాడతాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? కాకపొతే ఆయనకు పూర్తిగా సరెండరైపోవాలి. అప్పుడు కన్నబిడ్డలా అక్కున చేర్చుకుంటాడు బాబా.

 

my experience with sai baba, sai baba and me, felt sai baba alive, enlightenment feeling, enlightenment with spiritual touch, mysterious incident, unbelievable fact


More It's My Experience