మౌని అమావాస్యకు ఎందుకంత ప్రమాముఖ్యత?ఈరోజున ఏం చేస్తే మంచిదంటే..!

మాఘమాసంలోని అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఈ రోజున త్రివేణి సంగమం, గంగా లేదా ఇతర పుణ్యనదులలో స్నానమాచరించి దానధర్మాలు చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య ఫిబ్రవరి 9 న వస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం, అమావాస్య రోజున ఉపవాసం పాటించడం వల్ల పూర్వీకులు మోక్షాన్ని పొందుతారు.  ఇది మాత్రమే కాకుండా ఉపవాసం ఉండే వారి  లక్ష్యాలన్నీ నెరవేరాలని పూర్వీకులు ఆశీర్వదిస్తారని చెబుతారు.  మరొక విశేషం ఏమిటంటే.. ఈ మౌని అమావాస్య  70ఏళ్ల తరువాత వస్తోంది. ఈ కారణంగా  అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయని  జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  మౌని అమావాస్యరోజున  స్నానం,  దానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని ఫలితాలు ఏంటి? తెలుసుకుంటే..

పంచాగం ప్రకారం మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 09న ఉదయం 08:02 గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి 10, 2024న ఉదయం 04:28 గంటలకు ముగుస్తుంది. మౌని అమావాస్య హిందువులకు  మతపరమైన,  ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అమావాస్య రోజు  పూర్వీకులు లేదా మరణించిన వారి  జ్ఞాపకార్థం హవనం, పితృ దోష పూజ,  కావాలనుకుంటే పిండ ప్రదానం‌తో సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే పెళ్లి, నిశ్చితార్థం, గృహ ప్రవేశం వంటి కార్యాలు చేయడం మాత్రం మంచిది కాదు.  మౌని అమావాస్య రోజు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత  మంచిదట. ఎందుకంటే 'మౌని' అనే పదం నిశ్శబ్దాన్ని సూచిస్తుంది. ఈ రోజున ధ్యానానం చేసే వారు, మౌన వ్రతాన్ని పాటించేవారు  ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదురుతారు. ఇకపోతే ఈ మౌని అమావాస్య రోజు స్నానం, దానం చేయడం వల్ల బోలెడు పుణ్యఫలం లభిస్తుంది.

మౌని అమావాస్య రోజు ఏం చేయాలంటే..

ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి.  ఏదైనా తీర్థయాత్రకు, నదీ ప్రాంతానికి  వెళ్లలేకపోతే ఇంట్లో నీటిలో  త్రివేణి లేదా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు. పితృ తర్పణం చేయడానికి, నదిలో లేదా ఇంట్లో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. దీని తరువాత పేదవారికి ఆహారం ఇవ్వడం లేదా బ్రాహ్మణుడికి ఏదైనా దానం ఇవ్వాలి. పేదవారికి దానం చేసినా గొప్ప ఫలితం ఉంటుంది. గరుడపురాణంలో అమావాస్య రోజున పూర్వీకులు తమ వారసులను చూడటానికి వస్తారని చెప్పబడింది. అందుకే  ఈ రోజున  పెద్దలకు తర్పణం ఇవ్వడం మంచిది.   పవిత్ర నదిలో స్నానం చేసి, పూర్వీకులకు పిండప్రదానం చేసి, అన్నదానం చేయడం వల్ల పెద్దలు  సంతోషిస్తారు. తద్వారా వారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

                                          *నిశ్శబ్ద.

 


More Aacharalu