పొరపాటున కూడా ఈ 5 వస్తువులు దానం ఇవ్వకూడదు..!


హిందూ మతంలో  దానాన్ని చాలా గొప్పగా  పరిగణిస్తారు. దానం చేయడం వల్ల పేదవారికి సహాయం చేయడమే కాకుండా, దాతకు పుణ్యం లభిస్తుంది.  దానం చేయడం వల్ల మనసులో పరోపకార భావాలు, దయ పెరుగుతాయి. ఇది మానసిక ప్రశాంతత,  సంతృప్తిని అందిస్తుంది. దానం చేయడం వల్ల గ్రహ దోషాలు కూడా తొలగిపోయి జీవితంలో సుఖసంతోషాలు లభిస్తాయి. అయితే దానం చేసేటప్పుడు విచక్షణను  కలిగి ఉండాలి.  ఈ కింది 5 వస్తువులు దానం చేయడం మంచిది కాదట.  ఒకవేళ వాటిని దానం చేస్తే వాటికి ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చీపురు..


ఇంట్లోని మురికిని శుభ్రం చేయడానికి చీపురును ఉపయోగిస్తారు. చీపురు ఇంటిలోని లక్ష్మి దేవతతో కూడా పరిగణిస్తారు.  కాబట్టి చీపురు దానం చేయడం అశుభం. ఇలా చేయడం వల్ల దాత ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రావడమే కాకుండా ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయట.

పాత ఆహారం..


తరచుగా ప్రజలు కొంత ఆహారం మిగిలిపోతే దాన్ని  దానిని దానం చేస్తారు. కానీ మిగిలిన ఆహారం లేదా చద్ది ఆహారం  దానం చేయడం వల్ల దాన ఫలం లభించదు. ఆహారాన్ని దానం చేయాలనుంకే  తాజాగా,  శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే దానం చేయాలి.


వాడిన నూనె
 
జాతకంలో శని దోషం ఉన్న వ్యక్తికి నూనె దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ఈ నూనె ఎప్పుడూ చెడిపోకూడదు. ముందే వాడి ఉండకూడదు. కాబట్టి పొరపాటున కూడా వాడిన నూనెను దానం చేయకూడదు.


పాత్రలు


శాస్త్రాల ప్రకారం స్టీల్ పాత్రలను ఎప్పుడూ దానం చేయకూడదు. స్టీలు పాత్రలు దానం చేయడం వల్ల ఇంట్లో సంతోషం శాంతి పోతాయి. నమ్మకాల ప్రకారం పాత్రలను దానం చేయడం వల్ల  బలంగా ఉన్న వ్యాపారాలు కూడా దెబ్బతింటాయట.


పదునైన వస్తువులు..


కత్తి, కత్తెర వంటి పదునైన లేదా కోణాల వస్తువులను దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల దాతకు,  గ్రహీత మధ్య విభేదాలు ఏర్పడవచ్చు. పదునైన వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడతాయని శాస్త్రాలలో కూడా వివరించబడింది.

దానం చేసేటప్పుడు, ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి..

దానం ఎల్లప్పుడూ  స్వచ్ఛమైన హృదయంతో చేయాలి.
దానం ఇవ్వడానికి అవసరమైన,  పేద వ్యక్తులను ఎంచుకోవాలి.
దానం చేసేటప్పుడు, దానం చేసిన వస్తువులను అవమానించకూడదు.
దానం చేసిన తర్వాత, దానం చేసిన వస్తువుల గురించి చింతించకూడదు.


                                                       *రూపశ్రీ.


More Enduku-Emiti