నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? ఈ నాలుగు రాశుల వారు ఎందుకు కట్టుకోకూడదు?

 


చెడు దృష్టి పడకుండా, దిష్టి పడకుండా ఉండేందుకు చాలామంది తమ ఎడమ కాలికి నల్లదారం ధరిస్తూ ఉంటారు. దీన్ని ధరించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు. అయితే కొందరికి ఈ నల్లదారం ధరించిన తరువాత మంచి జరగకపోగా ఇబ్బందులు పెరుగుతాయి.  అసలు ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయో తికమక పడేవారు ఉంటారు.  నల్లదారాన్ని ఎందుకు ధరిస్తారో.. దీన్ని ఎవరు ధరించకూడదో తెలుసుకుంటే..

నల్లదారం ఎందుకు ధరిస్తారు?

హిందూమతంలో  నలుపు రంగును శనిదేవుడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు.  కొందరికి ఈ దారం ధరించడం వల్ల మంచి జరుగుతుంది.  కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు వస్తాయి. నల్లరంగు దారం ఎడమకాలికి ధరిస్తే చెడు దృష్టి,  దిష్టి కలగవని అంటారు. అలాగే చెడు శక్తుల నుండి కూడా నలుపు రంగు దారం రక్షణ ఇస్తుందని అంటారు.


నల్లదారం ఎవరు ధరించకూడదు?


మేషరాశి..


మేషరాశి వారు నల్ల దారం ధరించకూడదు. ఇది  సమస్యలను పెంచుతుంది. మేషరాశిని పాలించే గ్రహం అంగారకుడు.  నల్ల దారం శని,  రాహువులకు సంబంధించినదని నమ్ముతారు. శని,  కుజుడు మధ్య మంచి సంబంధాలు జ్యోతిషశాస్త్రంలో ప్రస్తావించబడలేదు. ఇలాంటి  పరిస్థితిలో నల్ల దారం ధరించడం వల్ల  సమస్యలు పెరుగుతాయి.


కర్కాటకం..

కర్కాటక రాశి వారు నల్ల దారం ధరించడం మానుకోవాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు.  శని,  రాహువుల మధ్య శత్రుత్వ భావన ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు దీనిని ధరించకూడదు. నల్ల దారం ధరించడం వల్ల చంద్రుని శక్తి బలహీనపడుతుందని, ఇది మానసిక సమస్యలను కలిగిస్తుందని చెబుతారు.

సింహం..

సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశిచక్రం  మూలకం అగ్ని. ఈ వ్యక్తులు కూడా నల్ల దారం ధరించకూడదు. కొన్ని కథల్లో సూర్య, శని గ్రహాలను తండ్రీకొడుకులు అంటారు. కానీ జ్యోతిష్యంలో వారిని శత్రువులుగా కూడా పరిగణిస్తారు. అందుకే నల్ల దారం ధరించకుండా ఉండాలి.

వృశ్చికం..

వృశ్చిక రాశి వారు నల్ల దారం ధరించకూడదు. ఈ రాశికి అధిపతి  అంగారకుడు.   ఈ వ్యక్తులు ఎటువంటి సలహా లేకుండా నల్ల దారం ధరించకూడదు. ధరిస్తే  వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ప్రతికూలత  అక్కడ ఎదురవుతుంది.

                                                    *రూపశ్రీ.


More Enduku-Emiti